నర్తన కేళి – 19

మనం ఏ విద్య నేర్చుకున్నా దాని మూలాలకి వెళ్లి తెలుసుకుంటేనే నేర్చుకున్న విద్యకి సార్ధకత ఉంటుంది . కూచిపూడి గ్రామంలో అడుగు పెట్టగానే ఒకరకమైన భావన కలుగుతుంది అంటున్న “ శ్రీమతి గాయిత్రి దేవి ప్రకాష్ గౌర్” తో ఈ నెల నర్తనకేళి ముఖాముఖి ……..

*నమస్కారం గాయిత్రి దేవి గౌర్ ?
నమస్కారం రండి , కూర్చోండి .

*మీ శిష్యులు చేస్తున్న నాట్యం ఏ అంశానికి సంబంధించినది ?
బాల గోపాల తరంగం . దీనిని నారాయణ తీర్ధులు వారు రచించారు. బాల కృష్ణుని దివ్య లీలలతో శోభిల్లే గ్రంధమే శ్రీ క్రిష్ణ తరంగణీ . తరంగం అంటే అల అని అర్ధం . కూచిపూడి నాట్యంలో మిక్కిలి ప్రాచుర్యం పొందినవి తరంగాలు . రేపు ప్రదర్శనలో తరంగం మా శిష్యులు ప్రదర్శిస్తారు .

*ఖరగ్ పూర్ నుంచి కాకినాడ లో ప్రదర్శన ఇవ్వటానికి రావడం ఎలా ఉంది ?
చాలా సంతోషంగా ఉంది . నేను పుట్టి పెరిగిన ఊరు . నేను తొలి ప్రదర్శన ఇచ్చిన వేదిక పై మళ్లీ నేను గురువుగా నా శిష్యుల చేత ప్రదర్శన ఇవ్వడం మరిచిపోలేను ఎప్పటికి .

*మీ తల్లిదండ్రులు గురించి , మీ స్వస్థలం ఎక్కడ ?
మా నాన్న పేరు సత్యనారాయణ వ్యాపారస్తులు . మా అమ్మ పేరు రాజి పోస్ట్ మెన్ . మేము ముగ్గురు అక్కా చెల్లెళ్లం . నేను రెండో అమ్మాయిని . మా స్వస్థలం కాకినాడ.

*మీకు నాట్యం పై ఎలా ఆసక్తి కలిగింది ?
నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉండేదాన్ని . మా మావయ్య గారి అబ్బాయి కూచిపూడి నేర్చుకుని ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాడు .తనతో పాటు వెళ్తూ ఉండడం తో నాట్యం పై ఆసక్తి పెరిగింది .

*మీరు  ఎవరి వద్ద కూచిపూడి అభ్యసించారు ?
శ్రీ మతి లక్ష్మి జ్యోతి మద్దనాల . ఆమె వద్ద కూచిపూడి నేర్చుకోవడం మొదలుపెట్టాను . అక్కడే కూచిపూడిలో సర్టిఫికేట్ పూర్తి చేసాను .

*కూచిపూడిలో ఏం.ఏ ఎక్కడ చేసారు ?
కూచిపూడి లోని పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ఏం.ఏ చేశాను .

*మీ తొలి ప్రదర్శన ఎప్పుడు , ఎక్కడ జరిగింది ?
ధనుర్మాసంలో కాకినాడ లోని సత్కళా వాహినిలో నెల రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి . వాటిలో భాగంగా థిల్లానా చేసాను .

*మీరు కాకినాడ లో నేర్చుకున్నారు , తరవాత కూచిపూడి లో ఉన్నత విద్యను అభ్యసించారు కదా రెండింటికి మీరు గమనించిన తేడా ఏమిటి ?
కాకినాడ నేను ప్రాధమికంగానే నాట్యం అభ్యసించానని చెప్పాలి. ఎందుకంటే మనం ఏ విద్య నేర్చుకున్న దాని మూలాలకి వెళ్లి తెలుసుకుంటేనే నేర్చుకున్న విద్యకి సార్ధకత ఉంటుంది . కూచిపూడి లో అడుగు పెట్టగానే ఒకరకమైన భావన కలుగుతుంది . అక్కడికి వెళ్ళాకనే కూచిపూడి ప్రార్ధన , పూర్వ రంగం గురించి తెలుసుకున్నాను .

*కూచిపూడి ప్రార్ధన గురించి చెబుతారా మా విహంగ చదువరులకు ?
ప్రార్ధనలో మొత్తం ఆరు శ్లోకాలుంటాయి .

*మొదటి శ్లోకం ” ప్రణమ్య శిరసా దేవౌ పితా మహ మహేశ్వరౌ , నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణా యదు దాహృతం “ దీని అర్ధం చెప్పండివిహంగ చదువరులకు?

నాట్య శాస్త్ర కర్త బ్రహ్మ దేవునికి , సృష్టించిన ఈశ్వరునికి , ప్రణమిల్లి ఈ నాట్య శాస్త్రాన్ని మీకు చెబుతున్నానని భరతడు మిగిలిన మునులకు చెప్పుచున్నాడని దీని అర్ధం .

*కూచిపూడి పూర్వ రంగం గురించి చెప్పండి ?
కూచిపూడి ప్రదర్శన మొదలు పెట్టడానికి ముందుగా చేసే అంశాల్ని పూర్వరంగం అంటారు . రంగాన్ని శుద్ధి చేయడం , అలంకరించడం , ధూప , దీపం చూపించడం , అలాగే కూచిపూడి పతాకం అయినా సత్య భామ జడ ఉన్న జెండాను పట్టుకుని వేదిక మీద ప్రదర్శించడం జరుగుతుంది .

* కూచిపూడి లో నాట్య శిక్షణలో మీరు గమనించిన విధానం ?
అక్కడ ముందుగా విధిగా ప్రార్ధన ఉంటుంది . తరవాత పూర్వ రంగం చేయాలి . తరవాత అడుగులు , జతులు , థిల్లానా లు చేసే వాళ్లం . తర్వాత మిగిలిన వాటిలో శిక్షణ ఇచ్చేవారు .

*మీరు ఏం .ఏ లో కొరియోగ్రఫీ పేపర్ లో విభాగాన్ని ఎంచుకున్నారు ?
నేను నారాయణ తీర్ధుల తరంగాల్ని , అన్నమయ్య కీర్తనలు తీసుకుని చేసాను . కొన్ని జావళీలు కూడా చేసాను .

* శాస్త్రీయ నృత్యములలో ఎన్ని భాగాలున్నాయి ?
శాస్త్రీయ నృత్యములు మూడు భాగాలుంటాయి . నృత్తము , నృత్యము , నాట్యము . రసానికి , భావానికి ప్రాదాన్యం లేకుండా మృదంగ జతులకు అనుగుణంగా చేయడమే నృత్తము . ప్రతి నాట్య ప్రదర్శన నృత్తం తోనే మొదలవుతుంది .

*మరి నృత్యం అంటే ఏమిటి ?
రస భావములతో కూడి సాహిత్యము యొక్క అర్ధాన్ని వివిధ భంగిమలతో , కళ్ళతో , హస్తపాద విన్యాసాలతో ప్రదర్శించడం జరుగుతుంది .

*నాట్యం గురించి చెప్పండి ?
పూర్వ కథతో ప్రదర్శించ బడుతుంది . దీనిలో పురాణ పురుషుల పాత్రలను నర్తకులు పోషించడం జరుగుతుంది .

*మీరు ఖరగ్ పూర్ లో కదా ఉండేది ? అక్కడ కూచిపూడి నాట్యానికి ప్రాధాన్యత ఎలా ఉంది ?
ఇక్కడ కూచిపూడి నాట్యానికి ఆదరణ ఉంది . శాస్త్రీయ నాట్యాలకు భరతుని “నాట్య శాస్త్రం” , నందికేశుని “అభినయ దర్పణం” ఆధారంగానే ఉన్నాయి కదా . ఇక్కడ వారు వాళ్ల నాట్యంతో పాటు మిగిలిన నాట్యాలను అభ్యసించడానికి కూడా ఆసక్తి చూపిస్తారు .

*కూచిపూడికి మిగిలిన శాస్త్రీయ నాట్యాలకి మీరు గమనించిన తేడా ఏమిటి ?
ఒక్కొక్క నాట్యానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది . వారి ప్రాంతీయత ఆధారంగా ఆ నాట్యాలు రూపొందుకున్నాయి . స్త్రీలు నర్తించేవి , పురుషులు నర్తించేవి , ఇద్దరు కలిసి చేసేవి ఉన్నాయి . కూచిపూడిలో అభినయానికి పాముఖ్యం ఎక్కువ .

*మీ కుటుంబం గురించి చెప్పండి ?
మా వారి పేరు శ్రీ ప్రకాష్ గౌర్ . సాఫ్ట్ వేర్ ఉద్యోగి . మాకు ఇద్దరు పిల్లలు . అమ్మాయి పేరు శృతిసాగరిక , అబ్బాయి పేరు సాగర్ గౌర్ .

* మీ నృత్య శిక్షణా సంస్థ పేరు , ఎప్పుడు ప్రారంభించారు ?
శృతి నాట్య అకాడమి . 2006 ,ఖరగ్ పూర్ లో ప్రారంభించాను .

*మీ భవిష్యత్ ప్రణాళిక ?
“ తరిగొండ వెంగమాంబ” చరిత్రను నృత్య రూపకాన్ని రూపొందిస్తున్నాను .

*ఇప్పుడు నాట్యం నేర్చుకునే వారికి మీరిచ్చే సలహా ?
నాట్యాన్ని అభ్యసించే టప్పుడు దృష్టి దాని మీదనే పెట్టాలి . అలాగే నేర్చుకోవడం మొదలు పెట్టాక పూర్తిగా నేర్చుకోవాలి . ఏదో సరదాకి మొదలుపెట్టడం మద్యలో వదిలెయ్యడం సరికాదు . అలాగే ఒక శాస్త్రీయ నాట్యాన్ని క్షుణ్ణంగా అభ్యసిస్తే మిగిలిన శాస్త్రీయ నాట్యాలు నేర్చుకోవడం చాలా సులభతరం .

మీ భావాలు , అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.నమస్తే

– అరసి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖి, , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో