వురిమళ్ల సునంద (భోగోజు)
వురిమళ్ల సునంద (భోగోజు)
కలంపేరు: విసు
నివాసం : ఖమ్మం
స్వస్థలం: సిరికొండ , సూర్యాపేట జిల్లా, మోతె మండలం, తెలంగాణ రాష్ట్రం
తల్లితండ్రులు: వురిమళ్ల సోమాచారి,రామతారకమ్మ
భర్త పేరు : భోగోజు ఉపేందర్ రావు
చదువు: M.A.B.Ed.
వృత్తి: తెలుగు భాషోపాధ్యాయిని
జి.ప.ఉ.పా.పాపకొల్లు, జూలూరుపాడు మండలం భద్రాద్రి కొత్త గూడెం జిల్లా
ప్రవృత్తి : అధ్యయనం సామాజిక స్పృహ కలిగిన రచనలు చేయడం, సామాజ సేవ
సాహిత్య రచనా ప్రక్రియలు: కథలు , కవితలు, గేయాలు, పద్యాలు వ్యాసాలు, సమీక్షలు, గజల్స్,రుబాయీలు,బాల సాహిత్యంలో కథలు, గేయాలు మొదలైనవి
ముఖ్యమైన బహుమతులు
( top 5):1 ఖమ్మం జిల్లా విద్యాశాఖచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
2.పట్టాభి కళాపీఠం వారిచే గిడుగు రామమూర్తి పంతులు స్మారక పురస్కారం
3.భావ తరంగిణి మాస పత్రిక వారిచే ఉత్తమ కవయిత్రి పురస్కారం
4.CGR ప్రకృతి పర్యావరణం పాటల పోటీల్లో జాతీయ స్థాయిలో తృతీయ బహుమతి
5.జనరంజక కవితా ప్రతిభ పురస్కారం (గుంటూరు రావి రంగారావు గారిచే )
6. దాస్యం వెంకటస్వామి స్మారక పురస్కారం
7. ముస్తాబాద్ చింతోజు బ్రహ్మయ్య బాల సాహితీ వేత్త పురస్కారం
8. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి నుండి అవార్డు
9. బండారు బాలానందం వారిచే బాల సాహితీ వేత్త పురస్కారం
10. వివిధ పత్రికలు నిర్వహించిన పోటీల్లో నగదు బహుమతులు
11. కేంద్ర సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన బాల సాహిత్య కార్యక్రమంలో సాహితీ వేత్తగా పాల్గొని ప్రశంసలు అందుకోవడం
పుస్తకాలు:
1.వరిమళ్ల వసంతం ( కవితా సంపుటి)
2. మెలకువ చిగురించిన వేళ-కవితా సంపుటి
3. వెన్నెల బాల- బాల గేయాల సంపుటి
4.పంచదార చిలుకలు అక్షర మాల గేయాల సంపుటి
5.బాలలకో బహుమతి- బాలల కథల సంపుటి
6.బహు’మతు’లు-కథా సంపుటి
7. మనవడికో ఉత్తరం- లేఖల సంపుటి
8. సరళ వాచకం-ఒకటో తరగతి విద్యార్థులకై వాచకం
9. సంస్కృత న్యాయాలు- తెలుగు వ్యాఖ్యానం
10. సునంద భాషితం- అక్షర భేదంతో అర్థం – పరమార్థం
సంపాదకత్వంలో వెలువడిన రచనలు:-
1. చిరు ఆశల హరివిల్లు – బాలల కవితా సంకలనం
2. ఆళ్ళపాడు అంకురాలు – బాలల కవితా సంకలనం
3. పూల సింగిడి – బాలల కథా సంకలనం
4. ఆసీఫా కోసం – కవితా సంకలనం
5. కలకోట కథా సుమాలు – బాలల కథా సంకలనం
6. తీరొక్క పూలు – జాతీయ స్థాయిలో బహుమతి పొందిన బాలల కథా సంకలనం
7. చిరు స్వరాలు – బాలల గేయాల సంకలనం
8. నాగుపల్లి కథా దివ్వెలు – బాలల కథా సంకలనం
9. నాగుపల్లి కవితా మువ్వలు- బాలల కవితల సంకలనం
10. సమీక్షల సమాహారం – జాతీయ స్థాయిలో గెలుపొందిన బాలలు రాసిన సమీక్షల సంకలనం
11. నాగుపల్లి కథా కదంబం – బాలల కథల సంకలనం 12. నవీన కథా(క)వనం- కథా సంపుటి
13.పెద్దయ్యాక- బాలల కోరికల సంకలనం
14.ఖమ్మం జిందాబాద్ ( సహ సంపాదకత్వం)
15. పాపకొల్లు పసిడి కథలు – బాలల కథా సంకలనం
16. పందెం కాసిన చెట్లు – 7వ తరగతి విద్యార్థిని వర్షిత రాసిన కథల సంపాదకత్వం
17. అమ్మ చెప్పింది – బాలల హృదయ స్పందనల సంకలనం
18. పిల్లల కోసం పిల్లలే రాస్తే .. జాతీయ స్థాయి బాలల కథల సంకలనం
19. ప్రకృతితో మమేకమై.. జాతీయ స్థాయి బాలల కవితా సంకలనం
ఇష్టం: “పుట్టుక నీది – చావు నీది బతుకంతా సమాజానిది” అన్న కాళోజీ మాటల్లా బతకడం ఇష్టం
ఈ సాహిత్య ప్రపంచానికి నేను సైతం నా వంతుగా ఏదో ఒకటి ఇవ్వడం ఇష్టం
ఒక్క రోజు రాయకున్నా ఏసీ గదిలో ఉన్నా ఉక్కపోసినట్టు ఉంటుంది అన్న సినారె గారి మాటల ప్రేరణగా ప్రతిరోజూ ఏదో ఒక సాహిత్య ప్రక్రియ రాస్తూ బతకడం ఇష్టం.ఆ విధంగానే ఈలోకం నుండి రాలిపోవడం ఇష్టం.
తెలుగు భాషోపాధ్యాయినిగా భాషను బతికించుకునేందుకు విద్యార్థుల చేత తెలుగు ప్రక్రియల్లో రచనలు చేయించి నా వారసులుగా అందించడం ఇష్టం.
వురిమళ్ల ఫౌండేషన్ ద్వారా పెద్దలకు, బాలలకు పోటీలు నిర్వహించి భాషామతల్లికి సాహిత్య సేవ చేస్తూ జీవితం ఈవిధంగా కొనసాగించడం ఇష్టం.
నా చిరునామా:-
వురిమళ్ల సునంద ( భోగోజు)
సాహితీ లోగిలి
11-10-694/5,
బురహాన పురం, ఖమ్మం టౌన్ ఖమ్మం జిల్లా -507001
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
వురిమళ్ల సునంద (భోగోజు) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>