24-11-2013 న కాకినాడలో ‘ఇస్మాయిల్ మిత్రమండలి’ నిర్వహించిన కవి ఇస్మాయిల్ సంస్మరణ సభలో అనేక మంది సాహిత్య అభిమానుల సమక్షంలో రేణుక అయోల తన కవితా సంపుటి “లోపలి స్వరం ” కి ఇస్మాయిల్ కవితాపురస్కారం . డా.రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు ‘లోపలికి’ పుస్తకానికి ఇస్మాయిల్ సాహితీ విమర్శా పురస్కారం అందుకున్నారు.
ఈ సభలో రచయితలు నండూరి రాజగోపాల్ ,వాడ్రేవు చినవీరభద్రుడు, వాడ్రేవు వీరలక్ష్మి,ధూళిపాళ అన్నపూర్ణ ,ఎల్. శేషు కుమారి ,దాట్ల దేవదానంరాజు, శ్రీపతి ,వక్కలంక రామకృష్ణ పాల్గొని ప్రసంగించారు. అనేకమంది సాహితీ ప్రియుల సమక్షంలో కవి ఇస్మాయిల్ కి నివాళులు అర్పించారు.
ఇస్మాయిల్ కవితాపురస్కార గ్రహీతలకి ‘విహంగ ‘ హృదయపూర్వక శుభాకాంక్షలు!