నర్తన కేళి – 14

“ ప్రేంఖనీ నాట్యాన్ని” తన శిష్యులతో  దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్న “కళారత్న” ఓలేటి రంగమమణి గారితో  ఈ నెల నర్తన కేళి ముఖాముఖి …….. 

*నమస్కారం అమ్మా ?

నమస్కారం . రండి రండి , కూర్చోండి .

*మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి ?

మా నాన్న పేరు సి .ఆర్.ఆచార్య ,కూచిపూడి లోని నూజివీడు వారి గ్రామం స్వస్థలం .

*తొలి గురువు  ?

నా తొలి గురువు మా నాన్న గారే  .

*ఇంకా ఎవరి వద్ద నాట్యాన్ని అభ్యసించారు ?

మా నాన్నగారు  అహ్మదాబాద్ లో ఉన్నప్పుడు కొంత కాలం వేదాంతం ప్రహ్లాద శర్మ గారి వద్ద నేర్చుకున్నాను .

*మీ తొలి ప్రదర్శన ?

నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడే తొలి ప్రదర్శన చేసాను . నాకు అంతగా గుర్తులేదు కాని ఆ ప్రదర్శన ఏలూరులో ఒకసారి కూచిపూడి శిక్షణ ఏర్పాటు చేసినప్పుడు . ఆ శిక్షణలో భాగంగాజరిగిన ప్రదర్శనలో చేసానంట.

*మీ నాన్నగారు రూపొందించిన  “ ప్రేంఖనీ నాట్యం” గురించి చెప్పండి ?

ముగ్గును వేదికపై పోసి దానిపై వస్త్రాన్ని పరచి , జతులు , తాళాలకు అనుగుణంగా నర్తకీ కదులుతూ ఆ వస్త్రంపై చిత్రాన్ని గీయడం జరుగుతుంది . దీనినే  ప్రేంఖనీ నాట్యం అంటారు .

*ఈ ప్రేంఖనీ నాట్యన్ని ఎన్ని విధాలుగా   చేయవచ్చు ?

సింహనందిని , మయూర కౌత్వం ,గణేశ కౌత్వం , మహాలక్ష్మి మొదలైన నృత్యాంశాలను తీసుకుని కూడా చేస్తారు .

*మీ నృత్య శిక్షణ సంస్థ పేరు ?

అభినయ దర్పణ – ఆర్ట్ అకాడమి . 1980 లో ప్రారంభించాను . మూడు చోట్ల పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను .

*ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు ?

చాలా ప్రదర్శనలు ఇచ్చాము . దేశ విదేశాల్లో కొన్ని వేల ప్రదర్శనలు మా నృత్య అకాడమి ద్వారా చేసాము .

*మీరు చేసిన నృత్య రూపకాలు గురించి చెప్పండి ?

గజేంద్ర మోక్షం , గీతా సచ్చిదానంద , గోదా కళ్యాణం , కుమార సంభవం ,హరిత భారతి , సమైఖ్య భారతి , గోదా గీత మాలిక చేసాము .

*గజేంద్ర మోక్షం నృత్య రూపకం గురించి చెప్పండి ?

భాగవతం లోని గజేంద్ర మోక్షం ఘట్టాన్ని తీసుకుని చేసినదే గజేంద్ర మోక్షం . శాస్త్రి గారు సంగీతం సమకూర్చారు . రెండు గంటలు నిడివితో ప్రదర్శన ఇచ్చాము .

*మీరు చేసిన గోదాదేవి కళ్యాణం , గోదా గీతమాలిక రెండింటికి తేడా ఏమిటి ?

గోదా కళ్యాణం లో గోదాదేవి , శ్రీరంగనాధుల కళ్యాణం ప్రధానంగా తీసుకుని చేసాము . గోదా గీతమాలికలో తిరుప్పావై కి సంబంధించి అంశాన్ని పాటల రూపంలో పొందు పరిచి చేసినది .

*హరిత భారతి “ నృత్య రూపకం గురించి చెప్పండి ?

పర్యావరణం గురించి చెప్పాలనే ఈ బ్యాలే చేసాను . కాలుష్యం వలన కలిగే నష్టాలను తెలియజేయాలి , మరే ముఖ్యంగా గాలి కాలుష్యం గురించి , దాని వలన కలుగుతున్న అనార్ధాలను ప్రజలకు తెలియజేయడమే ఈ హరిత భారతి నృత్య రూపకాన్ని చేసాము .

*సమైఖ్య భారతి “ నృత్య రూపకంలో తీసుకున్న అంశం ఏమిటి ?

భారత దేశం అనేక జాతుల కలయిక . భిన్నత్వంలో ఏకత్వం కలిగినది మన దేశం . ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని అన్ని జాతుల వారు కలిసిమెలిసి ఉండాలని , అదే దేశానికి మేలని చాటి చెప్పేదే సమైఖ్య భారతి .

*గీతా సచ్చిదానందం నృత్య రూపకం గురించి చెప్పండి ?

గణపతి సచ్చి దానందం స్వామి మైసూర్ లో ఉంటారు . వారి జీవిత చరిత్రని తీసుకుని , పుట్టుక నుండి ప్రస్తుతం వరకు జరిగిన వాటిలో కొన్ని ముఖ్య ఘట్టాలతో రూపొందించినదే గీతా సచ్చిదానందం . తోలో ప్రదర్శన మైసూరులో చేసాము . తర్వాత పలు  చోట్ల  ప్రదర్శనలు ఇచ్చాము .

*మీరు నిర్వహించిన వర్క్ షాప్ గురించి చెప్పండి ?

1999 – 2001 మధ్యలో టొరంటో (కెనడా )లో సుమతీరావు గారి కోరికపై అక్కడ వర్క్ షాప్ నిర్వహించాను . మంచి స్పందన వచ్చింది . చివర్లో వారందరి చేత ప్రదర్శన కూడా చేయించాను .

*మీరు అందుకున్న పురస్కారాలు గురించి ?

20 13 లో కళారత్న – ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ,2003 లో ఉమెన్ ఆఫ్ ది ఇయర్  , k.v.s – 2 0 0 8 అవార్డు –   k.v.s ట్రస్ట్ నుంచి ,

*ప్రస్తుతం  చేస్తున్న ప్రాజెక్ట్ ఏమిటి ?

డిపార్టమెంట్ కల్చరర్ వారు నుంచి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను . అది మా నాన్న గారు జీవిత చరిత్ర రాయడం . దాదాపుగా పూర్తి కావచ్చింది .

*ఇప్పుడు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించే వారికి మీరిచ్చే సలహా , సూచన ?

ఎంతో శ్రద్ధాగా  నేర్చుకునే ప్రయత్నం చేయండి . ఏదో ఒకటి ,రెండు ప్రదర్శనలకు  చేస్తే చాలు అని కాకుండా  మనస్ఫూర్తిగా అభ్యసించాలి .

 

 మీ భావాలు , అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.నమస్తే 

– అరసి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో