దేశమంటే మనుషులోయ్ !!!

కృష్ణ వేణి

కృష్ణ వేణి

2010 లో భారతదేశంలో జరిగిన కామన్ వెల్త్ క్రీడల ప్రారంభోత్సవపు దినాన్న భారతదేశపు జెండా పట్టుకున్న అభినవ్ బింద్రా నేతృత్వంలో భారతీయ దళం కవాతు చేస్తున్నప్పుడు, అతనికి ముందున్న అమ్మాయి మిజో సంప్రదాయమైన పౌంచై దుస్తులు ధరించింది. ఎట్టకేలకి ఈశాన్యదేశం కూడా ఇంత పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమంలో గుర్తింపు పొందిందని ఆ ప్రాంతం పడిన సంతోషం కాస్తా మర్నాడు పొద్దున్న టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటి పేజ్‌లోనే పబ్లిష్ చేసిన వార్తతో తుడిచిపెట్టుకు పోయింది. “భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన నాగా దుస్తుల్లో ఉన్న ఒకమ్మాయి తప్ప మిగతా అన్ని టీములకి ముందూ భిన్నవిభిన్నమైన తీరుల్లో చీరలు కట్టుకున్న అమ్మాయిలు నడిచేరు.” అంతెక్కువ సర్క్యులేషన్ ఉన్న వార్తాపత్రిక పబ్లిష్ చేసిన వార్త ఇది.

2007 లో వచ్చిన “చక్ దే ఇండియా” సినిమా చూసిననవారికి ఈ సంఘటన గుర్తుండే ఉంటుంది.

ఇండియన్ హాకీ టీంలో ఆడ్డానికి మణిపుర్, మిజోరామ్ నుంచి ఇద్దరు అమ్మాయిలు డిల్లీ వస్తారు.

కో-ఆర్డినేటర్- “స్వాగతం! భారతదేశపు అతి దూర ప్రాంతాలనుంచి వచ్చిన మన అతిధులు మనతో చేరినందుకు సంతోషంగా ఉంది.”

అమ్మాయిలు రెప్పవేయకుండా అతన్ని చూస్తారు.

కో-ఆర్డినాటర్- “ఏమయింది? సంతోషంగా లేరు!”

అమ్మాయిలు- “మా దేశంలోనే మమ్మల్ని అతిధులుగా లెక్కిస్తున్నప్పుడు, మేమెందుకు సంతోషపడాలో చెప్పండి”
దేశంలో ఇప్పుడున్న పరిస్థితిని ఈ డైలాగ్ చక్కగా వివరిస్తుంది.

జనవరి 29న, 2014 లో అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన 20 ఏళ్ళ నిదో తానియా తన ముగ్గురు స్నేహితులతోపాటు డిల్లీలో ఉన్న లాజపత్ నగర్‌కి వెళ్ళినప్పుడు, ఒక మిఠాయి దుకాణంలో ఉన్న వ్యక్తి నిదో జుట్టు గురించి హేళన చేయడం ప్రారంభించి అతన్ని ఇనప కడ్డీలతో కొట్టేడు. పెద్ద పోట్లాట జరిగింది. తీవ్రంగా గాయపడిన నిదో తన అక్క ఇంటికి వెళ్ళి ఆ రాత్రే ఆఖరి శ్వాస వదిలేడు. నిదో హత్యోదంతం తర్వాత ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో 11 మంది సభ్యుల బెజ్‌బారువా కమిటీ ఏర్పడింది.

