‘‘ఫ్రిజిడ్‌’’

                  
Dr.githaanjali

Dr.githaanjal

నా చేతులు కట్టెల్లా బిగుసుకుపోయి మంచాన్నీ, దుప్పటినీ గట్టిగా పట్టుకున్నాయి. పాదాలు బిర్రబిగిసి పరుపులోకి కూరుకుపోయాయి. నా నుదిటి మీది చర్మం నిగ్గదీస్కుని, నొప్పి. తల అటు ఇటూ తిప్పుతూ ఒక తిరస్కార ఆయుధంలా ఉంది నా శరీరమంతా. ఆకలాకలిగా నా మీదకు ఒంగి, తల బలవంతంగా పట్టుకొని పెదాల్ని కొరుకుతూ అతని నోటి ఎంగిలి నా పెదాలమీద…. వెధవ పళ్ళు సరిగ్గా తోమడు నా ప్రాణానికి. దరిద్రుడు పళ్ళు సరిగ్గా తోముకోమని చెబితే నా చెంపలెన్ని సార్లు పేలాయో. వాడి నోట్లోంచి వచ్చే దుర్వాసనకి కడుపులో తిప్పుతోంది. ఐదు నిమిషాలు నా పెదాల దగ్గర దుర్వాసనా భూయిష్టమైన అత్యాచారం చేసేసి నా ప్రతిఘటనలో ‘‘ఛత్‌… నీ …’’ అనుకుంటూ, ఇది శృంగారమా? చపాతీ పిండి పిండినట్లే, అర చేతులతో బలమంతా ప్రయోగించి పిచ్చెత్తినట్లే నా గుండెల్ని పిండుతున్నాడు వాడు. నొప్పితో ఊపిరాడక గిజగిజలాడుతున్న నన్ను పట్టించుకోకుండా మధ్యమధ్యలో పండ్లతో గాట్లు అమ్మా ! అన్న నా మూల్గుల్ని తన హూంకారాలలో ఆపేస్తూ.. ఈ హింసనెలా భరించను? నేను బిగుసుకుపోయే కొద్దీ ‘‘నీ …ఎలుగుబంటిలా మూల్గుతూ నన్ను కుమ్మేసి, ఒక్క నిమిషంలో చల్లారి, సగం తృప్తి నిండిన చూపులతో నా మోకాళ్ళను పక్కకు తోస్తూ…
‘‘యూ.. ఫ్రిజిడ్‌ మీ అమ్మ నీకు మొగుణ్ణి ఎట్టా సుఖపెట్టాలో నేర్పించలేదా కట్టెలా బిగుసుకుపోతావ్‌’’? వికారమైన మాటలు ఆ నోటినించి!
మరు నిమిషంలో గుర్రు గుర్రుమనే స్వీయ సంగీతంలో నిద్రాభోగం అనుభవిస్తూ… ఏమీ చేయినట్లే వాడు.. ఆ నిద్ర, అంత ప్రశాంతంగా ఎట్లా పడుతుందీ? పచ్చని పంట పైరుని దున్న పొతుల మంద వచ్చి ఎక్కితొక్కి విధ్వంసం చేసి వెళ్ళిపోయిన తర్వాత నిర్ధాంతపోయి, మిగిలి పోయిన పైరులా నేను! కాళ్ళ మధ్య వాడి కామపు విసర్జన జిగట జిగటగా, నోట్టి చుట్టూ వాడు కార్చిన చొంగ ఎండిపోయి, నా శరీరం నించి నాకే భరించ లేనంత వాసన. తట్టుకోలేక బాత్‌రూంకి పరిగెట్టి ఒంటి మీద నీళ్ళు కుమ్మరించుకున్నాను. శరీరం శుభ్రమైనట్లే అన్పించట్లేదు.కన్నీళ్ళు ఆగడం లేదు. శృంగారం అంటే ఇదా? నాకు హింస ,వాడికి సుఖమా? ఆడదాని శరీరాన్ని కుమ్ముతూ, గిల్లుతూ, కొరుకుతూ, రక్కుతూ ఆఖరికి వుమ్మునో, వీర్యాన్నో ఆడదాని శరీరంపై విసర్జించడమే శృంగారమా? దీంట్లో స్త్రీ అనుభూతులతో, స్పందనలతో బాధతో, నొప్పులతో, ఇష్టాయిష్టాలతో సంబంధమే లేదా? ఎక్కడో చదివాను.
‘‘శృంగారమంటే రెండు స్త్రీ పురుషుల జననాంగాల మధ్య జరిగే రాపిడి మాత్రమే కాదు. దంపతులు ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమను స్పర్శ ద్వారా వ్యక్త పరచుకునే అందమైన దేహభాష’’ అనీ. దానిక్కావల్సింది ప్రేమ, ఆప్యాయత, , బాధ్యత, గౌరవం, నిజాయితీ బ్యాధత అని! కానీ ఇదేంటి? గత రెండున్నర సంవత్సరాలుగా మా ఇంట్లోని ఈ పడకగదిలో జరిగే అత్యాచారాల పర్వం అనేక తిరస్కారాలు, అనేకానేక నిస్సహాయ కన్నీళ్ళు, పెనుగులాటల మధ్య నిత్యం జరిగే దేహ యుద్ధాల మధ్య గెలిచేదీ వాడే, ఓడేదీ వాడే! ఏదీ పట్టించుకోడు కదా. ఇష్టమా, అయిష్టమా ఒప్పా, నొప్పా అసహ్యమా మోహమా..? వీడి మొఖానికి నేను వీడిపై మోహంలో రగిలిపోవడం కూడానా? వీడ్ని చూస్తేనే చిత్తకార్తె కుక్క గుర్తుకొస్తుంది. ఒక సున్నితమైన భావం లేదు. ప్రేమ లేదు. సహ అనుభూతి అంతకన్నా లేదు. ఓ సాయంకాలం పూటో, ఓ చల్లని వెన్నెల రాత్రో, పూల పరిమళాల మధ్యోలేక ప్రేమ పరవశాల మధ్యో, ఓ మల్లె మాలతో పాటు తనదైన దరహాసమాల? మెడ ఒంపులో పెదాలతో ఓ చక్కని ముద్ర, రెండు అర చేతుల మధ్య నా ముఖం. పెదాలపై పరిమళాల ఓ వెచ్చని సంతకం! చెవి పక్కని సన్నని గుసగుసల్లో కస్తూరీ, అని నా పేరు సన్నగా మొదలై వరదలై పోటెత్తే ఓ మోహ పరవశం. సున్నితమైన దేహ భాషలతో వ్యక్తమయ్యే ప్రేమావేశం.. ఒక అద్భుతమైన దేహ ప్రయాణం! ఒకరి శరీరాల్లోంచి ఇంకొకరి శరీరాల్లోకి ఇంకేవి రక్తాల్లో ప్రేమే తప్పితే ఇంకేమీ కాని తనం… రెండు మనసులు ఏకమైతేనే కానీ ప్రకటితం కాలేని ఒక సమాగమ సంరంభం!ఛ !! అంతా కేవలం ఒక రొమాంటిసిసమ్‌! అతనిలో శృంగార పరిమళాలంటే తన నోటి దుర్గందమే లేదా విస్కీ సిగరేట్‌ వాసనల సమ్మళితం . చెవి పక్కని గుసగుసల్లో లం…లు`ముండలు. దేహభాష అంటే వీడు నా కీళ్ళు విరగ్గొట్టడాలు అంతే… రొమాంటిసమ్‌ ఎక్కడ? అంతా కేవలం ఓ రోమాంఛితమ్‌!
పక్కనే గుర్రు పెడ్తూ వాడు! మృగవాంఛే తప్ప మృదుస్పర్సే తెలీని వాడు. వీడి పక్కనే నేను! ఎంత విచిత్రం? రోజూ నాపైన లైంగిక అత్యాచారం చేస్తే హింసించే మనిషి పక్కకే పడుకోవల్సిరావడం. ఇది? అవుమ మరి వాడు చేసేది పెళ్ళి పేరిట లైసెన్స్ద్ అత్యాచారమాయె! ఇంటి నాలుగ్గోడల మధ్య జరిగే మెరైటల్‌ రేప్ల కు కు సమాజామోదం ఎప్పుడూ ఉంది. అది మగవాడి హక్కు. ధూ! ఎవడు రాసిన సూత్రమిది? ఇంటికి పారిపోదామంటే నిస్సహాయంగా కన్నీళ్ళతో అమ్మ… హు ఎక్కడికీ వెళ్ళలేను బందీని…

ట్రింగ్‌… ట్రింగ్‌ అమ్మో తెల్లారినట్లుంది. పాలబ్బాయి కాలింగ్‌ బెల్‌ తెగమోగిస్తున్నాడు. లేవాలి. పగలంతా ఇంటిపని, ఆఫీస్ పని, సాయంత్రం మళ్ళీ ఇంటిపని. రాత్రి ఓపికా. ఇష్టం లేకపోయినా కానీ వాడు కానిచ్చుకునే ఒంటిపని! వాడు నా దేహంతో చేస్కునే ప్రయోగాలకి నొప్పులతో, బాధ, అవమానంతో రాత్రంతా జాగారం. నిద్రలేని రాత్రిళ్ళు! అయినా లేవాలి తప్పదు. పొద్దున్నే లేవాలి. మంజీరా నీళ్ళు పట్టాలి. పాలు కాచి టీ చేసి ఈయనగారి పాచి నోటికి అందించాలి. నోట్లోకి బ్రష్‌ దగ్గర్నించీ, కాల్లోకి షూస్‌ వరకూ అన్నీ అందించాలి. దొడ్డికిపోతే అదొక్కటి స్వంతంగా కడుక్కుంటాడీ వెధవ! ఆదరా బాదరాగా వంట ముగించి లంచ్‌ బాక్స్‌లు, కూల్‌ కెగ్గులు ఇచ్చి, ఓపిగ్గా ఆయన గారికి వడ్డించి, హడావుడిగా ఇంత నోట్లో కుక్కుకుని, సిటీ బస్సుల్లో ప్రయాణ ప్రహసనం మొదలుపెట్టాలి.

‘అరవై ఏళ్ళ ముసలావిడ పైన అత్యాచారమట ఏంటో’’ పేపరు పైకే చదువుతూ ఈయనగారి కామెంట్‌! చేస్తే పడుచుదాన్ని చెయ్యాలని కాబోలు ఈయనగారి అర్థం. రోజూ రాత్రి నువ్వు నా మీద చేసేది లైంగిక అత్యాచారమే కదరా, కాకపోతే దానికి దాంపత్యమనే వెధవ లేబుల్‌ ఒకటి. మనసులో కచ్చగా అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళా.
ఇంతలో ఎవరో పాత ఫ్రెండు వచ్చినట్లున్నాడు. కుశల ప్రశ్నలు, హాశ్చర్యపోవడాలూ, హౌవ్‌ డూ యూ డూలూ అతనెవరో అంటున్నాడు’’ మేరేజీకి రాలేకపోయానోయ్‌ కామేశ్వర్రావ్‌. హౌ ఈస్‌ యువర్‌ మ్యారీడ్‌ లైఫు” అనీ, కామేశ్వర్రావు. నా మొగుడు, కామేశ్వరరావు వీడికి ఒళ్ళంతా కామమే! ‘బాగుందోయ్‌’ అని ఇకిలిస్తున్నాదు. ‘కస్తూరీ కాఫీ పట్రా’’ అంటూ అరిచాడు. హాపీ మారీడు లైఫా పాడా? వెరీ బ్యాడ్‌ మారీడు లైఫ్‌. హ్యాపీట, బాగుందిట ఎవరికి? మ్యారేజీ కాదురా డామేజీ అయ్యింది. అంతా. నా మనసూ, జీవితం, నా ఒళ్ళూ అన్నీ!

ఆ ఫ్రెండు వెళ్ళిపోయాడు. ఈ కామేశ్వర్రావుకి ఆకలేసి అరిచాడు. కొట్టంలో గొడ్డు ఆకలేసి అరిచినట్టు.
ఎంతాశ్చర్యమో…? రాత్రి అంత బలవంతంగా , రాక్షసంగా నా శరీరాన్ని లొంగ దీస్కున్నా, నా మనోదేహాల్ని తూట్లుపొడిచినా, పగలు రవ్వంత పశ్చాత్తాపం కూడా కనిపించనే కనిపించదు కదా ఈ పశువు ముఖంలో ? జరిగిందంతా చాలా సహజమైన విషయంలా ఒక బానిసతో చేయించుకున్నట్లుగా ఇంటి పన్లు చేయించుకుంటాడు. సుఘ్టగా భోంచేస్తాడు.
ఒక రోజు రాత్రి అతను బుగ్గ మీద కొరికినందుకు బుగ్గమీద గాటు కమిలినట్లుగా…, ఆఫీసుకెలా వెళ్ళటం అని తను బెంగపడుతుంటే, ‘‘మందు రాస్కొని తొరగా తగ్గించుకొని ఏడు’’ అంటాడు చిరాగ్గా. దానికితోడు పక్కింటి పిన్నిగారు ‘అబ్బో నీ మొగడు మహా రసికుడే కస్తూరీ’’ అంటోంది. చెత్త తెలుగు సినిమాలో రమా ప్రభ చీపు జోకులా ఈనకి వినిపించేట్లు. గొప్ప సరసమాడాననుకొంటోందీ పిన్నిది. ఈనగారి మొఖంలో ఒక వెలుగు.. తృప్తి…. ఛ చీదరగా. వాడు కొరికినప్పుడు ప్రాణం పోయిందే పిచ్చి దానా.. నీకు ఆ క్షణాలు మా మధ్య జరిగిన రేప్‌ సీనరీ అంతా వీడియో తీసి చూపించాల్సింది. ‘‘అయ్యో`తల్లీ ఎంతగా కమిలిందీ నొప్పిగా ఉందా? అలా ఎలా చేస్తాడమ్మా నీ మొగుడు మరీ పశువులా?’’ అన వచ్చుగా `
వీడిలో హింసోన్మాదం మరింత పెరగడానికి కాకపోతే . రాత్రి ఇంకింత రెచ్చిపోతాడు కాబోలు ` తనూ అలా కొరికితే వాణ్ణి సరసంగానే.. కసుక్కున, నొప్పితో తనలాగే అరవడూ? తనప్పుడు వాడు తన నోరు మూసేసినట్లుగా భయపెడుతే , ` మహా అయితే వాడిలానే అరవకుండా తొడమీద గిచ్చెయ్యదూ? తెల్లారి ఆఫీసుకు ఎట్టా వెడతాడు కమిలిన మచ్చల మొఖంలో.. హబ్బా తనకంత సీనా? తనా పని చేసేలోగా తను, గదిలో ఓ మూల వాడుకొట్టే దెబ్బలకు చచ్చిన పీనుగై పడి ఉండటం . కల్ల.

` అదేదో దేశంలో భార్యను తెల్లారు ఝామున తమ దేహాల మీద రక్తాలుకారే గాయాల్ని, గాట్లనీ తమ భర్తల రసికత్వానికి గుర్తులుగా ఒకరికొకరు ప్రదర్శించుకోవాలట… ఒక రోజు తనకు చూపిస్తున్నాడు గొప్పగా. ఒక శృంగారపు పేజీలొ తను వాళ్ళ మొఖాల్లో ఆ గాయాల నీలి ,నీడల్ని,కన్నీళ్ళ నీ చూసింది. వాడెవడో మగ సెక్సాలజిస్టు అలా కాకపోతే ఇంకెలా రాస్తాడు. ఎంత బలమైన గాయం చేస్తే అంత రసికుడట. ఆ హింసలో చచ్చినా ఫర్వాలేదన్నట్లుగా, అదొక హింసాత్మక శాడిసమ్‌గా, మరో లైంగిక సమస్యగా, చికిత్స తీస్కోవాల్సిన మానసిక రుగ్మతగా చూపడు… ఛ..!

అమ్మకి ఎన్నిసార్లు చెప్పిందనీ.. ఇక ఈ హింస తన వల్ల కాదనీ ` అమ్మ దగ్గరకొచ్చేస్తాననీ. ఉద్యోగముండగా తనకేం తక్కువనీ… ఊహు… వింటేనా? ‘సర్దుకో అమ్ముడూ’ అంటుంది. తనూ నాన్నతో సర్దుకు పోయిందట. నాన్న..! తన ప్రియమైన అమ్మతో ఈ కామేశ్వర్రావులాగేనా… తనను అత్తారింటికి సాగనంపుతూ కన్నీళ్ళు కార్చిన నాన్న, స్కూల్లో మేష్టారు కొట్టారంటే బడికొచ్చి మేష్టార్ని తిట్టిన నాన్న. అమ్మతో కామేశ్వర్రావులాగేనా? లాగేనా ఏంటి ? అంతే కదూ?
మరి అన్నయ్యో.. తనతో రాఖీ కట్టించుకుని మురిసిపోయే అన్నయ్యో? ఒక్కోసారి ఒదినెందుకో దిగులు, దిగులుగా కన్పించేది. ఓసారి, ఆదాటున గదిలోకి వచ్చిన తన్ను చూసి, ఒదిన జాకెట్టు గుండీలు ఖంగారు, ఖంగారుగా పెట్టుకుంటుంటే, బర్నాల్‌ రాసిన మచ్చలు సున్నితమైన ఒదిన వక్షభాగంలో… బర్నాలు గొట్టం నా కాళ్ళకింద పడి మందంతా వెళ్ళుకుని వచ్చేసింది .
నాన్నా… అన్నయ్య మీరే మీరేనా.. ఇది నిజమే నిజమేనా, ఒద్దు ఒద్దు ముసుగులు ముసుగులు తొలగించిన రాక్షసుల్ , రాక్షసుల్ కనపడెదరు, కనపడెదరు.కామేశ్వర్రావూ తన చెల్లెలికి మంచి బంగారు అన్నయ్యే మరి.

గుంపులు గుంపులుగా ఆడవాళ్ళు పర్సులు ,` వాటర్‌ బాటిల్‌, భుజాల మీద వేలాడుతూ, ఎండల్లో చమటల్లో నిలబడి బస్‌ కోసం ఎదురుచూపులు… వడి వడిగా ` ఎగబోస్తూ బస్సువెళ్ళిపోతుందేమో., అందదేమో అన్న బెంగ, ఆందోళన నిండిన మొఖాలతో ఆడవాళ్ళు.
తను వచ్చినా బస్సాపని డ్రైవరుని ‘‘ఓరేయ్‌ దొంగ సచ్చినోడా ఆపాపొర్రెయ్‌.. నీ సోమ్మేం పోనాదిరో’’ అని నిర్భయంగా గస పోస్కోంటూ మెటికలిరుస్తూ అరుస్తోంది టిఫిని కారియర్లు రోజూ మోస్కోచ్చే వెంకటలక్శి. బస్టాండ్‌ నిండా ఉద్యోగాలు చేసే ఆడాళ్ళే. బస్‌కోసం ఎదురు చూపులు, రాని బస్‌ కోసం ఆందోళన, చిరాకు! వీళ్ళంతా ఇళ్ళల్లో రాత్రి పగలు ఎంత వేదనలు పడ్డారో? అత్తల ఆడబిడ్డల వేధింపుల్లో మనసులు నలిగి పోయింటాయ్‌. భర్తల రాక్షస రతిలో, కమిలిన శరీరాన్ని తెల్లారి చన్నీళ్ళతో చల్లబర్చుకుని, తనలాగే పొరలు పొరల గరుకు కాటన్‌ చీరల్లో దాచుకుని, దిగులుతో, ముడుచుకు పోయి మబ్బుకమ్మిన ముఖాల్ని ఇంత పవుడరో పసుపో రాసుకుని ,ఒకింత కళ తెచ్చేస్కుని మరుసటి దినపు శుభారంభపుచిరునవ్వుల్ని పులిమేస్కుంటూ ` గబగబా ఆ రోజుకి నటించేద్దామనో ,పోనీ ,వృత్తిలో జీవిద్దామనో, బాధల్ని మరుద్ధామనో ఒచ్చి నిలబడితే వేళకు రాని బస్సు విసుగెక్కువ చేస్తోంది. అంతేనా ` అంతేనా..

అయినా తనకు లాగా, అందర్కీ కామేశ్వర్రావు లాంటి భర్తే ఉంటాడా ఏమిటీ? తన చిన్న నాటి స్నేహితురాలు సృజన భర్త మధుసూధన్‌ చాలా మంచోట్ట. ఇంటి పనులలో ఎంతో సాయం చేస్తాట్ట. ముద్దు ముద్దుగా సృజీ అని పిల్సుకుంటాట్ట. కామేశ్వర్రావులాఏమే, ఒసె, ఉష్షు అని పిలవట్ట.
ఎప్పుడైనా ‘‘ఒద్దండీ ఈ రోజు మూడ్‌ లేదన్నా ` నొప్పులన్నా దీని ఒంటిపై చేయి కూడా వెయ్యట్ట. పోనీలే అని దగ్గర్కి తీస్కుని తన హృదయంపై దాని తలను అదుముకుని, గాడంగా హత్తుకుని పడుకుంటాట్ట. అబ్బ తన మొగుడూ అలా ఉంటే? పగలంతా హుంకరిస్తూ పనులు చేయించుకుంటాడు. అతను తన యాజమాని అయినట్లు. రాత్రైందా సెక్స్‌ కోసం వేధిస్తాడు ఛీ!

ఎంతకీ రాదేం వెధవ బస్‌…
—              —–                  ——-               ——-          —-
‘‘లేటుగా వచ్చావేం ఈ రోజు కూడా బస్సు దొరకలేదూ?.. లోన్‌ ఇప్పిస్తా స్కూటర్‌ కొన్కుక్కోరాదా? అయినా ఇళ్ళ దగ్గర కమ్మగా బాగా వంట చేస్కుని, హాయిగా తిని, సుఖంగా తొంగుని, నున్నగా ఒళ్ళు పెంచుకుని, మొగుళ్ళను సుఖపెట్టక ఈ ఆదరా బాదరా రన్నింగ్‌ రేసులు దేనికీ. ఆరోగ్యాలు పాడుచేస్కోటం దేనికీ? వెకిలి వెకిలిగా ,మకిలి చూపులతో రోజూ చంపేసే బాస్‌ గాడి సొల్లు వర్షం. హమ్మయ్య ఒచ్చేసిందీ గాడీ ,తోస్కుంటూ తోసివేయబడ్తూ ఎలాగోలాగ అందరితో నేనూ నెట్టి వేయబడ్డాను బస్‌లోకి .కాలు తీసి కాలు వేయలేనంత రష్‌ బస్‌లో. దీనికి తోడు సందట్లో పడేమియాల్లాగా ఆడవాళ్ళను నొక్కేస్తూ ఆబ ఆబ చూపులతో ఒళ్ళంతా తడిమేస్తూ, మగవాళ్ళు తమ దొంగ పనులు కానిచ్చేస్తున్నారు ఆడవాళ్ళ అసహనాన్ని పట్టించుకోకుండా. .తమ పెళ్ళాలు, కూతుళ్ళూ, అమ్మలూ ఇలానే, అచ్చం ఇలానే ఇతర మొగాళ్ళతో బస్సుల్లో నలిపివేయ బడతారనీ, తమలాంటి మగ పురుగులతో నిత్యం అవమానించబడతారనీ ఇంటికెళ్ళాక అమ్మ గుండెల్లోనో, కాకపోతే దిండు గలీబుల్లోనో ముఖం దాచుకుని వెక్కెక్కి దు:ఖ పడతారనీ ఈ బహు ముఖాలకు తెలీదా?

హమ్మయ్య స్టాప్‌ వచ్చేసింది. ఆఫీసులోకి అడుగుపెడుతుంటే.. ‘‘ఏం రమణీ బాస్‌ రూంలో చాలా సేపే ఉన్నావు ఏంటీ కథ?’’ కేషియర్‌ సుధీర్‌ సకిలిస్తూ అడుగుతుంటే రమణి ‘షటఫ్‌’ అంటోంది. దగ్గర్కెళ్ళి అడిగాను ‘ఏమైంది రమణీ’ అని. దాని కళ్ళ ఎర్రబడి., ఉన్నాయ్‌. ఫైల్‌తో పాటు రమణి చేతులు నొక్కేస్తూ.. ‘‘ఏం ఆలోచించావు రమణీ? చూడు నిన్ను చూస్తే జాలేస్తోంది. జీవితాంతం నిన్ను ఉంచుకుంటా, నీకో ఫ్లాట్‌ కొనిస్తా ఉంటావా చెప్పు’’ అంటూ చటాలున లేచి, రమణిని ఒళ్ళోకి లాక్కున్నాట్ట, బాస్‌ గాడు. రమణి ఉక్రోషంతో చెంప చెళ్ళుమన్పించి, బయటకు వచ్చేసింది. అగ్ని గోళం లాంటి హృదయంతో. బయట ఇంకో మృగం సురేష్‌గాడి సందేహాల సకిలింపు ఇంకా సలుపుతూ ఉంటే …. చెంపదెబ్బ తిన్న బాస్‌గాడు. ‘‘ముఫ్పైరెండేళ్ళు దాటావు. పెళ్ళి కావట్లేదు. ముదిరి ముక్కి పోతున్నావు నేనుంచుకుంటానంటే అంత పొగరా నన్నే కొడ్తావా’’. అరుస్తున్నాట రమణి కేబిన్‌ తలుపు తోసుకు వచ్చేలోపు.. నాకు హృదయం భగ్గుమంది. కొట్టింది మంచి గయ్యింది రమణిని తన కీప్‌గా ఉంచుకోవాలన్న వాంఛ ఎందుకో ఈ నీచుడికి? ఇంట్లో చక్కని భార్య, ఇంటరు చదివే పిల్లలు, స్వంత ఇల్లు, బ్యాంక్‌ బాలెన్స్‌, కారు. బధ్ర జీవనం గడుపుతున్న వీడికి సెకండ్‌ సెటప్‌ పెట్టుకొని తన స్టేటస్‌ పెంచుకోవాలన్న దరిద్రపు కోరికేమిటో? చంపుకుని తింటున్నాడు. పోయినేడాది పరిమళ అనే అమ్మాయిని ఇలానే వేధిస్తే ఆ అమ్మాయి జాబ్‌ రిసైన్‌ చేసి మరీ పారిపోయింది.

‘‘నా ఉద్యోగం పోతుం దేమో? పోనీ అయినా ఎలా హత్తుకున్నాడనుకున్నావు నన్ను తన ఒంటికి? ఆ ఒక్క క్షణంలో ఎన్నెన్ని చోట్ల తాకాడు ఆబగా ఛీ కుక్క ఇన్నాళ్ళకు మంచిపని చేసాను వెధవను’’ రమణి. ఆయాసపడ్తూ అంటోంది, ఎర్రబడ్డ మొహంతో ‘‘ఇంటికెళ్ళి స్నానం చేయాలి, ఛీ ఈ చేతులు కడుక్కొస్తానుండు’’ సింక్‌ దగ్గర్కి పరిగెత్తింది రమణి. బాస్‌ గాడి కామపు స్పర్శ తగిలిన చేతులను కడుక్కొవడానికి పోతుందా అది? ముఫ్పైరెండేళ్ళ రమణి పీజీ చేసింది. చూపులకు బాగానే ఉంటుంది. కానీ పెళ్ళి వాయిదా వేస్తుంది. ఇష్టం లేదంటుంది అంతే! కారణం ఇదీ అని చెప్పదు. అయినా నువ్వు చేస్కుని ఏం సుఖపడ్తున్నావు కస్తూరీ..? రోజూ చూట్టంలా? మా అక్క.. బంగారం లాంటి మా అక్కయ్య జీవితం నాశనం అయ్యింది పశువులాంటి మా బావను చేస్కుని. బావ తిరుగుబోతుతనం భరించలేక అక్క ఉరోస్కుంది. నిన్నూ అక్కను చూసాక నాకు ఈ మెరెజి సిస్టమ్‌ మీదే నమ్మకం పోయిందే నాకు పెళ్ళి మీద ఏ మాత్రమూ ఆశక్తి లేదు నేనిలా ఉంటానంతే.. రమణి తల్లి సిఫారసుతో పెళ్ళెప్పుడు చేస్కుంటావన్న నా ప్రశ్నకు సమాధానంగా రమణి పై మాటలు. ‘అయినా నా సంగతికేంలే ఈ బాస్‌ కుక్కల్లాంటి వాళ్ళపని నాకెంత సేపు చెప్పు? కాకపోతే బ్లాక్‌ మార్క్‌ వేస్తాడేమో. ఉద్యోగం పీకిస్తాడేమో పీకనీ అయినా వీడి మీద మా ఫ్రెండు ఒకామె మహిళాసంఘం నడుపుతుందిలే దాంట్లో కంప్లైంట్‌ ఇస్తా.ఆమె ఆఫీసుకి ఎంక్వైరీ కొచ్చినప్పుడు తెలుస్తుంది. వీడికి నేనేంటో,`ఆడదంటే ఏంటో? నువ్వు నీ పనిచూడు నీ బుగ్గ మీద ఆగాటెంటి?మల్లీ కొట్టాడా? నీ శాడిస్టుమొగుడితో ఎంతకాలం పడ్తావు చెప్పు? గృహ హింస కేసు పెట్టరాదు ఎలానూ కట్నం ,కారూ అంటూ వేధిస్తున్నాడుగా? రమణి రెట్టించి అడుగుతోంది.

సాయంత్రం బస్‌లో విపరితమైన రష్‌! నాకు రమణికి ముందు వరసలో సీటు దొర్కింది. ఆఫీసులు ఒదిలే సమయమేమో బస్‌లు నిండిపోతున్నాయి. పుట్‌ బోర్ట్‌ మీద కూడా కాలేజీ అమ్మాయిలు నిల్చుని వున్నారు ఏవో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అంతా గడబిడగా ఎవరూ ఎవర్నీ పట్టించుకోనంత రద్దీగా ఉంది బస్‌లో. ఆ ఇద్దరమ్మాయిల వెనకాల ఒకాయన ముఫ్పై అయిదు సం॥ల వయసుంటుంది తెల్లచొక్కా ప్యాంటు.. నిల్చున్నాడు. వాడు ఆ ఆడపిల్లల్లో ఒకమ్మాయి పైన కావాలని ఒరుగుతున్నాడు. ఆ అమ్మాయి ముందు ముందుకు వాలి పోతూ, వాడికి చెప్పలేక అవస్థ పడుతోంది. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి ధైర్యంగా వాణ్ణి ఈడ్చితంతే ఎంత బాగుండు? రమణి ఏదేదో మాట్లాడుతోంది .రమణివైపు తిరిగి ఆమె మాటలు వింటున్నా. మ ళ్ళీ దృష్టి ఆ అమ్మాయిపైన పడింది.నిర్ఘాంత పోయింది తను. తన దేహమంతా రోమాంఛితమై… గుండె జుగుప్సతో ముడుచుకు పోయి మరుక్షణం తీవ్రమై, కోపోద్రేకంతో.. శరీరం ఒణికింది ఆ నీచుడు చేస్తున్నపనికి. వాడు తన ప్యాంట్‌ జిప్‌ విప్పి, తన అంగాన్ని ఆ అమ్మాయి వెనక భాగానికి రాస్తున్నాడు.

నా సీటు సరిగ్గా వాడిపక్కనే ఉందేమో స్పష్టంగా కనిపిస్తోంది. వాడి మొఖమంతా ఎఱ్ఱగా కామంతో కందిపోయి, కళ్ళనిండా ఎర్ర జీరలు. నాకెం తోచలేదు ఆవేశంతో గొంతు పెగలటం లేదు. ఈ లోపల నా ఎదురుగ్గా కండక్టర్‌ కన్పించాడు. అరుస్తూ.., ఏం చెప్పానో ఆ వైపు వేలు చూపిస్తూ, అటు చూసిన కండక్టర్‌ ఆవాక్కై ఏం చెయ్యాలో తోచక చేష్టలు డిగి ‘‘హోల్డాన్‌`హోల్డాన్‌’’ అంటూ అరిచేస్తూ ‘‘యూ బాస్టర్డ్‌ కుక్కల కొడకా’’ అంటూ వాడి మీదపడి కాలర్‌ పట్టుకుని, ఇంకా పూర్తిగా ఆగని బస్సులోంచి వాణ్ణి కిందికి తోసేసాడు. వాడింకా జిప్‌ పూర్తిగా పెట్టుకొనే లేదు ` కుక్కలా రోడ్డు మీద పాక్కుంటూ ఎటో వెళ్ళిపోయాడు. కానీ ఇంతలోపలే వాడు చేయవల్సినదంతా చేసేసాడు. బ్రౌన్‌ కలర్‌ చుడీదార్‌ వేస్కున్న అమ్మాయి వెనక భాగం డ్రెస్‌ మీద వాడి కామ ప్రకోపం అంతా గంజిలా కిందికి జారిపోతూ,,, జరుగుతున్న గొడవకు వెనక్కి తిరిగి నిర్ఘాంతపోయి ఆవేశంతో, దు:ఖంతో, అవమానంతో ఆ అసహ్యాన్ని, అసహ్యంగా తన వెనక్కి కింది భాగానికి ఒంగి ఒంగి చూస్కుంటూ తుడుచుకోలేక, తన శరీరంపై మోయనూ లేక భోరుమని ఏడ్చేస్తూ పరిగెత్తికెళ్ళి బస్సు దిగిపోయి కన్పించిన ఆటోని ఆపాపు అని ఏడ్చుకుంటూనే అరుస్తూ ఆపి ఎక్కేసి మాయమైపోయిందా పదహారు కూడా నిండి ఉండని ఆ పసిపిల్ల. బస్సంతా శ్మశాన నిశ్శబ్దం ఆవహించింది. రమణి చేష్టలుడిగి పోయింది. బస్సులో చాలామంది అంతే! నాకు బాబాయి గుర్తొచ్చాడు, ట్యూషన్‌ తాత గుర్తొచ్చాడు. గుండె ఒణికింది.’’ ఎక్కడి కెల్లి వస్తరన్నా ఈ లండీకొడుకులు ర్రైట్‌.. ర్రైట్‌’’ కండక్టర్‌ అరుపుకీ ` విజిల్‌కీ బస్‌ ఉలిక్కి పడి ముందుకు దుంకింది. ఆ అమ్మాయి గాయం ఎప్పటికి ఆరేను?
—              —–                  ——-               ——-          —-
తలనొప్పితో నుదురు అదిరి పోతోంది . అసలెంత భయానకమైన గతం తనది? బాబాయి… తన జీవితంలో బాబాయి సృష్టించిన విధ్వంసాన్ని ఎలా మర్చిపోగలదు? ఆ గాయం ఇంకా పచ్చిపుండై సలుపుతోంది. ఈ రోజు బస్‌లో ఆ పదహారేళ్ళ పసిపిల్ల మొఖంలోని భయం అసహ్యం 18 సం॥ల క్రితం తను అనుభవించిందేగా వాడెంత అసహ్యంగా ఉన్నాడు ?అచ్చం బాబాయి లాగా స్వంత బాబాయి. నాన్న రక్తం పంచుకుపుట్టిన తమ్ముడు. తన జీవితం నాశనం చేసాడు. అమ్మా, నాన్నా, అన్నయ్య, తనూ, నలుగురమే! అమ్మ నాన్న ఎప్పుడూ బిసీగా ఉండేవారు. నాన్న బిసినెస్‌, అమ్మ సెంట్రల్‌ గవర్నమెంటు ఉద్యోగం. పొద్దున్నే ఇద్దరూ కల్సి వెళ్ళిపోయి సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో వచ్చే వాళ్ళు, నాన్న వెంటనే క్లబ్‌ కెళ్ళిపోతే, అమ్మ ఇంటి పనుల్లో మునిగిపోయేది.

తనకు సరిగ్గా పదమూడు సం॥ల వయస్సప్పుడు ,తను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ,ఊర్నించి . కంప్యూటర్‌ సైన్స్‌ చేద్దామని ఇంట్లో దిగాడు. అచ్చం నాన్న లాగే ఉండేవాడు. కానీ బాబాయి ప్రవర్తన విచిత్రంగా ఉండేది. తన చున్నీ లాగేవాడు. ఎదుగుతున్న తన ఛాతీవైపు , స్కర్ట్‌ కింది కాళ్ళవైపు వికారంగా చూపేవాడు. కన్ను గొట్టే వాడు, తండ్రి లాంటి బాబాయ్యేంటి ఇలా అని తను చాలా గాభలాపడి పోయేది. బాబాయికి విస్కీ, గుట్కాల్లాంటి అలవాట్లుండేవి. అమ్మకు చెప్తే” ఛ ఊరుకో ` నాన్నకు తెలిస్తే చంపేస్తాడు” అనేది. ఎవర్ని తననా? ఎందుకు? బాబాయ్‌ని చంపడా ? తననే చంపుతాడా?ఎందుకు? తనేం తప్పుచేసింది? బాబాయ్‌ కాదా తప్పు చేస్తోంది? అంతా అయోమయం.. ఎవరికి చెప్పుకోవాలి? ఇంట్లో ఇంటర్‌నెట్లో గలీజు బొమ్మలు గంటలు గంటలు చూపేవాడు.

అమ్మా నాన్న తిట్టినా విస్కీ గుట్కా మాన లేదు. అదే సంవత్సరం తను మెచ్యూర్‌ అయ్యింది. కాళ్ళ మధ్య వెచ్చగా కారిన రక్తం నాలో సృష్టించిన భయోత్పాతం తనకింకా గుర్తే. ‘‘ఎందుకమ్మా ` ఎక్కడ్నించి వస్తుందిలా రక్తం?’ అని అడిగిన తనను ఏదో పెద్ద తప్పుడు మాట అన్న దానిలా ‘‘ఛీ ! అదంతా ఎందుకు? ఇది మామూలే ఆడపిల్లలకు’’ అన్నది అమ్మ ఖంగారు ఖంగారుగా ఎవరైనా వింటున్నారేమోనని అటూ ఇటూ చూస్తూ. అమ్మా బాబాయికి ‘అదివ్వు’ ‘ఇదివ్వు’ ‘అన్నం వడ్డియ్యు’ అంటూ చెప్పినా తను చేసేది కాదు. ఎంతసేపూ తన ఒంటి నంటి పెట్టుకునే బాబాయి చూపులు తనను ఆయన దగ్గర్కి వెళ్ళనిచ్చేవి కావు ఇంట్లో వస్తూ ` పోతూ పొరపాటున తనను తగిలినట్లుగా మోచేత్తో నా గుండెలపై పొడిచి ‘ఓ సారీ’ అనడం, చేరవేసిన తలుపులను ధభాలున తోసి, బట్టలు మార్చుకునే తనను చూసి పొరపాట్న వచ్చినట్లు ‘సారీ’ అంటూ తన ఒంటిని కనిపించినంత మేరా ఆబగా చూడడం. నాన్న రక్తం పంచుకుపుట్టిన బాబాయి వికృత చేష్టలతో, రోజులు భయంగా గడిచేవి. అర్థ రాత్రిళ్ళు తన గది కిటికీని ఆనుకుని బాబాయి కళ్ళు తారట్లాడేవి. తమ భయంతో బిక్క సచ్చిపోయేది. తన గది అమ్మా వాళ్ళగది పక్క పక్కనే ఉండేవి.
వదలండి అల్సి పోయాను ప్లీస్‌ ` రేపు…సరెనా.. మెన్సస్‌ మూడో రోజండీ, కడుపునొప్పిగా ఉందండీ దండం పెడతాను పోయినసారి నొప్పి, బ్లీడింగ్‌ ఎక్కువయ్యాయండీ ఒదిలి పెట్టండీ “అమ్మ గొంతు నిస్సహాయంగా. ‘‘ష్‌! చాల్లే ఊర్కో. రోజూ ఏదో నస పెడతావు అన్నీ సాకులే. మెన్సస్‌ అప్పుడు కలవచ్చని., ఏమీ కాదనీ డా॥ భ్రమరంగారు చెప్పారుగా అన్నీసాకులు. ఏం నేనంటే మోజు పోయిందా ఆఫీసులో ఏ రంకు మొగుడు దొరికాడు? ఏం నేనూ పోనా ముండల దగ్గర్కి ` తిరుగిట్లా. తిరగవా?’’ అమ్మ వీపు మీద పిడిగుద్దులు గుద్దిన చప్పుడు. నోట్లో చీరకొంగు దోపుతూ అమ్మ నొక్కేసే దు:ఖధ్వనులు ముక్కలు ముక్కలుగా విరుగుతూ ఒద్దన్నా తన చెవిని పడేవి. తన కర్ఖం అయ్యీ కాక పోయేవి. నాన్న అమ్మను ఏదో చేస్తూ న్నాడని,, నాన్న ఒంటి మీద బట్టలేకుండా అమ్మ మీద పడిపోయి, అమ్మనేమో చేస్తూ… చూడలేక తన గదిలోకి భయంతో పరిగెత్తే ది. అమ్మ ఏడుపు వినపడక పోతే అలా వెళ్ళే ది కాదు. నాన్న ఎందుకిలా? నాకు అసహ్యం వేసేది. అమ్మని హింసించే నాన్నను ఎలా ప్రేమించేది?

ఎప్పుడైనా, గుమ్మంలో నిల్చుని ఎదురిళ్ళల్లోని అమ్మాయి, అబ్బాయిలతో మాట్లాడినా, నిల్చున్నా ‘‘ఏంటక్కడ ఫో లోపల్కి భోగం ముండ వేషాలూ నువ్వూ’’ అనేవాడు నాన్న. ఎలా అనగలిగే వాడు అలా? స్వంత కూతుర్ని పట్టుకొని భోగం ముండ అని? విలవిల్లాడి పోయేదాన్ని. ‘‘ఏంటి? ఏంటా జాకెట్టు టైట్గా ఒళ్ళంతా కన్పించేట్లు ఫో మార్చుకురా ముండా’’ అని అరిచేవాడు భయంతో లోపల్కి పరెగెత్తేది. ‘‘బట్టలు బాగా లేవురా కస్తూరీ కాస్త వదులుగా ఉండేవి వేస్కోమ్మా’’ అని మెల్లగా చెప్పచ్చు గా.. ప్రతీ వాక్యానికీ చివర ముండ చేర్చాలా? తన పేరు ముండనా.. కస్తూరా అని కుమిలి పోయేది.

పొద్దున్నే అమ్మ నాన్నతో మాట్లాడదేమో, కోపంగా అడుగు తుందేమో మరి రాత్రంతగా ఏడ్చిందిగా అనుకునేది. ఎందుకో ఆశపడేది, ‘రజనీ అదివ్వు ఇదివ్వు. ఓ కప్పుటీ ఇవ్వవోయ్‌ నీ చెత్తో,,,అవునూ కస్తూరి ఫీసు కట్టేస్తావా? ఒకసారిలా రావోయ్‌ రమ్మన్నానా’’ అంటూ నాన్న మాట్లాడుతుంటే ‘‘ఆ కట్టేసానండీ, అబ్బ వుందురూ, ఇదిగో టీ’’ అంటూ అమ్మ నవ్వుతూ ప్రసన్నంగా సమాధానం చెబుతుంటే నిర్ఘాంత పోయేది.. రాత్రి జరిగిందంతా చాలా సహజమైన విషయంలా, రాత్రికి మాత్రమే సంబంధించిన విషయంలా పగలు అసలేమీ రాత్రి జరిగిందాంట్లో సంబంధంలేని అంశంలా అసలెట్లా ఇది సంభవం?
నాన్న తన్ను భోగం ముండ అంటే వారం రోజులు మాట్లాడలేదు. తను అమ్మని నిలదీసింది కూతుర్ని ఇలా ఎలా అనగలిగాడు నువ్వడుగు నిలదీయి అని అడిగింది కూడా. అమ్మేమో అలా అంతా మర్చిపోయి. తిన్న తన్నులు కూడా….. వయసులొ, ఇంత పెద్దగయ్యీ నవ్వుతూ నాన్నతో మాట్లాడుతుంటే తనకు కోపం వచ్చేది.

కొన్నిసార్లు అమ్మ బుగ్గలపై పెదాలపై గాట్లుండేవి. అమ్మది తెల్లని దేహ చాయ. చీర కొంగు పంటికి బిగించి జాకెట్టు వేసుకునేది. అప్పుడు కన్పించేవి. అమ్మ తెల్లని అందమైన ఛాతీపైన ఎర్రగా కందిన మచ్చలేవో ‘‘ఏంటమ్మా. అవీ’’ అంటే ‘‘ఏం లేదురా చిక్కుడు తీగ గీకిందనో.. పోపు చుక్కలు తెల్లి మీద పడ్డాయనో చెప్పేది. ఒకింత గాభరాగా. అమ్మ కళ్ళల్లో తడివి ఎన్నోసార్లు చూసింది తను. నాన్నే ఏదో చేసాడని అర్థం చేస్కునేది తను. నాన్నేనా అందరు మొగాళ్ళు ఇంతేనా? పక్కింటి సుధాకర్‌ అంకుల్‌, ఎదురింట్ల వినయ్‌ అంకుల్‌ ` మామయ్యలు, తాతయ్యలు, సైన్సు సారు అంతా వాళ్ళ భార్యలతో ఇలానే ఉంటారా? అసలు మొగాళ్ళంతా ఇంతేనా? నాన్న మీద ఏదో విముఖత ఏర్పడి ఎక్కువవ సాగింది. రేపు పెద్దయ్యాక అన్నయ్యా ఇంతేనా?
ఇంకో పక్క బాబాయి వెకిలి చేష్టలు ఎక్కువవ సాగాయి. ఒక రోజు. అమ్మా, నాన్న సాయంత్రం పెళ్ళి కెళ్ళి రాత్రి పదికల్లా వస్తామన్నారు. తనకు జ్వరం వచ్చి పడుకుంది అమ్మ ఉంటానన్నా నాన్న ఉండనివ్వలే. నానమ్మ ఊర్కోదని. ఆ రోజు ఉదయం ఊరెళతానని వెళ్ళి పోయాడు బాబాయి. రాత్రి ఏడుగంటలకు ఉన్నట్లుండి ఊడి పడ్డాడు బాబాయి. ఇంట్లో మేకలా, గొర్రెలా ఉన్న తన మీద బాబాయి పడ్డాడు. టీవి సౌండ్‌ పెద్దగా పెట్టాడు.

“బాబాయి ఒదులు, ఏం చెయ్యకు బాబాయి. నీ కాళ్ళు పట్టుకుంటాను. దీనంగా, ఘోరంగా బేలగా ఏడుస్తూ. గదిలో ఎక్కడికి పారి పోవాలో తెలీక భయంతో మంచం కింద దూరిన తనని వెతుక్కుంటూ ఎలా వచ్చాడు వాడు? ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆ మృగం కళ్ళు ఎర్రబడిపోయి, ఒళ్ళంతా బొచ్చుతో రెండు కాళ్ళ మధ్య భయంకరంగా ఏదో పొడుచుకొచ్చి, మూడు కాళ్ళ మానవ మృగంలా, మంచం కింద దాక్కున్న, తన కాళ్ళు పట్టుకు ఈడ్చి, బయటకు తెచ్చి, జుట్టు పట్టుకు,లాగి మంచం పైన తనను వేసి, రాక్షసంగా తన మీదపడి, బట్టలు పీకేసి తన గుండెలు నలివేసి, కొరికేసి తన రెండు తొడల మధ్య కత్తిని కసుక్కున దింపేనట్లే నొప్పి భరించలేక కెవ్వును వేసిన తన కేకల్ని చేత్తో ఒత్తేసి, గొంతు కోయబడ్డ కోడి పిల్లలా నేలపై విలవిల్లాడుతూ ఏడుస్తున్న తనను చూపుడు వేలితో ‘అమ్మకు నాన్నకు చెప్పావో చంపేస్తా అని’, మళ్ళీ అమ్మ నాన్న వచ్చేలోగా, ఒద్దు ఒద్దు బాబాయి అని వెక్కిళ్ళు పెడ్తున్న తన మీద ఇంకోసారి పడి తన రాక్షస కామం తీర్చుకున్నాడు వాడు. హాస్పటల్లోనే మెలకువ వచ్చింది తనకు. తీవ్రంగా రక్తస్రావమైంది. వెజైనా చాలా డీప్‌గా కట్‌ అయ్యిందట. డాక్టర్ల ప్రశ్నలు…. ఎలా చేసాడని కొందరు ఎన్ని సార్లు చేసాడని. వెజైనా ఎంత చిరిగిందని మరికొందరు డాక్టర్లు ప్రశ్నలు`ప్రశ్నలు. అవమానంతో బాధతో అందర్నీ వెళ్ళిపొమ్మని కేకలు వేసాను నేను. చచ్చిపోవాలన్పించింది. పదిహేను రోజుల వరకూ భయంకరమైన నొప్పి. కాలు కిందకు పెట్ట లేక , కదప లేక మూత్రంలో తీవ్రమైన మంటతో మూత్రం వస్తే భయమేసేది. నెలరోజులకు కానీ కొద్ది కొద్దిగా నడవలేక పోయింది. కాలనీ అంతా తెల్సిపోయింది .బాబాయి పారిపోయాడు.

అమ్మకు దాదాపు పిచ్చెక్కినట్లే అయ్యింది. ఎవరికీ చెప్పద్దని ఒట్లు వేయించుకునేది. ఎవరో పోలీస్‌ కంప్లైంట్‌ అనీ, మహిళా సంఘం అని అంటే ఒద్దని పరువు పోతుందనీ. పిల్ల పెళ్ళికాదని ఏడ్చేది. నాన్న దాదాపు మౌనమై పోయాడు. నాలో ఏదో కసి. బాబాయి కనిపిస్తే కత్తితో చంపెయ్యాలి. ముందుగా రెండు కాళ్ళ మధ్య ఉన్న ఆ మూడోకాలిని కసకసా కోసెయ్యాలి. బాబాయ్‌ని చంపేస్తానని అరిచేది భయంతో వెర్రిగా, పిచ్చిగా కేకలు వేసేది నిద్దట్లో రాత్రిళ్ళు అమ్మను కావలించుకుని పడుకునేది. చీకట్లో వుంటానికి. ఇంట్లో ఒంటరిగా వుంటానికి భయపడేది నాన్న ` నాన్నని కూడా దగ్గర్కి రానిచ్చేది కాదు. నాన్న కూడా బాబాయ్‌ లాగా.. ఒద్దు ఒద్దండీ అని అమ్మ ఏడుస్తున్నా వినకుండా అమ్మమీద పడి నొక్కడం చూడలేదూ తను? నాన్న ప్రేమతో తన్ను దగ్గర్కి తీసుకోవాలని చూసినపుడు తను విరిలించి పారిపోయేది. నాన్న కళ్ళల్లో నీళ్ళు పెట్టుకునే వాడు. చాలాసార్లు అమ్మ ఒళ్ళో తల పెట్టుకుని వెక్కెకి ఏడ్చేవారు. ‘వినాల్సిందే రజనీ ` అది ఆ త్రాష్టుడి గురించి నీకు నాకూ చెప్తున్నప్పుడు ఛీ నోర్ముసుకో బాబాయ్‌ అలాంటి వాడు కాదని ఆఫీసులకు పరుగులు పెట్టేవాళ్ళం ఒక్క నిమిషం ఆగి వినాల్సిందే ఉద్యోగాలూ`క్లబ్బులూ అంతో తిరగడం ఎక్కువైపోయాయి’’ నాన్న తలకొట్టుకుంటూ ఏడ్చేవాడు. నిజానికి ఆ రోజు పెళ్ళికెళ్ళకుండా ఉండిపోమంది తను. పెద్దగవుతున్నావు కదే ధైర్యంగా ఉండాలి అంది అమ్మ. పెద్దగవుతున్నా ననే నమ్మా.. బాబాయి అలా చేస్తున్నాడు. బాబాయి నువ్వు లేనప్పుడు వస్తాడేమో ఒద్దమ్మా వెళ్ళకమ్మా’.. అనలేదూ తను? ఛీ బాబాయి ఊరెళ్ళాడు. అయినా నేనొచ్చి పిలిస్తేనే తలుపు తీయాలి సరేనా.. అమ్మ వెళ్ళిపోయింది.అమ్మ పో యి,, బాబాయి వచ్చాడు మాటేసిన తోడేలులా. కాటేసి వెళ్ళిపోయాడు.

ఇప్పుడు అమ్మనాన్న చాలా మారారు. నాన్న దాదాపు సాయంత్రం పూట ఇంట్లో ఉండడం మొదలెట్టారు. రెండు నెలలు ఇద్దరూ సెలవులు పెట్టారు. తన చేత బ్రతిమిలాడి ఏవో మాత్రలు మింగించేవాళ్ళు. అవి తిని మత్తుగా పడుకునేది ఆ సం॥ ఏడో తరగతి పరీక్షలు రాయలేకపోయింది. అందరూ సానుభూతి చూపిస్తుంటే అమ్మ కుమిలిపోయేది. చెల్లికి ఏమైందమ్మ అంటు తన కంటే ఒక ఏడు పెద్దైన అన్నయ్య ఏడ్చేవాడు. వాడన్నా పెద్దయ్యాక తనకు బాబాయి చేసినట్లు ఎవర్నీ చేయకూడదు. . వాడికెలా చెప్పగలదు త న కేమైందో? ఎందుకు బాబాయి అలా తన మీద పడి తన రెండు కాళ్ళ మధ్య రక్తాలు కారేట్లు తను ప్రాణాలు పోతున్నంత ఏడుస్తున్నా అంత తీవ్రంగా కొట్టాడో. అన్ని టీవీల్లో ` పేపర్లలో వచ్చింది. తన ఫోటోతో సహా. అమ్మ తలకొట్టుకుని ఏడ్చింది. తనూ ఏడ్చేది. అంతరిక్షంలోకి దూసుకెళ్ళిన కల్పనా చావ్లా ఫోటో పేపర్‌లో పడితే. తన ఫోటో కూడా అలా పడితే ఎంతబాగుండు. తను కల్పనా చావ్లా లాగా ఏదైనా పెద్ద ఘన కార్యంచేస్తే అప్పుడు వేస్తారు ఫోటో. ఎలా అయినా ఏదైనా గొప్పపని చెయ్యాలి అనుకునేదీ అప్పట్లో. కానీ ఇలా పడింది తన ఫోటో. నాన్న ఇలా కాదని వేరే జిల్లాకి ట్రాన్స్ ఫర్‌ చేయించుకున్నారు.

తను క్రమంగా కోలుకున్నది బాబాయి చేసిన గాయం మానలేదు. స్కూలుకు వెళ్ళటం మొదలెట్టినా కానీ క్లాసులో మొగపిల్లలతో మాట్లాడేది కాదు ఆడేది కాదు. ఏదో భయం వెంటాడేది. మాష్టార్లతో మాట్లాడేదీ కాదు. మెగవాడంటే ఒక భయం అసహ్యంఎర్పడింది. అ పోయాడు. మెల్లగా కాలేజీ పీజీ పూర్తి అయ్యాయి. మధ్యలో ప్రేమిస్తున్నామని ఒకళిద్దరూ అడిగినా ఒప్పుకోలేదు. ఇంట్లో పెళ్ళి అమ్మా,,నాన్న తన పెళ్లి గురించి నస మొదలుపెట్టారు. ప్రతీ సంబంధం తిప్పి కొట్టింది పెళ్ళే ఒద్దంది. మెరైటల్‌ కౌన్సిలర్‌ దగ్గరకు తీస్కెళ్ళారు. అందరు మగాళ్ళూ అలా ఉండరని చక్కగా పెళ్ళిచేస్కొమని సలహా ఇచ్చాడాయన. అయినా నాలో శృంగారం పట్ల, పురుషుడి పట్ల అసహ్యం పోలేదు పెళ్ళి చేస్తే జీవితం ఎలా ఉంటుందో అన్న భయం తనలో పెరుగుతోందే కానీ తగ్గలేదు. ఉన్నట్లుండి నాన్నకి గుండె పోటొచ్చి పోయారు. తన మీద బెంగతోనే నాన్నకు గుండెపోటొచ్చింది. చనిపోయే ముందు చక్కగా పెళ్ళిచేస్కొని సెటిల్‌ అవ్వాలని ఒట్టు వేయించుకున్నారు. తర్వాత అమ్మ ఒంటరిగా నిలబడింది . తన పెళ్ళి కోసం నాన్న కిచ్చిన మాటకోసం కామేశ్వర్రావుని చేస్కుంది.

పెళ్ళైయ్యాక వీడొక మానసిక ఉన్మాది అని బయటపడింది. సవతి తల్లి పెంపకంలో దారుణమైన దెబ్బలు అవమానాల మధ్య, సవతి తల్లి మీద ద్వేషాన్ని గొంతు దాకా నింపుకుని దాన్ని లోకంలోని ఆడవాళ్ళ మీద పగగా మార్చుకుని తన పాలబడ్డాడు.
శృంగారం పట్ల అయిష్టత ఉన్న తనని బుజ్జగించీ, లాలించీ, సృజన భర్త మధసూధన్‌లా ప్రేమిస్తాడనుకుంటే, మొదటి రాత్రే తన మృగత్వం చూపించేసి, భయంతో బాధతో ముడుచుకుపోయే తనని ‘‘యూ ఫ్రిజిడ్‌ మొగాణ్ణెట్లా సుఖ పెట్టాలో మీ అమ్మ నీకు నేర్పలేదా’’ అనే ఈ పశువుకు బహుశ వాళ్ళ నాన్న స్త్రీ నెట్లా సున్నితంగా, గౌరవంగా చూడాలో నేర్పనట్లే ఉంది. ఇతనిలో తన సంసార జీవితం గత రెండున్నరేళ్ళుగా వందల బలాత్కారాలు, ` రెండు వందల తిరస్కారాలుగా సాగుతోంది.

