నర్తన కేళి – 23

శాస్త్రీయ నాట్య కళాకారులు సాహిత్యంలో రచనలు చేయడం చాలా అరుదు . ఒక వైపు శిష్యుల చేత నాట్య ప్రదర్శనలు , మరొక వైపు సుమారుగా 30 వరకు కథలు , నాటికలు , కవితలు , కవి సమ్మేళనాలు సాహిత్యం లోను రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న తిరుపతికి చెందిన శ్రీమతి కోడూరి సుమనశ్రీ అటు నాట్యం , ఇటు సాహిత్యం , మరొక వైపు సేవా భావం కలిగిన నాట్యా చారిణి కోడూరి సుమనశ్రీ తో ఈ నెల నర్తన కేళి ముఖాముఖి ……….

 *మీ పూర్తి పేరు ?

నా పేరు కోడూరు సుమన .

*మీ స్వస్థలం ?

కృష్ణా జిల్లా కూచిపూడి కి రెండు మైళ్ల దూరంలో ఉన్న శ్రీ రంగపుర  అగ్రహారం .

* మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ?

నాగిరెడ్డి పల్లె పి .ఎస్ .యు .పి స్కూల్ లో ప్రాధమిక విద్య , 6 వ తగారథి నుంచి 10 వ తరగతి వరకు నందలూరు జిల్లా ఉన్నత పాఠశాలలో చదివాను . నందలూరు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ , తిరుపతి శ్రీ పద్మావతి కళాశాలలో  డిగ్రీ , శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం .ఏ  పూర్తి చేసాను . 

122232 001
*మీ తొలి ప్రదర్శన ఎప్పుడు , ఎక్కడ జరింగిది ?

నాకు ఆరు సంవత్సరాల వయసులో తిరుమలలో 100 గీతాజ్ఞాన యజ్ఞం జరిగింది . దానికి మా తాతగారు ఋత్వక్కుగా వెళ్లారు . ఆయనతో పాటు మా కుటుంబం అంతా వెళ్లాము . అప్పుడు ఒక సాయంత్రం “ నీల మేఘ శ్శారీర “  కృష్ణ తరంగం చేసాను .

*మీరు చేసిన వాటిలో  బాగా గుర్తున్న ప్రదర్శనలు?

తరంగం , శివ తాండవం , ఓం శంభో , ఆనంద తాండవమాడే , నవ రసములు ఈ ప్రదర్శనలు చాలా సంతృప్తినిచ్చాయి .

*మీ వైవాహిక జీవితం గురించి చెప్పండి ?

నాకు 19 93 లో వివాహం అయ్యింది . మా వారు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు . వివాహం తరవాత మావారి ఉద్యోగం కారణం కడప లో ఉన్నాము . నాకు ఇద్దరు అమ్మాయిలు ప్రణవి , ప్రణీత .

*నృత్యంలో  శిక్షణ ఇవ్వడం ఎప్పుడు మొదలు పెట్టారు ?

నాకు వివాహం అయిన తరవాత కడపలో నృత్యంలో శిక్షణ ఇవ్వడ ప్రారంభించాను .

*మరి తిరుపతికి ఎప్పుడు వచ్చారు ?

మా వారికి చంద్రగిరి బదిలీ కావడంతో మేము తిరుపతి వచ్చాం .

*తిరుపతిలో భరత నాట్యం ప్రభావం ఎక్కువ కదా ?

అవునండి . ఇక్కడ కూచిపూడి చాలా తక్కువ . నేను ఇక్కడికి వచ్చాక కొన్ని పాఠశాలలో కూచిపూడి నాట్యం లో శిక్షణ ఇస్తున్నాను . నాకు కూచిపూడి అంటే ప్రాణం . హావభావ ప్రకటన , లాస్యానికి కూచిపూడి పెట్టింది పేరు . 

fhgfhf 001*మీ శిష్యులు చేత చేయించిన ప్రదర్శనల గురించి చెప్పండి ?

గిన్నీస్ రికార్డు కోసం సిలికాంద్ర 20 12 లో భ్రాహ్మాంజలి , దశావతారాలు చేసాము . ప్రపంచ తెలుగు మహా సభల్లో అనాధ శ్రమం  నృత్యరూపకం , మా తెలుగు తల్లికి మల్లె పూదండ కార్యక్రమం . అలాగే శివ తాండవం చేసాము .

*మీకు ఇంకా ఏ శాస్త్రీయ నాట్యాలలో ప్రవేశం ఉంది ?

తిరుపతిలో  ఉండటం వలన భరత నాట్యం అభ్యసించాను . ప్రస్తుతం కథక్ నేర్చుకుంటున్నాను . మా పెద్దమ్మ కోడూరి రాజ్య లక్ష్మి గారి వద్ద కథాకళి కొంత వరకు శిక్షణ పొందాను . 

* మీ రచనా వ్యాసంగం గురించి ?

కథలు , కథానికలు , లలిత గీతాలు , నాటికలు  ప్రక్రియల్లో రచనలు చేసాను .

*మీవి ప్రచురిత మైన కథలు ?

భవిత , రుణాను బంధం , మాతృ దేవత , జ్ఞాపకం , శ్రద్ధాంజలి , ప్రతీక , పాంచ భౌతికం , నగ్న సత్యం , ఇంకా నాటికలు , కవితలు అచ్చు అయ్యాయి.

122 001*ఆకాశ వాణిలో  మీ  రచనలు చదవడానికి ఎలా అవకాశం వచ్చింది ?

నేను ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ఉండేదాన్ని . A .I .R కు ఉత్తరాలు వ్రాస్తే , మీలో రాసే నైపుణ్యం ఉంది . మీరు రాసిన రచనలు ఉంటే పంపమని సూచించారు .

*ఆకాశవాణిలో ప్రసారం అయిన మొదటి రచన ?

“ బంగారం “ అనే హాస్య నాటిక పంపాను . 1997 లో గోపి గారు , మంజులా దేవి గారు ఆ నాటికను ప్రసారం చేసారు . అప్పటి నుంచి 20 05  వరకు నా రచనలు ఆకాశవాణిలో ప్రసారం అవుతూనే ఉన్నాయి . 

*ఆకాశ వాణి ద్వారా ప్రసారమైన మీ కథలు , నాటిలకు గురించి చెప్పండి ?

బంగారం , పని పిల్ల , నీడ , వాన ప్రస్థం , అమ్మంటే , తెలుగు కల , దొంగ చుట్టం , భవిత , ఉగాది , స్నేహానికి అర్ధం , అద్దె ఇల్లు , పెంపకం , పెరుగన్నం , కుంపటి ఇవి కడప ఆకాశ వాణి నుంచి  ప్రసారం అయ్యాయి . తరవాత తిరుపతిలో చికిత్స , ఒక్క ఒయ్ , మన ఇల్లు , బాల కార్మికులు , దశావతారాలు , రుణాను బంధం , కన్నీళ్లకు మాటలు , రచయిత్రి మాతృ రుణం మొదలైనవి ప్రసారం అయ్యాయి .

*మీరు పాల్గొన్న కవి సమ్మేళనాలు ?

ఆకాశ వాణి కవి సమ్మేళనాలు , సాహితీ సభలలో అష్టావధానం 20 05  జూన్ లో జరిగింది . శ్రీ వేంకటగిరి వీర మల్లన్న తరపున  కళా పీఠం ద్వారా మహిళా వధానం 20 08 జరిగింది . చంద్రగిరిలో జరిగిన కవి సమ్మేళనం ,చిత్తూరు జిల్లా వంద ఏళ్ల పండగలో కవి సమ్మేళనం వాటిల్లో పాల్గొన్నాను .

*అందుకున్న అవార్డులు ?

అయిదు సంవత్సరాల వయసులో తిరుమలలో ఆలయంలో వద్ద భగవద్గీత  చదవడం లో పాల్గొన్న పోటీలో బహుమతి . ఏడేళ్ల వయసులో ఆనంద తాండవం కి వందన అవార్డు , పదేళ్ల వయసులో స్కూటు ర్యాలీ బెస్ట్ డాన్సర్ అవార్డు , నందలూరి కళా సమితి అవార్డు , లిమ్కా అవార్డు , నటరాజ పురస్కారం , వంశీ కళా క్షేత్ర పురస్కారాలు , కల హంస పురస్కారం ,ముఖ్య మంత్రి గారి చేతుల మీదుగా 20 14 ఉగాది కి గాను  “ మాతృ భాషా సేవా రత్న పురస్కారం .

*ఇప్పుడు ప్రచురణకు సిద్ధంగా ఉన్న రచనలు ?

సుమన శతకం , నీ కోసమే నే … , వెన్నెల వాకిట , ప్రతీక , ఒక సీత , ఒక కైక , శ్రీనివాస స్తుతి , తెలుగు స్తుతి  రచనలు ప్రచురణలో ఉన్నాయి .

*భవిష్యత్ ప్రణాళిక ఏమిటి ?

మాతృ భాష తెలుగు పరిరక్షణకు కృషి చేయటం , అనాధ పిల్లలు శరణాలయం ఏర్పాటు చేయటం , కూచిపూడి లో సందేశాత్మక మైన నృత్య రూపకాలను రూపొందించాలి .

మీ భావాలు , అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.నమస్తే

– అరసి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖి, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో