మృగాడి దహనం

మొన్న నిర్భయ , ఇప్పుడు అభయ … రేపు?

అభయని మాదాపూర్ లో కిడ్నాప్ చేసి మెదక్ జిల్లా కొల్లూరు తీసుకెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డారు . ఆరు గంటల పాటు ఆమెను చిత్ర హింసలు పెట్టి తిరిగి ఆమెను హాస్టల్ దగ్గర పడేసి పోయారు .
సి.సి.కెమెరాల సహాయం తో వారిని వెంటనే పట్టుకోగలిగినా … విచారణ పేరుతో మరో ఏడాది గడిచిపోతుంది.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అంతే వేగంగా ఈ తరహా నేరాలను జరగకుండా అడ్డు కట్ట వేయగలుగుతుందా ?

2012 డిసెంబరులో నిర్భయ అత్యాచారానికి గురై చనిపోతే 2013 సెప్టెంబరుకి కానీ నిందితులకి శిక్షలు ఖరారు కాలేదు. ఆ తర్వాత ఏమయ్యింది? స్త్రీలపై నేరాలు … ఆగడాలు ఆగనూ లేదు. నిందితులకి పడాల్సిన శిక్ష అలా పడిగాపులు పడుతూనే వుంది.
నిర్భయ మరణంతో చట్టాలకి మార్పు చేసి మరింత పకడ్బందీగా స్త్రీలకి రక్షణ కల్పించింది మన ప్రభుత్వం.

అసలు నిర్భయచట్టంలో ఏం వుంది?

దాని వల్ల స్త్రీలపై ఎందుకు దాడులు ఆగటం లేదు?

ఎందుకంటే దోషులకు విధించబడిన శిక్షలు వెంటనే అమలు చేయక పోవటం. ఈ లోపు నిందితులు తప్పించుకునే మార్గాలను

వెతుక్కోవటం ….. వీలయితే జీవిత ఖైదుతో బయట పడొచ్చనే భరోసాని కల్గిస్తున్నాయని … అందుకే నేరం చేయటానికి వ్యక్తులు

భయపడటం లేదని సాధారణ పౌరులు సైతం అభిప్రాయపడుతున్నారు.

నిర్భయ చట్టాన్ని చూస్తే – అందులోని శిక్షలన్నీ అమలైతే స్త్రీకి ఎంత భద్రత వుందో అనిపిస్తుంది.

మీరూ ఒక సారి చూడండి.:

* ఉద్దేశ్యపూర్వకంగా యాసిడ్ దాడి చేసి గాయపరచడం నేరం . IPC సెక్షన్ 326A ప్రకారం పది సంవత్సరాలు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు మరియు జరిమానా .
* ఉద్దేశ్యపూర్వకంగా యాసిడ్ విసిరినా , విసిరే ప్రయత్నం చేసిన నేరం . IPC సెక్షన్ 326 B ప్రకారం అయిదు సంవత్సరాలు నుంచి ఏడు సంవత్సరాలు వరకు జైలు శిక్ష మరియు జరిమానా .
* స్త్రీ తత్వానికి భంగం కలిగించేలా , అవమానించేలా దౌర్జన్యం , బాల ప్రయోగం చేయడం నేరం . IPC సెక్షన్ 354 ప్రకారం ఒక సంవత్సరం నుంచి అయిదు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరి యు జరిమానా .
*లైంగిక వేధింపులు , అశ్లీల చిత్రాలు చూపించడం నేరం . IPC సెక్షన్ 354 A ప్రకారం మూడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా .
*దౌర్జన్యం లేదా బలప్రయోగం చేయడం లేదా ప్రోత్సహించడం ద్వారా వివస్త్రను చేయడం నేరం . IPC సెక్షన్ 354 (B) ప్రకారంమూడు సంవత్సరాలు నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా .
*స్త్రీల శృంగార భాగాలను రహస్యంగా చూడటం , ఫోటోలు తీయడం నేరం . IPC సెక్షన్ 354 (C) ప్రకారం ఒక సంవత్సరం నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష .
*దురుద్దేశ్యంతో స్త్రీని భౌతికంగా కాని లేదా ఎలాక్ట్రానిక్ సాధనాల ద్వారా కాని పదేపదే వెంబడించడం నేరం . IPC సెక్షన్ 354(D) ప్రకారం అయిదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా .
*అక్రమ రవాణా ద్వారా వ్యభిచారం నేరం . IPC సెక్షన్ 370 ప్రకారం ఏడు సంవత్సరాలు జైలు మరియు జరిమానా .
*ఒకరి కంటే ఎక్కువ మందిని అక్రమ రవాణా ద్వారా వ్యభిచారం నేరం . IPC సెక్షన్ 37 0 ప్రకారం పది సంవత్సరాలు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు మరియు జరిమానా .
*మైనరుని అక్రమ రవాణా చేయడం నేరం . IPC సెక్షన్ 370 ప్రకారం జీవిత ఖైదు మరియు జరిమానా .
*ఒకరి కంటే ఎక్కువ మంది మైనరులను అక్రమ రవాణా చేయడం నేరం . IPC సెక్షన్ 370 ప్రకారం 14 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు మరియు జరిమానా .
*ప్రభుత్వ ఉద్యోగి , పోలీసు ఆఫీసర్ అక్రమ రవాణాకు పాల్పడడం నేరం . IPC సెక్షన్ 370 ప్రకారం మరణించే వరకు జీవిత ఖైదు మరియు జరిమానా .
*అక్రమ రవాణా కాబడిన మైనర్ బాలికలను , మహిళలను వ్యభిచారంలోకి దించడం నేరం . IPC సెక్షన్ 370 (A) ప్రకారం అయిదు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శ్కిష మరియు జరిమానా .
*అత్యాచారం నేరం . IPC సెక్షన్ 376 ప్రకారం ఏడు సంవత్సరాలు తగ్గకుండా కఠిన శిక్ష లేదా చనిపోయే వరకు జీవిత ఖైదు మరియు జరిమానా .
*అత్యాచారం వలన చనిపోయిన లేదా గాయపరిచిన వలన చనిపోతే నేరం . IPC సెక్షన్ 376(A ) ప్రకారం 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష లేదా మరణించే వరకు జీవిత ఖైదు .
*న్యాయబద్దంగా విడిపోయి వేరుగా జీవిస్తున్న భార్యను బలత్కరించడం నేరం . IPC సెక్షన్ 376(B ) ప్రకారం రెండు సంవత్సరాలు నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా .
*అధికారాన్ని ఉపయోగించి స్త్రీని లొంగదీసుకొనుట నేరం . IPC సెక్షన్ 376(C) ప్రకారం అయిదు సంవత్సరాలు నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా .
*స్త్రీని ఒకరు కంటే ఎక్కువ మంది బలాత్కరించుట (గ్యాంగ్ రేప్ ) నేరం . IPC సెక్షన్ 376(D) ప్రకారం 20 సంవత్సరాలు కఠిన శిక్ష లేదా చనిపోయే వరకు జీవిత ఖైదు .
*స్త్రీ ని ఒకటి కంటే ఎక్కువ సార్లు బలాత్కరించడం నేరం . IPC సెక్షన్ 376(E) ప్రకారం మరణించే వరకు జీవిత ఖైదు .
*స్త్రీలను అల్లరి పెట్టి అవమానించడం నేరం . IPC సెక్షన్ 509 ప్రకారం మూడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా .

***                                         ***                                           ***                                              ***

మహిళల పట్ల జరిగిన నేరాల్లో మన రాష్ట్రమే మొదటి స్థానం లో వుంది.
రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 24.64 శాతం పెరిగింది. గత సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 12,731 కేసులు నమోదు అయితే ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆ సంఖ్య 15 వేలకి పైగా పెరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,285 కేసులు మొదటి ఆరు నెలల్లోనే నమోదయినట్టు ఒక సర్వే నివేదిక.

మరి ఈ నేరాలకు అడ్డు కట్ట ఎప్పుడు?

ప్రతి ఏడాదీ నరకాసుర వధ జరుపుకుంటున్నట్టు ఈ ఏడాది టీవీ 10 వారు లైవ్ లో మహిళల పట్ల జరిగే దాడులపై చర్చ ,

‘ మృగాడి ‘ దహనాన్ని నిర్వహించబోవటం , మహిళలకి ఒక కొత్త సందేశాన్ని అందిస్తున్నట్టుగా వుంది . *

(రాజమండ్రిలో నవంబరు 2 వ తేదీ సాయంత్రం 5 గంటలకి మహిళల పట్ల జరిగే దాడులపై చర్చ , ‘ మృగాడి ‘ దహనాన్ని టీవీ

                     10 వార్తా ఛానల్ నిర్వహిస్తోంది.)

– పుట్ల హేమలత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

2 Responses to మృగాడి దహనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో