సంపాదకీయం

                     చుండూరులో 1991 లో దళితుల పై జరిగిన మారణ కాండ మరోసారి తెర పైకి వచ్చింది . ఇన్నేళ్ళ  తర్వాత “అగ్ర “ న్యాయ స్థానం దళితుల ఆత్మాభిమానం పై మారణ హోమం జరిపింది. 219 మంది ముద్దాయిలతో మొదలైన విచారణ ఏళ్ళకి ఏళ్ళు జరుగుతూ పోయింది . అత్యాచార నిరోధక చట్టం 21 మందికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది . 35  మందికి ఏడాది జైలు శిక్ష  వేసింది .

చిన్న చిన్న సంఘటనలతో మొదలైన వర్ణ ఘర్షణలు గొల్లమూడి యాకోబ్ అనే దళితుడి పై హత్యా ప్రయత్నం  వరకు వెళ్ళింది. . స్థానిక పోలీసుల సహాయం తో  మాల పేట పై దాడికి దిగారు . అగ్ర వరణ దురహంకారంతో పాటు గొడ్డళ్ళు , బరిసెలు , కత్తులతో దళిత వాడ మీద పడి ,వెంట పడి దొరికిన వాళ్లని నరుకుతూ పంట పొలాల వెంట పరుగులు తీయించారు . ఎనిమిది మందిని నరికి చంపారు . దాడులలో చనిపోయిన వారిని పంట కాలులలోకి తోసారు . సంసోను అనే వ్యక్తికి కను గుడ్లు పికేసారు . మరి కొంత మందిని గోనె సంచుల్లో కూరి కుట్టేసారు . దాహం అంటే నోట్లో మూత్రం పోసారు . 2003 లో స్పెషల్ పి పి బి . చంద్ర శేఖర్ బాధ్యతలు తీసుకున్నాక  కేసును విచారించి న్యాయం జరిగేలా చేసారు . ప్రజా సంఘాల నాయకులు , దళిత మహా సభ , కుల నిర్ములన పోరాట సమితి  దళితులకు అండగా నిలిచి  మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు . న్యాయం జరగడానికి  కృషి చేసారు . ఇన్ని పరిణామాల మధ్య ఇప్పుడు హై కోర్టు సంచనాత్మకమైన తీర్పు తీర్చింది . చుండూరు నిందుతులందరికి విధించిన యావజ్జీవ శిక్ష , జరిమానాలు రద్దు  చేసింది . వారిని వెంటనే విడుదల చేస్తూ జరినామాలను కూడా తిరిగి ఇవ్వాలని సూచించింది . చుండూరు దళిత మృతులు ఎప్పుడు ,ఎక్కడ, ఎలా మృతి చెందారో ఎవరు దాడి చేసారో అనే అంశాలను సరిగ్గా ఆధారాలతో చెప్పలేక పోయారని న్యాయస్థానం నిందితుల్ని నిర్దోషులుగా పేర్కొంటూ  తీర్పు ఇచ్చారు .

                              ఈ తీర్పు వచ్చిన వెంటనే ప్రజా సంఘాలు , దళిత సంఘాల నాయకులు , చుండూరు దళితులు ఈ సంఘటనని తీవ్రంగా ఖండించారు . ఎప్పటిలాగే దళితుడి ప్రాణానికి విలువ లేకుండానే పోయింది . ప్రాణాలు కోల్పోయినా  పంట కాలువలలో కుళ్లిపోయినా , న్యాయం జరిగినా తమ తల రాతలు మారవని అర్ధం అవుతుంది . కుల కక్షలున్న మాట వాస్తవం . దళితులపై దాడి జరగటం , చంపటం రెండు నిజమే, చూపించిన సాక్ష్యాలను అంగీకరించి శిక్షలు వేయటం కూడా నిజమే.  కాని కోర్టుకి దోషులు కనిపించలేదు . చంప బడ్డ స్థలం , సరిగ్గా ఎన్ని గంటల  ఎన్ని నిమిషాలకు చనిపోయారో అనే ఆధారాలు కనిపించలేదు . దోషులు  లేకుండానే  దళితులు కిరాతకంగా చంపబడ్డారు . అయినా మనకో పాత సామెత ఉండనే ఉంది కదా ..

            ‘వడ్డించే  వాడు మన వాడే అయితే చివరి పంక్తి లో కూర్చున్నా విందు భోజనం దక్కుతుందని’ లాభం పొందిన నిందితులని చూస్తే ఈ విషయం అర్ధం అవుతూనే వుంది. .

– హేమలత పుట్ల 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

One Response to సంపాదకీయం

  1. Thirupalu says:

    ఇక్కడ మానవ కాయం లో జన్యువులు మ్యుటేషన్లు ఏర్పరుచుకున్నాయి.
    సిగ్గు లజ్జాను కలిగించే హార్మోన్లు స్రవించడం మాను కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)