మహిళా ఉద్యమం (1857 – 1956)

vihangaవితంతు వివాహాలు జరుగుతుండగా ఆ వివాహనంతర పరిణామాలు ఎలావున్నాయో బుధవిధేయిలోని  ఒక వార్తాంశం ద్వారా గ్రహించవచ్చు. విధవా వివాహం చేసుకొన్న వాళ్ళకు వెలిబాధతో పాటు దేవాలయ ప్రవేశం వంటివి నిషిద్ధాలు. విధవా వివాహం చేసుకొని వెలిపెట్టబడిన వాళ్ళు దేవాలయ ప్రవేశానికి న్యాయస్థానానికి అప్పీలు చేసుకొంటే అది కొట్టివేయబడింది. (5 ఏప్రిల్‌ 1890) అంటే స్త్రీ విషయంలో సంస్కరణలు అనుబంధంగా ఎన్ని కొత్త సవాళ్ళను ఎదుర్కొనవలసి వచ్చిందో గ్రహించవచ్చు.

    స్త్రీ విద్య, వితంతు వివాహాలకు సంబంధించి వీరేశలింగం ప్రారంభించిన ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయిన ఉన్నవలక్ష్మీ నారాయణ గుంటూరు వీరేశలింగంగా ప్రసిద్ధుడు.వీరేశలింగానికి సన్నిహితుడిగా వుండి ఆయన స్థాపించిన వితంతు శరణాలయానికి నిర్వాహకుడిగా బాధ్యతలు నిర్వహించి ఆ తరువాత గుంటూరు కేంద్రంగా తన ఉద్యమాన్ని నడిపించాడు. 1902లో ఒక వితంతు వివాహం చేసి వెలికి కూడా గురయ్యాడు. ఆందువల్ల ఆయన మామగారు తన కూతురు లక్ష్మీబాయమ్మను అతనితో కాపురానికి పంపటానికి నిరాకరించాడు. లక్ష్మీ బాయమ్మ పట్టుపట్టడంతో ఆమెను భర్త దగ్గరకు పంపకతప్పలేదాయనకు. స్త్రీల ఉన్నతిని అభ్యుదయాన్ని కాంక్షించి వితంతు వివాహాలు జరిపించటానికి సిద్ధపడ్డ ఆయన మహిళా ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి ముందు దృష్టి పెట్టాల్సింది స్త్రీ  విద్యమీదేనని గుర్తించాడు.  1922 శారదానికేతనం ఏర్పరచి తన కలను సాకారం చేసుకొన్నాడు.

    వీరేశలింగం తరువాత స్త్రీ సమస్యపై బందరు కేంద్రంగా పనిచేసిన రఘుపతి వెంకటరత్నం నాయుడిని చెప్పుకోవాలి. బందరు నోబుల్‌ కళాశాలలో ఆంగ్లోపన్యాసకుడుగా పనిచేస్తూ బ్రహ్మసమాజ ధర్మాన్ని అనుష్టిస్తూ హేతుదృక్పథంతో  అనేక అంశాలపై ప్రసంగాలు చేస్తూ, పత్రికలకు రాస్తూ  యువతను ఉత్తేజపరిచాడాయన. స్త్రీ జీవితంలోని క్లేశాలను గురించి ఆయన ఆందోళన చెందాడు. మరీ ముఖ్యంగా ఆయనను బాధించింది వేశ్యాసమస్య.

    పెళ్ళికి, కుటుంబానికి అవతల ఒక స్త్రీ సమాజం ఉంది. అది వేశ్యాసమాజం. సంస్కరణోద్యమం ఈ సమాజాన్ని కూడా సంబోధించింది. ఈ సమాజానికి ప్రధాన స్రవంతి సమాజానికి వున్న సంబంధాలు ప్రధాన స్రవంతి సమాజపు ఆరోగ్యానికి, సుస్థిరతకు  అవరోధమవుతున్నాయన్న గుర్తింపు నుండి వేశ్యా వ్వవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించటం జరిగింది. పెళ్ళిళ్ళకు బోగం మేళాలను పిలిచే పద్ధతి వుండేది. బోగం మేళం లేకపోతే పెళ్ళికి శోభలేదని, కుటుంబ గౌరవానికి భంగకరమని అనుకొనే వాళ్ళు ”పెళ్ళికి వచ్చిన వాళ్ళు బోగం మేళం వారికి రూపాయికి తక్కువకాకుండా ‘ఒసగులు’ ఇయ్యవలసి వచ్చేది. ఇందుకొరకు గృహస్థులు అప్పులు కూడా చేయవలసి వచ్చేదంటే ఇదెంత  తీవ్రమైన ఆర్థిక సమస్యగా పరిణమించిందో గ్రహించవచ్చు. ఒసగులు  ఇచ్చే ఆచారం ఆర్థికస్థోమతుతో సంబంధం లేకుండా,  అధికారంతో,  నిర్భంధంగా సాగుతుండటం వలన దీనికి వ్యతిరేకంగా వీరేశలింగం పంతులు వంటి వాళ్ళు. యాంటినాచ్‌ ఉద్యమానికి పూనుకొన్నారు. 

    ఈ ఉద్యమాన్ని అందిపుచుకొన్నవాడు  రఘుపతి వెంకటరత్నంనాయుడు. ఆయనది సాంఘిక స్వచ్ఛతా ఉద్యమం. వేెశ్యావృత్తి నిర్మూలనోద్యమం అందులో ఒక భాగం. వేశ్యావృత్తిలో మగ్గిపోతున్న మహిళలను ఉద్ధరించటానికి  కార్యక్షేత్రంలోకి దిగాడు. తాను పనిచేస్తున్న కళాశాల విద్యార్థుకు ఉపన్యాసాలిచ్చి వేశ్యలలో మాతృస్వరూపాన్ని గురించి బోధించి,  భోగం మేళాలను నిరసించునట్లు ప్రతిజ్ఞాపత్రాలు తీసుకొనేవాడు. బందరు పట్టణంలోని విద్యార్థులకే కాక తదితర పట్టణాలకు కూడా వెళ్ళి,  వేశ్యా వృత్తి నిర్మూలనోద్యమ సంఘాలు పెట్టించి కార్యకర్తలను తయారుచేసి బాధ్యతలప్పగించి వచ్చేవాడు.     వేశ్యా సమస్య సామాజిక అనైతికతకు కారణమని ప్రజలకు నచ్చచెప్పటంలో,  నృత్యప్రదర్శనలు విసర్జించదగిన వన్న స్పృహను ప్రజలలో కలిగించటంలో వెంకటరత్నంనాయుడు విశేషంగా  కృషి చేశాడు. గురజాడ కన్యాశుల్కం నాటకంలో (1897) కన్యాశుల్కం సమస్యకుఅసుసంధానం చేసి వేశ్యసమస్యను చర్చించటానికి ఈ సామాజిక సంస్కరణా సందర్భమే కారణమైంది.

    ||
    స్త్రీల విషయంలో సంస్కరణలకు ఆంధ్రదేశంలో వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకయ్యనాయుడు, ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి వారు బలమైన ప్రతినిథులు అయినప్పటికి ఆ ప్రభావంతో ఆంధ్రదేశమంతా విస్తరించిన సంస్కరణ చైతన్యం చెప్పుకోతగింది. 1890వ థకంలోనే కృష్టాగోదావరి జిల్లాలలో సంస్కరణ సంఘాలు జిల్లా స్థాయిలో  పనిచేసాయి. 20వ శతాబ్ది తొలిథకంలో విజయవాడ, గుంటూరు, కుముదవెల్లి, బళ్ళారి, హంపి, బరంపురం, విజయనగరం  వంటి అనేక ప్రాంతాలలో సంస్కరణ సభలు జరుపుతూ స్త్రీ విద్య గురించి ప్రచారం చేశాయి. బాల్య విహాలగురించి సంఘసంస్కరణలగురించి వితుంతు వివాహాలగురించి, రజస్వలానంతర, వివాహాల గురించి తీర్మానాలు చేశాయి. 1906లో హైదరాబాదులో జగన్‌ మిత్ర మండలి స్థాపించి  సాంఘిక ఉద్యమాన్ని ప్రారంభించిన భాగ్యరెడ్డి వర్మ అంటరాని వర్గాల వారిలో బాల్య వివాహాలను రూపుమాపాలని, దేవదాసి, జోగిని వంటి సాంఘిఙక దురాచాలను నిషేధించాలని పిలుపునిచ్చి 1939 (ఫిబ్రవరి 18) లో మరణించే వరకు అందుకు  కృషిచేశాడు.
   
    1920ల నాటికి హైదరాబాదు కేంద్రంగా తెలంగాణలో సంఘసంస్కరణ చైతన్యం వేరూనుకొంది. 1921 నవంబరు 11,12 తేదీలలో హైదరాబాదులో జరిగిన సంఘ సంస్కార సభ ఇందుకు నిదర్శనం. ఆర్థిక  రాజకీయ ప్రయోజనాల కొరకు ఏర్పడిన వర్తక సంస్థలు ప్రాంతీయ సమాజంలో,  ప్రజా సమూహాలలో  సంస్కరణలను ఆశించాయి. 1923 ఆగస్టు 17,18 తేదీలలో సూర్యాపేటలో జరిగిన వర్తక సభలకు 200 మంది స్త్రీలు హాజరయ్యారంటే నూతన చైతన్య వికాసానికి వాళ్ళేంత ప్రాధాన్యత ఇచ్చారో స్పష్టమవుతున్నది. ఈ వర్తక సంఘ సమావేశాలలో స్త్రీ విద్య గురించి శివానంద మొదిలియార్‌ ఉపన్యసించాడు. లాభిశెట్టి లింగన్న గుప్త వంటివారు సూర్యపేటలో స్త్రీ విద్య ఆవశ్యకతను గుర్తించి పనిచేశారు. ఆసభలలోనే స్త్రీ పునర్వివివాహం అవసరమా కాదా అని చర్చవస్తే కార్యదర్శి మాడపాటి హనుమంతరావు యాభైఏళ్ళక్రితమే వీరేశలింగం పంతులు పునర్వివాహ సంస్కరణలను ఆంధ్రదేశంలో ప్రవేశ పెట్టాడని మనకు కూడా అందుకు అభ్యంతరాలు వుండాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చాడు. 1927 జూన్‌, 12, 13 తేదీలలలో సరళాదేవి చేదూరాణి అధ్యక్షతన నిజాం  రాష్ట్ర హిందూ సంస్కార సభ జరగటం సంస్కరణోద్యమ చైతన్య  విస్తరణను  సూచిస్తుంది. అతి బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ పునర్వివాహాలను సమర్థిస్థూ  గోల్కొండ పత్రిక ద్వారా ప్రచారం సాగుతుండేది.

    వీరేశలింగం కాలం నుండే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తున్నా ఆయన మరణించాక(1919) పదకోండేళ్ళకు గానీ బాల్య వివాహ నిషేద చట్టం రాలేదు. శారదా చట్టంగా ప్రసిద్ధమైన ఈ చట్టం 1930 ఏప్రిల్‌ నుండి అమలులోకి రాగా ఆ చట్టం వర్తించని బ్రిటీష్‌ ఆంధ్ర సరిహద్దు గ్రామలకు వెళ్ళి వివాహాలు జరుపుకొన్నవారు ఆనేకం. నిజాం రాష్ట్రంలో చైతన్యవంతులవుతున్న వర్గం ఈ వైఖరిని తప్పుపట్టింది. ఆంధ్రమహాసభ స్థాయీ సంఘం బాల యువకులు తాము యుక్తవయస్సురాని బాలికలను పెళ్ళి  చేసుకొనమని పట్టుపట్టాలని అందుకవసరమైన చైతన్యం వారిలో ప్రోది చేయాలని ప్రకటించింది. 1930 జోగిపేటలో జరిగిన నిజాంరాష్ట్ర ప్రథమాంధ్ర మహాసభలో స్త్రీల ఉన్నత విద్యకొరకు, స్త్రీల శారీరక మానసికాభివృద్ధికి అవరోధంగా వున్న గోషా దురాచారాన్ని,  అతి బాల్య వివాహ దురాచారాన్ని రూపుమాపటం కొరకు  తీర్మానాలు చేయబడ్డాయి. బాల్య వివాహాల నిషేద చట్టం పునర్వివివాహిత స్త్రీల సంతతికి  వారసత్వ హక్కుల సంరక్షణ చట్టం, వుండాలని కూడా ఈ సభ తీర్మానించింది.   
   
    సంస్కరణోద్యమంలోని వేశ్యా సమస్యపై భోగం కులాలలోపలి నుండే  చర్చ ప్రారంభంకావటం ఇరవైయ్యవ శతాబ్దపు విశేషం. అంతవరకు ప్రధాన స్రవంతి సామాజిక వర్గాలచేత అనైతికతకు మూలకారణంగా వేలెత్తి చూపబడుతున్న,  బహిష్కరింపబడవలసిన వాళ్ళుగా  చెప్పబడుతున్న బోగం వారు తమ గురించి తాము ఆలోచించుకొనటం ప్రారంభమైంది.  కుల వృత్తిని వదిలి చదువుకొని, పెళ్ళి చేసుకొని గౌరవంగా జీవించాలనే ఉద్బోధ వేశ్యకులం స్త్రీలకు అందించాలన్న అభిప్రాయం బలంగా వ్యక్తమైంది. బోగం కులానికి చెందిన గుడిసేవ సుబ్బయ్య, భాస్కర్ల ఈశ్వరుడు వంటివాళ్ళు తమకులంలోని బాలికలకు విద్య చెప్పించి పెళ్ళిళ్ళు చేయటానికి, తమ కులంలోని పురుషులు వాద్యగాళ్ళుగా నృత్య ప్రదర్శనల్లో పాల్గొనకుండా చదువుకొని గౌరవకరమైన వృత్తులను అవలంభించేట్లు ప్రేరేపించటానికి సంఘాలు పెట్టి పనిచేయసాగారు. సికింద్రబాదులో కళావంతుల సంస్కరణ సంఘాన్ని పెట్టి (1922) పనిచేసిన శామ్‌రావు కూడా ఈ కోవలోవాడే. వరంగల్‌, నల్లగొండ మొదలైన జిల్లాల్లో కూడా ఇటువంటి సంఘాలు ఏర్పడ్డాయి. గుడిసేవ సుబ్బారావు, భాస్కర్ల ఈశ్వరుడు యామినీపూర్ణ తిలకం వంటివారు తరచు తెలంగాణకు వచ్చి సంస్కరణ సభలలో పాల్గొని ప్రసంగిచారు. (గొల్కొండ 14 మే, 1927) కళావంతుల స్త్రీలు దీపావళి పండుగకు మంగళహారతులు పట్టుకొని తిరగటం, వివాహాది శుభకార్యాలకు బోగం మేళాలుగా  వెళ్ళటం ఆపివేయాలని,  ఇతర జాతులవారు వేశ్యలకు తమపిల్లలలను  విక్రయించకుండా, వేశ్యలు కొనకుండా చట్టం చేయాలని కళావంతుల సంఘసంస్కరణ సభలు  (1927 మే 21-24) తీర్మానించాయి. కళావంతుల బాలికలకు, విద్యా, వివాహం ప్రోత్సహించబడ్డాయి. (1927 మే 14)  దక్కన్‌ మానవసేవా సమితి కూడా కళావంతుల అబివృద్ధిగురించి పనిచేసిన సంస్థ దేశముఖులు, పటేలు పట్వారీలు పేదకుటుంబాల బాలికలను కొనుక్కొని ఆడబాప వ్యవస్థను ఏర్పరచి వ్యభిచారానికి కారకులవుతున్న చరిత్రను నిరసించి  తమ గృహాలలో దాసీ జనపు సంతతిని వ్యభిఙచారులనుచేయక వివాహాలకు ప్రోత్సహించి ఈ దురాచార నిర్మూలనకు తోడ్పడాల్సిన బాధ్యత రెడ్డికులంపై వుందని ఈ సంఘాలు పేర్కొన్నాయి. మద్రాసు శాసన మండలిలో ముత్తులక్ష్మీరెడ్డి దేవదాసి వ్యవస్ధ నిర్మూలనకు చట్టం కోసం కృషి చేయటానికి తగిన నేపథ్యాన్ని సామాజిక వాతావరణాన్ని ఈ సంఘాలు,  సభలు కల్పించాయి.

    1930 నుండి 1938వరకు జరుగుతూ వచ్చిన ఆరు నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలలో స్త్రీ విద్య, బాల్య వివాహల నిషేద,  స్త్రీపునర్వివాహం భోగంమేళాలు,  వేశ్యావృత్తి రద్దు, కళావంతుల బాలికల వివాహం, కన్యాశుల్క వర శుల్కాల నిర్మూలనం, మాతృభాషలో స్త్రీలకు ఉన్నత విద్య, స్త్రీల అస్తిహక్కు  మొదలైన సమస్యలు తీవ్రంగా చర్చించబడ్డాయి. ఆయా సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని తగు చర్యలు తీసుకొనవలసిందిగా చట్టాలు చేయవలసిందిగా, కోరుతూ తీర్మానాలు చేయబడ్డాయి. 1936లో హైదరాబాదు శాసనసభ వితంతు వివాహా చట్టాన్ని ఆమోదించింది.

అయితే క్రమంగా అటు కోస్తాంద్రలో జాతీయోద్యమ రాజకీయ ప్రాధాన్యతలు, తెలంగాణలో నిజాం వ్యతిరేక రాజకీయార్థిక పోరాటాల ప్రాధాన్యతలు సంస్కరణోద్యమాన్ని విడి అస్తిత్వం లేకుండా సంలీనం చేసుకొన్నాయి.

– ఆచార్య కాత్యాయనీ విద్మహే ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ –

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో