రంభ పిలిచినా సరే
రాజీ పడకండి
తొడుగు లేకుండా
అడుగు వేయకండి
తొందర పడ్డారా !
పాడె నవ్వుతుంది
బూడిద రువ్వుతుంది
*********
మన్మధుడు ఎయిడ్స్ వ్యాధి తో మంచమెక్కాడు
రతీ దేవి సెక్స్ వర్కరై రోడ్డున పడింది
ప్రబంధ కాలం కాదు
దుర్గంధ కాలం దాపురించింది
*********
ఎయిడ్స్ ని ద్వేషిద్దాం
హెచ్చైవి పేషెంటుని ప్రేమిద్దాం
బతికినంత కాలం
బాగా చూసుకుందాం
ఒకే జననం
ఒకే మరణం
మనిషే మన శరణం
********
పులి రాజు ఊరి మీద పడితే
నెల రాజుకైనా ఎయిడ్స్ వస్తుంది
పులికి వాతలు పెట్టండి
ఆడ వాళ్ళంటే
హడలి చస్తుంది
***********
మనుషుల్ని కుట్టడానికి దోమలు భయపడుతున్నాయి
ఎయిడ్స్ గుర్తుకొచ్చి గజ గజా వణుకుతూ రొదపెడుతున్నాయి
ఇంత చెప్పినా సిగ్గు రాని జంటలు
నడి చీకట్లో ‘అడ్డు’ లేకుండా కలుసుకుంటున్నాయి
*********
ముసి ముసి నవ్వులతో మురిపించింది
అడుగడుగున వలపు వాన కురిపించింది
హెచ్చైవీ లక్షణాలు కనబడగానే
నరకానికి ద్వారాలు తెరిపించింది
– ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to ఎయిడ్స్ కవితలు