సంపాదకీయం


             తెలుగు స్త్రీలస్వేచ్ఛ, వికాసాల కోసం జీవితమంతా ఉద్యమాలు చేస్తూ , చైతన్యవంతమైన రచనలు చేస్తూ ఎంతో మంది మహిళలకి చేయూతనిచ్చిన తొలి తరం మహిళా వాది మల్లాది సుబ్బమ్మ మరణం మహిళా లోకానికే పెద్ద లోటు.

తొంబయ్యేళ్ళ తన జీవితంలో అధిక భాగం సంఘ సంస్కరణల కోసమే, మహిళల విముక్తి కోసమే పనిచేసారు.

సుబ్బమ్మ గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతర్లంక గ్రామంలో 1924 ఆగస్టు రెండో తేదీన పుట్టారు.చిన్నతనంలోనే మల్లాది రామ్మూర్తిగారి తో వివాహం జరినా, చదువు కొనసాగించటానికి అత్తమామలు అడ్డు చెప్పినా , సంఘ సంస్కరణ భావాలు కలిగిన భర్త ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు.దీక్షతో చదువు కొనసాగించి మెట్రిక్‌, పి.యు.సి., బి.ఎ., పూర్తి చేసారు.చదువు ఆమెలో ఆత్మ విశ్వాసాన్ని ,సామాజిక బాధ్యతని పెంచింది.కుటుంబ నియంత్రణ ప్రచారకురాలిగా ఉద్యోగం చేస్తూ , స్త్రీల సమస్యల్నీ , కుటుంబాల్లో అణచివేత ,మహిళల హక్కులు వంటి విషయాల మీద దృషిని పెట్టి అధ్యయనం చేస్తూ మహిళల కోసం రచనలు చేయటం ప్రారంభించారు.తన ఆలోచనలకి కార్యరూపాన్నితీసుకొస్తూ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పని చేసారు. ఆ సమయంలోనే బాపట్లలో స్త్రీ హితైషిణీ మండలి కార్యదర్శిగా, బాలికా పాఠశాలకు మేనేజరుగా, శారదా మహిళా విజ్ఞాన సమితికి అధ్యక్షురాలిగా కూడా పని చేస్తూ ఉండేవారు.

ఒక వైపు పుస్తక రచన , మరో వైపు పత్రిక సంపాదకత్వం వహిస్తూ 80 కి పైగా పుస్తకాలు రచించారు.

ఫిలిం సొసైటీకి ఛైర్మన్ గా ,1979 నుంచీ ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికీ, 1989 నుంచీ అఖిలభారత హేతువాద సంఘానికీ ఉపాధ్యక్షులుగా ఉంటూ మూఢ నమ్మకాలని నిరసించారు. 1978లో లండన్ లో జరిగిన ప్రపంచ హ్యూమనిస్టు సభల్లో పాల్గొన్నారు. అభ్యుదయ వివాహ వేదిక స్థాపించి ఎన్నో ఆదర్శ,కులాంతర వివాహాలు జరిపించారు.

ఇక స్త్రీ విముక్తి కోసం అయితే ఎన్నో పథకాలు, సంస్థలు స్థాపించి సేవ చేసారు.
వాటిలో మచ్చుకి కొన్ని –
1980లో మహిళాభ్యుదయం, మహిళాభ్యుదయ గ్రంథాలయం, కుటుంబ సలహా కేంద్రం, స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం ,మహిళాభ్యుదయ పురస్కారం,వృద్ధ మహిళాశ్రమం వరకట్న హింసల దర్యాప్తు సంఘం, స్త్రీల హక్కుల పరిరక్షణ కేంద్రం, శ్రామిక మహిళాసేవ, సుబ్బమ్మ షెల్టర్, 2000లో మల్లాది సుబ్బమ్మ మహిళా ఒకేషనల్ జూనియర్ కళాశాలను, మల్లాది సుబ్బమ్మ ట్రస్టు….మొదలైనవి ఇంకా చాల వున్నాయి. పై సంస్థల ద్వారా మహిళలకు చేయూతగా ,అండగా నిలిచారు.

సార నిషేధం కోసం ఉద్యమం చేసి పోరాడి విజయం సాధించారు.

ఆమె చేసిన కృషికి దుర్గాబాయ్ అవార్డు,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథం అవార్డు, ప్రియదర్శిని అవార్డు, త్రిపురనేని రామస్వామి అవార్డు,మహిళా ఆత్మగౌరవ పురస్కారం, దుర్గాబాయ్ మెమోరియల్ పురస్కారం,సంఘసేవకు నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డు లభించాయి. .

ఆస్తుల్ని కూడబెట్టుకోవటం, వారసులకి పంచిపెట్టుకోవటం మాత్రమే చూస్తున్న ఈ రోజుల్లో సుబ్బమ్మ తన యావదాస్తిని ‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’కి ఇచ్చేయటం ,పలు విద్యాసంస్థలకు విరాళంగా అందించటం కూడా చేసారు.అంతే కాదు. తాను చనిపోయిన తర్వాత సైతం శరీరం సమాజానికే ఉపయోగపడాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని ఉస్మానియా మెడికల్ కళాశాలకు అప్పగించే ఒప్పందాన్ని ముందుగానే చేసుకున్నారు.కుటుంబ సభ్యులు సుబ్బమ్మ ఆశయాలను గౌరవించి నెరవేర్చారు.
భౌతికంగా సుబ్బమ్మ గారు లేకపోయినా తన రచనల ద్వారా, స్త్రీల పథకాల ద్వారా ,భావజాలం ద్వారా ఎప్పటికీ సమాజంలో నడయాడుతూనే వుంటారు.

– పుట్ల హేమలత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

One comment

  • చక్కగా చెప్పారమ్మా! మరలా అలాంటివారుకొందరైనా వస్తేనేకానీ ప్రస్తుత స్త్రీ సమస్యలు తీరేలాలేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)