మహిళా ఉద్యమం (1857 – 1956)

             Katyayani vidmahe ఈ దశకంలో  మరొక విశేషం ఆంధ్రరాష్రోద్యమం గురించి స్త్రీలు ఆలోచించటం, మాట్లాడటం, ఆంధ్రరాష్ట్ర మహిళా సభలో ఉపన్యసిస్తూ రాయసం రత్నమ్మ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు గురించి ప్రస్తావించిది. ప్రత్యేకాంధ్రరాష్ట్రం నిర్మాణమైతే ఆంధ్రులు తమ దేశాన్ని తామే పరిపాలించుకొంటూ తమ మాతృభాషా వాజ్ఞయం పరిషోపించగలరని అన్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఎక్కువ సోదరీమణులు ఎక్కువ విద్యాలాభం పొంది దేశక్షేమాభివృద్ధికి తోడ్పడగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు విషయమై స్త్రీలు పురుషులతో పాటు గట్టిపట్టు పట్టాలి అన్నది. వట్టిశేషాంబ స్త్రీ జనాభ్యుదయానికి ఆంధ్రరాష్ట్రోద్యమంలో పురుషులతో పాటు  స్త్రీలూ పాల్గొనాలని పిలుపునిచ్చింది. 

               ఆంధ్రరాష్ట్ర  మహిళా మహాసభలో మాట్లాడుతూ కడప జిల్లా బోర్డు అధ్యకక్షురాలయిన  రామసుబ్బమ్మ ప్రాచీన కాలపు పౌరాణిక చారిత్రక స్త్రీల ప్రాశస్త్యాన్ని పేర్కొంటూ అలాంటి స్త్రీ ‘నేడు కుటుంబ భారంతో  క్రుంగి  పోతుంది. దారిద్య్రంతో తలయెత్తలేకున్నది. మగవారి స్వౌర్థంలో  మగ్గిపోతున్నది. అని వేెదనపడింది. మహిళావున్నతికి స్త్రీవిద్య, మాతృ భాషారాధనం శ్రేయోదాయకమని  ప్రతిపాదించి – ఆంధ్రరాష్ట్ర సాధనలో  సత్యాగ్రహం సాధించి  వచ్చి జైళ్ళకు వెళ్ళవల్సివచ్చినా సిద్ధంగా వుండాలని స్త్రీలకు పిలుపునిచ్చింది. రాయలసీమ వీరాంగనలు ఇందులో వెనుకాడరన్న విశ్వాసాన్ని ప్రకటించింది. 

               రాష్ట్రాల అభివృద్ధి అఖిలభారత జాతీయైక్యతకు తోడ్పడాలన్న గాంధీజి హెచ్చరికను ప్రస్తావిస్తూ దేశీయభాషా సాహిత్య సంపదను ఔన్నత్యాన్ని  పేర్కొంటూ మన సంస్కృతి, భూసంపద అన్యాక్రాంతం కాకుండా వుండాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటమే ముఖ్య సాధనమంటుంది కనుపర్తి  వరలక్ష్మమ్మ. గుంటూరు ఆంధ్రమహాసభల వైభవాన్ని ప్రశంసిస్తూ ఆంధ్రోద్యమ విషయంలో ప్రభోధ ప్రచారాలు జరుగక ఇంతవరకు ఆంధ్ర స్త్రీలు ఈ విషయం ఏమీ ఎరగకుండావున్నారని, రాష్ట్రవిషయంలో ప్రభోధం ఇటీవల జరిగినందున స్త్రీలకీ విషయంలో ఆసక్తి జనించిందని, రాష్ట్రోద్యమంలో పురుషులు స్త్రీలకు బాసటగా నిలబడగరని విశ్వాసం  ప్రకటించింది. ఆంధ్రసభవారు ఆంధ్రరాష్ట్రం  సంపాదించుటకై నిర్ణయించు కార్యక్రమాలలో పాల్గొనుటకు ఆంధ్రనారీమణులు సంసిద్దం కావాలని పిలుపునిచ్చింది ఆంధ్ర రాష్ట్రం   మేమే తెస్తాం”  అన్న ధీమాను ప్రదర్శించింది. 

                       లక్ష్మీ రఘురాం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన అన్యాయం, అమర్యాద మరువరాదని, ఆంధ్రరాష్రానికి  స్వాగతం పలకటం ఆంధ్రుల విధి అని ఆంధ్ర రాష్ట్రం  ఏర్పాటుకు ఆశతో నిరీక్షిస్తున్నానని వ్రాసింది,  (1946 మే) సమయమంత్రి రాజ్యలక్ష్మీ దేవి ఆంధ్రరాష్ట్ర ఆవశక్యకతను గుర్తుచేస్తూ ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు 40 ఏళ్ళుగా జరుగుతున్న కృషి చరిత్రను, ఆంధ్రరాష్ట్ర ఆర్థికవనరుల సంపత్తితో సహావివరిస్తూ  వ్రాసిన వ్యాసం పదునెక్కుతున్న స్త్రీల రాజకీయార్థిక చైతన్యానికి గుర్తు (1949) లోకల్‌బోర్డులు. స్త్రీలు అనే అంశంమీద చిలుకూరి లక్ష్మీనరసమ్మ వ్రాసిన వ్యాసం స్త్రీల రాజకీయ భాగస్వామ్యాన్ని గురించిన చైతన్యాన్ని వ్యక్తీకరిస్తుంది.

               1938లో ఆంధ్ర మహిళా సభను స్థాపించి స్త్రీల అభ్యున్నతికి కృషి చేస్తున్న దుర్గాబాయిదేశముఖ్‌ స్త్రీలలో ఆర్థిక రాజకీయ చైతన్యాన్ని ప్రోది చేయటానికి చర్చలు ఏర్పాటు చేసింది. ఆంధ్రమహిళ పత్రికను స్థాపించి ఆ భావాలు స్త్రీలోకంలోకి ప్రసరించటానికి తోడ్పడింది.  మామిడి వెంకమ్మ  అధ్యక్షతన ఆంధ్రమహిళాసభ నిర్వహించిన చర్చలో  టి. సీతమ్మ, వై విజయలక్ష్మి, సుశీల, రత్మమ్మ, సుగుణమణి, పి. సరస్వతి  పాల్గొన్నారు. టి. సీతమ్మ, వై. జయలక్ష్మీ, సుగుణమణి, వెంకమ్మ ఆస్తి హక్కు అవసరాన్ని నొక్కిచెప్పగా మిగిలిన వారు ఆస్థిహక్కు  అవసరంలేదన్నారు. స్త్రీకి డబ్బుతో పనేమిటి ఇల్లు చక్కదిద్దటం ఆమెకు తగినది అని అభిప్రాయపడ్డారు. కానీ ఆస్తి హక్కులేని గృహాధికారం బుద్భుదప్రాయం అన్న అభిప్రాయానికి బలం చేకూరింది. (ఆంధ్రమహిళ డిసెంబరు  1946లో)

               ఇక ఈ థకంలో స్త్రీల రాజకీయ చైతన్యం వికసించినదనటానికి నిదర్శనాలుగా వున్న వ్యాసాలు  అనేకం. దామెర్ల కమలరత్నమ్మ అధ్యక్షతన 1945 డిసెంబరు 20వ ఆంధ్ర మహిళా సభ నిర్వహించిన  చర్చ కార్యక్రమంలో మొక్కపాటి కనకవల్లి, సుగుణమణి, సుశీలాదేవి, కస్తూరి రంగనాయకమ్మ అమ్మన్నరాజా సీతారామమ్మ పాల్గొని స్త్రీలు – రాజకీయాలు అనే విషయం మీద చర్చించారు. కె. సుశీలాదేవి, రంగనాయకమ్మ, సీతారామమ్మ స్త్రీలకి మాతృత్వం, ఇంటిపని ప్రధాన బాధ్యతలని, స్త్రీలు రాజకీయాలలో పాల్గొంటే గృహకృత్యాలకు ఇబ్బంది ఏర్పడి ఇళ్ళల్లో సంతోష సౌకర్యాలు లోపిస్తాయని కనుక స్త్ర్ర్రీలకు రాజకీయాలు అవసరం లేదన్నారు. అమ్మన్నరాజా,  కనకవల్లి స్త్రీలు రాజకీయాలలో పాల్గొనటాన్ని బలపరిచారు. దేశాభ్యుదయానికి, స్వయం వికాసానికి రాజకీయాలలో ప్రవేశం తప్పని సరి అన్నారు. స్త్రీలకు విద్య, సౌకర్యాలు, సమానహక్కులు కావాలంటే  స్త్రీలు రాజకీయాలలో ప్రవేశించాల్సిందేనని వాళ్ళు అభిప్రాయపడ్డారు. (ఆంధ్రమహిళ, 1946 ఫిబ్రవరి)
రెండవ ప్రపంచయుద్ధం గెలుపు ఓటముల స్వభావాన్ని చర్చిస్తూ టి. సావిత్రి వ్రాయటం స్త్రీల రాజకీయ చైతన్యం ప్రపంచ రాజకీయాలతో ముడిపడి అభివృద్ధి చెందుతున్న విషయాన్ని సూచిస్తుంది. భూపతిరాజు వెంకమ్మ, పరకాల అహల్యాదేవి వంటి స్త్రీలు కమ్యూనిస్టు రాజకీయ చైతన్యంతో స్త్రీల సంఘాలు పనిచేస్తున్న తీరును వివరిస్తూ వ్యాసాలు వ్రాశారు. 

             1940 వ థకంలోనే భారతదేశానికి బ్రిటీషు వలస పాలన నుండి స్వాతంత్య్రం వచ్చింది. భారతీయ పురుషులతో పాటు స్త్రీలకు కూడ  రాజకీయ స్వాతంత్రం వచ్చిందని స్త్రీలందరూ గుర్తించారు. స్త్రీలకు పురుషులతో సమానమైన హక్కులున్నాయన్న ఎరుకను కనబరిచారు. స్త్రీల శక్తి సామర్థ్యాల గురించిన చరిత్రను వర్తమానాన్ని తవ్విపోసుకొన్నారు. ఆశక్తి సామర్థ్యాలను తోటి స్త్రీల అభ్యుదయానికి ఇతోధికంగా వినియోగించటానికి తగు నిర్మాణ కార్యక్రమం ఏర్పరచాలని వి మాణిక్యవల్లి (జులై 1949),  పురుషుడు తానెక్కువ, స్త్రీ తక్కువ అనే భేదాభిప్రాయాలు సంకుచిత భావాలు విడనాడాలని, ప్రభుత్వంలో సమస్తవర్గాలకు సంబంధిఙంచిన కార్యాలయాల్లో స్త్రీలకు పురుషులతో సమానంగా  ఉచిత స్థానమివ్వాలని వై. సరోజినీదేవి (జులై 1949) వ్యాసాలు వ్రాశారు. 

               1950 వ  సంవత్సరంలో స్త్రీల వ్యాసాలు అనేక అంశాలను సృశించాయి. పిల్లల శిక్షణ, ఇంటి పనులలో మెళుకువలు, పొదుపు, విద్య, విజ్ఞానం, ఆహార భద్రత, ఆధ్మాత్మికత, గృహపరిశ్రమ, ముగ్గులు మొదలైన అంశాలమీద వచ్చిన వ్యాసాలు అలా వుంచితే స్త్రీల సమస్యను సంబోధించినవి ప్రత్యేకం గమనించ దగినవి. ప్రతి వ్యక్తి సాంఘిక ఆర్థిక రాజకీయ విషయాలలో స్వశక్తితో వ్యవహరించటానికి కావలసిన విషయ పరిజ్ఞాన సంపాదనయే విద్య అని, ప్రస్తుత పరిస్థితిలో భారతదేశాభ్యుదయానికి  స్త్రీలకు అటువంటి విద్యేకావాలని యస్‌.కె. పద్మావతి  స్త్రీ విద్యా స్వభావాన్ని పునర్నిర్వచించింది.  పురుషులు స్త్రీలు రాజకీయ గృహ కృత్యాలలో సమానగౌరవ మార్యాదలతో  సంచరించాలని ఆశించింది. స్త్రీల ప్రవర్తనపై, శీలంపై నిఘా వుంచే సంఘాచారాన్ని విమర్శకు పెట్టింది ఓలేటి రాజరాజేశ్వరి. స్త్రీలు విద్యాశూన్యులై  కూపస్థమండుకాలవలె వుండి తమకు తెలిసిన దానితో తృప్తిపడి జీవించటం స్త్రీలకే మంచిది కాదని అంటుంది చెరుకూరు నాగభూషణమ్మ.   ఇల్లే శరణ్యంగ వుండే స్త్రీల స్థితి అతిదైన్యమని, పత్రికా పఠనంలో, గ్రంథపఠనంలో అభిరుచి కలిగించి వాళ్ళను అజ్ఞాన తిమిరం  నుండి బయటకు తీసుకురావాలని క్రొవ్విడి మాణిక్యాంబ వ్రాసింది. ప్రతివూళ్ళో స్త్రీలకు ప్రత్యేక గ్రంథాలయాలు వుండాలని అది స్త్రీలలో సంఘభావాన్ని కలిగిస్తుందని, బుద్ధికి సత్యనిర్ణయ సామర్థ్యాన్ని, సంభాషణకు చాతుర్యాన్ని ఇస్తుందని ఆమె అన్నది.

– ఆచార్య కాత్యాయనీ విద్మహే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ -~~~~~~~~~~~~~~~~~~~

 

సాహిత్య వ్యాసాలు ​, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో