తిరస్కార ఓటు

ఎదురు చూస్తున్న ఎన్నికలు రానే వచ్చాయి . వాగ్దానాలు , ధనలక్ష్మి స్వైర విహారం , పానీయాల ప్రవాహాలు ఓటర్లకి , మరు నిమిషంలో మాయమైయ్యే రంగుల కలల్ని చూపిస్తున్నాయి . ప్రజాస్వామ్యాలు , మహిళల హక్కులు మరోసారి తెర మీదికి వచ్చి ఓట్లు దండుకునే గుంపుల్లో స్త్రీలు రోజుకూలీల పావులుగా మారుతున్నారు .

ఆడపడుచులని ఓటు లక్ష్ములుగా భావించి ఆడపడుచు లాంచనాలతో… చీరలు, కుంకుమ భరిణెలతో దర్శిస్తే తమ తమ రాజకీయ జీవితాలు గట్టెక్కేస్తాయని రాజకీయ నాయకులు తీవ్రంగా నమ్ముతున్నారు . నేర చరిత్రలు, గత చరిత్రలు ఎన్నికలలో నిలబడడానికి పెద్ద అడ్డేమీ కాకపోవడంతో ఓట్ల కోసం  ఎత్తులు పైఎత్తులు మామూలే  అయ్యాయి . అనుభవాలు పండిన రాజకీయాల ముందు ఔత్సాహిక స్వతంత్ర అభ్యర్ధులు రంగు వెలిసిన బ్యాలెట్ పత్రాల్లా కనుమరుగవుతున్నారు .

ఇంతకీ తమ తమ నియోజక వర్గాలలో పోటీ చేసిన  అభ్యర్దులంతా ఏ కారణం చేతనైనా ఓటర్లకు నచ్చకపోతే తిరస్కార ఓటును ఉపయోగించుకునే హక్కును సుప్రీం కోర్టు అనుమతించింది . అభ్యర్దులందరినీ   తిరస్కరించే హక్కు ఓటర్లలకు ఉంటుందని, ఈ హక్కును అనుమతించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు  ఆదేశించింది . ఓటు వేయటం ఎలా చట్టబద్దమైన హక్కుగా ఉందో , అభ్యర్ధుల్ని తిరస్కరించటం కూడా ఓటర్ ప్రాథమిక హక్కు అని ఖరాఖండీగా తేల్చి చెప్పింది .ఓటు యంత్రంలో తిరస్కార బటన్  ను

ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఇంతకీ తిరస్కార ఓటు వల్ల లాభం ఎవరికీ?

ఈ ఓట్ల వల్ల అభ్యర్ధులు తమకు కావాల్సిన ఓట్లను కోల్పోతారు కాబట్టి పార్టీలు వీలైనంత వరకు నిజాయితీ గల అభ్యర్ధులనే పోటీలో నిలబెట్టి తిరస్కారానికి గురి కాకుండా ఉంటారనేది ఒక కారణం.దీని వలన ఫలితాలు వెంటనే కనిపించక పోయినా కొంత కాలానికి నేర చరితులని అభ్యర్ధులుగా నిలబెట్టే అవకాశం బాగా  తగ్గుతుంది.రాజకీయాలు ప్రక్షాళన అవుతాయనేది మరొక కారణం.

మరొక కోణంలో ఆలోచిస్తే తిరస్కార ఓట్లు చెల్లని ఓట్ల జాబితాలోకి చేరిపోతాయి .వాటి వల్ల ఏ అభ్యర్దికీ ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.మిగిలిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని మాత్రమే లెక్కింపు జరుగుతుంది. ఒక వేళ ఎక్కువ శాతంలో ఓటర్లు తిరస్కార బాటనే పడితే మళ్ళీ కొత్త అభ్యర్ధులూ , కొత్త ఎన్నికలూ తప్పవు.

చట్టపరమైన అడ్డంకుల సాకుతో మొన్నటి మునిసిపల్ ఎన్నికల్లో తిరస్కార ఓటుని అనుమతించక పోవటంతో ఈ ప్రయోగం అమలు కాలేదు

ఇవన్నీ ఆలోచిస్తే ఓటింగ్ రాజకీయాల్లోనే కాదు . మన ఇళ్ళల్లోనూ జరుగుతుంటాయి.

పితృస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్న కుటుంబ రాజకీయాల్లో మహిళలు చైతన్యవంతులైతే  ఏ ఓట్లు ఉపయోగించుకుంటారు???

                                                                                                                         –  పుట్ల హేమలత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

సంపాదకీయంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)