ప్రముఖ చరిత్రకారుడు, బహుగ్రంథ రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్‌కు ‘సంఘమిత్ర’ పురస్కారం లభించింది. రాష్ట్రంలో వివిధ రంగాలలో గణనీయమైన సేవలందించిన వారికి ‘బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్’లో స్థానం కల్పిస్తూ, పలు పురస్కారాలు అందజేస్తున్న ‘బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్’ నిర్వాహకుల నుండి నశీర్ అహమ్మద్‌కు గురువారం నాడు వర్తమానం అందింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్‌లో ప్రస్తుతం ని”వాసం ఉంటున్న నశీర్ భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలు నిర్వహించిన త్యాగపూరిత పాత్రను వివరిస్తూ తొమ్మిది పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను రాసి వెలువరించారు. ఆ క్రమంలో తెలుగులో సాహిత్య సృజన చేసిన, చేస్తున్న 333 మంది ముస్లిం కవులు రచయితలు వ్యక్తిగత, సాహిత్య, వివరాలతో కూడిన ‘అక్షరశిల్పులు’ గ్రంథాన్ని కూడా ఆయన వెలువరించారు
.ఈ మొత్తం పది గ్రంథాల ‘పిడియఫ్’ ఫైల్స్‌ను గత మూడు సంవత్సరాలుగా సుమారు రెండువేల ఐదువందల మందికి ‘ఉచితం’గా అంతర్జాలం ద్వారా అందజేసినందుకు
గాను ‘సంఘమిత్ర’ పురస్కారం అయనకు దక్కింది. ‘జనంలో పఠనాశక్తిని పెంపొందించటానికి తనవంతు కృషి చేస్తున్న నశీర్ అహమ్మద్‌ను ‘సంఘమిత్ర’ పురస్కారంతో సత్కరిస్తున్నామ’ని ‘బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్’నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన చరిత్ర గ్రంథాలను ఆదరించిన తెలుగు పాఠక మిత్రులకు,పిడియఫ్ పైల్స్‌ను కోరిన ప్రజలకు, ‘సంఘమిత్ర’ పురస్కారం ప్రకటించిన ‘బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్’ నిర్వాహకులకు సయ్యద్ నశీర్ అహమ్మద్ ధన్యవాదాలు తెలిపారు.
సయ్యద్ నశీర్ అహమ్మద్ గారికి ‘విహంగ మహిళా సాహిత్య పత్రిక’ తరపున అభినందనలు !
One Response to చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహమ్మద్‌కు ‘సంఘమిత్ర’ పురస్కారం