తను…!!

sobha

ముద్దుగా బొద్దుగా నేను
ఎర్రగా పీలగా తను

హుందాగా ముందు బెంచీలో నేను
పక్కనే కాస్త దూరంగా తను

నీ పేరేంటి కళ్లతో ప్రశ్నిస్తూ నేను
మీతో మాట్లాడొద్దట కదా తను

ఏం ఎందుకనీ కోపంగా నేను
ఏమో మా అమ్మ చెప్పిందిలే తను

కొన్నాళ్లకి…….

ఏయ్… నాక్కూడా కాస్త మిగల్చవే నేను
నా బాక్స్ ఉందిగా తినవే – తను

నాతో మాట్లాడకు మీ అమ్మ తిడుతుంది నేను
నాతో మాట్లాడకపోతే నేను తిడతాను తను

ఇంతకీ మీ అమ్మ ఏం చెప్పిందేంటి నేను
మీరు తక్కువ కులమోళ్లట కదా… తను

అట్లయితే నా బువ్వ కూడా తినేస్తున్నావేం
అయితేనేం… నువ్వు నా “ఫ్రెండ్‌”వి కదా…!!

– శోభ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

14 Responses to తను…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో