ఓ ఆడ బిడ్డ ఆక్రందన

  
 పుట్టక మునుపే నన్ను వద్దనుకున్న నాన్న
 పట్టుబట్టి కని పెంచింది మా అమ్మ…

పుట్టి ఏడాది పెరిగాక నా పాలు గారే
పసి బుగ్గలు ముద్దాడే వారంతా నా వారే అనుకున్నాను..

నా కంటే చిన్న వాడు నా తమ్ముడ్ని వదిలి,
నన్నే ఎందుకు ఎత్తుకు ముద్దాడాడూ?ఈ గుమాస్తా?

అద్దె అడగడానికి వెళ్తే “రేపిస్తాను” అంటూ,
భుజం నొక్కి చెప్తాడెందుకు అంకుల్..

చెప్పుకొనేందుకు ఎవరూ లేరు..
చెప్పటానికి చేత కాదు…

ఎక్కడెక్కడో చక్కిలి గిలి పెడుతుంటే,
మా మంచి సరదా మామయ్య అనుకున్నా..

ఒకడు వెంటపడి  వేధిస్తున్నాడని చెప్పబోతే
మరి నాకేమిస్తావని అడిగారు మాస్టరు..

యాసిడ్ నుంచి ఐతే తప్పించుకోగలిగాను కానీ..
నా మనసు రగిలి పోతోంది కసి తో…

వయసుతో పనిలేని వంచనలింకెన్నాళ్ళు?
రక్షణనే ఇవ్వాలేని ఈ రాజ్యాంగపు లోగిళ్ళు..

ఎలా కక్ష తీర్చుకోను ఈ సమాజం మీద?
ఎలా జన్మ నివ్వను మరో ఆడ బిడ్డకు ఈ భూమిమీద?

-కుసుమ కాంతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , Permalink

One Response to ఓ ఆడ బిడ్డ ఆక్రందన