గౌతమీగంగ

                         

కాశీచయనుల వేంకట మహాలక్ష్మి

కాశీచయనుల వేంకట మహాలక్ష్మి

 ఇప్పుడు క్రొత్తగా ఇంగ్లీష్‌ చదువులు వచ్చాయి. ఈ చదువులకు డబ్బు అవసరం. పొరుగూర్లో వుండి చదువు కోవాలి. బసకూ, చదువుకూ కొంత డబ్బు అవసరం అవుతూ వుండేది. ఒక్కో ఇంట్లో నలుగురైదుగురు మగ పిల్లలు వుంటే వారందరికీ ఎందరు తెలిసిన వాళ్ళు వుంటే వసతి సమకూరేను. ఈ స్థితిలో పిల్లనిచ్చుకొని వాని బాగోగులకు తామే బాధ్యత వహించడానికి కొందరు గృహస్థులు ముందుకు వచ్చారు. ఇది ఆ రోజుల్లో   ఉభయతారకంగా తోచింది. సోమయాజులు గారు యోచించారు. తమకు వీడు పెద్ద బిడ్డయితే ఐదుగురు మగపిల్లలూ, ముగ్గురు ఆడపిల్లలూ వున్నారు.  భార్య కనీ పెంచే వయస్సులో వుంది. పెద్ద బిడ్డ వీడికి చదువు అబ్బితే వీడు కుటుంబాన్ని కొంత పైకి తెచ్చే అవకాశం వుంది. తాను భేషజాలకు పోయి వచ్చిన అవకాశాన్ని వదులుకోరాదు అనుకున్నారు వారు. తల్లీ, అప్పగారు కూడా ఆ విధంగానే సలహా ఇచ్చారు.              శుభకార్యం నెరవేరింది. జగన్నాథం గారి కుమార్తె సుబ్బలక్ష్మితో సోమయాజులు వివాహం వైభవంగా జరిగింది. మరుసటి సంవత్సరం జగన్నాధం గారు కూతుర్ని, అల్లుణ్ణీ చదువు నిమిత్తం కాకినాడలో కాపురంపెట్టించారు. ఆమె పది సంవత్సరాల బాలిక. గృహకృత్యాలు ఏ విధంగా నెరవేర్చగలదు. అల్లుని మేనత్తను వండి పెట్టడం కోసం తీసుకొని వచ్చారు. గదీ వసారా వున్న వాటా పాఠశాలకు చేరువగా అద్దెకు తీసుకొన్నారు. ఉప్పుతో తొమ్మిది అత్తవారి ఊరు నుంచి వచ్చేవి తన రుచులెరిగి వండి పెట్టడానికి మేనత్త వుంది. ఇంట్లో  భార్య సోమయాజులు నరసాపురంలో వారాలు చేసుకొని చదివిన వాతావరణం నుండి క్రొత్త వాతావరణంలోకి వచ్చాడు. శలవులిచ్చే సరికి మామగారు కూతుర్ని,అల్లుణ్ణి తీసుకొని రమ్మని మనిషిని పంపేవారు. మేనత్త స్వగ్రామం వెళ్లేది. బావమరదులకూ, మరదలుకీ పట్నంలో చదువుతున్న బావగారంటే గౌరవంతో కూడిన ప్రేమ. తల్లి వలే అమాయకురాలు కాక అత్తగారు గృహకృత్య నిర్వహణలో నేర్పరి. క్రమంగా సోమయాజులులో అత్తవారిపట్ల అభిమానం, కన్నవారిపట్ల ఉపేక్ష భావం పెరగసాగాయి. మూడు ఏళ్లు గడిచాయి. సోమయాజులు స్కూల్‌ ఫైనల్‌ పరీక్షలో తప్పాడు. కోపిష్టి అయిన సోమయాజులు గారు దీనికి తట్టుకోలేకపోయారు. వియ్యంకుడు ఖర్చులు పెట్టుకొని చదివిస్తుంటే తన కొడుకు ఈ విధంగా పరీక్ష తప్పడం ఆయనకు శిరచ్ఛేదంగా తోచింది. కొడుకుని కాస్త తీవ్రంగానే మందలించారు. అలిగి పడుకున్న కొడుకుని తల్లి భోజనానికి పిలిస్తే కసిరికొట్టాడు. నాయనమ్మ వచ్చి బ్రతిమాలింది. 

                       మరునాడు సోమయాజులు అత్తవారి ఊరు వెళ్ళాడు. అత్తగారు మనస్సులో కష్టంగా వున్నా పైకి ఏమీ అనలేదు. బావమరదులు చిన్న వాళ్లు, వాళ్లకి ఈ గోల ఏమి పట్టదు. బావ వస్తే హాయిగా పంట పొలాల మీదకు, షికారు వెళ్లవచ్చు. ఆ రోజుల్లో క్రొత్తగా వస్తున్న చీట్ల పేక ఆడుకోవచ్చు పెద్ద వాళ్లు చూడకుండా, ఊరి చెఱువులో ఈతలు కొట్టవచ్చు. వాళ్ళు బావగార్ని వదలలేదు. 

 

                    కరువు, కాటకాలు ఏర్పడినప్పుడు ప్రజలు తిండి దొరక్క అల్లాడిపోయేవారు. అసలే పంటలు అంతంతమాత్రంగా వుండేవి ఆ ప్రాంతాల్లో. ఎంతో కొంత భూవసతి గల వారికి అప్పో, సొప్పో దొరికేది కానీ, రెక్కాడితే గాని డొక్కాడని శ్రామిక వర్గానికి అటువంటి కరువు కాటకాల రోజులు నిజంగా గడ్డు రోజులే. వారికి ఓ మోస్తారు అన్న వస్త్రాలు కలిగిన వారు దానంగా కానీ, అప్పుగా కాని ఏమీ ఇచ్చేవారు కారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు పగలల్లా ఊళ్ళలో తిరిగి రాత్రి చీకటి పడ్డాక వళ్లంతా మసి పూసుకొని,  ఆ మసిపైన ఆముదం రాసుకొని తలకు పిశ్రీష్నసులు తగుల్చుకొని ఇంటి పెరళ్ళలో నక్కి వుండేవారు. మసి వలన వారు ఎవరికీ ఆ చీకటిలో కనపడరు. వంటి నిండా ఆముదం రాసుకోవడం వలన పట్టుకోబోతే జారిపోయేది. జుట్టు పట్టుకోబోతే పిన్నులు చేతికి గుచ్చుకొనేవి. అయినా ఆ అభాగ్యులు దెబ్బలకు సిద్ధపడి పొట్టకూటి కోసం తెగించేవారు. మరి కాస్త ధైర్య సాహసాలు కలవారు దొంగలదండుగా ఏర్పడి కొన్ని గుఱ్ఱాలు, ఆయుధాలు సేకరించి, ఊళ్ళమీద పడేవారు. వారి ధాష్ట్యానికి బెదిరి ఊరివారు వారు కోరిన ధనం ఇచ్చి పంపేవారు.  కొందరు సాహసులు వారిపై తిరగబడితే ఉభయపక్షాల  కొందరు క్షతగాత్రులైతే, మరికొందరు మరణించేవారు. ఒకటి రెండు దోపిడీలు చేసాక ఈ దొంగలు దూర ప్రాంతాలకు తరలిపోయేవారు. అక్కడ కొంత భీతాంగాన్ని సృష్టించి, ఇక్కడి జనం కొంత ఏమరేక తిరిగి ఈ ప్రాంతాలకు వస్తుండేవారు. 

 

                       శాస్త్రికి మేనత్త కుమారునితో అతడి మైత్రి బాల్యమాదిగా వీడరానిది కదా. బాహ్య ఆకారాలలో వారిరువురకూ చాలా బేధం వుంది శాస్త్రి నల్లని బక్క పలచని వాడు. నారాయణ పచ్చని శరీర చ్ఛాయతో సంపన్నుల ఇంట ఏక సంతానం కనుక విశేష పోషణతో పరిపుష్టమైన శరీరం కలవాడు. శాస్త్రి మితభాషి. నారాయణ అందరికీ స్నేహపాత్రుడు అయితే వారిరువురిదీ ఏకాత్మ. శాస్త్రి వాళ్లు ఆరుగురు అన్నదమ్ములు.  నారాయణ తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడు. వారింట అతని ఈడు తన పిల్లలను అదుపు ఆజ్ఞలలో పెడుతూ గంభీరంగా వుండే కృష్ణ సోమయాజులు గారికి మేనల్లుడన్నా, చిన్నతనంలోనే భర్తను కోల్పోయి ఏక పుత్రునితో అత్తవారింట వున్న చెల్లెలన్నా అపార ప్రేమాదరాలు. మహాలక్ష్మమ్మ గారు కూడా నారాయణ పసితనంలోనే తండ్రి పోగా, భర్తృవియోగ దుఃఖంతో గది విడిచి బైటకు రాకుండా కుమిలిపోతున్న ఆడపడుచును ఆదరిస్తూ, ఆమె కొడుకుకు తాను పెంపుడు తల్లి స్తన్యమిచ్చి పెంచింది. అతడు ఆమెకు కన్న కొడుకుల కన్నా మిన్న.
 
                     తమ ఇంట్లో ఏదైన అపురూపమైన వంటకం చేసుకుంటే నారాయణ మేనమామ ఇంటికి వెళ్లి ఒరేయ్‌!   ఈ రోజు మా ఇంట్లో ఫలానా వంటకం. మీరు మా ఇంటికి భోజనానికి వస్తేనే కాని వీల్లేదు అని వార్ని తమ ఇంటికి పిలిచుకొని పోయి వారు తింటేనే కాని తాను ఆ పదార్థం తినేవాడు కాదు. వారు ముఖమాట పడ్డా ఇతడు వదిలేది లేదు. దీపావళి వస్తే ఉప్పు పొట్లాలు, టపాసులు ఎన్నో తయారు చేసేవాడు నారాయణ. మేనమామ కొడుకులతో కలిసి అవి కాల్చడం అతడికి సరదా. క్రొత్త గుడ్డకు పేడ పూసి ఆరబెట్టి అందులో గంధకం, సూరేకారం విడివిడిగా మెత్తగా నూరి బీడు ఆముదం కలిపి ఆ మిశ్రమాన్ని ఆ గుడ్డలో పోసి మూటకట్టి, దానికో చేంతాడు కట్టి ఆ మూటను గిర గిరా త్రిప్పుతూ తాము తమ చుట్టూ తిరగడం బాలుర, యువకుల నేర్పుకూ, సాహసానికీ ఓ నిదర్శనం. త్రిప్పుతారు గనుక అవి త్రిప్పుడు పొట్లాలు, క్రమంగా ఉప్పు పొట్లాలు, ఉప్పుడు పొట్లాలు అని పిలవబడేవి. ఓ ఏడాది అలాంటి త్రిప్పుడు పొట్లం త్రిప్పుతుంటే నారాయణ మేనమామ కొడుకు చొక్కా అంటుకుంది భయంతో అతడు పరుగు పెట్టడంతో ఒళ్ళు కొంత కాలింది. పెద్దవాళ్ళంతా నారాయణ ప్రోత్సాహంతో ఇది జరిగిందని అతణ్ణి తిట్టసాగారు. పసివాడు బావని ఏమీ అనకండి నేనే సరిగా చూసుకోలేదని ఏడుస్తూనే చెప్పసాగాడు. వారి మధ్య అనుబంధం అటువంటిది. నాలుగేళ్లపాటు దీపావళి హడావిడి కాస్త తగ్గింది. మళ్ళీ మామూలే. 
                     ధనవంతుల ఇంట పుట్టిన వాడు నారాయణ, పినతండ్రి, పిన తల్లీ, మేనత్తలు, తాతగారూ, నాయనమ్మ అందరికీ ముద్దు బిడ్డ అతడి దృష్టిలో డబ్బుకు విలువలేదు. అడిగిన వారికి అడిగినంతా. ఒక్కోసారి అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చేసేవాడు. ఇబ్బందుల్లో పుట్టి పెరుగుతున్న శాస్త్రికి ఇది గిట్టేది కాదు. ‘‘ఒరేయ్‌! వెనుకా ముందూ చూడకుండా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నావు. రేపు నీకు అవసరం వస్తే వీళ్లలో ఒక్కడూ ఆదుకోడు అనేవాడతడు. పోన్లేరా నాకు లేకపోతే వీళ్లెందుకు నువ్వు ఇవ్వవా ఏమిటీ? అనేవాడు నారాయణ. తనకు బాగా నచ్చిన దుస్తులు ఒకటి రెండు సార్లు కట్టాక మేనమామ కొడుకులకు ఇచ్చేవాడు. వాళ్లు నువ్వు కట్టుకోరా మాకు వద్దు అంటే, నేను కట్టుకొంటే ఎలా వుందో నాకెలా తెలుస్తుంది. మీరు కట్టుకుంటే నేను కళ్లారా చూసుకుంటాను అనేవాడు. వారి మధ్య ప్రేమ బంధం వయస్సుతో గట్టిపడిరది కాని సడలలేదు. సాటి వారికి సహాయపడుట తప్పుకాదురా కానీ మన శక్తి, ఎదుట  వాడి అవసరం గమనించి దానం చెయ్యాలి అపాత్ర దానం తగదు అనేవాడు శాస్త్రి. 
                            నారాయణ మేనత్త భర్త బి.ఎ. బి.ఇ.డి. చేసి ఏలూరులో ప్రధానోపాధ్యాయులుగా వున్నారు. నారాయణను తమ వద్ద వుంచుకొని చదివిస్తామని వారు కోరారు. నారాయణకు క్రొత్త లాగులు, చొక్కాలు కుట్టించి, ట్రంకుపెట్టె ్టకొని ప్రయాణానికి  అంతా సిద్ధం చేసారు. పోయిన వారు పోగా నారాయణ తల్లి గారికి ఇద్దరు సంతానం మిగిలారు. నారాయణ తమ్ముడు ఐదేళ్లవాడు హఠాత్తుగా మరణించాడు. ఈ సంఘటనతో ఇంటి వారంతా కలగిపోయారు. నారాయణను క్షణం కూడా విడిచి వుండటానికి వారు అంగీకరించలేదు. నారాయణ చదువు ఆ విధంగా చెట్టెక్కింది. మేనత్త భర్త ఎంతగా నచ్చచెప్పి చూసినా ఇంటి వారు అంగీకరించలేదు. చదువుకుంటున్న మేనమామ కొడుకులంటే నారాయణకు ఎంతో అభిమానం. వారి కష్ట సుఖాలు తనవిగానే  భావించేవాడు. 
                            ఆ రోజుల్లో పిల్లవానికి 10వ ఏడు ఆడపిల్లకు 5వ ఏడు వివాహానికి యుక్త వయస్సు. నారాయణకు పెళ్ళి చేస్తే బాగుంటుందని ఇంటి వాళ్ళు అనుకున్నారు. అతడి వాటాకు 40 ఎకరాల పొలం వస్తుంది. మంచి గౌరవ మర్యాదలు కల కుటుంబం. సంబంధాలు రాసాగాయి. అతడి రెండవ మేనమామకు ఒకతే కుమార్తె, మంచి భూవసతి వుంది. పిల్ల బాగానే వుంటుంది. అదే ఊర్లో మరో స్థితిమంతుల పిల్ల చాలా బాగుంటుంది. వీరు పిల్లవాడి తాతగారి వద్దకు వచ్చారు. పై ఊర్ల నుండి కూడా సంబంధాలు వస్తున్నాయి. ఆ రోజుల్లో దూరప్రాంతాల సంబంధాల్ని చేయడానికి ఇష్టపడేవారు కాదు. తాతగారు మనవణ్ణి అడిగారు. తన దృష్టిలో వున్న సంబంధాలు చెప్పి నీకు ఏది చేయమంటావు అని. ఇతడికి పెద్ద మానమామ భార్య అంటే విశేష గౌరవాభిమానాలు కదా. ఆయన కొడుకులు ప్రాణమిత్రులాయే. నాకు చేస్తే పెద్ద మామయ్య కూతుర్ని చేయండి లేకపోతే అసలు పెళ్లే వద్దు అన్నాడు తాతగారితో. అతడి తల్లికి సరళ స్వభావురాలైన పెద్ద వదిన గారంటే అభిమానం. ఆమె పది మంది పిల్లల తల్లి, రేపు తన కోడలు కూడా తల్లిలానే సంతానవంతురాలై తన వంశం అభివృద్ధి అవటమే తనకు కావాలి. రూపు రేఖలు, ధనధాన్యాలు తనకు అక్కరలేదు అనుకుంది ఆ తల్లి. ఆ మాటే తనను అత్తమామలు అడిగినపుడు చెప్పింది. 
జగన్నాథ సోమయాజులు గారు, కృష్ణ సోమయాజులు గారిని పిలిపించి ‘‘ఏమయ్యా నీ కూతురిని మా మనవడికి ఇచ్చి పెళ్ళి చెయ్యి నీకు వీలయినట్లుగా పెళ్ళి జరిపించు. ఎలా చేసిన మాకు పట్టింపు లేదు. మీ ఇంటి పిల్ల మా ఇల్లు మెట్టడమే మాకు కావలసింది అన్నారు. నిక్షేపంలాంటి పొలం వుండగా చదువు అవసరం ఏముంది? కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తిన్నా తరగని ఆస్తి. అనుకొని సోమయాజులు గారు తమ అంగీకారాన్ని తెలియజేసారు. పెద్దింటి సంబంధం, అయిదు రోజుల పెళ్ళి ఖర్చుల నిమిత్తం సోమయాజులు గారు కోమటింట అప్పు చేసారు. అత్తగారి వడ్డాణం, జిగినీ గొలుసు, దండకడియాలూ, మురుగులూ మెరుగు పెట్టించి పెళ్లి కూతురికి పెట్టారు అత్తవారు. పెండ్లి కుమారునికి చెవులకు వజ్రాల తమ్మెట్లు, మురుగులు గట్టి కంటే వున్నాయి. 
                                నోములు, వ్రతాలకూ, పండుగలకూ, పబ్బాలకూ ఊళ్లో వున్న వియ్యాల వారిని పిలిచి మర్యాద చేయడానికి సోమయాజులు గారికి మరికొంత ఋణం చేయవలసి వచ్చేది. వినాయక చవితి, వరుని ఇంట్లో చేసుకునే పండుగ అయినా అల్లుడు తన ఇంట్లో ఒకడేనని తమ పిల్లలందరితో పాటు పూజ చేసుకుంటాడని సోమయాజులుగారు అల్లుని తమ ఇంటికి ఆహ్వానించారు. పండుగ రెండు రోజులు వుందనగానే నారాయణ, బావమరదులు గోదావరి నుండి బంకమట్టి తెచ్చి నేర్పుగా వినాయక ప్రతిమను చేసి నీడను జాగ్రత్తగా ఆరబెట్టేవారు. ఊరు చివర వున్న వెదురు పొదల్లోంచి వెదురు నరుక్కు వచ్చి పాలవెల్లి తయారు చేసారు. క్రితం రోజంతా తోటల్లో, దొడ్లలో తిరిగి మారేడు కాయలు, వెలగ కాయలూ, మామిడి ఆకులు, కాయలు, ఇంకా రకరకాల కాయలు కోసి తెచ్చారు. కృష్ణసోమయాజులు గారు పిల్లలను వెంట తీసుకొని వెళ్లి 21 రకాల పత్రి సమకూర్చారు. నారాయణ తన నేర్పుతో రంగు కాగితాలతో గొలుసులూ, బుట్టలూ, తయారు చేసి పాలవెల్లి అమర్చాడు. పిల్లలు పండుగనాడు ఉదయాన్నే చెఱువుకు వెళ్ళి, కలువలూ, తామరలు కోసుకొని వచ్చారు. పిల్లలంతా తలంటు స్నానాలు చేసుకొని పూజకు సిద్ధం అయ్యారు. గజానన విజయం అనే తాళపత్ర గ్రంథం వారి వద్ద వుండేది. అందులో గజాసుర వధ, శివుడు గణేశుని తల శూలంతో ఖండిరచడం, జగన్మాత శోకక్రాంత అవడం, ఆమె అన్నగారయిన విష్ణువు చెల్లెల్ని శాంతింపచేయడానికి గణేశుని పునరుజ్జీవుణ్ణి చేయమని బ్రహ్మదేవుని ఆదేశించడం శివుని శూలాహతమైన గణేశుని శిరస్సు ఎంత వెదికినా దొరకకపోవడం విష్ణుదేవుడు ఉత్తరపు దిశగా తల వుంచి నిద్రించిన వారి శిరస్సు ఖండిరచి తెమ్మనడం. ఎవరూ ఆ విధంగా చేయరు కదా. ఒక ఏనుగు ఆ విధంగా శయనించగా ప్రమధ గణాలు ఆ శిరస్సు ఖండిరచి తేవడం. ఆ శిరస్సు అతికి బ్రహ్మ గణేశున్ని బ్రతికించడం గజానన విజయగాథ. దేవతలంతా అతడికి గణాధిపత్యాన్ని ఇచ్చి గౌరవించారు.
                        అతడు పార్వతీపరమేశ్వరుల పెద్ద కొడుకుగా పూజలందుకుంటున్నాడు. మామూలుగా ఇప్పుడు చదువుతున్న శమంతకోపాఖ్యానం కాకుండా ఈ గాధ ఎందుకు చదివేవారో ఇప్పుడు తెలియదు. పూజ ముగిసే సరికి   ఉండ్రాళ్ళు, జిల్లేడు కాయలు తయారయి సిద్ధంగా వుండేవి. కొబ్బరికాయలు కోరి లస్కోకార చేసి ఉడికిన వరిపిండిలో ఆలస్కోర పెట్టి జాగ్రత్తగా పొదిగి ఆ జిల్లేడు కాయల్ని తిరిగి ఆవిరిపై వండుతారు. నాటి ఆడవారి నేర్పుకు అదో నిదర్శనం. రామలక్ష్మమ్మ గారు ఆరు కొబ్బరికాయలు కొట్టి మనుమల నైవేద్యానికి జిల్లేడు కాయలు తయారు చేసేవారు. మహాలక్ష్మమ్మకు ఈ బెడద కిట్టదు. ఆమె పప్పులో వుండ్రాళ్లు, పాలలో ఉండ్రాళ్లు తయారు చేసారు. బియ్యంనూక విసిరి అందులోంచి మెత్తని పిండి జల్లించి వేరుగా తీసి ఆ నూక కొంచెం నెయ్యి వేసిన నీళ్లలో వుడకబెడతారు. దాన్ని చిన్న వుండలుగా చేసి పెసరపప్పు ఉడికించి పల్చగా చేసి అందులో వేస్తే అవి పప్పులో ఉండ్రాళ్ళు. కొంచెం వేడి పాలలో బెల్లం చేర్చి అందులో వేస్తే పాలలో  ఉండ్రాళ్ళు. మెత్తని పిండిని వేరు చేయకుండా ఉడికిస్తే అది మరికాస్త అసుముగా వుంటుంది. అందులో కొబ్బరి తౌజు పెట్టి వుండేవి జిల్లేడుకాయలు. ఇంత శ్రమపడి వంట చేయడం మహాలక్ష్మమ్మకి కిట్టదు. అంతగా పిండి వంటలు తినాలంటే పప్పుల నరసమ్మ అనే వైశ్య స్త్రీ వండి తెచ్చిన బెల్లం మిఠాయి, అరిసెలు, కజ్జికాయలు మొదలైనవి కొనేవారు ఆమె. కూతురు కొడుకు ఈ ఇంటి అల్లుడై పండుగకు వచ్చాడు కనుక రామలక్ష్మమ్మ గారు మరికాస్త ఉత్సాహంగా పిండి వంటలు వండారు. 
                           ఆ రోజుల్లో శ్రామిక స్త్రీలు పూత రేకులు అనే వస్తువులు  తయారు చేసి అమ్మేవారు. అడుగు భాగం బాగా వెడల్పుగా వుండే కుండ బాగా వేడిచేసి బోర్లిస్తారు. చిక్కని వరిగంజిలో పల్చని, మెత్తని, తెల్లని పాతబట్ట ముంచి వేడి కుండపై నుండి ఉపాయంగా లాగితే గంజి పల్చగా రేకులా వస్తుంది. ఇదే పూతరేకు.. పంచదార ఏలకులు వేసి మెత్తగా దంపి కమ్మని నెయ్యి కాచి ఈ రేకులు ఒకొక్క రేకుపై పిండిన తడిబట్ట కొంచెం కప్పి దానిపై పంచదార పొడి, నెయ్యి వేస్తూ 10 రేకులు పేర్చి చుట్టే ఈ చుట్టలు తెల్లగా చాకింటి ఇస్త్రీ మడతల్లా కనపడుతూ తినడానికి మహారుచిగా వుంటాయి. ఇవి ఆరోగ్యప్రదం, పత్యమైనవి కూడా జ్వర పీడితులకు,  పిల్లలకు ప్రత్యేకాదరంతో వీటిని తినిపించేవారు. శ్రామిక స్త్రీలు వ్యయప్రయాసలకోర్చి వీటిని తయారు చేసి అమ్మేవారు. ఆ ప్రాంతాల సంపన్నులైన క్షత్రియులు స్వంత వాడకానికీ, గౌరవభాజనులైన వారికి కానుకగా ఈ పూతరేకుల చుట్టలు ఇచ్చేవారు. బనారస్‌ కాజా, బందర్‌ లడ్డూలాగా ఈ అత్రేయపురం పూతరేకులు ఆంధ్రదేశమంతటా ప్రఖ్యాతి పొందాయి. కాటన్‌దొర ఈ పూతరేకులు రుచి చూసి వీరికి ఈనాములు ఇచ్చాడని స్థానికులు కథలుగా చెప్తారు. రామలక్ష్మమ్మ గారు, ఆమె కుమార్తెలు చాల నేర్పుతో కూడిన ఈ పూతరేకుల తయారీ నేర్చుకొని మడిగా పూతరేకులు తయారు చేసేవారు. మరి వారు బయట చేసిన పదార్థాలు తినకపోవడమే కాక తాకను కూడా తాకరు కదా. 

                            వేంకటరత్నం పెళ్ళిలోనే నరసింహం వడుగు జరిగింది. తొలిచూలు పిల్లవాడు కదా. మగ పిల్లవాడి వడుగు  చేసి కన్యా ప్రదానం చేయడం సంప్రదాయం. అతడు అప్పటికి 1వ ఫారం చదువుతున్నాడు. ఆరోగ్యంగా బలంగా వుండే నరసింహానికి ఆటలంటే ప్రాణం. ఆ రోజుల్లో ఫుట్‌బాల్‌ ఆటకు ఆంధ్ర దేశంలో మంచి ఆదరం వుంది. ఆటలలో నిపుణులైన యువకుల్ని కొన్ని బ్రిటీష్‌ కంపెనీల వారు తమ కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చి ప్రత్యేక శిక్షణ ఇప్పించి, వారిని మ్యాచ్‌లకు పంపడం తమ కంపెనీకి ప్రతిష్ఠాత్మకంగా భావించేవారు. ఈ ఆట తమకంలో ఒకసారి మ్యాచ్‌ ఆడుతుండగా బంతి తగిలి గ్రౌండులో మూర్చపోయాడు నరసింహం. తెలిసిన వారి వలన కబురు అంది అదిరే గుండెతో పరుగు పరుగున వచ్చాడు తండ్రి. పిల్లవాడిని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకున్నారు. అతడు పూర్తిగా కోలుకునే వరకూ తల్లిదండ్రుల మనస్సు మనస్సులో లేదు. వీడికి ఆ ఆటల వెర్రి ఏమిటీ? తన చదువు ఎలాగు అర్థాంతరంగా ఆగిపోయింది. వీడయినా కష్టపడి చదివి స్కూలు ఫైనలు గట్టెక్కగలిగితే తాలుకా ఆఫీసులో గుమాస్తాగా చేరినా క్రమంగా తహసిల్దారు అవుతాడు. ఠాణేదారు అయిన తమ బావ గారి కన్నా ఎక్కువ హోదా తమకు దక్కుతుంది. ఓనాడు తమకు తాహతు లేదని అయిన వాళ్ళే నిరసన చేసారు. వారందరికీ సిగ్గు వచ్చేటట్టుగా తన కొడుకు తమ అంతస్తు పెంచుతాడు అనుకుంటే వీడు చదువు సంధ్యా మానేసి ఇలా ఆటలు అంటూ తిరుగుతున్నాడు. ఇలా దెబ్బలు తగుల్చుకుంటూ వుంటే ఏరోజు ఎటువంటిది అవుతుందో అనుకొని  కొడుక్కు గట్టిగా బుద్ది చెప్పి ఈ ఆటలు కట్టిపెట్టి శ్రద్దగా చదివేటట్లు చేయాలి అనుకున్నారు తల్లిదండ్రులు. వారు కొడుకును మందలించి కట్టడిలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా తాత లచ్చన్న గారు మనవడి పక్షం వహించి కొడుకు, కోడళ్లతో  తగాదాకు దిగేవారు. మీనాన్న నిన్ను చంపేస్తున్నాడురా బాబు తాను చదివాడుగా పెద్ద చదువు, ఇంకా నీకు తక్కువ అయిందట. ఫస్టు ఫారం చదివిన మీ బాబాయి హాయిగా బ్రతకడం లేదు. ఆ షావుకారు అతణ్ణి నెత్తిమీద పెట్టుకుంటున్నాడు.

   

                           ఇల్లూ వాకిలీ కొనిపెట్టాడు ఈ మధ్యనే. అంటుండగా మొన్న ఆ మధ్య బాకీలు సరిగా వసూలు చేయలేదని షావుకారు ఉద్యోగం తీసేస్తే మీ చిన్న కొడుకు భార్య పిల్లలతో నెలనాళ్లు ఇక్కడే వున్నాడుకదా. మీ పెద్ద అబ్బాయి తెలిసిన వాళ్లను బ్రతిమాలుకొని షావుకారుకు చెప్పించి మళ్లీ పనిలో పెట్టేటట్లు చేసారు అనేది సుబ్బమ్మ గారు. వీడు కష్టపడి చదివితే సర్కారు ఉద్యోగంలో చేరి ఒకరికి ఒదిగి వుండక్కర లేకుండా హాయిగా బ్రతుకుతాడు. కుడువపెట్టా లోటు వుండదు అని మామగారికి నచ్చచెప్ప చూసేది సుబ్బమ్మ గారు. చాల్లేవే నీ మగడి బడాయి. మరది వచ్చి వున్నాడని తెగ బాధపడిపోతున్నావు. నాకు వచ్చే పది పరకా మీకు ఇచ్చే కదా నేను మీ దగ్గర వుంటున్నాను. అని కోడల్ని మందలించేవారు ముసలాయన. తల్లి తనే శ్రద్ద తీసుకొని పెందరాళే ఇంటి పనులు ముగించుకొని పెద్ద దీపం వెలిగించి పెట్టి పెద్దాడా  రా నాయనా చదువుకో అని తాను దగ్గర కూర్చోనేది. పగలల్లా ఆటలతో అలసి వున్న నరసింహానికి పుస్తకం చూస్తూనే నిద్ర ముంచుకొని వచ్చేది. తల్లి తడి చేత్తో అతడి కళ్ళు తుడిచి ఎంత ప్రయత్నించినా ఫలితం వుండేది కాదు. స్కూలు ఫైనలు పరీక్ష నరసింహ తప్పనే తప్పాడు. తండ్రి ఉగ్రనరసింహ రూపం దాల్చాడు.  ఇక నిన్ను చదివించడం నా వల్ల కాదు. ఏ కోమటి కొట్టులోనో గుమాస్తాగా చేరు అన్నాడు. సుబ్బమ్మ గారు భర్తను బతిమాలుకొన్నారు. ఇంటికి పెద్ద బిడ్డ. మనం పస్తులు వుండి అయినా వీణ్ణి పైకి తెస్తే వీడు సంసారాన్ని అభివృద్ధి చేస్తాడు. కాస్త నిదానించండి అని నచ్చచెప్పారు. నరసింహం మళ్ళీ పాఠశాలలో చేరాడు. నాటి విద్యా విధానం కఠినంగా వుండేది. నేటి ప్రైవేట్లు, గైడ్లు, వంటి వసతులేమి లేవు. చదివింది చాలక నరసింహం మళ్ళీ పరీక్ష తప్పాడు. ఈసారి అతడికి పౌరుషం వచ్చింది. మరి చదవను ఏదో నాకు తగిన ఉద్యోగం చేసుకొని నా మానాన నేను బ్రతుకుతాను అన్నాడు తల్లి దగ్గర. అప్పటికీ ఆ దంపతులకు పోయిన వారు పోగా రత్నం, నరసింహం కాకుండా ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు వున్నారు. సంసారభారం పెరుగుతోంది నరసింహం దొరికిన ఉద్యోగంలో చేరాడు. 

ఈ పరిస్థితుల్లో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తాలూకా మార్కొండపాడు నుంచి రంగయ్య గారు నరసింహానికి తమ మనుమరాల్ని ఇస్తామని వచ్చారు. లచ్చన్న గారికి మునిమనవణ్ణి ఎత్తుకోవాలనే తహ తహ రోజు రోజుకూ పెరుగుతూ వుంది. వీడికి ఇప్పుడే పెళ్ళి ఏమిటీ అనుకున్నారు సుబ్బారావు గారు. పిల్ల తాత కూడా లచ్చన్న గారి వలెనే వైదిక వృత్తిలో వున్నవాడే. తాతలిద్దరికీ మైత్రి కుదిరింది. బిడ్డ వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ అన్నారు.

                             ఓ సారి పరీక్ష తప్పినంత మాత్రాన ఏం మునిగి పోయింది. మా మనవరాలి జాతకం మంచిది. దాని ముఖంలో లక్ష్మీకళ తాండవమాడుతూ వుంటుంది. పెళ్ళి అయితే మీ వాడి దశ మారి పరీక్ష ప్యాసు అవుతాడు అన్నారు కన్య తాతగారు. ఒక్కసారి మీరు, బావగారు దయచేసి పిల్లను చూడండి. మీకు పిల్ల నచ్చకపోతే నేను మరి మాట్లాడను అన్నాడు పిల్ల తండ్రి. సుబ్బారావు గారూ, తండ్రి వెళ్ళి పిల్లను చూచి వచ్చారు. ఆడపెళ్ళి వారు మర్యాదలు బాగానే చేసారు. మా రంగనాయకిలో లక్ష్మీ కళ ఎలా తాండవిస్తుందో చూడండి. అసలు ఇది పుట్టాక మా నట్టిల్లంతా బంగారమేననుకోండి. మా పొరుగూరు చింతలపూడి కరణంగారు మా చెల్లెలి భర్తే. అసలు మా చెల్లెలు కొడుక్కే ఈ బొట్టిని ఇయ్యవలసింది. ఇదే ఆరు నెలలు పెద్దదయి కూర్చొంది. మాకు ఆడ పిల్లలు లేరు. మట్టెలు, మంగళసూత్రాలూ చేయించి మేము పీటల మీద కూర్చొని కన్నెధార పోసుకుంటాం. మాకీ అదృష్టం కలిగించండి అని అంటున్నారు. అని తమ పిల్ల అదృష్ట జాతకాన్నీ, తమ బంధు సంపత్తినీ చాటి చెప్పాడు పిల్ల తండ్రి. నరసింహానికి చదువు అబ్బడం లేదు. కాస్త పదిమంది వున్న ఇంటి సంబంధం చేస్తే వాళ్ళే ఉద్యోగం వేయించుకొని మంచి చెడ్డలు చూస్తారని దూరపాలోచన చేసారు సుబ్బారావు గారు. తధాస్తు అన్నారు ఇంటికి వచ్చి ఈ మాట చెప్పిన భర్తతో ఒక్కసారి రా నాయనా చదువుకో అని తాను దగ్గర కూర్చోనేది. పగలల్లా ఆటలతో అలసి వున్న నరసింహానికి పుస్తకం చూస్తూనే నిద్ర ముంచుకొని వచ్చేది. తల్లి తడి చేత్తో అతడి కళ్ళు తుడిచి ఎంత ప్రయత్నించినా ఫలితం వుండేది కాదు. స్కూలు ఫైనలు పరీక్ష నరసింహ తప్పనే తప్పాడు. తండ్రి ఉగ్రనరసింహ రూపం దాల్చాడు.  ఇక నిన్ను చదివించడం నా వల్ల కాదు. ఏ కోమటి కొట్టులోనో గుమాస్తాగా చేరు అన్నాడు. సుబ్బమ్మ గారు భర్తను బతిమాలుకొన్నారు. ఇంటికి పెద్ద బిడ్డ. మనం పస్తులు వుండి అయినా వీణ్ణి పైకి తెస్తే వీడు సంసారాన్ని అభివృద్ధి చేస్తాడు. కాస్త నిదానించండి అని నచ్చచెప్పారు. నరసింహం మళ్ళీ పాఠశాలలో చేరాడు. నాటి విద్యా విధానం కఠినంగా వుండేది. నేటి ప్రైవేట్లు, గైడ్లు, వంటి వసతులేమి లేవు. చదివింది చాలక నరసింహం మళ్ళీ పరీక్ష తప్పాడు. ఈసారి అతడికి పౌరుషం వచ్చింది. మరి చదవను ఏదో నాకు తగిన ఉద్యోగం చేసుకొని నా మానాన నేను బ్రతుకుతాను అన్నాడు తల్లి దగ్గర. అప్పటికీ ఆ దంపతులకు పోయిన వారు పోగా రత్నం, నరసింహం కాకుండా ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు వున్నారు. సంసారభారం పెరుగుతోంది నరసింహం దొరికిన ఉద్యోగంలో చేరాడు. 

