పుస్తకాల సంచిని భుజాల మీద మోసే వయసులోనే తన దేశంలో తాలిబన్ల ఆంక్షల బూటు పాదాల క్రింద నలుగుతున్న తన తోటి పిల్లల భవిష్యత్త్ ను పిడికెడు అక్షరాల కోసం పోరాటాన్ని బాధ్యాతయుతంగా భుజాలెత్తుకున్న ఒక ఉద్యమ స్ఫూర్తి పేరే మలాల యూసఫ్ జాయ్ . ఉద్యమం ఎప్పుడూ పూల పాన్పు కాదు . అది ముళ్ళ దారిలాగే ఉద్యమ కారుల గమ్యాన్ని సవాళ్లు చేస్తుంది . అన్ని కష్టాలను తుఫాకి తూటాలను ప్రాణాలను తీసే గాయాలను దాటుకుని ముందు కెళ్ళినప్పుడు ఫలితం కన్పిస్తుంది . మలాల అంటేనే దుఃఖ దాయని . ఆమె తన దుఃఖాన్ని చిరునవ్వులుగా మార్చి విద్యా హక్కుని బాలికల పెదాలపై చిరునవ్వుగా పూయించింది . తాలిబన్ల అరాచకాలను అంతర్జాలానికి ఎక్కించి ప్రపంచం దృష్టికి తెలియజేసింది .
పదహారేళ్ళకే Iam Malaala పేరుతో పుస్తకాన్ని రాయటం విశేషం . తనతో పాటు తన వయసు ఆడ పిల్లలకు , ఉగ్ర వాద పిల్లలకు కూడా చదువుకునే హక్కు కావాలని ఐక్య రాజ్య సమితి లో చేసిన ప్రసంగంలో వెలుగెత్తి చాటింది .తాలిబన్ల తూటాలకు గురైన మలాల అంతే వేగంతో తన ధికారాన్ని కొనసాగించింది . 20 14 నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక కావడం టైమ్స్ మేగజైన్ ప్రకటించిన ప్రపంచ ప్రతిభా వంతమైన కౌమార బాలల జాబితాలో మలాల (17 ) చోటు దక్కించుకోవడం హర్షణీయం . ఈమె ఉద్యమ స్ఫూర్తి పలు దేశాల బాలికలకు ఆదర్శ వంతం కావాలని విహంగ ఆకాంక్ష .
ఇదే అంశం పై బాలల హక్కుల కోసం 19 80 సంవత్సరం నుంచి పోరాడుతున్న భారతీయ ఉద్యమ కర్త కైలాష్ సత్యార్ధికి కూడా నోబెల్ శాంతి బహుమతిని అందుకోనున్నారు . చదువుకునే వయసు నుంచి బాలల విద్య కోసం ఎంతో కృషి చేసి 26 ఏళ్ల వయసులో “ బచన్ పన్ బచావో ఆందోళన్ “ సంస్థని స్థాపించి తన జీవితాన్ని బాల కార్మికుల కోసమే పనంగా పెట్టిన ఆదర్శ మూర్తి కైలాష్ సత్యార్ది . తన సంస్థ ద్వారా సుమారుగా 80 వేల మంది బాలాలకు వెట్టి చారికి , చిన్నారుల అక్రమ రవాణ వంటి బాధల నుంచి విముక్తి కలిగించాడు . ప్యాక్టిరీలలో బాల కార్మికుల అవసరం లేకుండా ఉత్పత్తులను తయారు చేయాలని కంకణం కట్టుకున్నాడు . అలా బాల కార్మికుల ప్రసక్తి లేని ప్యాక్టిరీల్లో ఉత్పత్తి అయ్యే దుప్పట్లు , తివాచీలను రగ్ మార్క్ అనే పేరుతో అమ్మటం మొమార్చ్దలు పెట్టించాడు . ఈ చర్య ద్వారా అనేక ప్రపంచ దేశాలకు ఈ సంస్థ లక్ష్యం బోధపడింది .
1998 లో నిర్వహించిన గ్లోబల్ మార్చ్ కి చైర్మన్ గా వ్యవహరించారు . దాదాపు వేయి మంది బాలల్ని వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించారు . ఈ ప్రయత్నంలో అనేక సార్లు ఎన్నో దాడులను ఎదుర్కొన్నాడు . శరీరం చిట్లి రక్తం కారుతున్నా బాలల హక్కుల కోసం ముందుకు సాగిన ధీరుడు కైలాష్ . 1994 లో జర్మన్ శాంతి బహుమతి అందుకున్నారు .
డిసెంబర్ లో జరగబోయే నోబెల్ బహుమతి ఉత్సవంలో ఈ ఇద్దరికి గౌరవ పతకం తోపాటు 1.1 మిలియన్ల డాలర్లు నగదు బహుమతి సమానంగా ఇస్తారు .
– హేమలత పుట్ల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
4 Responses to సంపాదకీయం