ఒక పురుషుడిగా నేనిలా రాయొచ్చా ?

ఒకానొక స్త్రీల పత్రికలో పురుషులకి ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించడం అనేది, పురుషులని శత్రువుల్లా  కాకుండా మిత్రుల్లా చూసే ఒక సమరస భావంతో చేసిన మంచి పని.
మరి, దాన్ని ఇంతవరకూ పురుషులేవ్వరూ ఉపయోగించుకోకపోవడం అంటే ఏమిటి ?
ఇది చాలా లోతయిన ప్రాతిపదికని కలిగి,  తరతరాల చరిత్రని ఇముడ్చుకున్న బలమైన ప్రశ్న.
ఈ ప్రశ్నని అడిగే పరిస్థితి ఎదురు కాకూడదు  అంటే మగవాళ్ళు తమంత తామే ముందుకి వచ్చి వివరణ ఇచ్చుకోవలసి వుంటుంది. ఎందుకంటే, ఎదుటివారు నేరారోపణ చేసేంతవరకూ చేతులు ముడుచుకుని కూర్చుంటే, ఆరోపణని ఎదుర్కొన్నవారు తామా తప్పుని చెయ్యలేదని నిరూపించుకునేవరకూ నిందితులుగానే గడపవలసి వస్తుంది.
అలాటి నింద పడకుండా ఉండటానికి ఏమి చెయ్యాలా అని చాలా ఆలోచించాను.
చివరికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. వెంటనే ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకుగాను ముందుగా కొన్ని ప్రశ్నలు తయారు చేసుకున్నాను.
మా సంస్థలో చాలా మంది మధ్య తరగతి వివాహిత స్త్రీలు పని చేస్తున్నారు. వాళ్ళందరూ వివిధ వయసులవారు. వివిధ ప్రాంతాలవారు వివిధ నేపధ్యాలని కలిగి ఉన్నవాళ్ళు. వాళ్ళందరినీ సమావేశ పరచి నా ప్రశ్నా పత్రం ఇవ్వడం అంటే కొరివితో తల గోక్కున్నట్టే. అందుకే నాకు బాగా చనువుగా వుంది అరమరికలు లేకుండా మాట్లాడే పన్నెండు మందిని ఎంపిక చేసుకుని వారికి   ఒక చిన్న టీ ఇస్తున్నాను రమ్మని పిలిచి ఒకచోట సమావేశ పరిచాను. కాఫీ టిఫిన్లయ్యాక నేను తయారు చేసిన ప్రశ్నా పత్రాలని వాళ్లకిచ్చాను. ప్రశ్నా పత్రాలని చూసి ముందు అందరూ నవ్వుకున్నా ఆనక మనస్ఫూర్తిగానూ నిజాయితీగానూ తమ అభిప్రాయాలని వెల్లడించారు.
దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి పొందు పరుస్తున్నాను. నేను  చెయ్యాలనుకున్నదాన్ని నిజాయితీగా చేశాను.
ఇంక, ఈ సమాచారాన్ని విశ్లేషించడం మీవంతు.
1. మీవారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు ?
ఒసే, ఏమే, ఏమిటే, ఏమోయ్, మేడం ,ఇదిగో అని పిలిచేభర్తలు : పది మంది.
పేరు పెట్టి పిలిచే భర్తలు : ఇద్దరు.
2. మీరు మీ భర్తని ఏమని పిలుస్తారు ?
ఏమండీ : పన్నెండు మంది.
3. మీ భర్తని మీరెప్పుడైనా పేరు పెట్టి పిలిచారా ?
లేదు : నలుగురు.
పెళ్ళికి ముందు పిలిచాము : అయిదుగురు.
భర్తని అలా పేరు పెట్టి పిలవకూడదు : ముగ్గురు.
4. మీరెప్పుడయినా మీ భర్తని అరేయ్ ఒరేయ్ ఏరా ఏమోయ్ అంటూ పిలిచారా ?
లేదు : ముగ్గురు
అలా ఎందుకు పిలవాలి ? : ఇద్దరు
జవాబు చెప్పం : ముగ్గురు.
అలా పిలవడం తప్పు : ఒకరు
సందర్భాన్నిబట్టి పిలవచ్చు : ఇద్దరు
పిలిస్తే తప్పేంటి : ఒకరు
5.మీరెప్పుడయినా మీ భర్త పాదాలకి నమస్కరించారా ?
ఏదో ఒక సందర్భంలో నమస్కరించాం.: పదకొండు మంది.
ఎందుకు నమస్కరించాలి ? : ఒకరు. ( ఈవిడ కూడా రెండు మూడు సార్లు నమస్కరించారట.)
6. మీ భర్త ఎప్పుడయినా మీ పాదాలకి నమస్కరించారా ?
ఛా.., ఇదేం ప్రశ్న ? : తొమ్మిది మంది
తప్పండీ అలా భర్తలు నమస్కారాలు పెట్ట కూడదు : ముగ్గురు
7.మీ భర్త మిమ్మల్ని ఎప్పుడయినా కొట్టారా ?
లేదు : పది మంది.
చెప్పం : ఒకరు.
కొట్టారు : ఒకరు.
8. మీరెప్పుడయినా మీ భర్తని కొట్టారా ?
లేదు : ఏడుగురు.
మేమేం అలాగా జనం అనుకున్నారా ? : ఇద్దరు
ఇదేం పిచ్చి ప్రశ్న ? : ముగ్గురు.

ప్రియమయిన చదువరులారా, ఈ జవాబులు ఏం చెబుతున్నాయి ?

అందరు భార్యలూ భర్తని” ఏమండీ” అనే ఎందుకు పిలుస్తున్నారు ?
భర్తలందరూ భార్యలని ఏకవచనం తోనే సంబోధించడం  భార్యలు ఎవరూ భర్తని మరీ ఏ ఏకాంతం లోనో తప్ప ఏకవచనంలో ఎందుకు పిలవలేకపోతున్నారు ?
ఎవరూ కనీసం పేరు పెట్టి పిలిచేంత స్వాతంత్ర్యాన్ని కూడా ఎందుకు పొందలేకపోతున్నారు ?
ఈ రోజుల్లో కూడా ” పేరు పెట్టి పిలిస్తేనే స్వాతంత్ర్యం ఉన్నట్టా ? ” అని వాదించే అమాయకత్వంలో ఎందుకున్నారు ?
భార్యలందరూ భర్తల కాళ్ళకి నమస్కరించాల్సిన అవసరం ఎందుకు వస్తోంది ?
ఏ భర్తా తన భార్యకి ఏనాడూ ఎందుకు నమస్కారం పెట్టడం లేదు ?
ఎప్పుడయినా మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు వేసుకున్నారా ?
వేసుకుంటే వాటికి జవాబులు దొరికాయా ?
ఒకవేళ జవాబులు దొరక్కపోతే వాటిని తెలుసుకునేందుకు మీరు ప్రయత్నం చేసారా ?
ఆ ప్రయత్నం ఎలాంటి పర్యవసానానికి దారి తీసింది?
ఆలోచించండి
ఆలోచించండి
ఆలోచిస్తూనే ఉండండి..,
అలా ఆలోచిస్తూ వుంటే
ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరష్కారం దొరక్కపోదు.

– రమణ  కుమార్

పురుషుల కోసం ప్రత్యేకం, వ్యాసాలు, , , , Permalink
0 0 vote
Article Rating
8 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Dadala Venkateswara Rao
Dadala Venkateswara Rao
8 years ago

రమణ కుమార్ గారూ
మీ పరిశోధన మొత్తం తప్పుగా చేసారు.
అయినా మీ ప్రయత్నానికి గౌరవించి నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను
ఇటువంటి ప్రయత్నాలు ఆరోగ్యధాయకం కావు రమ (ణ) కుమార్ గారూ
కోపం వచ్చినప్పుడు భార్యా భర్తలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు
ప్రేమతో ఉన్నప్పుడు భార్యను పొగుడుతాడు కాళ్ళు పడతాడు
ఇద్దరిలో ఏఒక్కరు తక్కువ కాదు
ఇద్దరూ సంపాదించే వారిలో ఇవన్ని ఆలోచించడానికి సమయమే ఉండదు

ఉదాహరనకు మీరు చేసిన ప్రయతనం ఇది చదివిన తరువాత మీకే తప్పుగా అనిపిస్తుంది

మీరు అడిగిన 8 ప్రశ్నలు బాగా చనువుగా ఉండి అరమరికలు లేకుండా మాట్లాడే 12 మందికి ఇచ్చి జవాబులు సంపాదించారు
అందులో 5 ప్రశ్నలు స్త్రీలకు తమ భర్తలపై ఉండే గౌరవ మర్యాదలకు సంభందిచినవి
3 ప్రశ్నలు భర్తలకు తమ భార్యలపై ఉండే గౌరవ మర్యాదలకు సంభందిచినవి
స్త్రీల అభిప్రాయాలు ఈ క్రిందివిధంగా ఉన్నాయి
2 మీరు మీ భర్తని ఏమని పిలుస్తారు ? గౌరవంగా ఏమండి : 12
3. మీ భర్తని మీరెప్పుడైనా పేరు పెట్టి పిలిచారా ? లేదు : 12 (4+5 +3)
4. మీరెప్పుడయినా మీ భర్తని అరేయ్
ఒరేయ్ ఏరా ఏమోయ్ అంటూ పిలిచారా ? లేదు : 12 (3 +2 +3 +1 +2 +1 )
5.మీరెప్పుడయినా మీ భర్త పాదాలకి నమస్కరించారా ? : 12 (11 + 1 )
8. మీరెప్పుడయినా మీ భర్తని కొట్టారా ? లేదు 12 (7 +2 +3 )
పురుషులకు తమ భార్యలపై ఉండే ప్రతిస్పందన
1. మీవారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు ? గౌరవంగా పేరుతో : 2
6. మీ భర్త ఎప్పుడయినా మీ పాదాలకి నమస్కరించారా ? లేదు 0
7.మీ భర్త మిమ్మల్ని ఎప్పుడయినా కొట్టారా ? లేదు 2

మీ ప్రశ్నావళిని అనుసరించి చూస్తె ఫలితాలు ఈవిధంగా వచ్చాయి
జవాబులు ఏవిధంగా చెప్పినా వారి అభిప్రాయాన్ని పరిగణ లోనికి తీసుకుని
చూడవలసి వచ్చింది. ఎందుకంటే ప్రశ్నావళి ‘అవును’ లేదా ‘కాదు’ అని లేదు కనుక

స్త్రీలు నూటికి నూరు పాళ్ళు తమ భర్తలను గౌరవ మర్యాదలతో చూస్తె
పురుషులు ప్రతిగా రెండు శాతం మార్కులు కూడా సంపాదించుకోలేక పోయారు
నిత్యజీవితంలో వ్యవాహారాలు (ఫలితాలు) ఇలా ఉండవు

ఈ ప్రశ్నావళి ఫలితాలను అంత తేలికగా తీసివేయవలసిన అవసరం లేదు
కాని ఇది సరయిన పద్దతి కాదు. ఎందుకంటే అభిప్రాయసేకరణ ఎక్కువ సంక్యలో ఉండాలి
వారి వయసు కూడా ఇంచు మించు సరి సమానంగా ఉండాలి
అడిగే ప్రశ్నలు భార్యా భర్తలకు సరిసమానంగా ఉండాలి
ప్రశ్నావళి తయారుచేయడంలో నైపుణ్యాన్ని కలిగి ఉండాలి
లేదా నిపుణులచే తయారుచేయించాలి
ఆ ప్రశ్నావళి అవును లేదా కాదు అనే జవాబు వచ్చే రీతిలో స్పష్టంగా ఉండాలి
ప్రశ్నలు సూటిగా జవాబు చెప్పదగినవిగా ఎక్కువ సంక్యలో ఉండాలి
ప్రశ్నావళి పూర్తిచేసే సమయం చాలా తక్కువగా ఉండాలి
ఈ విహంగాలో తెలుగువారందరూ చూసే విధంగా ఉండే పరిశోధనలో
చాలా జాగ్రత వహించాలి
ఎదో సరదాగా వ్రాసాములే అని అనుకోకూడదు

