శిలాపుష్పాలు

 శిలాపుష్పాలు

రచయిత్రి ; సి.ఉమాదేవి

మాలా కుమార్

మాలా కుమార్

 సి.ఉమాదేవి గారు చాలా సంవత్సరాలు గా , వివిధ పత్రికలలో కనిపిస్తున్నారు.దాదాపు  అరవై కి పైగా కథలు, రెండుమూడు నవలలు, వ్యాసాలు ,కవితలూ వ్రాసారు. వీరి కథలు వివిధ అంశాలతో , జీవితం లోని వివిధ కోణాలను కలిగి వుంటాయి.కొన్ని భావుకతతో వుండగా ,కొన్ని మానవ జీవిత చిత్రణలతో శోభిల్లుతాయి. మరోచోట జీవనగతి లో తారసిల్లే సమస్య లకు విశ్లేషణలుగా కనిపిస్తుంది..మానవ మనస్తత్వమూ కొన్నిటిలో కనిపిస్తాయి. ఒక  కథ వస్తువు ఇంకో కథ తో పోలివుండదు. దేనికదే ప్రత్యేకమైంది.భాష పై మంచి పట్టువుంది.పద ప్రయోగము ప్రత్యేకముగా వుంటుంది.అందమైన పదాలను ఏరి కూరుస్తారు. చదువుతున్న కొద్దీ చదవాలనిపిస్తాయి. 

సి.ఉమాదేవిగారు వ్రాసిననవలల్లో నాకు చాలా నచ్చింది “శిలాపుష్పాలు.” ఈ నవలలో  ,

చిన్నతనములోనే  తండ్రిని కోల్పోయిన రవిచంద్రను తల్లి విశాలిని ఏలోటు లేకుండా పెంచింది.భర్త చివరి కోరిక మేరకు రవి చంద్రను విదేశాలకు పంపి చదివించింది.పుట్టింటిపై ఏమాత్రమూ ఆధారపడక తోటలను,భవనాన్ని,తన వంశాకురాన్ని పదిలంగా కాపాడి తన పరువును కాపాడుకుంది.తన కోరిక ప్రకారము , రవిచంద్రకు మేనరికము ఇష్టము లేకపోయినా మేనమామ కూతురు రంజని తో రంగ రంగ వైభోగం గా వివాహము జరిపించింది.వంశాకురము కావలన్న కోరిక తీరలేదు.పిల్లల ముద్దుముచ్చట్లు చూడాలని వుంటే చెప్పు ఎవరినైనా పెంచుకుందాము అంటాడు రవిచంద్ర. కాని అనాధ పిల్లల ను పెంచుకుంటే వంశం భ్రష్టమవుతుందని బాధపడుతూ , కొడుకుకు ఇంకో వివాహము చేయాలని ప్రయత్నిస్తూ వుంటుంది. కాని రవి చంద్ర వినడు. పట్టుబట్టి ఒక పిల్లవాడిని పెంపకానికి తీసుకొని వస్తాడు. ఆ పిల్లవాడి ని దగ్గరకు తీయలేక , కొడుకు ను ఏమీ అనలేక సతమతమవుతుంటుంది విశాలిని.  

విశాలిని ఏకైక కుమారుడు రవిచంద్ర. విదేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చినా ఆధునిక వ్యవసాయ పద్దతులలో తనవంతుగా భారతదేశ అభివృద్ధికి పాటుపడాలనుకుంటాడు.డాక్టరేట్ సంపాదించాడు.తనను వెతుక్కుంటూ వచ్చిన ఉద్యోగ గావకాశాలను వదులుకొని భారతదేశం తిరిగి వచ్చాడు.మేనరికాలు , వాటివల్ల నష్టాలు తెలిసిన రవిచంద్ర తల్లి కోరికను మన్నించి మేనమామకూతురు రంజనిని వివాహమాడాడు.రాజీ పడటము రవిచంద్ర జీవితములో ఇదే మొదలు.రవిచంద్ర ది అలుపెరుగని ముఖం. నిర్ధిష్టమైన ఆహారపు అలవాట్లు. తనే కాక తల్లి , భార్య కూడా ఆచరించేట్టుగా చూస్తాడు. తల్లి , పిల్లల కోసము తనకు చేయదలిచిన ద్వితీయ వివాహప్రయత్నాన్ని వప్పుకోక కస్తూరిబా అనాధాశ్రమము నుంచి ఓ బాబును పెంపకానికి తీసుకొని వస్తాడు.అలవాటులేని మూలము గా రంజనికి పసిబిడ్డను పెంచటము కష్టమవుతుందని ,ఊహ తెలిసిన వాడైతే అర్ధం చేసుకొని , కలిసిపోతాడని అవినాష్ ను పెంపకము తీసుకుంటాడు.

విశాలిని కావాలని ఇష్టపడి తెచ్చుకున్న కోడలు రంజని, భర్త ప్రేమకు పాత్రురాలు.సౌమ్యురాలు.జీవితము లో అన్నీ వున్నా సంతానము లేని కొరత. అత్తగారి కోరిక , భర్త కు ద్వితీయ వివాహాన్ని చేసేందుకు అనుమతిస్తుంది.ఓ అపరిచిత బాలుని పెంపకానికి తీసుకొని వస్తే ఆనందముగా హారతిచ్చి ఆహ్వానిస్తుంది.పున్నామ నరకము నుంచి తప్పించే కొడుకు ఇన్నాళ్ళు మాయమై ఇప్పుడే ప్రత్యక్షమైనట్లుగా సంతోషము గా వుంది. పైగా అవినాష్ కు ఏ విధమైన నియమ నిబంధనలు లేవు . స్వేచ్చగా పెరిగి తమతో ఆత్మీయతను పెంచుకోవాలని రవిచంద్ర కోరిక.ఎంత పని వత్తిడివున్నా అవినాష్ పట్ల తన బాధ్యతను విస్మరించదు.

అవినాష్ . . . ఇన్ని సంవత్సరములూ అనాధాశ్రమం  లో పెరిగినవాడు. ఇప్పుడు అమ్మా , నాన్నా వున్నారు. ఏవిధమైన ఆంక్షలు లేవు . ఐనా అసంతృప్తిగానే వున్నాడు.ఆశ్రమము లోని స్నేహితులు గుర్తుకొస్తారు.క్లాస్ లో వున్నంత సేపూ కనిపిస్తారు. కాని సాయంత్రానికల్లా రాజనిలయానికి చేరుకోవాలి.వంటరిగా ఆడుకోవాలి. లేదా రాము తో పక్షులతో ఆడుకోవాలి.పైగా విశాలిని కోర చూపులు కాలుస్తున్నట్లుగా వుంటాయి.పరీక్షలయ్యాక ఆశ్రమానికి వెళ్ళి నిర్వాహకురాలు దమయంతి  ని ,నేను నా క్లాస్మెట్లను కలవాలి . సెలవల్లో రాజనిలయానికి దూరంగా వుండాలని అడుగుతాడు. కాని ఆమె నీకు అనుమతి ఇవ్వాల్సింది నేను కాదు రవిచంద్ర అని చెపుతుంది.రవిచంద్ర కోరినట్లు గా  ఇంజనీరింగ్ లో కాక బి.కాం లో చేరుతాడు.కొత్తవాతవరణము లో స్వేచ్చను దుర్వినియోగపరుస్తాడు.అవినాష్ కు వార్నిగ్ లు ,సస్పెన్షన్లు మంచినీళ్ళప్రాయమైపోయాయి.అన్ని పరీక్షలు వ్రాసాడు.డబ్బు విలువ కన్నా డబ్బు అవసరం తెలుసుకున్నాడు. రవిచంద్రను నాన్నా అని పిలవలేక పోయాడు కాని రవిచంద్రకు వారసుడినన్న అహం , గర్వం మాత్రం బాగా వేళ్ళూనింది.అవినాష్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు రంజని కావ్య ను ఇచ్చి వివాహము జరిపిస్తుంది.ఐనా అవినాష్ పతనాన్నికి అడ్డుకాలేకపోయింది.ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. 

ఈ నలుగురి మధ్య  నడిచినకథనే సి.ఉమాదేవి గారి “శిలాపుష్పాలు”నవల.కొడుకు వంశాంకురము కోసం తపిస్తూ పాత పద్దతులను వదులుకోలేని విశాలిని , దృడమైన మనస్తత్వము , అభ్యుదయభావాలు కలిగినవాడుగా రవిచంద్రను, అత్తగారికి , భర్త కు అనుకూలవతి ఐన యువతిగా రంజని, అనాధాశ్రం నుంచి వచ్చి , ఇంటిలో వీరందరి మధ్య ఇమడలేక చెడు సావాసము చేసే బాలుడిగా అవినాష్ పాత్రలను బాగా చిత్రీకరించారు.అందరి మనస్తత్వాలను విపులంగా చూపించారు. ఆయా సంఘటనలకు దారి తీసిన పరిస్థితులను  చక్కగా చూపించారు .ఇదొక విభిన్నమైన సబ్జెక్ట్ . మామూలుగా నైతే ఎవరైనా ఓ పసివాడిని పెంచుకునేందుకు ఇష్టపడతారు. కాని ఇందులో రవిచంద్ర  పది  సంవత్సరాల బాబు ను దత్తతకు తీసుకుంటాడు. ఆ వయసు పిల్లవాడు కొత్తపరిసరాలలో ఎలా ఇమడలేకపోతాడో బాగా వివరించారు.నవల యేక బిగిన చదివిస్తుంది.

సంతానలేమిని సమస్య గా చూపించి దత్తతను పరిష్కారంగా చూపించి నవలగా మలచవచ్చు. ఐతే దత్త అనంతరం ఎదురయ్యే సమస్యలు వుంటాయి.రక్త సంబంధానికే కట్టుబడలేని పిల్లలు పెరిగిపోతున్న తరుణం లో దత్తత వచ్చిన పిల్లలు తల్లిదండ్రులుగా కొత్తవారిని అంగీకరించటానికి కొంత సమయం కావాలి. తప్పదు. శిలలు కరుగుతాయి.శిలాపుష్పాలు వికసిస్తాయి. అదే ఈ నవల మూలాంశం అంటారు రచయిత్రి ముందుమాటలో!

ఈ నవల మే 2000  ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించారు.

– మాలా కుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో