జూలై సంపాదకీయం

సాహిత్యానికి స్త్రీల దృక్పధం అలవడి ఇన్నేళ్ళయిన తర్వాత స్త్రీలుగా మనమేం రాస్తున్నామో,ఏం రాయాల్సి ఉందో

సమీక్షించుకోవాలి.స్త్రీలుగా రాయడం అంటే ఇపుడు కేవలం జెండర్ అస్తిత్వం లోంచి రాయడం మాత్రమే కాదు.కుల మత ప్రాంత

వర్గ అస్తిత్వాల సంక్లిష్టతలని  అర్ధం చేసుకుంటూ వివక్షతలని ప్రశ్నిస్తూ రాయడం.

ప్రతీ అస్తిత్వం లోనూ మగవారికన్నా అధికంగా అణచివేతకూ ఆధిపత్యానికీ గురయ్యే స్త్రీలు వాటిని సాహిత్య ప్రక్రియల్లోకి

తీసుకురావడానికి కూడా అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది.సమస్యల్ని అవగాహన లోకి తెచ్చుకోవడం ఒక ఎత్తైతే,వాటిని

రికార్డ్ చేసే క్రమంలో ఎదురయ్యే సెన్సార్షిప్ ని అధిగమించడం మరొక సవాలు.

మగవారు అంగీకరించిన ప్రమాణాలకి లోబడి,వారి ఆధిపత్యానికి ఎలాంటి ఆటంకం కలగని సాహిత్య సృజన చేసే పరిధి నుంచి

రచయిత్రులు ముందుకు వెళ్ళాలి.సాహిత్యం అంటే ఎవరి అహాన్నోభోగాన్నో సంతృప్తి పరిచే సాధనం కాదనీ ముఖ్యంగా స్త్రీల

ఉనికిని సహించలేని వ్యవస్థలపై పోరాడే ఆయుధమనీ గుర్తించాలి.

స్త్రీల హక్కుల కోసం నిలబడి రాయడం,మాట్లాడటం పట్ల స్త్రీలకే నిరసన ఉన్న పరిస్థితులు  ఇప్పటికీ

ఉన్నాయి.స్త్రీలని వివక్షకి గురి చేస్తున్న మతం,రాజ్యం,కుటుంబం,వివాహం ఈ అంశాల

మీద స్థిరంగా  మనం నిలబడినపుడు చుట్టూ ఉన్న సమాజం ముందు వ్యూహాత్మక మౌనాన్ని

పాటిస్తుంది.,తర్వాత మానసికంగా దెబ్బతీయడం, చివర్లో భౌతిక దాడి చేయడానికి కూడా సంకోచించదు.

తస్లీమా నస్రీన్ జీవితమే ఇందుకు ఉదాహరణ.

అలాగే స్త్రీలుగా మనం, స్వీయ అనుభూతుల గొడవని సామూహిక అంశంగా మలిచే క్రమంలో మరింతగా ఎదుగుతాం.

వ్యక్తిగా,కుటుంబీకులుగా,మాత్రమే రాసే క్రమం లోంచి మొత్తం సమాజాన్ని వివక్షారహితం చేసే ప్రయత్నాలని

మన రచనలు ప్రతిబింబిస్తాయి.ఆ దశలోకి  రచయిత్రులుగా మనం ఎంత తొందరగా ప్రవేశిస్తే అంత మంచిది.

– కె.ఎన్.మల్లీశ్వరి

సంపాదకీయం, , , , , , , , Permalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
రాణి
రాణి
9 years ago

కత్రీనా సగం అయితే రాహుల్ కూడా సగమే

కత్రీనా కైఫ్ ఆడది కాబట్టే ఆవిడ చేత క్షమాపణలు చెప్పించారు.
ఏం రాహుల్ గాంధీ పూర్తి భారతీయుడైనపుడు కత్రీనా కైఫ్ ఎందుకు కాదు ?
ఆమె సగం ఇండియన్ అయితే రాహుల్ గాంధీ కూడా సగం భారతీయుడే కదా ?
దీన్ని ఎవరూ ఖండించలేదు ఎందుకు ?
తను స్త్రీ అయినందుకే కదా ?

అయనా ఈ గాంధీలంతా అసలు గాంధీకి ఏ రకంగా వారసులో ఎవరు చెప్పగలరు ?

స్వంత ఇంటిపేరు కూడా లేనివారికోసం కొద్ది కొద్దిగా విచ్చుకుంటున్న స్వంత గొంతుని నులిమెయ్యడం ఎక్కడి ప్రజా స్వామ్యం ?