ఇవి ఉదాహరణ మాత్రమె
ఒక పద్దతిలో సాగిన పరిశోధన మాత్రమే చర్చనీయంసంగా ఉంటుంది
ఇటువంటి పరిశోధనలు మంచికంటే చెడే ఎక్కువ చేస్తాయి

uma
uma
9 years ago

కళ్యాణి గారు, నాకు చాల విషయాలు తెలియవు! ఏదో అత్తెసరు మార్కులతో నెగ్గుకు వచ్చాన౦తే! ఇక పొతే చాల ప్రశ్నలకి జవాబుగా ఒకటే కారణ౦ ఉ౦ది: మన స౦స్కృతీ స౦ప్రదాయాల పట్ల మన గౌరవము, నమ్మకము, అభిమానము, ఆదరణ. అదే మనకు శ్రీరామరక్ష!
అ౦తే కానీ ఇవి ఎవరో ఎక్కువ లేదా తక్కువ అని కాదు. ఇలా౦టి ప్రశ్నలను ము౦దు వారి ఇ౦ట్లో అడగగలరా?
ఎ౦దుకని?

kalyani
kalyani
9 years ago

ఉమగారూ,
మీరు ఇంగ్లీషులో రాసిన వ్యాసం అదిరిపోయింది. రాస్తానన్న వ్యాసం గురించి ఎదురు చూస్తున్నాను.మీలా అన్నీ తెలిసినవారే తప్ప మాలాటివాళ్ళం సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు వేసారీ వ్యాసంలో.

uma
uma
9 years ago

అన్నట్టు, అది ఒక ఒంపు తిరిగిన (అనగా skewed ) స్టడీ. మీరు నా రెస్పాన్స్ ఐ బ్లాగ్ లో చూడ౦డి: http://www.mymomentsmythoughts.blogspot.com/
Regards
Uma

uma
uma
9 years ago

నిజానికి, మీ పద్దతి చాల సైంటిఫిక్ అ౦డి… పరిశోధన చేసి చెప్పారు…:)

uma
uma
9 years ago

మన౦ ఇ౦కా ఎప్పటికి ఈ పరిథి లో ను౦డి బయటకు వస్తా౦? మన౦ అనగా ఇలా౦టి చొప్పద౦టు కోస్చనేర్లు ప్రతిపాది౦చిన ప్రబుద్దులు- మనలో వాళ్ళే గనక ఇన్ గ్రూప్ స౦బోధన. మన౦ అనగా భారతీయుల౦. ఒకరిని గౌరవి౦ఛిన౦త మాత్రాన మన గౌరవానికి ఏమి ఆక్షేపణ రాదు. ఒకవేళ ఏకవచన స౦బోధనతో భర్తను పిలిచినా దాని అర్థ౦ మనకేదో గౌరవం ఒరుగుతు౦దనీ కాదు. ఇది కేవల౦ మన స౦ప్రదాయ౦. గు౦డెల మీద చెయ్యేసుకుని చెప్ప౦డి ఎ౦తమ౦ది వారి వారిచే ఏకవచన స౦బోధనతో గౌరవి౦పబడలేదో. అ౦త మాత్రాన ఇద్దరికీ గౌరవము కాదు అగౌరవము కాదు. అది వ్యక్తిగత అభిప్రాయ౦, అ౦తే.

M.V.Ramanarao
9 years ago

మన సంప్రదాయం ప్రకారం ,ఇప్పుడు మనకి నచ్చినా లేకపోయినా భార్య భర్తకు విధేయురాలుగాఉండాలి.భర్త భార్యని పోషించి రక్షించాలి .మీరు ప్రశ్నించిన మహిళలలో ఆ సంప్రదాయం ఇంకా ఉందన్నా మాట .౨.మామూలుగా భార్య వయసులో భర్తకన్నచిన్నదాయి ఉంటుంది.చిన్నవాళ్ళు పెద్దవాళ్ళను గౌరవించాలి. ౩.మగవాళ్ళు కూడా తల్లి ,పెద్దలైన ఇతర స్త్రీలకూ పాదాభివందనం చెయ్యాలి.ముఖ్యంగా కొన్ని సమయాల్లో( శుభకార్యాలు వంటివి) చేస్తారుకూడా. ౪స్త్రే దేవతలని పురుషులు కూడా పూజిస్తారు కదా.

లలిత
లలిత
9 years ago

రమణ కుమార్ గారు ముందుగా మీకు మా అభినందనలు .
పురుషుల పేజీలో మొదటిపుట మీదే అయినందుకు . మీ ఆలోచన బావుంది .