k1అది నెలరోజుల్లో తన నివేదికని అందించింది. అందులో తక్షణం(ఆర్నెల్ల నుంచి ఏడాదిలోగా), స్వల్ప వ్యవధి(ఏడాది నుంచి ఏడాదిన్నర లోగా), దీర్ఘకాలం(మూడేళ్లలోపు)లో తీసుకోవాల్సిన చర్యలేమిటో కమిటీ  సూచించింది. తక్షణ చర్యల్లో ఫేస్‌బుక్, వాట్స్‌యాప్ కనెక్టివిటీ, న్యాయవాద బృందాల ఏర్పాటువంటివి ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్‌ఎల్‌ఏ అయిన నిదో పవిత్రా కొడుకు నిదో తానియా.                                                                ఈ మధ్యే బెంగళూరులో మైకెల్ లాంజాథాంగ్ హౌకిప్, అతని స్నేహితులూ కలిపి ఒక రోడ్‌సైడ్ స్టాల్లో భోజనం చేస్తూ తమ మాతృభాషలో మాట్లాడుకుంటూ ఉంటే, “కర్నాటకలో ఉండి, కర్నాటక తిండి తింటున్నప్పుడు-    కన్నడం మాట్లాడలేకపోతే కనుక రాష్ట్రంనుండి బయటకి పొమ్మని” బెదిరించి ఆ విద్యార్థులని రాళ్ళతో కొట్టేరు కొందరు.                                                                                                                                                                               

k2ఇంకొక సంఘటనలో మణిపుర్‌కి చెందిన 22 ఏళ్ళ ఖుప్షియాంగెన్‌ని మెహ్రౌలీ(డిల్లీ)లో ఐదుగురు పిల్లలు కత్తితో పొడిచి, అతని జేబు దోచుకున్నారు. ఖప్సియాంగెన్‌ పొత్తికడుపుకి ఆపరేషన్ చేయవలిసి వచ్చింది. ఈ ప్రాంతాలవారిని అవమానకరమైన రీతిలో “ చింకీ” అని సంబోధించేవారికి 5 సంవత్సరాల కారాగార శిక్షపడాలి కానీ పడిన నిదర్శనాలేవీ లేవు. ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలని “పార్టీగర్ల్స్“గా, నైతిక విలువలు లేనివారిగా జమకట్టి రోడ్డుమీదో, లోకల్ మార్కెట్లలోనో వెళుతుంటే వారిని వెకిలి చూపులు చూడడం, అసభ్యమైన మాటలు అనడం, వారిని రాసుకు వెళ్ళడం- ఇవన్నీ సామాన్యం. మెట్రోల్లో ఈ ప్రాంతాలకి చెందిన అమ్మాయిల దగ్గిరకి చేరి గుసగుసలతో ”రాత్రికి రేటెంత?” అని అడగడం కూడా పరిపాటి. అబ్బాయిలని పనికిమాలినవారిగా, డ్రగ్స్‌కి బానిసలలైనవారిగా, తిరుగుబాటు ధోరణి కలిగినవారిగా చూస్తారు మిగతా రాష్ట్రాలవారు.

రాజధానిలో ఉన్న ఏ ఈశాన్య రాష్ట్రానికి చెందిన వ్యక్తికీ, ఈ జ్ఞానశూన్యత పట్ల ఆశ్చర్యం కలగదు. బయట రాష్ట్రాలలో తాము ఇమడమన్న విషయం వారి జీవితాల్లో ఒక భాగం అయి, వారు దాన్ని అంగీకరించి చాలా కాలమే అయింది. మన రాజధాని నగరం కూడా వారు ఈ దేశానికే చెందినవారన్న ధైర్యాన్ని ఏ మాత్రం కలిగించదు. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినాకానీ ఈశాన్య రాష్ట్రాల గురించి మాత్రం పట్టించుకోదు.

ఢిల్లీ యూనివర్సిటీలో ఎడ్మిషన్ల కోసం ప్రతి సంవత్సరం ఈశాన్య రాష్ట్రాలనుండి వందలమంది వస్తారు. వర్గ విచక్షణ, లైంగిక వేధింపులు మరియు వసతి దొరక్కపోవడం-వారికి ఎదురైన సమస్యల్లో కొన్ని. సీట్ దొరికిందన్న సంతోషం ఎంతకాలమూ నిలవదు.

భారతదేశం వర్ణవ్యవస్థ మీద ఆధారపడిన సమాజం. కులం భారతీయ సమాజంలో ఉన్న అనేకమైన విభాగాలని నియంత్రిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలనుంచి వచ్చినవారు వారు మిగతావారిని సాంస్కృతికంగా, మతపరంగా, సాంఘికంగా కలుషితం చేస్తారన్నది పితృస్వామ్య వ్యవస్థని పాటించే భారతదేశవాసుల అభిప్రాయం. రూపురేఖల్లో, వస్త్రధారణలో లేక అలవాట్లలో ఎంత తేడా ఉన్నాకానీ ‘వారు కూడా భారతీయులే, భారతదేశపు సమాజానికి భాగమే’ అన్న సంగతిని మనం విస్మరిస్తాం. “భిన్నత్వంలో ఏకత్వం” అన్న స్పూర్తిదాయకమైన ఆదర్శాన్ని ఈ ఆలోచనాధోరణి ఉల్లంఘిస్తుంది.

ఈశాన్య రాష్ట్రపు ప్రజల మీద మనదేశంలో పలుమార్లు జరిగే ఈ అత్యాచారాలకి మనం ఏ నిర్వచనాన్నైనా ఆపాదించగలమా? ఇది జాత్యహంకారమే అని నిశ్చయించడానికి ఇంకా ఎన్ని హత్యలు జరగాలి!

ప్రతి భారతదేశపు పౌరునికీ వలస పోయి భారతదేశపు భూభాగంమీద ఎక్కడైనా నివసించే హక్కుంది. కానీ ఈ హక్కు ‘సెవెన్ సిస్టర్ స్టేట్స్’  అని పిలవబడే ఈశాన్య రాష్ట్రాలవారికి మాత్రం ఆచారంలో నిరాకరించబడుతున్నట్టు కనపడుతోంది. వాళ్ళ ఉనికి బట్టి అద్దెలకి ఇళ్ళు దొరకవు. దొరికినా మామూలు అద్దెకి మూడింతలు అడుగుతారు. వారి భోజనపు అలవాట్లు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. లైంగిక వేధింపులనీ, దాడులనీ తప్పించుకోవాలంటే ఆ ప్రాంతాలకి చెందిన అమ్మాయిలు శరీరం కనబడే బట్టలు వేసుకోకూడదని సూచిస్తూ ఢిల్లీ పోలీస్ అడ్వైసరీ జారీ చేసింది. అదే అడ్వైసరీ- వారు తమ ప్రాంతపు వంటకాలు అయిన ఆకుని మరియు వెదురు రెమ్మలు వండుకోకూడదని కూడా శాసించింది.

k3

ఈశాన్య రాష్ట్రాలనుంచి వలస వచ్చేవారిలో 66.35 % ఉన్నత విద్య కోసం, తక్కిన శాతం ఇతర పట్టణాల్లో ఉద్యోగవకాశాలకోసం వస్తారు.ఈ రాష్ట్రాల ప్రజల మీద మిగతావారికి ఎందుకింత కోపం? ఈ రాష్ట్రాలలో ఉన్న సమస్యలేమిటి? ఆ ప్రాంతంలో అభివృద్ధి ఎందుకు లేదు? ఆ రాష్ట్రాల ప్రజలు విద్య కోసం, ఉపాధి కోసం దేశంలోని అనేక ప్రాంతాలకు వలస పోవాల్సిన అవసరం ఎందుకొస్తోంది? వలసవచ్చిన వారి బీదరికం, వారు భిన్నంగా కనిపించడం కారణాలుగా మారి వారిని చంపటానికి కూడా వెనుకతీయనంత కోపం ఎందుకొస్తోంది? దీని వెనక ఉన్న ఆర్థిక/రాజకీయపరమైన కారణాలు అర్థం కానంతవరకూ మనం ఇలాగే నిశ్శబ్దాన్నే పాటిస్తూ ఉంటామా!

ఉన్నతవిద్యకీ, ఉద్యోగాలకీ ఆ రాష్ట్రాలలో అవకాశం లేకపోవడం వల్ల ఈ ప్రాంతాలవారు వలస వస్తారు.  మణిపుర్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు బయట రాష్ట్రాలలో ఉద్యోగాలు వెతుక్కోమని ఆ రాష్ట్ర నివాసులని ప్రోత్సహిస్తున్నాయి. వేర్పాటువాద సంఘర్షణ, సైనిక ఉనికి వల్లా ఇబ్బందిపాలై, దీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకోని ఏడు ఈశాన్య రాష్ట్రాలూ అవి భారతదేశానికి భాగమే అని మనకి తట్టదా?

ఇవన్నీ చూస్తుంటే, కొన్నేళ్ళ కిందట నేను ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఒకటి గుర్తొస్తోంది. వారణాసికి వెళ్ళే ఫ్లైట్‌ పూర్తిగా బుక్ అయి ఉంది. కౌంటర్లో పాసెంజెర్లని చెక్- ఇన్ చేస్తున్న అబ్బాయి నన్ను పిలిచి ‘కన్ఫర్మ్ అయిన పాసెంజెర్లెవరూ ఇంక క్యూలో లేరని’ చెప్పేడు. చూస్తే, వెయిట్ లిస్ట్  చేంతాడంత పొడుగుంది. మిగిలినవి రెండే సీట్లు. మొదటి రెండో మూడో పేర్లు పిలిచి, ‘వాళ్ళని చెక్- ఇన్ చేసిన తరువాత కౌంటర్ మూసేయమని’ ఆ అబ్బాయికి చెప్పి నేను వెనక్కి తిరిగేను. వెయిట్ లిస్ట్లో ఎక్కడో ఆఖర్న  పేరున్న ఆఫ్రికా దేశంనుంచి వచ్చిన 70 సంవత్సరాలున్న ఒకాయన నా దగ్గ్గిరకి వచ్చి “ నేను నల్లవాడిననేగా మీరు నాకు సీట్ ఇవ్వలేదు?” అని ఉక్రోషంగా అడిగేరు. అప్పుడు పట్టించుకోలేదు కానీ- నిజమే కాదా? మనం కూడా వివక్షని కనపరుస్తూనే ఉన్నాం కదా! మన జాత్యహంకారాన్ని మన దేశవాసులమీదే చూపిస్తూ మరీ!
1990 లో నెల్సన్ మండేలా విడుదల తరువాత ప్రపంచంలో ఉన్న రేసిజం యొక్క అవశేషం అంతం అయింది. ప్రెసిడెంట్ F. W. de Klerk దక్షిణ ఆఫ్రికాలో అప్పుడు సామాన్యమైన జాతి/వర్ణ వివక్షని రూపుమాపడం ప్రారంభించేరు.

భారతదేశపు న్యాయవర్తనని, ఐకమత్యతని సంరక్షించడం/కాపాడటం భారతదేశపు పౌరుల బాధ్యతనీ, భారతదేశపు పౌరులందరూ కుల/మత/భాషాసంబంధాలని, ప్రాంతీయ లేక దేశీయ వైవిధ్యాలని అధిగమిస్తూ అందరిమధ్యా సౌభ్రతృత్వాన్ని నెలకొల్పాలనీ, స్తీల గౌరవాన్ని కించపరిచే పద్ధతులని విడిచిపెట్టాలనీ భారతదేశపు కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 51A చెప్తుంది.

రవీంద్రనాథ్ టాగూర్ రాసిన జాతీయగీతంలో “అందరినీ కాపాడటం నీ చేతుల్లో ఉంది” అని దేశాన్ని ఉద్దేశిస్తూ రాసిన ఒక వాక్యం ఉంది.

ఈ జాతి/వర్ణ వివక్ష అంతం అయిందని సమస్త ప్రపంచం భావిస్తున్నా కానీ మనం మాత్రం తిరోగమనానికి దారిలోనే ఉన్నాం.

– కృష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీతPermalink

6 Responses to దేశమంటే మనుషులోయ్ !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో