పాపం…..!!!

పాపం…..!!!

మనుషులను విడిచిన మానవత్వం

ఎగురుకుంటూ ఎగురుకుంటూ….

వినువీది ని చేరి

మేగాలను తాకి …..

గర్షణ కలిగించింది…

ఆ ఘర్షణల వరవడి లో….

రాలుతున్న చినుకులు

తుఫాను గా మారి

జన జీవనాన్ని

అతలాకుతలం చేస్తున్నాయి….

వెలుగుతో పాటు

మండే ఎండను పంచే

సూర్యుడు సైతం

మిన్నకున్నాడు

ఈ భీభత్సవాన్ని చూస్తూ….

పండిన పంటలు

వరదల్లో కొట్టుకు పోతున్నాయి

ఏపుగా ఎదిగిన పైరు

నీట మునిగి నిర్జీవమౌతుంది….

కన్నీటి సునామీలు

కర్షకుల కళ్ళల్లో….

గుండెపోట్ల దాడీలు

ముంగిళ్ళకి చేరువలో….

షావుకార్లు లేని

సరుకుల బజారుల్లో

కాలుతున్న కరీదె…

ప్రతీ వస్తువు…

సామాన్యుడు తాకడానికి

బయపడే జ్వాలాముఖే…

దానికి తోడు

కాలుతున్న కడుపు

మర్మం తెలియక

డొక్కల నెగరవేస్తూ…

చప్పుడు చేస్తుండే….

పేద వాడి బ్రతుకు …

తమ తప్పు లేకుండా

రాజకీయ రాబందులు

ఆ డొక్కల చీల్చి చెండాడుతూండే…

ప్రకృతి మాత్రం

ఏంచేస్తుంది…..

పాపం…..!!

 – సుజాత తిమ్మన. 

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , , Permalink

3 Responses to పాపం…..!!!

 1. ధన్యవాదాలు…….వేద గారు……

 2. ved says:

  సుజాత గారు

  మీ “పాపం” చాల బాగుంది

  అయ్యోపాపం అనిపిస్తుంది ఈ సామాన్య మానవుల గురించి ఆలోచిస్తుంటే

  చాలా చాలా అభినందనలు

  ved