బ్రోకెన్ బార్బీ

Untitled

బ్రతుకు దుర్భరము చేసి

కూల్చి వేసి , కాల్చి వేసి, 

అవయవాలు ఖండించి, 

ప్రతి కణము పీకి పెట్టు,

దుష్ట క్రౌర్య దురాత్ములగు 

కీచకులను, దుశ్శాసనులను 

శాసించే శాసనాలు 

లేవా ? ఇక లేవా?  

ఈ దుర్మద దౌర్జన్యపరుల 

చేతిలోన చిక్కుకున్న,  

నారీ లోకము 

నడి వీథిలోన విలపిస్తూ,  

ప్రాణాలను మానాలను కోల్పోతూ,  

కకావికలై పోతున్న 

దౌర్భగ్యపు స్థితి లోన, 

మాటల మూటలేనా? 

స్త్రీకేదీ రక్షణ?  

కావాలి ప్రతి స్త్రీ 

ఒక చైతన్యపు స్రవంతి,  

పీడితులకు ధైర్యమిచ్చి,  

పీడనలకు ఎదురు నిల్చి, 

పోరాడే ప్రతి వనితకు, 

నిలవండీ బాసటగా, 

ప్రతి మనిషి,  

స్థాపించండి, తిరిగి, 

స్త్రీలు తిరుగు సుక్షేత్రం, 

శ్రీలు చిందు సుక్షేత్రం  

-ఉమా పోచంపల్లి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

 

కవితలుPermalink

Comments are closed.