గమ్యం లేని బాల్యం

 

కృష్ణ వేణి

కృష్ణ వేణి

 “బచపన్ బచావ్ ఆందోలన్”- ఉద్యమాన్ని ప్రారంభించిన కైలాష్ సత్యార్థికి నోబెల్ బహుమతి వచ్చిన సందర్భంగా ఆయనని అభినందిస్తూ, ఆయన చేసిన నిరంతర కృషికి ప్రణామాలతో…….
dvgfdfgdfgdfsg
                             జాన్‌పుర్ నుంచి వచ్చిన ఎమ్పీకి భార్య అయిన డెంటిస్ట్ అయినా, వసంత్‌కుంజ్‌లో ఉన్న డాక్టర్ అయినా, మా ఇంటి కిందనున్న డాక్టర్ దంపతులు అయినా కానీ, తాము చదువుకున్నవారిమన్న జ్ఞానాన్ని పక్కకి నెట్టి, మానవత్వాన్ని కాలరాసి, హత్యలకీ అత్యాచారాలకీ పాల్పడుతుంటే, “ ఎందుకీ ఉన్నత విద్య? ఎవరిని ఉద్ధరించడానికి” అన్న ప్రశ్న మన మనస్సుల్లో తప్పక తలెత్తుతుంది. మొదటి సంఘటనలో, హత్యకి ఐపిసి- 302, హత్యాప్రయత్నానికి ఐపిసి-307, జువెనైల్ జస్టిస్ ఏక్ట్ కింద శిక్ష పడింది. వారి పట్ల జువెనైల్ జస్టిస్ ఏక్ట్, బాండెడ్ లేబర్ సిస్టమ్ (అబోలిషన్), చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ ఏక్ట్ మరియు బుద్ధిపూర్వకంగా హాని కలిగించినందుకు సెక్షన్- 323 కింద శిక్ష అమలుపరచబడింది.
11222
                       రెండో విషయంలో- రాంచీకి చెందిన ఆదివాసురాలైన (సంతాలీ తెగ) పిల్లని పనిలో పెట్టుకుని తిట్టి, కొట్టి, వేడి పెనంతో వాతలు పెట్టి, అర్థనగ్న పరిస్థితిలో ఉంచి యూరిన్ తాగమని బలవంత పెట్టి, ఆఖరికి ఒక ఎన్జీవో సహాయంతో జైల్లో పెట్టబడిన యజమానురాలి వార్త రాజధానిలో గుప్పుమని వ్యాపించింది. ప్లేస్మెంట్ ఏజెన్సీలని రెగ్యులేట్ చేసే అవసరం ఉందని ఈ కేస్‌లో తీర్మానించబడింది. ఇక్కడ జరిగిన సంఘటన కనీసం కొన్ని ఎన్జీవోల దృష్టికీ, పోలీసుల దృష్టిలోకైనా వచ్చింది. మిగతా పిల్లలకి ఆపాటి న్యాయం కూడా సమకూరదు. అఘాయిత్యానికి పాలుపడిన స్త్రీకి ఇప్పటికీ బెయిల్ దొరకలేదు.
12334
                    ఉమ్మడి కుటుంబాలు కరువైపోయి, భార్యా భర్తా ఇద్దరూ ఉద్యోగం చేస్తూ ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో, ఇంట్లో ఉండి ఇంటిని/పిల్లలనీ చూసుకోడానికీ, ఇంటి పనులకీ ఒక మనిషిని 24 గంటలూ పనిలో పెట్టుకునే అవసరం పడిన కాలం ఇది. ఈ నేపధ్యంలో తెలిసినవాళ్ళకి చెప్పి, ఎక్కడో అక్కడ ఒక పనిపిల్లని/పిల్లవాడిని సంపాదించటం, ఏ ప్లేస్‌మెంట్ ఏజెన్సీకో వాళ్ళ ఫీ వాళ్ళకి చెల్లించి, పిల్లలని పనికి కుదుర్చుకోవడం సామాన్యం అయిపోయింది. వయోపరిమితి నియమాలని ఉల్లంఘిస్తూ, చాలా ఇళ్ళల్లో కనిపించే పనమ్మాయిలు చిన్నపిల్లలే.
                     ఢిల్లీలోనూ, చుట్టుపక్కలా పని చేసే 14 ఏళ్ళ లోపల వయస్సు పిల్లలు ఇంచుమించు కనీసం 4 మిలియన్లమంది. 18 ఏళ్ళ వయస్సని అబద్ధం చెప్పి వాళ్ళని పనిలో పెట్టి, డబ్బు చేసుకునే ప్లేస్మెంట్ ఏజెన్సీలు ఎన్నో! ఈ పిల్లలు బ్రోకర్ల వల్ల కొనుక్కోబడి, జీతం భత్యం లేని బానిసల్లాగా మిగిలిపోతారు-రోజుకి కనీసం 16-18 గంటలు పని చేస్తూ, పాచిపోయినదో, మిగిలిపోయినదో భోజనం తింటూ, ఎక్కడ చోటు చూపిస్తే అక్కడే పడుక్కుంటూ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఇంటిని విడిచిపెట్టడం పనిపిల్లలకి ఇంచుమించు అసాధ్యమే- ఇంటినుంచి పారిపోతే తప్ప. అలా చేసినా కానీ వారు తప్పుడు మనుష్యుల చేతుల్లోనే చిక్కుకుంటారు. లైంగికంగా కూడా ఈ పిల్లలు ఉపయోగించుకోబడిన కేసులు ఎన్నో ఉన్నాయి. వీళ్ళు ఇంట్లో ఆ నాలుగు గోడల మధ్యా ఉండటం తప్ప బయటి ప్రపంచం చూడరు. అప్పుడప్పుడూ చుట్టుపక్కల ఉన్న పిల్లలతో ఆటలు ఆడటం కాదు కదా, మాట్లాడ్డానికి కూడా నోచుకోరు. ఏజెన్సీలయితే నెలకోసారి పనమ్మాయిలకి సెలవివ్వాలని నియమం పెడతాయి కానీ అదీ అమలు పరచబడదు. ఈ పిల్లలు వచ్చేది పేదరికం ఎక్కువగా ఉన్న బీహార్, మధ్యప్రదేష్, ఝార్ఖండ్, యూపీ రాష్ట్రాలనుంచీ, నేపాల్‌నుంచీ.

                           “మిలియన్ల బాల్యాలని హరించి మన దేశం ఎదగలేదు, ఎదగకూడదు కూడా” అంటారు భువన్ రిభు- బచ్‌పన్ బచావ్ (బాల్యాన్ని కాపాడండి) ఉద్యమం యొక్క నేషనల్ సెక్రెటరీ.
ప్రస్తుతానికి వస్తే….,

                                 ఎవరో కానీ డోర్ బెల్ మీద నొక్కిన వేలిని తీయకుండా అదేపనిగా మోగిస్తున్నారు. చూస్తే కింద డాక్టర్ దంపతుల ఇంట్లో పని చేసే 12 ఏళ్ల అమ్మాయి రేణూ వాళ్ళ సంవత్సరం వయస్సున్న పిల్లని పట్టుకుని, నీరసంగా తలుపుకి ఆనుకుని ఉంది. తెల్లని పసి చెంపలు కమిలి, కళ్ళుబ్బి చేతిలో ఉన్న పిల్లతో పాటు లోపలకి వచ్చి, కింద చతికిల పడి “మంచినీళ్ళు తాగుతావా?” అంటే వద్దంటూ తలూపింది. చెదిరిన జుట్టూ, ఊడిపోయిన పోనీటైల్ చూసి అనుమానం వేసి ఏమయిందని అడిగితే కంగారు పడుతూ, “ఆంటీ, ఒకసారి నీ ఫోన్నుంచి అమ్మకి ఫోన్ చేయవా?చేతిలో ఉన్నప్పుడెప్పుడైనా దానికి డబ్బిస్తానులే” అంది. వాళ్ళూరికి ఫోన్ చేస్తే, ఎంతసేపైనా ఎవరూ ఫోన్ ఎత్తలేదు. మొత్తానికి తేలిన విషయం ఏమిటంటే పొద్దున్నే ఈ పిల్లకి ముందు రోజు చేసిన పాచిపోయిన రొట్టెలు పెడితే వాంతి చేసుకుందట. మధ్యాహ్నం షిఫ్టని డాక్టరమ్మ బ్యూటీ పార్లర్కి వెళ్ళగానే ఈ అమ్మాయి కాస్తా ఒక గుడ్డూ రెండు బ్రెడ్ ముక్కలూ తిందిట. అందుకే ఆ చెంపమీద దెబ్బలూ, కమీజ్ పైకెత్తి చూపించిన వీపుమీద గుద్దిన గుద్దులూ, జుట్టుపట్టుకుని జాడించిన సూచనలూ. డాక్టరమ్మ హాస్పిటల్కి వెళ్ళగానే రేణూ ఇటువైపు వచ్చిందన్నమాట!

