రవీంద్రుడి 150 వ జయంతి – సాహిత్య అకాడెమీ సదస్సు

సాహిత్య అకాడెమీ, బెంగుళూరు ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ టాగూర్ 150 వ జయంతి సందర్భంగా 20011 ఆగస్ట్ 6 ,7 ,8  తేదీలలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం లో సాహిత్య అకాడెమీ సహాయ సంపాదకురాలు డా. మీనలోచని  స్వాగతోపన్యాసం తో సాహిత్య సభలు మొదలయ్యాయి.
ప్రముఖ రచయితలు కోడూరి శ్రీరామమూర్తి ,శలాక  రఘునాథ శర్మ,అంపశయ్య నవీన్ సాహిత్య ప్రసంగాలను చేశారు.మొదటి  రోజు సాయంత్రం  జానపద కళాకారుల బృందం గడ్డం జలంధర్ పర్యవేక్షణలో ‘కీచక పర్వం’ చిందు  యక్షగాన ప్రదర్శన జరిగింది.
రెండవ రోజు సాహిత్యపీఠం పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ స్వాగతోపన్యాసం తో ‘అస్మిత’సాహితీ కార్యక్రమం మొదలైంది.
ఇందులో భాగంగా తమ అస్థిత్వాన్ని నిలుపుకొని రచయిత్రులు తమదైన శైలిలో స్వీయ కథలను చదివి వినిపించారు. అబ్బూరి ఛాయాదేవి ‘అదేమిటమ్మా!’,వి.ప్రతిమ’నాయన కూతురు’,కె.బి .లక్ష్మి జూకా మల్లి’,పుట్ల హేమలత ‘మనిషి తనం’ , కె.వరలక్ష్మి ‘ఊరు కథ’ అనే కథలను చదివి వినిపించారు.

విద్యార్ధులు చిన్నితల్లి,సూరిబాబు,కె.యు.వి.వి.ఎస్.లక్ష్మి ,వై.సిహెచ్.శ్రీనివాస్,కె.గోపి రచయిత్రులను సభకి పరిచయం చేశారు.
రచయితలు కాంత రాజు, ఎర్రాప్రగడ రామకృష్ణ ,దాట్ల లలిత చర్చలో పాల్గొన్నారు.
కేంద్రసాహిత్య సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత అబ్బూరి ఛాయాదేవిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సిబ్బంది పట్టు శాలువాతో సత్కరించింది.
చివరి రోజున “విమర్శకునితో సాయంత్రం” కార్యక్రమం లో డా.యు.ఏ. నరసింహమూర్తి ప్రసంగం పై ఆచార్య ఎండ్లూరి సుధాకర్ చర్చ నిర్వహించారు.
Rtd.D.E.O ప్రముఖ హేతువాది పసలభీమన్న తమ ఇంద్రజాల ప్రదర్శన ద్వారా మూఢ నమ్మకాలపై అవగాహన కలిగించారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విశ్వకవి జయంతి సందర్భంగా రవీంద్రుడి రచనలతో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
పుట్ల హేమలత వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిశాయి.*

 – విహంగ

సాహిత్య సమావేశాలు, Permalink

Comments are closed.