అనిన

                                                          ANINA

 

Director: Alfredo Soderquit

Country: Uruguay, Colombia

Language: Spanish with English Subtitles.

Duration: 80 minutes

Age Group: Above 10 years.

1111

ఇతివృత్తం: ఉరుగ్వే నుండి వచ్చిన అత్యంత సృజనాత్మక మైన యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ . సగటు పిల్లల సమస్యలు, చిన్ననాటి వివాదాల్ని పరిశీలిస్తుంది. ఒక పది ఏళ్ల అమ్మాయి తనచుట్టూ ప్రపంచాన్ని తరచి చూడడానికి చేసిన ఒక  ప్ర యత్నం.జీవితాలకు సంబంధించిన కొన్ని నిజాలు పిల్లలు మాత్రమే చెప్పగలరు.మనం ఏముందిలే? అని తెలిగ్గా తీసుకునే విషయాలు పిల్లల్ని ఎంత తీవ్రంగా వేధిస్తాయో తెలియచెప్తుందీ సినిమా.

Doc021-150x150ఈ సినిమాలో అమ్మా-నాన్నలతో కలిసి “మాంటవిడీయో” అనే నగరంలో ఉంటున్న పదేళ్ళ పాపకి తన పేరు “ANINA YATAY SALAS” (అనీనా యాతయ్ సలాస్) అంటే ఇష్టముండదు. ఆమె పేరులోని పదాలు మూడూ ఇంగ్లీష్ లో కుడి నుంచి ఎడమకు చదివినా  ఎడమ నుంచి కుడికి చదివినా అక్షరాలు ఒకేవిధంగా వస్తాయి. ఉదాహరణకి మన కిటికి, వికటకవి లాగా నన్నమాట.పాఠశాల లోని మిగిలిన విద్యార్ధులందరూ ఆమె పేరు గురించి ఏమాత్రం సహానుభూతి లేకుండా “Capicua girl” (స్పానిష్ భాషలో ఇరువైపుల ఒకేవిధంగా వచ్చు పేరు) అని హేళన చేస్తూ వేధించి, విసిగిస్తుంటారు. తనకో మంచి స్నేహితురాలుంటుంది.కానీ తన తరగతిలోనే ఉన్న ఇంకొక పాప “యీజెల్అంటే “అనీనా కి అస్సలు గిట్టదు. ఒకరోజు వాళ్ళిద్దరూ పాఠశాల ఆవరణ లోని  ఆటస్థలంలో బాగా ఘర్షణ పడి కొట్టుకుంటారు. లావుగా ఉన్నందున యీజెల్ ని అనీనా   “She elephant” అని ఎగతాళి చేస్తుంది. ప్రిన్సిపాల్ వాళ్ళిద్దరినీ పిల్చి ఒక అసాధారణమైన, వింత శిక్ష అమలు చేస్తుంది.ఇద్దరికీ చెరొక నల్లరంగు సీల్డ్ కవర్  ఇచ్చి దాన్ని వారం రోజులవరకూ తెరిచి చూడరాదని ఆజ్ఞాపిస్తుంది. సహజంగానే శిక్ష ఏమై ఉంటుందా అని తీవ్రమైన తపన పడుతుంది అనీనా.

వారం రోజుల వ్యవధిలో అనీనా ఆలోచనలు మనల్ని అబ్బురపరుస్తాయి.తలి-దండ్రుల పట్లా,ఇరుగు-పొరుగు పెద్దవాళ్ళ మీదా తనకున్న అభిప్రాయాలను వ్యాఖ్యానిస్తూ, ప్రేక్షకులను మనోహరంగా అలరిస్తుంది.

విపరీతమైన ఆదుర్దాతో రాత్రి పీడకలలు,పగలు పగటి కలలతో భీతిల్లిపోయిన అనీనా ఎంత భయంకరమైన, అతి  దారుణమైన శిక్ష అమలు జరుపుతారోనని ఆరాట పడుతుంది. నిరంతరం ఉద్వేగానికి గురౌతూ ఆ వేదన లోనుంచి రహస్య ప్రేమల గురించీ, సన్నిహిత స్నేహ సంబంధాల గురించీ, భయంకరమైన శత్రువుల గురించీ తనకు తెలియకుండానే మనసులో ఆలోచిస్తూ, పైకి సంభాషిస్తూ మనతో పంచుకుంటూ అద్భుతమైన ప్రయాణం చేస్తుంది. ఆ జ్ఞాపకాలన్నీ సహజంగా వాస్తవికంగా ఉంటాయి.అనీనా వ్యాఖ్యల ద్వారా ఆమె అంత అమాయక బాధితురాలేంకాదనీ, యీజెల్ మరీ అంత చెడ్డదేంకాదనీ అనీనా తో పాటు ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే కుతూహలం ఆపుకోలేని అనీనా తన కవర్ కాకుండా, స్వార్ధంతో యీజెల్ కవర్ తెరిచి చూద్దామనుకుంటుంది. తన తప్పు తెలుసుకుంటుంది. మనసులో యీజెల్  పట్ల సానుభూతితో,దయతో పశ్చత్తాపపడుతుంది. విషయం తెలుసుకునే క్రమంలో తన పరిమిత జ్ఞానం లోంచే ప్రపంచాన్నీ అందులో తన స్థానాన్నీ తెలుసుకుంటుంది. పిల్లలు వాళ్ళని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రిన్సిపాల్ తెలివిగా వేసిన శిక్షగా చరిత్రలో మిగిలిపోతుంది!

