ఉమ్మడి కుటుంబం

           మనం ఎటు పోతున్నాము…….? అని మనని మనం ప్రశ్నించుకుంటే….ఎక్కడికి వెళ్ళడం వెళ్ళటం లేదు..ఎక్కడ మొదలయ్యమో అక్కడే ఉన్నాము అని సమాదానం వస్తుంది….!! భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు….మన చుట్టూ తరాలు…అంతరాలు…మారుతూ ఉన్నాయి..

.ఏ జన్మలో ఏ పుణ్యం చేసామో కాని… మన తల్లి భారత మాత బిడ్డలుగా పుట్టాము. ఆ తల్లి అందించిన వన్నెతరగని నిధిని (సభ్యత..సంసృతి ) అందుకుని ప్రపంచమంతా చాటున్నాము గర్వంగా మేము భారతీయులమని .

ఇలా ఉపోద్గాతమిచ్చుకుంటూ ఉంటె…ఎంతైనా వ్రాయవచ్చు కానీ ఒక్క సారి మన తాత గారి కాలం నాటి జ్ఞాపకాలలోకి తొంగి చుస్తే…ఆ ఆప్యాయతలు…అరమరికలు లేని మమతానురాగాలు ప్రస్తుత కాలంలో ..మైక్రోస్కోప్ తో వెతికినా కనిపించవేమో…..?

” ఉమ్మడి కుటుంబం ” ఉమ్మడి అన్న పదంలోనే ఆ దగ్గరతనం ఉంది….తాత… నానమ్మ…పెద నాన్న..పెద్దమ్మ ..పిన్ని..బాబాయ్ …అమ్మ నాన్నా…అక్క..చెల్లి తమ్ముడు ..వదినా..బావగారు…మరిది..మరదలు ….ఇలా అల్లుకున్నా బాంధవ్యాలలో ఎన్ని అల్లికలో..ఇంట్లో ఎవరికీ ఏ చిన్న సమస్య వచ్చినా తమదిగా భావించి ఆ చిక్కు ముడిని విప్పుకునే వారు…

జారుకుంటున్న కాలంతో పాటు..నాన్నగారి తరం వచ్చేసరికి ” చిన్న కుంటుంబం..చింత లేని కుటుంబం “
అనే కొటేషన్లతో….ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు అనుకునే రోజులవి….అయినా తాతా.నానమ్మల మురిపాలు దొరికాయి…ముచ్చటైన కుటుంబంగా…అన్ని సంబంధాలను నిలుపుకుంటునే వచ్చిన దానిలో…సంతృప్తి జీవితం గడపగాలిగారు….

ప్రస్తుతం అంతా ఎలక్ట్రానిక్ యుగం….పరుగుల మయం….భార్యా ..భర్త …మాట్లాడుకోవటానికి టైం ఉండదు….అమ్మ..నాన్నలంటే …మోయలేని బరువులు….చెప్పాలంటే..(వ్యర్ధ పదార్దాలు) . అతి కష్టం మీద ఒక్క బిడ్డ చాలు…అనుకుంటూ..వాళ్ళని పెంచుకోవడానికి కూడా డేకేర్ సెంటర్ లను ఆశ్రయిస్తూ ఉన్నారు….ముక్కు పచ్చలారని పసివాళ్ళ ఆలలా..పాలనా..చూసుకోలేని ఈ నాటి తల్లితండ్రులు…ఏం.. సాదించాలని అలా పరుగులు పెడుతున్నారో….వారికే తెలియదు……..!!!

తల నెరిసిన సమయంలో వాళ్ళు జీవితం లోనికి తొంగి చూసుకుంటే…ఆ అనుభూతులకు అర్ధం తెలియని స్థితిలో ఉంటారు…..మరి…

మనిషి తన అవసరాలని బట్టి మారుతూ….కుటుంబాలని మదించేసుకుంటున్నాడు……కానీ తమని కన్న వాళ్ళని మరవకుండా…తాము కన్నవాళ్ళకి ఆరోగ్య ప్రదమయిన పరిస్థితులను కల్పిస్తూ దొరికే కొద్ది సమయంలో నయినా ఆత్మీయతని అందరితో పంచుకుంటూ….రాబోయే తరం వారికి మార్గదర్సకమ్ కావాలి…..దూరంగా ..ఉంటున్నా దగ్గర తనం. అదే మన ” ఉమ్మడి కుటుంబం ” మరి….

– సుజాత తిమ్మన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)