నది ప్రవహిస్తూ ఉంది

నిడదవోలు మాలతి

నది ప్రవహిస్తూ ఉంది 

వేయి పడగల ఫణి రాజు 

మెలికలు  తిరుగుతూ 

కుత్సిత ఉత్తేజిత  ఊగిసలాట తో 

అసాధరణ  నాట్య కళాకారిణి  

ఆఖరి మిరుమిట్ల ప్రదర్శన వలే 

నదీ ప్రవాహం 

శోభా మయమైన ఉత్సుకత తో 

నది ప్రవహిస్తూ 

ప్రవహిస్తూ కదులతుంది 

నది ప్రవహిస్తూ 

కదులుతూ కూడా .. 

అద్భుతాన్ని తేరిపార చూస్తూ ఉంటాను 

చీల్చుకుని  వెళ్ళే నది

కొండ పై గుహల మూలలు నుండి 

ఉన్నతాల పై మండే జ్వాల లా

స్థల ధ్వంస రచన చేస్తూ

పోటెత్తిన గిత్త లా

విరోధిని మట్టు పెడుతూ 

ఆకలి గొన్న సింహం 

ఎర పై విసిరిన పంజా లా

ప్రవహిస్తున్న  నది 

కొండ వాలుల పై నించి జారుతూ 

బండ రాళ్ళ పై తొక్కుతూ 

ఒడ్డు గండ్లు పై నించి దొర్లి పోతూ 

నిపుణుడైన  గారడి వాడి తాడు పై  నడకలా 

నది ప్రవహిస్తూ ఉంది  

 

అక్కడ

ఒక్క క్షణమాగి 

ఎగ శ్వాస కై తడుముకుంటూ

లేక                     

సరి చూసుకుంటూ 

ఉపేక్ష తో కూడిన స్పర్శా …

అశాశ్వత మైన జీవితాలు

చేతనా  వస్తువుల కోల్పోయిన ఆత్మలు 

వారి ఆశ లు

భయాలు ,వారింపులు

కోపాలు ,లోభిత్వాలు            

చిన్న చిన్న అసూయలు 

వెర్రి వేలాడ్డాలు

అల్పమైన విషయాలకి

ఇంకా

వేల నీడల

ఖాళీ కోరికల తో 

ప్రవహించే నది 

ప్రవహించే నది 

నా మది ని దోచేస్తూ

తన దాష్టిక చేష్ట ల తో

అందె వేసిన నాట్య గత్తె

తన గమనాన్ని తానూ పాటిస్తూ

లేలేత ఆత్మలని మోసుకుంటూ

తన చేతుల మధ్య

తెలియని తీరాలకి 

ఆమె ప్రవహిస్తూ 

నేను ఆశ్చర్య పడుతూ 

ఆమె ఎరుగునా ఆ వస్తువులు
ఆమె హత్తుకున్న
తన తీయని ఎడద లో

వస్తువు లు
ఆమె పోగు చేస్తున్న
కాలం ,కెరటాలలో
ఇంకా
వదిలి వేస్తూ
ఆమె కదులుతూ

ఆమె స్పర్శి స్తుందా

లెక్క లేని పిచ్చి వస్తువులు 

తనలో బలవంతంగా దాచుకుంటూ

కాగితపు పడవలు 

విరిగి పోయిన హృదయాలు
పూల గుత్తులు 

పవిత్రమైన మునకలు 

నది ఒడ్డున గవ్వలు 

మానవ వృధాలు
లాలా జాలాలు 

చచ్చి పడిన శరీరాలు
నాచు
మోటార్ బోట్లు 

ఆమె పేగులు మెలిపెడుతూ
మొసళ్ళు మెండుగా పీక్కుంటూ
సగం శిధిల మైన శరీరాలు                                                                            

చిన్న చేపలు 

తమ మనుగడ కోసం జగడిస్తూ
నది ప్రవహిస్తూ 

నది ప్రవహిస్తూ                                                

రాజసం ఒలికించే తిరస్కారంతో కదులుతూ
అల్పమైన కట్టడాలు  

మానవుడు నిర్మించినవి
స్టీల్ తో గుచ్చుతూ
కాంక్రీట్ పోస్తూ
పవిత్ర జలాలని భ్రష్టు పరుస్తూ
తన ఆఖరి ప్రయత్నం అరికట్టాడానికి
తన అజేయమైన జలాల తో
నది ప్రవహిస్తూ
తన గమనాన్ని తానే అనుసరిస్తూ 

వారి పొగరు చూసి క్రోధురాలై
ఆ నది
పిగిలి పోతుంది

బహు సుందరం గా వెళ్ల గ క్కుతుంది 

ఆగ్రహాన్ని పగల గొడుతూ 

ఆనకట్టలు ,వారధులు 

ఇంకా వారి నివాసాలు
ఒక్క శుభ్ర మైన ఊడ్పు లో
ఎలా అంటే 

నేల ని తయారు చేస్తున్నట్టు

కొత్త లోక పునర్ నిర్మాణం కోసం 

రెచ్చగొడుతున్నట్టు
వారి లోపాలని
నిరూపిస్తున్నట్టు
తన సొంత బలాన్ని

అందాన్ని 

ఇంకా నిబద్ధతని
ఎలా అంటే
తీక్ష్ణ మైన బ్రహ్మాండ నర్తింపు లా
ఆ నటరాజు ది 

నేను ఆ ఒడ్డున కూర్చుంటాను 

విస్మయ పడుతూ
ఆమె కి ఎరుకేనా ఈ బంధం
అంతు బట్టని అగాధం అనిపించే  ప్రవాహం లో
ఇంకా ఒడ్డున ఉన్న ఆ జటిలమైన జీవితాలు  ?
మానవ సమూహాలు
సంపూర్ణం
తల్లులూ కూతుళ్ళూ
తండ్రులూ కొడుకులూ
కలుషితమై
రాజకీయాలు  అధికారం
ఇంకా ధనమూ
విద్యుత్ కాంతులు
పరివేష్టించి న 

నీచ జీవితాలు
మరియు
ఎక్కడ
విద్వత్తు నశించిందో
మానవ యోగ్యత 

ఇంకా ఒక వ్యాపార సరుకు గా మారిందో
తగ్గింపు ధరలలో 

అమ్ముకుంటారో  

ఆమె మృదువుగా 

ప్రవహిస్తుంది
రాజస మైన సరళి లో
వైఫల్యాలు  తనని తాకక 

మానవ జాతివి 

నేను ఇంకా అక్కడ కూర్చుంటాను
వింటూ ఉంటాను
సవ్వడి  లాంటి
లక్షల చిన్ని తరంగాలు
ఒడ్డున రాళ్ళని బలం గా తాకుతూ 

శ్రావ్యమైన ధ్వనులని
నేను  సంభ్రమ పడుతూ 

ఆమె ఎవరో
ఎరగని అణకువ గల
విడి వడి , నిష్పక్షపాతమై
అనుసరించాలి అనే కోరికతో
తన దారిన తను 

నది మైదానం లోకి ప్రవేశించింది 

మహనీయమైన గమనం  తో
వేద మంత్రాల ని పారాయణం చేస్తూ
కుంగిన ఆశలని ఉత్సాహ పరుస్తూ
నిస్తేజితులైన జీవాలని పరిరంభణం చేస్తూ
విశ్వ సమన్వయానికి తెర లేపుతూ 

అలా ప్రవహిస్తూ ఆమె 

రక రకాల ఆత్మలని స్పర్శిస్తూ
వేల ఎడద ల ని వెలిగిస్తూ
హరివిల్లు రంగులు వెద జల్లుతూ

ఆమె ఔదార్య హృది ని  హత్తుకుంటూ 

దట్టమైన మబ్బుల వేపు
నది ప్రవహిస్తూ ఉంటుంది
హుందాగా
తన ప్రకాశం లో తానే చలి కాచుకుంటూ
లయ బద్ధమైన 

స్వర గుసగుసలు తో 

నది ప్రవహిస్తూ                                                                 

 ఆ నది
వయోరహిత నాట్య కారిణి లా 
నర్తిస్తూ 

 శతాబ్దాల జ్ఞానాన్ని పంచుతూ
దేవ సైనికుడి తేజస్సు తో
సామ్రాజ్ఞి చుట్టు ఉండే దివ్య తేజస్సు తో
నది ప్రవహిస్తూ 

ఆ నది
మరియు ఆ జీవం
మెలివేసుకుని 

చిక్క నైన  బంధం లో
ఒక్కొక్కటి
స్వాభావిక భాగమై
మరొక దాని లో
నది ప్రవహిస్తూ ఉంటుంది
ఇంకా
ఆ నది ప్రవహిస్తూ ఉంటే

జీవితమూ కొనసాగుతూ ఉంటుంది .. 

– నిడదవోలు మాలతి 

అనువాదం:  వసంత లక్ష్మి . పి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, Permalink

8 Responses to నది ప్రవహిస్తూ ఉంది

 1. లక్ష్మీ వసంత నాకవితని ఇంత చక్కగా అనువదించినందుకు ధన్యవాదములు.
  ఆంగ్లమూలం ఆసక్తి గలవారు ఇక్కడ చూడవచ్చు. http://wp.me/p3npcR-కబ్

  • మాలతి గారూ ,
   ఒక పెద్ద విశ్వ విద్యాలయం నుండి పట్టబధ్రురాలినయాను అన్నంత సంతోషం గా ఉంది ..
   తెలుగు – ఆంగ్ల భాషల అనుసంధానం ,తెలుగు భాష సొబగులు పై మీరు చేస్తున్న పరిశోధన , చూసిన నాకు , మీ ఈ అభినందన చాలా గర్వ కారణం ..
   అవకాశం ఇచ్చినందుకు మరొక మారు కృతజ్నతలు ..

   వసంత లక్ష్మి .

 2. వసంత గారు మూలం ఎలా ఉండూ కానీ మీ అనువాదం చాలా బావుంది . పైన వ్యాఖ్యలో దమయంతి గారి అభిప్రాయమే నా అభిప్రాయం ..

  • వనజ తాతినేని గారూ ..
   క్షమించండి ,నా ప్రతి స్పందన ఇంత ఆలస్యం గా ఇస్తున్నందుకు ..
   మూలం నన్ను చాలా ఆకట్టుకుంది ..అంత గొప్పగా కాకపోయినా బాగా చేయాలని ,నా సాయశక్తులా ప్రయత్నించాను ..మీ అందదికీ నా ప్రయత్నం నచ్చినందుకు చాలా సంతోషం ..
   ధన్యవాదాలు అండీ మీకు వనజ గారూ ..
   వసంత లక్ష్మి ..

 3. mani vadlamani says:

  చాల బావుంది మీ అనువాదం, అంటే మాలతిగారి అసలు కవిత ఇంకెంత బావుందో, అది కూడా
  షేర్ చెయ్యల్సింది వసంత గారు. అసలు ఆ పదాలు యెంత
  బావున్నాయో!

  నది ప్రవహిస్తూ ఉంటే
  జీవితమూ కొనసాగుతూ ఉంటుంది…… గ్రేట్ Mams both of you

  • మణి వడ్లమాని గారూ !
   ధన్యవాదాలు .. విదుషి మణులు మీరు మెచ్చుకున్నారు అంటే ,మరి నాకు సంతోషమే ..
   అవును ఆంగ్లం లో అసలు కవిత ఇంకా మాధుర్యం గా ,నది మన మీదకి ఉరికి కథనం చెపుతున్నట్టు కధన కుతూహుల రాగం లో ఉంది ,నిడదవోలు మాలతి గారికి ,ఈ ముఖం గా వందనాలు ,నాకు అనువాదం చేసుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు ,వేల కృతజ్ణతలు .

   వసంత లక్ష్మి .

 4. ఆర్.దమయంతి. says:

  శతాబ్దాల జ్ఞానాన్ని పంచుతూ దేవ సైనుకుడి తేజస్సు తో సామ్రాజ్ఞి చుట్టు ఉండే దివ్య తేజస్సు తో నది ప్రవహిస్తూ –
  బావుంది వసంత. బాగా రాసారు. అనువాదం లా అనిపించలేదు.
  మీ ఇరువురికీ నా అభినందనలు.
  ప్రేమతో..

  • దమయంతి గారూ ..
   చదివి ,వెను వెంటనే మీ అభిప్రాయం కూడా వ్రాసారు , నది ప్రవహించింది అంటూ ఆంగ్లం లో రాసిన మాలతి గారు నా మదిలో ఆనంద అలల రేపారు ,ఆ అలల వరద లో కొట్టుకు పోతూ ,ఒక చిరు ప్రయత్నం చేసాను ,నా ., మన భాష లోకి అనువదించాలని …దోసెళ్ళ తో పట్టుకునే వారు కొందరు ..నది ..ఎంత ప్రాప్తమో అంతే ఇస్తుంది …

   మీ స్పందన కి అమిత సంతోషం తో ఎగిసి పడుతూ ..

   వసంత లక్ష్మి .