ఒక్కటిగా….

ఆలోచనల ఆలింగనంలో
ఎప్పుడు అల్లరిపెడుతూనే ఉన్నా…
కనుచూపుల దారిలో కనిపించని నీవు ..
కన్నీటికి కారణమవుతున్నావు…

ఎద సంద్రంలో ఎగసిపడే
అలల ఘోష ఎప్పుడు విన్పించుకోవెం..!!
చల్లని వెన్నెల పంచే జాబిల్లి సైతం
వేదనలు కలిగించే వేడిలో
కరిగి…. తానో కథవుతుందే..!!
మెల్లగా వీచే మలయ మారుతం
ముసిరే ముంగురులను రెచ్చగొడుతూ..
కలతల తుఫానుకు కారణం ఏంటని..
గుచ్చి గుచ్చి అడుగుతుందే..!!

భవిష్యత్తుని మింగేసే గతం…
మన జీవిత ప్రాకరాలను తాకనివ్వకుండా..
నువ్వు..నేను …అనే ఈ నిజాన్ని
వాస్తవం చేసుకుంటూ..
ఒక్కటిగా..ఒకరిలో ఒకరమై
సాకారమైన బ్రతుకును పండించుకుందాం..!!

– సుజాత తిమ్మన
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
vedavyas
vedavyas
6 years ago

శుభం

తథాస్తు

పప్పన్నానికి మమ్మల్ని కూడా పిలుస్తారు కదూ

చెప్పలేనన్ని అభినందనలతో

ved