                              ఈ పరిస్థితుల్లో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తాలూకా మార్కొండపాడు నుంచి రంగయ్య గారు నరసింహానికి తమ మనుమరాల్ని ఇస్తామని వచ్చారు. లచ్చన్న గారికి మునిమనవణ్ణి ఎత్తుకోవాలనే తహ తహ రోజు రోజుకూ పెరుగుతూ వుంది. వీడికి ఇప్పుడే పెళ్ళి ఏమిటీ అనుకున్నారు సుబ్బారావు గారు. పిల్ల తాత కూడా లచ్చన్న గారి వలెనే వైదిక వృత్తిలో వున్నవాడే. తాతలిద్దరికీ మైత్రి కుదిరింది. బిడ్డ వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ అన్నారు. ఓ సారి పరీక్ష తప్పినంత మాత్రాన ఏం మునిగి పోయింది. మా మనవరాలి జాతకం మంచిది. దాని ముఖంలో లక్ష్మీకళ తాండవమాడుతూ వుంటుంది. పెళ్ళి అయితే మీ వాడి దశ మారి పరీక్ష ప్యాసు అవుతాడు అన్నారు కన్య తాతగారు. ఒక్కసారి మీరు, బావగారు దయచేసి పిల్లను చూడండి. మీకు పిల్ల నచ్చకపోతే నేను మరి మాట్లాడను అన్నాడు పిల్ల తండ్రి. సుబ్బారావు గారూ, తండ్రి వెళ్ళి పిల్లను చూచి వచ్చారు. ఆడపెళ్ళి వారు మర్యాదలు బాగానే చేసారు. మా రంగనాయకిలో లక్ష్మీ కళ ఎలా తాండవిస్తుందో చూడండి. అసలు ఇది పుట్టాక మా నట్టిల్లంతా బంగారమేననుకోండి. మా పొరుగూరు చింతలపూడి కరణంగారు మా చెల్లెలి భర్తే. అసలు మా చెల్లెలు కొడుక్కే ఈ బొట్టిని ఇయ్యవలసింది. ఇదే ఆరు నెలలు పెద్దదయి కూర్చొంది. మాకు ఆడ పిల్లలు లేరు. మట్టెలు, మంగళసూత్రాలూ చేయించి మేము పీటల మీద కూర్చొని కన్నెధార పోసుకుంటాం. మాకీ అదృష్టం కలిగించండి అని అంటున్నారు. అని తమ పిల్ల అదృష్ట జాతకాన్నీ, తమ బంధు సంపత్తినీ చాటి చెప్పాడు పిల్ల తండ్రి. నరసింహానికి చదువు అబ్బడం లేదు. కాస్త పదిమంది వున్న ఇంటి సంబంధం చేస్తే వాళ్ళే ఉద్యోగం వేయించుకొని మంచి చెడ్డలు చూస్తారని దూరపాలోచన చేసారు సుబ్బారావు గారు. తధాస్తు అన్నారు ఇంటికి వచ్చి ఈ మాట చెప్పిన భర్తతో ఒక్కసారి నీ అందం కొంచెం కూడా తగ్గలేదు సుమా। అంటూ తన విస్తరిలో బూరె తీసి సుబ్బమ్మ గారి విస్తరిలోకి విసిరాడు. ఈ సంఘటనతో అందరు ఖిన్నులయ్యారు. సుబ్బమ్మ గారి అప్పగారి అళ్ళుళ్ళు ఇద్దరూ వచ్చి ఆగంతకుడి చెంపలు వాయించి బయటకు ఈడ్చివేసారు. సుబ్బారావు గారు మహోగ్రంగా విస్తరి ముందు నుంచి లేచి వచ్చి సుబ్బమ్మ గారిని కొప్పు పట్టి లేవతీసి లోపలకు లాగుకునిపోయారు. సుబ్బారావుగారి మేనత్త రావమ్మ గారు వచ్చి సుబ్బమ్మ తల్లీ 8వ ఏట పెళ్ళి అయి ఈ గడపలో కాలు పెట్టావు. ఆ తాష్ట్రుడు ఏదో పేలితే నీకేం అపకీర్తి రాదు. నువ్వెంత మానవతివో మా అందరికీ తెలుసు. ఈ సూరిగాడు ఆస్తంతా తగలేసుకొని గంజాయి, భంగు తాగుతూ బైరాగుల వెంట తిరుగుతున్నాడు. సాటి బ్రాహ్మణ్యమంతా వాడిని వెలివేసారు. వీడు ఇక్కడికి ఎలా వచ్చాడో తెలియకుండా వుంది. అని సుబ్బమ్మ గారిని ఓదార్చింది. ఏమయినా ఈ సంఘటనతో ఆడపెళ్ళి వారి దృష్టిలో మగ పెళ్ళి వారు కొంత లోకువయ్యారు. మగపెళ్ళి వారిలోనూ  ఉత్సాహం సగం చచ్చింది. తన తప్పేమి లేకపోయినా మగవాడి దౌష్ట్యానికి ఆడది బలికావడం అనాదిగా వస్తున్నదే కదా. ఆ ఆడది అందగత్తె, ఉత్సాహవంతురాలూ అయితే ఈ అవమానాలు ఇంకా ఎక్కువ అవుతాయేమో.

                        మనుగుడుపుల్లో రత్నానికి రంగనాయకికీ బాగా జత కుదిరింది. క్రొత్త పెండ్లి కూతురు గది వదిలి బయటకు రాకూడదు. రత్నం ముఖం కడుగుకోనే నీరు దగ్గర నుంచి స్నానానికి వేడి నీరు వరకూ అన్ని అమర్చేది. వదిన గారి చీర ఉతకడానికి తీసుకొని వెడుతుంటే అప్పమ్మ గారు చూచి అయ్యో! అది విడిచిన బట్టను ఆడపడుచువు నువ్వు ముట్టుకొంటావేమిటీ? దాని వెనుక నలుగురు వచ్చారుగా వాళ్లు ఉతుకుతారు. లేకపోతే మూట కట్టుకొని పట్టుకుపోతారు అంది. మనుగుడుపుల పెళ్ళివారు ఏదో జవాబు చెప్పబోయి మళ్ళీ ఆగిపోయారు. 

(ఇంకా వుంది)

–  కాశీచయనుల వెంకటమహాలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
118
UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో