నా ప్రపంచం

ఇది నేను సృష్టించుకున్న నా ప్రపంచం!
అతి నిర్మలమైన సుందర ప్రదేశం !
దయావర్షాన్ని ధారలుగా
కురిపించే నిండైన పర్ణశాల!

ఈ పర్ణశాల చుట్టూ నిరంతరం ఏకాగ్రతతో
పరిభ్రమించే రక్షకభటులను చూసారా!
వారే ఒకరు మనసు మరొకరు మమత.
బయటిప్రపంచపు కల్మష వాయువులను కూడా రానీయకుండా
నిరంతరం తిరుగుతూనే వుంటారు!

ఇందులో విహరించే మానవులంతా
మానవత్వం మూర్తీభవించిన దయామూర్తులూ ప్రేమమూర్తులే!
చక్కని ప్రభోధాలనిచ్చే దేవతామూర్తులే.

ఇక్కడ వెదుకుదామన్నా పగ,ప్రతీకారాలు
మాయలు, మోసాలు ,నమ్మకద్రోహాలూ
ఈర్ష్యాద్వేషాలు మచ్చుకైనా కనిపించవు!
ఎందుకంటే ఇది నాకై నేను సృష్టించుకున్న నాప్రపంచం!

ఇక్కడ నిజాలను పాతిపెట్టే అబధ్ధాలుండవు.
మానవత్వాన్ని మంటగలిపే రాక్షసత్వముండదు.
శాంతిని మింగేసే అశాంతి రక్కసి నీడైనా ఇక్కడ వాలదు!
వయోభేదం లేకుండా స్త్రీలపై చేసే అత్యాచారాలుండవు.

ఇక్కడ వేదనలు,రోదనలు లేవు
చిరునవ్వులు,ప్రేమలు తప్ప!
హత్యలు,రక్తపాతాలు అసలే వుండవు.
అభిమానాలు , ఆదరణలు తప్ప!
రాజకీయపు ముసుగైనా వుండదు
నిజమైన మానవతా విలువలు తప్ప!

ఎందుకంటే ఇది నేను సృష్టించుకున్న
నా అద్భుత ప్రపంచం కదా!
అందుకే ఈ నా ప్రపంచం అంటే నాకు ప్రాణం!

నా దేశం కూడా
నా ప్రపంచంలానే వుంటే ఎంత అదృష్టమో కదా!!
ఓ భగవంతుడా ఎప్పటికైనా నా దేశాన్ని
ఇలా స్వర్ణభారతంగా మలుస్తావు కదూ!!

– భారతి కాట్రగడ్డ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
3 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Dadala Venkateswara Rao
Dadala Venkateswara Rao
6 years ago

వేద్ గారు క్షమించాలి

నా విమర్శను మీరు తప్పుగా అర్ధం చేసుకున్నరనుకుంటాను
వారి కవితలోని ఈ ఆఖరి వరుసలను మరొక్కసారి చదవండి

“నా దేశం కూడా
నా ప్రపంచంలానే వుంటే ఎంత అదృష్టమో కదా!!
ఓ భగవంతుడా ఎప్పటికైనా నా దేశాన్ని
ఇలా స్వర్ణభారతంగా మలుస్తావు కదూ!!”

ఎప్పుడూ తను సృష్టించుకున్న తన ప్రపంచంలోనే ఉంటూ
ఈ దేశాన్ని స్వర్నభారతంలా మలచడానికి భగవంతున్ని కోరుకోవడం విడ్డూరంగా అనిపించింది
ఇప్పటికీ తప్పనిపిస్తే చెప్పండి
భారత భారతికి క్షమాపణలు చెప్పుకుంటా

vedavyas
vedavyas
6 years ago

అయ్యా దడాల గారు

ఎవరి ప్రపంచం వారిది …………..హాయిగా విహరించనీయండి.

ముందు మన ఇల్లు శుభ్రం చేస్కుని తర్వాత వూరి శుభ్రత గురించి ఆలోచించే మనస్తత్వాన్ని తప్పు పట్టాల్సిన పనిలేదేమో అని………………ఒక ఫీలింగ్.

హక్కు ledantaarevitandee ? మీకు విమర్శించే హక్కు వున్నప్పుడు , వారికి అందమైన ఊహా లోకంలో విహరించే హక్కు కూడా లేదా ?

వారి పర్ణశాల గురించి చెప్పుకున్నారు కానీ , పర్ణశాల అడ్రస్ ఇవ్వలేదు సరి కదా………..మెంబెర్షిప్ తీస్కుని పర్ణశాలలో జాయిన్ అవ్వమనీ అడగలేదు . పర్ణశాల గురించి తెలుసుకుని నాకు ఆనందంగా వుంది …………మీ దేశసేవ గురించి తెలుసుకోవాలనీ వుంది……………( మీరెన్నో సేవలు చేసే వుంటారు ఈ పాటికి )

భారత భారతికి

అభినందనలతో

Ved

దడాల వెంకటేశ్వరరావు
దడాల వెంకటేశ్వరరావు
6 years ago

మీ అద్భుత ప్రపంచం మీకు ఇష్టం
మీ ప్రపంచాన్నే మీరు ప్రేమిస్తున్నారు
మీ ప్రపంచంలోనే మీరు ఉంటున్నారు
ఆ ప్రపంచం చుట్టూ తిరుగుతున్నారు
ఆ ప్రపంచామంటేనే ఇష్టపడుతున్నారు
మీ మనసు మమతల్ని నిరంతరం తిరిగే రక్షక భటులుగా చేసి
మీ పర్ణశాల అనే బుల్లి ప్రపంచం చుట్టూ పరిభ్రమించేలా చేసారు
దుష్ట శక్తుల్నిమీ ప్రపంచంలోకి రాకుండా నిరంతరం శ్రమిస్తున్నారు
శారీరకంగా మీరు మీ ప్రపంచంలో లేవనుకున్న పరిసరాలలో బ్రతుకుతున్నారు
మానసికంగా మీరున్నాయనుకున్న వాటితో మీ ప్రపంచంలో బ్రతుకుతున్నారు
మీరు మీ ప్రపంచంలోనించి మీ దేశాన్ని చూస్తున్నారు
మీలా మీము ఓ ప్రపంచాన్ని సృష్టించుకుని ఉండలేము
మీ ప్రపంచంలో ఉన్నవన్నీ ఈ దేశంలో కూడా ఉన్నాయి
ఈ దేశంలో ఉన్నవాళ్ళే ఈ దేశాన్ని స్వర్ణ భారతం చేయగలరు
‘భారత దేశము నా మాత్రుభూమి భారతీయులందరూ నా సహోదరులు’
‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’
‘కలసి ఉంటె కలదు సుఖం’
అనుకున్నావారే ఈదేశంలో మార్పును తీసుకురావడానికి కృషి చేయగలరు
మీలా అద్భుత లోకంలో విహరించే వారికి అలా ఆలోచించే హక్కు లేమేమో