చెదరని రంగులు…

ఎదను కాలుస్తున్నా…
ఉబికే ఆవిరులలోహాలాహలం …
వెల్లివిరిసే ఇంద్రధనసు రంగులు ఎన్నో…

ఏ చిత్ర కారుని కుంచెకు
అందని చిత్రాలై…
కనువిందు చేస్తూ…

ఏ నాట్య కారుని
భాషకు స్పురించని
భంగిమలలో..
భావాలను వ్యక్తం చేస్తున్నాయి…

ఆకాశమంత చెలిమిని ..
అరచేతుల్లో పోస్తూ..
వ్యతల హృదయానికి
సాంత్వన నిస్తున్నాయి…

తేడాలు తెలియనియని
స్న్హేహం ఎప్పుడూ..
‘నేనున్నానంటూ..అడుగేస్తుంది…
నీవెక్కడున్నా…’
అని తెలియజెపుతున్నాయి..!!

– సుజాత తిమ్మన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలు, Uncategorized, , , , , , , , , , , , , Permalink

One Response to చెదరని రంగులు…

 1. Dadala Venkateswara Rao says:

  చెదరని రంగులేక్కడున్నాయి ఈ జీవితంలో
  క్షణంలో చెరిగిపోయే ఇంద్రదనస్సు లు తప్ప

  చిత్రాలను కనువిందు చేయించేవాడు
  భావాల భంగిమలతో ఆడించేవాడు
  ఏ తేడాలు తెలియక స్నేహంచేసే వాడు
  ఆకాశమంత చెలిమిని అరచేతుల్లో పోస్తాడు
  హరివిల్లును మీదికి వంచి రంగుల్లో ముంచుతాడు