 

దర్శకుడి గురించి చెప్పాలంటే ఉరుగ్వేలో జన్మించిన ‘ఆల్ఫ్రెడో  సోడిక్విట్’ (Alfredo Soderquit)  అక్కడి జాతీయ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అధ్యయనం చేశారు. సెర్గియో లోపెజ్ సువరేజ్ (Sergio Lopez Suarez) అనే ప్రముఖ రచయిత ఉరుగ్వే, అర్జెంటీనా,నార్వే కి సంబంధించిన  పిల్లల పుస్తకాలకు 45 కథలను  రచించారు. ఈ కథలన్నిటికీ ఆల్ఫ్రెడో చిత్రాలు వేశారు. అందులో ఒక కథ ‘అనీనా’. ఆయనకు కధాంశం నచ్చి దృశ్యీకరించారు. ఒక ఆర్ట్ గ్రూప్ SO (Symbolic Operation) ను స్థాపించారు. యానిమేషన్ లో సిద్ధహస్తుడు. చిత్ర లేఖనంలోనూ నిష్ణాతుడైనందువల్ల రెండిటి కలయికతో ఈచిత్రాన్నిఉల్లాసకరమైన, విచిత్రమైన పాయలతో అపురూపంగా  తీర్చిదిద్దారు. ఇప్పుడున్న డిజిటల్, 3డి యానిమేషన్లు కాకుండా తనదైన ధోరణిలో పెన్సిల్,వాటర్ కలర్స్ మాత్రమే వాడి, మృదువుగా చేత్తో గీసి ఒక ప్రత్యేకమైన శైలీ విన్యాసంతో గొప్ప ప్రయోజనాన్ని సాధించారు. ప్రస్తుతం ప్రతిదీ అమెరికనైజ్ అవుతున్న సందర్భంలో ఈ రచయిత లాటిన్ అమెరికా దేశాల ప్రత్యేకతల్ని నిలుపుకుంటూ  రాసిన కథలో దర్శకుడు కూడా వాటిని కాపాడుతూ పాటల్లో ఉరుగ్వేయన్ సంస్కృతీ-సాంప్రదాయాలు ఉట్టిపడేటట్లు,ఆ యా దేశాల ప్రజలు బాగా రిసీవ్ చేసుకునేలా తీశారు. ఇది అతని మొట్టమొదటి సినిమా!

 
దక్షిణ అమెరికాలో, మూడు మిలియన్ ప్రజలు మాత్రమే ఉన్న చిన్న దేశం నుంచి వచ్చిన అందమైన చిత్రమిది!!

చక్కని హాస్యంతో పాటు యానిమేషన్,ఆహ్లాదంగా, మనోరంజకంగా, ప్రతిభావంతంగా ఉండి తాదాత్మ్యం కలిగిస్తుంది.కానీ సినిమా సాగి సాగి  చిక్కుతోవలగుండా , మెలికలు తిరుగుతూ పోతూ ప్రేక్షకుల ఆసక్తికి పరిక్ష పెట్టింది. అయినప్పటికీ చివరికి అనీనా , యీజెల్ లతో పాటు మనం కూడా ఆ కవర్ లో ఏముందో చూచి పోదాంలే  అని సీట్లకే అంకితమవుతాం. ఈ చిత్రంలో చిన్న చిన్న లోపాలున్నప్పటికీ పిల్లల సమస్యల మీద మనస్ఫూర్తిగా దృష్టి పెట్టారనిపిస్తుంది.  

అనీనా  పిల్లలు,పెద్దలలో చమత్కారంగా మాట్లాడుతుంది. చురుకైన అనీనా తన మాటలతో పెద్దలమీద కొరడా ఝుళిపి స్తుంది. ఉలిక్కిపడతాం. ఇంత వికారమైన పేరు ఎలా పెడతారు? ఈ పేరుతో నేను ప్రపంచంలో  తల ఎత్తుకుని ఎలా బతకాలి?అని నిలదీస్తుంది.తలి-దండ్రులిద్దరూ వెనకనుంచి “అయ్యో!ప్రత్యేకంగా,వేరెవరికీ లేని పేరు పెట్టాలని బోలెడంత సమయం వెచ్చించి,ఆలోచించి అలా పెట్టామ”ని చెప్తారు.

నేపధ్యంలో ఇలాంటి పేర్లున్న వారి గురించిన దు@ఖంతో, మూలుగులధ్వనితో విషాదగీతాలు బోలెడన్ని వినిపిస్తూ ఉంటాయి. 

అనీనా విమర్శలు “The Little Prince” లో “Grown-ups” అంటూ పెద్దవాళ్ళను  ప్రిన్స్   నిరసించిన విధానాన్ని గుర్తుకు తెస్తుంది!

స్నేహం గురించి సందేశాన్నిచ్చే ఈ చిత్రాన్ని ఇంటిల్లిపాదీ హాయిగా చూడొచ్చు. ఈ సినిమా పదేళ్ళు దాటిన పిల్లలదే అయినప్పటికీ,పెద్దలకు చాలా హితబోధ చేస్తుంది. అది తెలియాలంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ సినిమా చూచి తీరవలసిందే!

 

అంతర్జాతీయ షార్ట్స్ పోటీ లో వచ్చిన చిత్రమిది.

పాల్గొన్న పండుగలు , అవార్డులు :

ఉత్తమ చిత్రం & ఉత్తమ దర్శకుడు-ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్  కార్టేజీన.

ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్-BAFICI

– శివ లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సినిమా సమీక్షలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో