యున్ (UN)ఎయిడ్స్ తాజా నివేదిక ప్రకారం ,ప్రపంచ దేశాల్లో శరవేగంతో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాది ఎలా వచ్చింది అనేది 30ఏళ్ళ తర్వాత కూడా శేషంగానే ఉండిపోయింది . ఎయిడ్స్ వ్యాది మానవులకు సోకడంలో శాస్త్రవేత్తల పాత్ర ఉందని ,అందుకే ఈ అంశంఫై పరిశోదనలు జరగటం లేదని ఆరోపణలు కూడా వస్తున్నాయి .దాదాపు సంవత్సరముల క్రితం తొలిసారి HIV కేసు నమోదు అయినప్పుడు ఈ వ్యాది ఎలా వచ్చింది ?అనే ప్రశ్న తలెత్తింది ,అది ఈ నాటికి సమాదానం లేకుండా ఉంది పోయింది .
అయితే ఎయిడ్స్ వ్యాది ఆఫ్రికాలోని చింపాంజీల ద్వారా మనుషులకు వ్యాపించిందని శాస్త్రవేత్తలు భావించేవారు . చింపాంజీలను గిరిజన తెగలవారు చంపి తిన్నప్పుడు లేదా అవి మనుషులను గీరినప్పుడో చింపాంజీల కిద్నీలలో ఉండే సిమియన్ ఇమ్మ్యునో వైరస్ (SIV)మనుషులకు సంక్రమించింది . అది HIVగా మారిందని వీరి వాదన . కొన్ని వేల ఏళ్ళ క్రితం నుంచి ఆఫ్రికాలో వివిధ తెగలవారు చింపాంజీలను చంపి తింటూనే ఉన్నారు . వారికి ఎప్పుడూ HIVవైరస్ సోకినా దాఖలాలు లేవు . ఇలాంటిది హఠాత్తుగాఈ వ్యాధి ఎలా ప్రత్యక్షం అయ్యింది ?అనే ప్రశ్నకు జవాబు లేదు . శాస్త్రవేతల అలసత్వంవల్ల ఈ వ్యాధి మానవులకు సోకిందనే అభిప్రాయం ఉంది. 1992లో తొలిసారి ప్రచారంలోకి వచ్చింది . 1950లో ఆఫ్రికాలో పోలియోవ్యాధి ప్రబలంగా ఉండేది . దీని నివారణ కోసం విస్తృతమైన పరిశోదనలు జరుగుతూ ఉండేవి . అమెరికాకు చెందిన విస్టార్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కాంగో అడవులలో పోలియో వ్యాక్సిన్ను రూపొందించడానికి పరిశోధనలు చేస్తుండేవారు . వీరు వ్యాక్సిన్ను అబివృద్ది చేయడానికి ఆఫ్రికా అడవులలో ఉన్న చింపాంజీల కిడ్నీలలోని కణజాలాలను ఉపయోగించేవారు . కొన్ని చింపాంజీలలోని కిడ్నీలలో HIVఉంటుంది
1956నాటికి చీట్స్ పోలియో వ్యాక్సిన్ను పెద్ద మొత్తంలో తయారు చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు . 1956-1960సం మద్య ఆఫ్రికాలోని వివిధ దేశాలలో లక్షలమంది ప్రజలు ఈ వ్యాక్సిన్ను చేయించుకున్నారు . వ్యాక్సిన్ ద్వారా SIVమనుషులలో చేరిందని క్రమంగా అది HIVగా మారిందని హుపర్ వాదిస్తున్నారు .
AIDS:
A:ACQUIRED-ఆర్జిత
I:IMMUNO-వ్యాధినిరోదక
D:DEFICIENCY-లోపం
S:SYNDROME- బహులక్షణాలు.
ఎయిడ్స్ అనగా:ACQUIRED IMMUNO DEFICIENCY SYNDROM. ఎయిడ్స్ ఇతరుల ద్వారానే సంక్రమిస్తుంది కనుక ఆర్జిత అంటున్నారు . శరీరంలో వ్యాదులకు వ్యతిరేకంగా పోరాడే వ్యదినిరోదక శక్తికి HIVవైరస్ భంగం కలిగిస్తుంది . కనుక వ్యాధినిరోధక శక్తి లోపం ఏర్పడుతుంది . ఎయిడ్స్ వ్యాధిలో అనేక లక్షణాలు కనిపిస్తాయి కనుక సిండ్రోమ్ అంటున్నారు .
HIV అంటే :
హ్యూమన్ ఇమ్మ్యునో వైరస్ . మానవ శరీరంలో వ్యాది నిరోధక శక్తిని క్షీణింప చేసే ఒక సూక్ష్మ క్రిమి . ఇదే ఎయిడ్స్ వ్యాధికి కారణం అవుతుంది . ఈ భయంకరమైన వైరస్ వ్యాదిగ్రస్తులు అయిన మానవ శరీరంలోని వీర్యం ,యోని ,స్రావం,రక్తం వంటి ద్రవ పదార్దాలలో జీవిస్తుంది .తల్లిపాలలో కూడా HIV ఉంటుంది .
ఎయిడ్స్ లక్షణాలు -స్వభావం :
తమకు ఎయిడ్స్ సోకిన సంగతి చాల మందికి తెలియకపోవచ్చు . ఎందుకంటే వ్యాధి లక్షణాలు, చిహ్నాలు ఏవి కన్పించవు . ఎవరినుంచి ఈ వ్యాధి సోకిందో వారిలో కూడా ఈ వ్యాధి లక్షణాలు కన్పించకపోవచ్చు . యువతీ యువకులు ఎవరైనా ఎయిడ్స్ రోగాగ్రస్తులయ్యరని నిర్ధారణ చేయాలంటే కనీసం రెండు అతి ప్రధాన లక్షణాలు, ఒక ప్రధాన లక్షణం కన్పించాలి. అప్పుడే నిర్ధారణ సాధ్యం అవుతుంది .
లక్షణాలు :
1)శరీరం బరువులో 10శాతం కంటే అధికంగా తగ్గుదల కన్పించడం .
2)నెలరోజులు దాటినా అతిసారం తగ్గకుండా కొనసాగడం .
3)నెలకన్నా ఎక్కువ రోజులనుంచి జ్వరం తగ్గకుండా కొనసాగడం .
4)దురదతో శరీరం అంతటా చర్మ వ్యాధి .
5)శరీరం మీద పదే పదే కురుపులు రావటం .
6)శరీరం నిండా బొబ్బలతో భాద .
7)గ్రంధులలో వాపు .
ఎయిడ్స్ వ్యాప్తికి కారణాలు:
ఎయిడ్స్ ఏ విధంగా విస్తరిస్తుంది?………
1)వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంభంధం.
2)వైరస్ సోకినా వ్యక్తి రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల.
3)వైరస్ తో కలుషితమయిన సిరంజులను ,సూదులను ఇతరులకు ఉపయోగించడం వల్ల.
4)ఈ వైరస్ సోకిన తల్లి ద్వారా ఆమె కడుపులోని బిడ్డకు వైరస్ సంక్రమిస్తుంది.
ఎయిడ్స్ ఈ విధంగా సంక్రమించదు:
1)కలసి జీవించడం వల్ల.
2)కలసి పని చేయడం వల్ల.
3)కలసి కూర్చోవడం వల్ల .
4)కరచాలనం వల్ల.
5)కలసి తినడం వల్ల.
6)ఒకే మల మూత్రశాలను ఉపయోగించడం వలన HIVసంక్రమణ జరగదు .
యవ్వనంలో లైంగిక విషయాలఫై సరి అయిన అవగాహన లేక పోవడం వల్ల ఎయిడ్స్ పంజా విసురుతుంది.
ఎయిడ్స్ నిరోధంలో సామాజిక అంశాలే కీలకం :
ప్రతి నిమిషానికి సగుటన పదిమందిని బలితీసుకుంటూ ,ప్రతిరోజూ 16000మందిని కొత్తవారికి సోకుతూ ఎయిడ్స్ మానవాళిని వణికిస్తోంది. HIVవ్యాప్తికి ఏ కొందరినో భాధ్యులుగా చేయడం సరికాదు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్నా వివిధ అంశాలు రోగావ్యాప్తికి కారణమవుతున్నాయి. స్త్రీ పురుష సమానత్వం ఎయిడ్స్ నిరోధంలో కీలకపాత్ర పోషిస్తుందని ఐక్యరాజ్య సమితి సర్వసభ్యసభ ప్రత్యేక సమావేశంలో తీర్మానించారు .
అంతర్జాతీయ సమాజంలోని ప్రజలలో నైతికంగా మార్పును తీసుకొని రావడం తక్షణ కర్తవ్యం . ఇందుకు సమాజంలోని మేధావులు,శాస్త్ర విజ్ఞాన కోవిదులు ,రాజకీయ ,స్వస్చంధ సేవాపరులు వారి ఆలోచన విధానానికి చక్కటి కార్యరూపం ఇవ్వాలి. వీరి విధాన నిర్ణయాలకి మామూలు ప్రజల జీవన విధానంలో ప్రభుత్వాలు మార్గాధర్శికులుగా వారి పాత్రను విజయవంతం చెయ్యాలి.
ఎయిడ్స్ వ్యాప్తి వివరాలు:
భారతదేశంలో 1986లో మద్రాసులో మొదటి ఎయిడ్స్ రోగిని కనుగొన్నారు. ఆడవాళ్ళ కంటే మగవాల్లలోనే ఎక్కువగా ఉంది. 15నుంచి 44మధ్యగల వయసుగల వారికి ఎక్కువగా HIVవస్తుంది. TB ఉన్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చేం దుకు అవకాశాలున్నాయి,పలువురి అభిప్రాయం.చైనా కంటే భారతదేశంలో 10రెట్లు అధికంగా HIVవ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఫ్రెంచి దేశానికి చెందిన లాక్ ఎంటివీర్ 1983లోనూ,రాబర్ట్గాల్లో 1984లోను విడివిడిగా HIVక్రిమిని కనుగొన్నారు. మశూచి తర్వాత ప్రపంచంలోని 190 దేశాలపైబడి కనిపిస్తున్నవ్యాది బహుశ HIVఎయిడ్స్ అని అర్ధమవుతుంది. అయితే దీనిని నిర్ధారించుకోవటానికి ఎలీసాటేస్ట్ ,DOTస్పాట్ పరీక్షల వల్లే ఈ వ్యాధి నిర్ధారణ అవుతుంది.
మౌలికమైన అవగాహన లేక ఆత్మహత్యలు:…………
అయితే ఈ వ్యాధి బారిన పడినవారు భయందోలనకు,అదే విధంగా సమాజం వీరిని హీనంగా చూస్తుందనే అపోహ వలన అనేక మంది ఆత్మా హత్యలు చేసుకుంటున్నారు. అయితే నేటి కాలంలో ఈ వ్యాధి వచ్చిన వెంటనే కొంత వరుకు నివారించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాబట్టి వ్యాధిగ్రస్తులు ఎటువంటి భయందోలనకు గురు చెందాల్సిన అవసరం లేదు.
చివరగా ప్రభుత్వాలు ఈ వ్యాధి పట్ల ప్రచార కార్యక్రమాలు అధికం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి. సమాజం ఈ వ్యాధిగ్రస్తులను ఆదరించేలా చేయటం వల్ల వారు మానసికంగా క్రుంగి ముందుగానే మృత్యువుకు దగ్గర అవుతారు. అంతే కాకుండా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఆదరణ ,ప్రేమను అందించాలి. ఇటీవల కాలంలో విజయవాడలో ఒక కాలనీలో ఒక వ్యక్తికి ఎయిడ్స్ ఉందని తెలిసి ఆ కాలనీలో ప్రజలు అంతా ఇల్లు కాలిచేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఎవరు చెప్పినా వినలేదు. చివరకు ఆ మున్శిపాలిటీ కమీషనర్ వచ్చి ఆ వ్యాధిగ్రస్తుడిని కౌగిలించుకొని చెప్పటం వలన ప్రజలు అందరు తిరిగి రావటం జరిగింది. ఇటువంటి అపోహాలకు ఎవరూ గురికావద్దు.
– కుసుమే వీర్రాజు
ఎం.ఏ .ద్వితీయ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to హెచ్ ఐ వి ఎలా మొదలయింది …. !