                      ఆఖరికి వాళ్ళమ్మ ఫోన్ ఎత్తింది. నేను కోపం పట్టలేకపోయి” ఏవమ్మా, నువ్వు తల్లివేనా? ఇక్కడ నీ కూతురి సంగతి పట్టించుకోవా?” అన్నలాంటి మాటలేవో అన్నాను. “లేదమ్మా, పేదరికం. మా పక్క ఊళ్ళోవాళ్ళే వీరు. 20 వేలిచ్చారు సంవత్సరానికని. అందుకే మా పిల్లని పంపించేం కానీ పరిస్థితులు సరిగ్గా ఉంటే పంపించేవాళ్ళమా చెప్పమ్మా!” అని నన్ను ఎదురు ప్రశ్న వేసింది. డాక్టర్ దంపతులు రాంచీకి చెందినవారు కనుక సంగతి అర్థం అయింది. అద్దెకి ఉన్నవారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తరువాత నాకు నిస్సహాయంగా అనిపించి “సరే, ఏదవుతుందో అదే అవుతుందిలే” అనుకుంటూ నెట్లో చూసి దొరికిన మొదటి నంబర్‌ (ఒక ఎన్జీవో)కి ఫోన్ చేసేను. ఏమయిందో ఏమిటో కానీ పట్టుమని నెల తిరగకుండా, డాక్టర్ దంపతులు ఇల్లూ ఖాళీ చేసేరు, ఉద్యోగాలు కూడా( మరి ఎంత త్వరగా సంపాదించుకున్నారో కానీ) మార్చేసుకుని నోయిడాకి మారిపోయేరు. కానీ వాళ్ళింటికి పోలీసులు వచ్చేరని తరువాత చుట్టుపక్కలవాళ్ళనుంచి తెలిసింది.
బాలకార్మిక వ్యవస్థకి ఇది ఒక పక్షం మాత్రమే.

– కృష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

19 Responses to గమ్యం లేని బాల్యం

 1. కిరణ్ కుమార్ కే says:

  కృష్ణ వేణి గారు,

  అభినందనలు. చక్కటి అంశాన్ని ఎన్నుకున్నారు. బాల కార్మికుల వేతలపై ప్రస్తుతం చెప్పుకోదగ్గ మందికి అవగాహన వచ్చింది, మనం ఇంకొంచం శ్రద్ద వహిస్తే ఇంకో ఒకటి రెండు దశాబ్దాలలో ఇలాంటివి కనుమరుగు కావొచ్చు.

  • క్రిష్ణ వేణి says:

   కిరణ్ గారూ, ఇన్నాళ్ళ మీ అందరి స్నేహితుల సాంగత్యంలో తెలుగులో రాయడానికి ఏదో ప్రయత్నిస్తున్నానంతే. భాష మీద ఎక్కువ పట్టు కానీ ఫ్లో కానీ లేకపోయినా కూడా, మీ అందరు స్నేహితులూ అందిస్తున్న ప్రోత్సాహానికీ చాలా కృతజ్ఞతలు.

 2. Sai Padma says:

  కృష్ణ గారూ.. మొదట పర్సనల్ మీ రచన గురించి, అక్కడక్కడా మీ వాక్యాలు అర్ధం కాలేదు .ఉదా : రేణు, వాళ్ళ పిల్లని తీసుకొని.. ఎవరి పిల్లని ..? రేణు యజమాని కూతుర్ని తీసుకొని ..ఇలా చాలా చిన్నవే ..కానీ అవి ఒక్కసారి చూసుకోండి ..

  ఇకపోతే, చాలా మంచి గొప్ప సబ్జెక్ట్ ..మా హాస్టల్ లో ఇలాగే ఒక చైల్డ్ లేబర్ పిల్లని తీసుకొచ్చి జాయిన్ చేస్తే.. మొదట అడిగింది ..ఈ తిండికి, చదువుకి నేనేం పని చేయాలి ..? అని ..అక్కర్లేదు , నువ్వు తిన్న పళ్ళెం కడుక్కుని, నీ బట్టలు నీట్ గా పెట్టుకొని చదువుకుంటే చాలు, వేరే పని ఏమీ చేయనక్కరలేదు అనగానే.. నమ్మలేనట్టు ..నిజమా ? ఇంకా చాలా మంది ఉన్నారు తీసుకురానా ..అని అడిగింది .. మా వార్దేన్స్ తో సహా అందరికీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ..
  చాలా బాగా రాసేరు.. మంచి ప్రయత్నం.. నిజమే ఎందుకు అలాంటి చదువులు ? కానీ చదువుకున్న వాళ్ళల్లోనే ఎక్కువ శాడిజం కనబడుతోంది .. అది చాలా విచారించాల్సిన విషయం.

  • క్రిష్ణ వేణి says:

   శాయి పద్మా,
   హమ్మయ్యా, “చాలా బాగుందని” అన్నకన్నా నా తప్పులు ఎత్తి చెప్పినందుకు. చాలా చాలా థేంక్స్ . ఈ సారి శ్రద్ధ తీసుకుంటాను.
   తెలుగులో రాయడం ఇప్పుడే మొదలెట్టేను కదా! తెలుగు భాషనీ కంటెంట్నీ సరి చేసుకునే అవసరం మాత్రం తప్పక ఉందని అచ్చయిన తరువాత నాకూ గట్టిగా అనిపించింది కానీ అప్పటికే అచ్చయి కొందరు చదివేరు కాబట్టి అది మార్చలేకపోయేను.
   మీరు నడుపుతున్న హోస్టెల్ కి నా అభినందనలు )

 3. jhanshi devi says:

  కృష్ణ వేణి గారుమాకు తెలియని చాలా విషయాలు చెప్పారు . బాల కార్మికుల దుష్టితిని వాళ్ల ఆగచాట్లకు ఇది అక్షర రూపం . మీ వ్యాసం చాలాబాగుంది .

  • క్రిష్ణ వేణి says:

   ఝాన్సీ దేవిగారూ, కృతజ్ఞతలు.

 4. mercy margaret says:

  మీ ఆర్టికల్ చదివాక నాకు ఢిల్లీ ముఖం గుర్తొచ్చింది. నిజమే తెలిసిన సంఘటనల వరకు సరే బయట పడతాయి . తెలియనివి ఇంకెన్నో ??
  మీ ఆర్టికల్ చూడడం చదవడం సంతోషం కలిగింది క్రిష్ణవేణి గారు . మీ ఈ ప్రయాణం ఇంకా మరిన్ని విషయాలను మాకు తెలియజేస్తుందని అభినందనలు తెలియజేస్తున్నాను .

  • క్రిష్ణ వేణి says:

   థేంక్యూ మెర్సీ మార్గరెట్ 🙂

 5. Sivalakshmi says:

  “మిలియన్ల బాల్యాలని హరించి మన దేశం ఎదగలేదు, ఎదగకూడదు కూడా” అంటారు భువన్ రిభు- బచ్‌పన్ బచావ్ (బాల్యాన్ని కాపాడండి)
  మీ వ్యాసం-బాలల పట్ల మీకున్న ఆర్ధ్రతను తెలియజేస్తే, మీరు రాసిన ఈ కొటేషన్ ఇంకా బాగుంది.బాగా డబ్బున్న సంపన్న వర్గాలకు వాళ్ళ పిల్లల్లాంటివారే ఈ పిల్లలు అని తట్టనే తట్టదు.ఇక చిన్నారులు గాజు ఫ్యాక్టరీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు,పొగాకు పరిశ్రమల్లాంటి ప్రమాదకరమైన చోట్ల పని చేసి,సంపాయించి దేశ ఆర్ధిక వ్యవస్థను తమవంతు బలోపేతం చేస్తున్నారు. “బాలల్ని మించినదేదీలేదు.బాలలు ఈ దేశపు సంపద “అని చెప్పే ప్రభుత్వాలకు క్లాస్ నేచర్ ఉంటుంది.ప్రభుత్వం దృష్టిలో “భావి భారత పౌరులు” అంటే ధనవంతుల పిల్లలే.ఈ శ్రామిక జీవులు ఆ లిస్ట్ లోకి రానే రారు.

  • క్రిష్ణ వేణి says:

   శివలక్ష్మిగారూ, థేంక్యూ.
   మీరు చెప్పినది అక్షరాలా నిజం. ఆ అంశాల గురించి కూడా రాద్దామనుకున్నాను కానీ మొదటి కాలమే పెద్దదయితే బాగుండదేమో అని నేనే ఎడిట్ చేసి కుదించేను. 🙂

 6. కృష్ణవేణీ గారూ !
  మన దేశం లో చదువుకున్న కుటుంబాల వారే ,ఇలాంటి దుశ్చర్య లకి పాల్పడుతారు ..అలాంటి కథలూ ,కన్నీ్ళ్ళూ .వెతలూ ఈ దేశం లో అంటే అన్ని గల్ఫ్ దేశాలలో కూడా వింటూ ఉంటాం ..ప్రభుత్వాలు ,తమకి సంబంధం లేని విషయాలు లా గా ,పట్టించుకోరు .కళ్ళ ఎదుట కనిపింస్తున్నా ,చూపి ఉండి గుడ్డి ప్రభుత్వాలు ,మనవి ..
  పేదరికం లో ప్రతీ ప్రాణీ , వ్యాపార వస్తువు కాక తప్పదు ..పై ,పై కారణాలు కాదు అసలు కారణం ,పేదరికం ఇది రూపుమాపితే కానీ ,పరిస్థితులు బాగుపడవు ..
  మంచి ప్రారంభం ..ఈ ఆలోచన ఒకటి మొదల్యింది కదా ..
  వసంత లక్ష్మి .

  • క్రిష్ణ వేణి says:

   వసంత లక్ష్మిగారూ, నిజమే. గల్ఫ్ దేశాలో కూడా ఈ దారుణాల గురించి చదువుతూనే ఉంటాం కదా! చాలా చాలా థేంక్స్ నన్ను మీరందరూ ఇంత ప్రోత్సహిస్తున్నందుకు.

 7. sasi kala says:

  చాలా బాధగా ఉంది .మీరు చేసిన పని చాలా బాగుంది

 8. amarendra dasari says:

  బావుంది..హోప్ to write ఇన్ డీటెయిల్ వెన్ ఐ రీచ్ బ్యాక్ ఢిల్లీ ఆన్ 22 nov ..కంగ్రాట్స్

 9. కృష్ణ వేణి గారు వెలుగులోకి రాని ఎన్నో అంశాలు లక్షలు ఉంది ఉంటాయి . మీ వ్యాసంలో మీరు చాలా చక్కగా ప్రశ్నించారు . బాల కార్మిక సమస్యని పరిష్కరించడం అంత సులువైన సమస్య కాదు . అధిక సంతానం, పేదరికం, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, అత్యాస ఎన్నింటిని చేదించగల్గాలి . ఎంతమంది సత్యార్ది లు కావాలి ? ఎనీ హౌ .. మీ ప్రయత్నం బావుంది . మీరు ఇలా ఎన్నో వ్యాసాలూ వ్రాయాలి .

 10. mala kumar says:

  బాలకార్మిక వ్యవస్త గురించి బాగా వ్రాశారు కృష్ణవేణి.
  మీ తెలుగు చాలా ఇంప్రూవ్ అయ్యింది. చాలా బాగా వ్రాశారు.

 11. క్రిష్ణ వేణి says:

  హేమలతగారూ, దీన్ని పబ్లిష్ చేసినందుకు కృతజ్ఞతలు.

  • క్రిష్ణ వేణి says:

   అమరేంద్రగారూ, థేంక్యూ. తిరిగి నా రూట్స్ ఏవో గుర్తు చేసుకుని ఏదో ప్రయత్నిస్తున్నానంతే.
   మాలగారూ,థేంక్సండీ. ఇన్నాళ్ళ మీ అందరి స్నేహితుల సాంగత్యం వల్లా నేనూ ఏదో రాయగలనేమో అని చేసిన ప్రయత్నం మాత్రమే ఇది.
   వనజగారూ, మీలాంటి స్నేహితులు ఇలా ప్రోత్సహిస్తుంటే సంతోషంగా ఉంది.
   నేను తెలుగు గ్రూప్స్ లో చేరి ఉండకపోతే ఇది సాధ్యం అయి ఉండేది కాదు 🙂
   .

   • క్రిష్ణ వేణి says:

    శశికళగారూ, నిజమేనండీ. కానీ చుట్టుపక్కల జరుగుతున్నవి అవే కదా! థేంక్యూ 🙂