గాయాల చుండూరు

ఎండ్లూరి సుధాకర్

ఎండ్లూరి సుధాకర్

ముద్దాయిలకు
ముద్దబంతుల దండలేసి

ముక్తి ప్రసాదించారు
అన్యాయమంటూ
ధర్మ దేవత గొంతు పిసికి
నిర్దోషులుగా పరిగణించారు

  ****                 ****                 *****

కళ్లు మూస్తే గాయాల చుండూరు
కళ్లు తెరచి చూస్తే అన్యాయాల పుండూరు
మనుషుల్ని చంపడం ఎంత ఎడ్డి తనం
కాపు కాసి మట్టు బెట్టడం ఎంత మడ్డితనం
పోలీసు స్టేషనో న్యాయ స్థానమో ఉంది కదా
పట్టపగలే గొంతులు కోయడం ఎంత గిడ్డితనం

  ****                 ****                 *****
సినిమా హాల్లో కాళ్ళు తగిలించారని
చెరువులో నీళ్ళు కలుషితం చేసారని
దళితుల్ని దారుణంగా నరికేయడం
ఏ ఆదిమ కాల కరాళ క్రూర న్యాయం ?
దొంగ నిద్ర నటించే దోషుల్లార
తుంగ భద్ర కాలువ నడగండి
నెత్తుటి అలలతో మృత్యు గీతం పాడుతూనే ఉంటుంది
ఏ ధర్మా సనానికి ఆ గొంతు వినపడుతుంది ?

****              *****         ***

ఇక్కడ వర్ణం అగ్రమై
ఆయుధమై అపరాధమై
అస్పృశ్యుల హత్యలు జరిగినప్పుడల్లా
పాలక హస్తాలో
రక్షక నేస్తాలో

దోషం మీద దుప్పటి కప్పుతాయి
అబద్ధపు సాక్ష్యాలు చెపుతాయి

  *****         ****         ***

రాజకీయ నాయకులారా
కుల రక్త పాతం ఆపలేరా
ఓట్లు పోసి కొనుకున్నాం
కనీసం ప్రాణాలు కాపాడ లేరా
అంటరాని వీధుల్లోకి అడుక్కోవడానికి వచ్చినప్పుడు
మృత్యు ముఖాలు గుర్తుకు రావా ?

వెలి ఆత్మలు మీవి కావా ?

*****            ****         ***
సహనం దహనమైపోతుంది
కంటికి కన్ను
పంటికి పన్ను

మానానికి మానం…
ప్రాణానికి ప్రాణం

కావాలి సమానం
ఇదే చట్టమైతే
ఇప్పుడే ఆమలులోకి వస్తే
ఆయుధాలు శాంతి వచనాలు వల్లిస్తాయి
న్యాయ స్థానాలు శాశ్వత సెలవులు ప్రకటిస్తాయి

*****            ****         ***

చుండూరు మృత వీరుల
సమాధుల మీది
శిలువలు ఏమి చెబుతున్నాయి ?
కంట తడి పెట్టకండి తల్లుల్లారా
న్యాయం గెలుస్తుందని నముతున్నాయి

*****         ****         ***

మీ దళిత వాడను చుండూరు చేస్తాం
అడుగడుగునా మీ అంతు చూస్తాం
ఇవి చుండూరు సందర్భ వాక్యాలు
ఎవరు ఎవరితో అన్నారో
ఎవరితో అంటే ఎవరు విన్నారో
ఈ దేశంలో
ప్రతి ఊరికీ తెలుసు
ప్రతి వాడకీ  తెలుసు
తెలియనిదల్లా న్యాయ దేవతలకి
చట్టాలకి … ఖాకీలకి ..

*****         ****         ***
దళిత దాష్టీకాల మీద
దళిత స్త్రీల దారుణాల మీద
కవితలు పలకమన్నా
కథలు రాయమన్నా
కలాలకి జ్వరం పట్టుకుంటుంది
కులాలకి కుంటు సాకు దొరుకుతుంది
అరె !
కూపస్థ కవుల్లారా
మరో జన్మంటూ ఉంటే
ఈ దేశంలో దళితుల్లా పుట్టండి
అంటరానితనం అనుభవమవుతుంది
అనుభవం దగ్ధ దళిత కవిత్వం అవుతుంది

***        ****            ****

ఎక్కడో ఎడారిలో
ఒయాసిస్సులా
స్పార్టకస్ లా
దళితుల పక్షాన
ధర్మ వీరులు పోరాడుతున్నారు

” జై భీం ” వాళ్ల కోసం
పీడితుల కోసం
ఎరుపెక్కిన పిడికిళ్ల కోసం !

*****    *****    *****

– ఎండ్లూరి సుధాకర్

9246650771

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink
0 0 vote
Article Rating
7 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Lanka Kanaka Sudhakar
Lanka Kanaka Sudhakar
6 years ago

కూపస్థ కవులు …..బాబోయ్ మేలుకొలుపు లా వుంది సర్

Thirupalu
Thirupalu
6 years ago

//రాజకీయ నాయకులారా
కుల రక్త పాతం ఆపలేరా
ఓట్లు పోసి కొనుకున్నాం
కనీసం ప్రాణాలు కాపాడ లేరా
అంటరాని వీధుల్లోకి అడుక్కోవడానికి వచ్చినప్పుడు
మృత్యు ముఖాలు గుర్తుకు రావా ?
వెలి ఆత్మలు మీవి కావా ? //
రాజకీయ నాయకులారా ఆపొద్దు నాయన ఆపొద్దు .
మీకెందు పాపం అంత కష్టం. ఆపక పోతే పోయారు. చేతి నిండా పనులుండె వారు మీరు.
కనీసం మీరు నూనేగా మారి ఒత్తి వెలిగించక పొతే అదె పది వేలు.

Jaidev Nada ( USA )
Jaidev Nada ( USA )
6 years ago

మన్నించండి …… నీటి కాకులను సైతం “కవి ” అంటారు . ( నేను ముందు రాసిన దానిలో సవరింపు )

Jaidev Nada ( USA )
Jaidev Nada ( USA )
6 years ago

నాయన ఎండ్లూరి కవి గారు! ఎందుకయ్యా మమ్మల్ని ” కూ పస్థు కవులని ” మంచి బూతులు తిడ్తున్నావ్ ?. నీటి కాకుల్ని సైతం కాకులంటారు కదా? బీద కవి ఏ కులంలో పుట్టినా ఒక్కటే కదా? సందకాడే లేచి చిటుకుడు ఆటుకుల్ల్ని వెతుకొన్నే నా లాంటి గొట్టం కవులు ఈ సంఘాన్ని ఎం ఉద్దరిస్తారని మీరు ఆశిస్తున్నారు? అయినా మీకు కోపం వచ్చినా సరే ….. గిద్దెడు రిజర్వేషన్స్ లిఫ్త్స్ లేదా గిఫ్ట్స్ కోసం …. మేము దళితులం ….జ్వలితులం ….అని నుదుటి మీద రాసుకొని …. ఏదో తెలియని అసమర్ధ తతో ….వూరోళ్ళకు దూరంగా … పూరిళ్ళ మధ్య ఘోరంగా …. మద్య పెద్ద డెకరేషన్ గా “డాక్టర్ గారి బొమ్మ ” నొకటి పెట్టుకొని …” మేం గొర్రెలం …. మీరు దొరలు … కాల్మోక్కుత్తం అని రాగాలు తీస్తుంటే … బలి కార్యక్రమాలు సజావుగా జరిగిపోతాయి. అందుకే నేను గుంటూరు దళిత సమ్మేళ్ళనమ్ గురించి 15 ఏళ్ళ క్రితం ఓ పాట రాసి నట్టు గుర్తు . ” చరణం : మేకలను బలి యిత్తురు కానీ పులులను బలి యిత్తురా ?”. ఇలా పులిలా బ్రతకాలనే తాపత్రయ పడ్తూ ….కవి ఏండ్లూరి ప్రియ మిత్రుడు మరియు అతి సన్నిహితుడు … మధుర కవి .జైదేవ్ నడ .

buchi reddy gangula
buchi reddy gangula
6 years ago

ఎక్ష్చెల్లెన్త్ సుధాకర్ జి —-
సుప్రీమ్ కోర్ట్ కు వెళ్ళాలి —దోపిడీ వ్యవస్థ లో —న్యాయం నిద్రపోతుంది
————————–
బుచ్చి రెడ్డి గంగుల

kandikatti suri
kandikatti suri
6 years ago

కోపం ఎప్పటికప్పుడు ఎక్కువవుతూనే ఉంది మండుతున్న అగ్నిగుండంలా
ఎక్కుపెట్టిన బాణంలా మీ కవితకు జోహారు.
అభినందనలతో.-కందికట్టి సూరి, హైదరాబాద్
.

Gangadhar mylaram
Gangadhar mylaram
6 years ago

చట్టాలు పోలీసులు మనకు న్యాయం చేయలేవు ఆవి డబ్బు వునోని చుట్టాలు
కాబట్టి పోరాటం చెయ్యాలి