వాడొక పురుషాహంకారి, ఒక పిచ్చి పుచ్చు వెధవ అయినా సర్దుకుపోయేదేమో. కానీ వీడొక సెక్స్‌ ఉన్నాది తల్లిదండ్రులు లేని పెంపకంలో అరాచకంగా పెరిగాడు. సహజ శృంగారం అంటేనే భయపడి చచ్చేతనతో అసహజ శృంగారం చేష్టల్ని చేస్తూ నరకం చూపిస్తున్నాడు. చచ్చిపోతున్నది వీడితో, ఛంపేస్తా వీడిని, ఏదో ఒక రోజు! తన బుర్ర వేడెక్కింది బస్సులో సంఘటన తన బాల్య జీవితంలోని చేదుజ్ఞాపకాల్ని మళ్ళీ త న ముందు నిలబెట్టింది. వీడెంత సేపూ బూతు సినిమాలు, ఇంటర్నెట్‌లో సెక్స్‌ సైట్‌లు అందులో ఉన్నట్లు చేద్దామని తన మీద బల ప్రయోగాలు! ఈ మధ్య వయాగ్రాకు సంబంధించిన విషయాన్ని సేకరిస్తున్నాడు. వాడి జేబుల్లో ఏవో కొత్తవి ఇంకా విప్పని మాత్రలు కన్పిస్తున్నాయి కూడా. ఓర్నాయనో ఒక్క నిమిషపు వీడి ప్రతాపానికే నొప్పితో సచ్చిపోతున్నానే వయాగ్రాలు, భయాగ్రాలు వేస్కుని గంటల తరబడి తన మగతనపు వీరంగం నాపైన ప్రదర్శిస్తాడు కాబోలు మగాళ్ళ ఈ మామూలు రెండు మూడు నిమిషాల ప్రతాపాలకే మూడేళ్ళ పసికూనల దగ్గర్నించి డెబ్భై ఏళ్ళ ముసలవ్వల దాకా బలవుతున్నారే అలాంటిది వయాగ్రాలతో మృగాల్లా గంటల తరబడి, బాబాయ్‌ల్లా.. తన మొగుడు కామేశ్వర్రావులాగా రెచ్చిపోతే స్త్రీల పరిస్థితి ఏంటి? మరి స్త్రీలు ఫ్రిజిడ్స్‌ కాక ఏమవుతారు?
ఎందుకో ఈ రోజు దు:ఖం వరదలా వస్తోంది. వరదే దు:ఖమై ముంచేస్తోంది. బస్సు సంఘటన తనను గ్నాపకాలు కడలిలోనే తోసేసింది. త న బాల్యపు చేడు గ్నాపకాలను మర్చిపోయి. బలవంతంగానైనా అయిష్టంగా పెళ్ళికి ఒప్పుకున్నాక శృంగారం పట్ల భయాన్ని కొద్ది కొద్దిగా పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఎంతో ఆశతో ప్రారంభించిన తన దాంపత్యపు జీవితంలో ప్రతీ రాత్రి ఒక అరాచకపు రాత్రే. గత రెండున్నర సం॥లుగా ఏ ఒక్క రోజు కూడా తనకు దాంపత్య జీవితంలో ఆనందంగానీ, కనీస గౌరవం కానీ దొరకలేదు. అతను ఒంటిపై చేయివేస్తేనే భయంతో, అసహ్యంతో ఒళ్ళు జలదరిస్తుంది. వెంటనే బాబాయి గుర్తుకొచ్చేస్తాడు. ఆనందం కాదు కదా ` ప్రేమోన్మతమైన స్పర్శను, ఒక కమ్మని ముద్దుకు అతన్నించి ఎరుగదు. ఎద్దు గుడ్డిగా చేలో బడి కుమ్మేసినట్లే తన శరీరంపై పడి కుమ్మేసి ,కమ్మేసి ఆయాసంతో రొప్పేస్తూ తన శరీరంలోనా, పైనా తన వీర్యాన్ని విసర్జించేసి పక్కకి తిరిగి పడుకోవడం. వీలున్నప్పుడల్లా పర్వర్టెట్‌ ఎక్స్‌పెరిమెంట్స్‌ తన మీద ప్రయోగించడం, తిరస్కరిస్తే ముండను ` లంజను, ఫ్రిజిడ్‌ను చేసేసి ఎడాపెడా కొట్టేయ్యడం. స్నేహం, ప్రేమ సాన్నిహిత్యం లేని ఈ సహజీవనం ఎన్నాళ్ళు? ఎన్నేళ్ళు? కొన్నిసార్లు మనిషిని మార్చుకోలేనా? సవతి తల్లి ప్రేమ రాహిత్యంలో ఇలా అయ్యాడేమొ? మనిషి మారడా అని ఆలోచించేది మెల్లగా ప్రేమగా ` స్నేహంగా కమ్ముకుపోవాలని చూస్తే, భోగం ముండ పనులు తన దగ్గర పనిచెయ్యవనే మోటుదనం హృదయాన్ని ముక్కలు చేస్తే నీస్తే జంగా ` నీరసంగా, రిజిడ్‌గా నిజంగానే ఫ్రిజిడ్‌గా జడపదార్థంగామిగిలిందనే చెప్పాలి. వీడికిన్నాళ్ళూ చెప్పనే లేదు. చెప్పెయ్యాలి తనెందుకు ఫ్రిజిడో? వాడికెంతానందమో తనను ఫ్రిజిడ్‌ అనడంలో? చెప్పాలి తన బాబాయి ,` ఆఫీసులో రమణిని వేధించిన బాసుగాడు, ప్యాంటు వీడ దీసి పదహారేళ్ళ పసికూన మీద పడిన బస్సు మృగాడు వీళ్ళందరి గురించి చెప్పాలి. అసలు వీడెంత అసహ్యంగా ఉంటాడో రాత్రిళ్ళు తనముందు మృగంలా చెప్పాలి. మాటి మాటికీ ` వెనక్కి తిరిగి తన నడుము కింద పంజాబి డ్రస్ కి అంటించిన మృగాడి మదాన్ని చూసి భయంతో ` అసహ్యంతో, అవమానంతో ` విభ్రాంతితితో మ్లానమై ` మరుక్షణం అవమానంతో ఎరుపెక్కిన ఆ పదహారేళ్ళ బస్సమ్మాయి మొఖమే వెంటాడుతోంది. బాబాయితో , ఆ రాత్రి తన ముఖం అలానే ఉండి ఉండచ్చు. ఈ కామేశ్వర్రావు గదిలో తన తొలి రాత్రిళ్ళు అట్లానే ఉండి ఉండచ్చు ఆ మొఖాలలో భయం, అసహ్యపు నీలి నీడలు వీళ్ళకు కనపడవా? రాస్కెల్స్‌ వాటిని సిగ్గనుకుంటారు కాబోలు. ఈ దు:ఖం ఎలా ఆగేది? ఈ భయంకరమైన తలనొప్పి ఎలా తగ్గేది? వంట చెయ్యి బద్ది కాలేదు. లైటు వేస్కో బుద్దీ కాలేదు. వాకిటి తలుపు వారగా వేసి హాల్లో అలానే పడుకుండి పోయాను. రాత్రి ఒక్కసారి మెలకువ వచ్చింది”. వాకిటి తలుపు వేస్కోలేదు ‘ఏ రండగాడి కోసమే తెర్చి ఉంచావు’. మీద పడి చీర లాగేసి ఆక్రమిస్తున్నాడు కామేశ్వర్రావు. ఛీ ఛీ మళ్ళీ తాగొచ్చాడు. హాల్లో ఉన్న తన మీద అట్లానే పడ్డాడు. వాసన భరించలేకపోతున్నా .పైగా నిద్రలో ఉన్న తనపై అలా పశువులా పడడం. ముందే హృదయం అగ్ని గోళంలా ఉంది. మళ్ళీ బాబాయి గుర్తొస్తున్నాడు. బస్సులో ఆ నిస్సహాయ అమ్మాయి ఆర్తనాదం ,బస్సులో మద మెక్కిన ఆ మగమృగపు వికృత చేష్ట వీడు అచ్చం అలానే ఇంకా ఎక్కువ. తన శక్తినంతా ఉపయోగించి విదిలించి అతన్ని తను పెనుగులాడే కొద్దీ వాడి పైన కోపం పెరిగి పోయింది ‘ఒదులు ` ఒదులు ` యూ బాస్టర్ట్‌’ నా నోట్ళొంచి వచ్చాయా మాటలు. వాడి మత్తు దిగిపోయి పిచ్చిగా చూసాడు ‘ముండా.. నన్నే అంటావే అంటూ చెంప ఛెళ్ళు మన్పించాడు. ‘దొంగలంజా, ఒక్క రాత్రీ వప్పుకోవు కదే. ఫ్రిజిడ్‌! నీ అమ్మా.. అంటూ వాగుతూ నా మీద మీద పడ్తున్నాడు. ఒక్కసారి నాలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లాగి ఒక్కటిచ్చాను తాగి బలహీనంగా ఉన్నాడేమో పక్కకి పడిపోయాడు. వెంటనే లేచి వాడి రెండు కాళ్ళ మధ్య కుడి కాలితో బలంగా తన్ని యూ బీస్ట్‌..అయ్ టెల్ యు వై అయ్ బి కం ఎ ప్రిజిడ్?అని కోపంతో అర్చింది. పెద్ద పులిలా పెద్దగా ఆక్రోశించింది… మళ్ళీ తన్నింది,, మళ్ళీ,మళ్ళీ తన్నింది వాడి పుచ్చకాయలు చితికి పోయేలా,,. నొప్పితో రెండు మోకాళ్ళు ముడ్చుకుని కుక్కలా నేల మీద పడిపోయాడు. ఆయాసం, ఆవేశం ముంచెత్తి మళ్ళీ పక్కనున్న గొడుగుతో వాడు లేవకుండా కసిదీరా కొట్టింది. గబగబా బెడ్రూంలోకి నడిచి సూట్‌ కేసు సర్దుకోవడం మొదలుపెట్టింది ఇక్కడ్నించి ముందు బయటకెళ్తే, ఆ బస్సులలో .ఇంటా,బయటా నిరంతరం గాయపడే పసిపిల్లల నన్నా అందుకోవాలి,,ఆదుకోవాలి, నా హృదయానికి హత్తుకోవాలి ఆ కన్నీళ్ళు తుడవాలి. రమణి ఎలాగూ ఉండనే ఉంది.

– గీతాంజలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

23 Responses to ‘‘ఫ్రిజిడ్‌’’

 1. Noorbasha Rahamthulla says:

  “కన్నీళ్ళు ఆగడం లేదు. శృంగారం అంటే ఇదా? నాకు హింస ,వాడికి సుఖమా?”

 2. shreeram says:

  భాగుంది కథ థాంక్స్

 3. Sesha Sai Panangipalli says:

  మీరు వేదనతో కథ ,చాలా మందికి వర్తించవచ్చు. కారణం మనం చూసే సమాజం, దాని లక్షణాలు,నడవడి,సంస్కారం.ఇందులో చదువుండి సంస్కారం లేని వాళ్ళు,చదువు లేక సంస్కారం లేని వాళ్ళు , ఏమీ చదవక పోయినా సంస్కారవంతులు వున్నారు. ఏది ఏమైనా ఈ జాతి ఇంకా ఎన్నో కోట్ల రెట్లు సంస్కరింపబడాలి.

 4. manju says:

  మీరు పబ్లిష్ చేసిన ఈ వ్యాసం బాగున్నది. కాని అసహ్యం కలుగుతుంది. మీరు చెప్పినట్టు అందరు మగ వాళ్ళు అలానే ప్రవర్తించరు. మరి మీ నాన్న గారు, మీ బాబాయ్ గారు, మీ అన్న గారు అలా చేసి ఉంటారేమో. మా నాన్న గారు, మా అన్నయ్య, ఆకరుకి నాకు వరుస అయ్యే బావ కూడా నాతో ఎంతో ప్రేమగా మెలిగారు. మీరు ఇటువంటివి ఎందుకు పోస్ట్ చేసి ఉన్నారో అర్ధం కావటం లేదు. ఎవరో ఎక్కడో ఎలాగో బాధ పడితే, మీరు యావత్ మగ జాతినే కించ పరిచే విధంగా మాతాడుతున్నారు.

  • geethanjALI says:

   మంజు గారు…మీ స్పందన చదివాను..చాల అసభ్యంగా..సంస్కారహీనంగా..ఉంది..నా కథలో అమ్మాయికే ఆ సంఘటనలన్నీ జరిగాయి..ఇది వాస్తవం.మీ ఒప్పుదలతో నాకు సంభంధం లేదు.మీ నాన్న ,బాబాయ్..బావ మీతో ఎంతో ప్రేమగానే మెలిగి ఉంటారు.అది మీ అదృష్టం కానీ మంజుగారు..లోకంలో ఎంతో మది అత్యంత దురదృష్టకరమైన అడ పిల్లలు ఉన్నారండి..బాబాయి లె కాదు..కన్న తండ్రులతో రేప్ కి గురై తల్లులై.. పుట్టిన బిడ్డకి తన తండ్రి తాత అవుతాడో..తండ్రి అవుతాడో,,,తనకి తన తండ్రి భర్త అవుతాడో..కన్న తండ్రి అవుతాడో తెలీని భయానకమైన స్థితిలో పిచ్చెక్కిన ఆడపిల్లలున్నారండీ..మీరు మీ భర్త,,బావా..నాన్నాల ప్రేమ,బాధ్రతల మధ్య భద్ర జీవితం గడుపుతూ..లోకంలో ఆడపిల్లలందరూ అలానే ఉన్నారని అనుకుంటే ఎలా? నిర్భయ కేసు చూడలేదా,,మీ రక్తం మరగలేదా ? కథా వస్తువు..రచయిత్రిదే కానక్ఖరలేదు..ఆ మాత్రం జ్ఞానం మీకు లేదు….నాకే ఆ ఇన్సిడెంట్స్ జరిగాయని అసభ్యంగా రాసారు..రండి..నా కౌన్సిలింగ్ చాంబర్లో కూర్చొని గుండె ధైర్యం ఉంటె ఆ బాధితురాళ్ళ గోడు..ఆవేదన వినండి .జాలి చూపితే చూపండి..మీరు కడుపునిండా తింటూ ..ఆ తిండి లేని కోట్ల మంది కూడా మీలాగే భోజనం చేస్తున్నారనుకుంటే ..అది గుడ్డితనమే అవ్తుంది ..మీకు సమస్యలు లేవని ,,వేరే స్రీలకు సమస్యలు లేవనుకోవడం ..సమాజం పట్ల ..బాధిత స్త్రీల పట్ల బాధ్యతారహితమే అవుతుంది ..నాతో నా తండ్రి ,,బాబాయి ,,అసభ్యంగా ప్రవర్తించారన్న మీ నీచ పదాలను .సభ్యత ఉంటె వెనక్కి తీసుకోండి ..నాలుగేళ్ల చిన్నారుల దగ్గర్నించి ..70 ఏళ్ళ ముసలమ్మల మీద కూడా లైంగిక అకృత్యాలు ఎ పితృస్వామ్య పునాదుల మీద జరుగుతున్నాయో..గ్రహించి..ఆ దుర్నీతిని ఖండించక పోతే.మీరు మనిషే కాదు..ఇక నేను వాడిన భాషా మీద కూడా ఆరోపనలున్నై..అది నా భాష కాదు..నా దగ్గరకోచిన స్రీలు గుండెలు పగిలే ఆక్రోసంతో వాడిన మాటలు..వాస్తవాలు ..అత్యాచారం చేసిన వాడిని కుడా అయ్యా ,,సారూ మీరు పసిబిడ్డ మీద లైంగిక అత్యాచారం చేయకుండా ఉండాల్సింది అండి ..కాస్త పెద్దదాన్ని చూస్కోవాల్సింది..అని రాయలేము ..లేదా ఫలానా వెంకట్ గారు నా 3 ఏళ్ల బిడ్డని..ఏదో కొద్దిగా రక్తం కారేలా అత్యాచారం చేసాడండి..అని చెప్పాలేమో..మంజు గారూ..కళ్ళు తెరవండి..మీ చుట్టూ ఉన్నా బాధిత స్త్రీ లను అర్థం చేసుకోన టానికి ప్రయత్నించండి..అంతే కాని నాలుగ్గోడల మధ్య భద్ర జీవనం గడుపుతూ..ఆ సమస్యలను బాధ్యతతో రాసే నా లాంటి రచయిత్రులమీదా అసభ్యమైన ఆరోపణలు..నీచమైన కామెంట్లు చేయకండి..నా కన్నా తండ్రితో నాకున్నా పుత్రికా సంభందాన్ని అత్యంత నీచపరిచారు మీరు.. మీకు సమాధానం రాయడానికే సిగ్గనిపిస్తున్నది నాకు

 5. mercy margaret says:

  ఓ బాధ ఆవేదన అలా నిత్యం బాధపడే మహిళల మానసికస్థితి అధ్బుతంగా వివరించారు.. కథ బాగుంది అంజలి గారు

 6. ఆనంద says:

  గీతాంజలి గారూ!
  ఆడవాళ్ళు కొందరు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యలని చాలా బాగా వర్ణించారు. జుగుప్సాకరమైన సన్నివేశాల్నికూడా ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా, విపులంగా వర్ణించిమరీ చెప్పినందుకు మిమ్మల్ని, ప్రచురించినందుకు విహంగ సంపాదకుల్నీ అభినందించకుండా ఉండలేకపోతున్నాను.

  నాదొక విన్నపం! మీరు డాక్టరంటే సైకాలజీ పీహెచ్ డీ నా లేక నిజంగా డాక్టరో నాకు తెలీదు. ఇలా ఆడవారి సమస్యని ఎత్తి చూపుతూరాసినట్టే, ఆడవాళ్ళ వల్ల బాధలు పడే మగవాళ్ళుకూడా మీదగ్గరకు వస్తుంటారు కదా! వాళ్ళ బాధకూడా ఒక కథలా రాయండి. అప్పుడు నాణేనికి రెండు వేపులా చూపించినట్టవుతుంది. ఎందుకడుగుతున్నానంటే, ఆడవాళ్ళ కోణం నుంచే అభ్యుదయవాదులంతా ఆలోచిస్తారు, ఎందుకంటే వాళ్ళ కన్నీళ్ళు కనిపిస్తాయి కనుక. మగవాడు అలా బయటపడలేడు.

  పెళ్ళయ్యేవరకు పరాయి స్త్రీని తల్లికన్నా ఎక్కువగా చూసి, పెళ్ళయ్యాక భార్యతోనే అన్నీ అనుకుని ఉన్న మగాడు, పెళ్ళవగానే ఆ భార్యని ప్రేమగా దగ్గరకు తీసుకుంటే, “కామాంధుడా” అని తిట్టి వెళ్ళిపోతే, సరేలే మొదట కదా అనుకుని సర్దుకుపోయి, నాలుగైదేళ్ళు గడిచినా భార్యనుంచి కనీసం ప్రేమగా కాస్త స్పర్శని కూడా అందుకోలేనప్పుడు ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేక మెలికలు తిరిగిపోయిన మగాళ్ళని నేను చూశాను. అలా అని వాళ్ళు ఫ్రిజిడా అంటే, పెళ్ళికి ముందూ తర్వాతా బహుపురుష సంపర్కం కలవాళ్ళే! వీణ్ణి వదిలేసి వెళ్తారా, విడాకులిస్తారా అంటే, లేదు వీడు సంపాదించే కాసులు కావాలి, వీడివల్ల వచ్చే పరపతి కావాలి. చస్తామనో, గృహహింస కేసు పెడతామనో బెదిరిస్తారు….

  లేకపోతే,నేను ముందొకణ్ణి ప్రేమించాను, వాణ్ణి తప్ప నేనెవర్నీ ఊహించుకోలేను అనటం. మరి నేనే వాడికిచ్చి పెళ్ళి చేస్తా అన్నా వినరు, మా వాళ్ళ పరువు పోతుంది అంటారు. ఎటూ తేల్చుకోలేక, ఉరేసుకు చచ్చిన అబ్బాయిలూ ఉన్నారు.

  అలాంటి పరిస్థితుల్లో కూడా, వయసు, శరీరం పెట్టే బాధని నిగ్రహించుకుని, పరస్త్రీ వంక కన్నెత్తి చూడలేని తమ సంస్కారానికి కుమిలిపోయే వాళ్ళనీ చూశాను.

  నగ తెస్తేనో, చీర కొంటేనో పక్క ఎక్కనిచ్చేది అని కండిషన్లు పెట్టే సాధ్వీమణులనీ చూశాను. రోజూ ఒకరకంగానేనా, అంటూ పర్వర్షన్లతో భర్తని ఇబ్బంది పెట్టినవాళ్ళనీ, ఇంతేనా నీ ప్రతాపం, ఫలానా వాడైతే నాలుగ్గంటలు ఆపకుండా చేస్తాడు అని ఈసడించుకున్నవాళ్ళనీ చూశాను. మొదటిరాత్రి ఖంగారు పడ్డ భర్తని, పదిమందిలో చులకనగా మాటాడి, వాడు ఆత్మహత్య చేసుకునేలా చేసి, ముందునుంచీ ఉన్న ప్రియుడితో తర్వాత సెటిల్ అయినవాళ్ళనీ చూశాను….

  ఇవనీ ఎక్కడొ ఒకచోట జరిగేవికాదు, ఎప్పుడు జరుగుతున్నవే…. రోజంతా కూచుని టేవీ సీరియళ్ళు చూసి, సాయంత్రం అలిసిపోయి వచ్చిన భర్తకి కాస్త చిన్న నవ్వుకూడా పారేయకపోగా, వచ్చాక నాకు వంటలో సాయం చెయ్యలేదు, ఇంటిపని పట్టించుకోవు అని కాల్చుకుతినే మహిళామణులూ ఉన్నారు….

  వీళ్ళందరి గురించి కూడా రాసి, నిజమైన స్త్రీ పురుష సమానత్వాన్ని చూపించండి.

  ధన్యవాదాలు.

 7. sarada says:

  గీతాంజలి గారూ ఫ్రిజిడ్ కథ చదువుతూ వుంటే గుండె బాధ తో బరువు ఎక్కింది. చదువుతున్నట సేపూ కంటి నిండా నీళ్ళు నిండి , chadivina తరువాత ఎలా నా స్పందనను అక్షరాల్లో కి మార్చాలో తెలేలేదు. చాలా తక్కువ శాతం స్త్రీలు వుంటారేమో అనుకూలమైన భర్త వుండేవాళ్ళు అన్ని రకాలుగా! ఎప్ప్పుడూ అనుకూలమైన భార్యగా వుండాలి అని ఆడ పిల్లలకే ఎందుకు చెపుతుంది సమాజం? మగ పిల్లలకు కూడా అనుకూలమైన భర్తగా వుండాలి అని ఎందుకు
  చెప్పరు? అన్నింటి కంటే
  ముఖ్యం ఆడపిల్లలు ధైర్యంగా ప్రస్తుత పరిస్తితులలో మగ రాక్షసులని ఎదుర్కోవాలి.
  పెళ్లి అనేది లైసేన్సేడ్ వ్యభిచారం కాకూడదు.

 8. D.Venkateswara Rao says:

  ఆడవారందరూ అనుకున్నట్లు మగవారందరూ ఒకేలా ఉండరు
  అవకాశమొస్తె ఎంతటి మంచివాడైనా క్రూరంగా మారుతాడు
  అమానుషంగా ప్రవర్తించడానికి వెనుకాడడు
  ఇది మగ బుద్ధి
  మగవాడికే ఉండే బుద్ధి
  మగవాడిలో అణగి ఉన్న నివురుగప్పిన నిప్పులాంటి బుద్ధి
  ఆడవారిని దహించడానికి ఏమాత్రమూ వెనుకాడని వికృత బుద్ధి

  మీలా ఆడవారందరూ ధైర్యంగా ముందుకొచ్చి మగవారు చేసే తప్పుల్ని బహిర్గతం చేసిననాడు
  మగవారందరికి తాముచేసే అనైతిక కార్యాలవల్ల ఆడవారనుభవించే అమానుషాలన్నీ అవగతమైననాడు
  ఆదిలోనే ఆడవారు తమకు జరిగే అవమానాలని దైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించిన నాడు
  ఆడవారు ఎదురు తిరిగితే మగవారికి నరకం చూపించవచ్చు
  ఆడవారి సహనం మగవారి అమానుష కార్యాలకి మార్గం
  ఆడవారిలో ఐకమత్యం మగవారి క్రూరత్వాన్ని అణచివేయగలదు
  ఆడవారు తలచుకుంటే మగవారికి ఎప్పటికప్పుడు భుద్ది చెప్పగలరు
  ఆవారు అలిగితే బయటకొస్తే కోపగిస్తే దైర్యం చేస్తే ఎదురు తిరిగితే
  మగవారిలో మార్పు వస్తుంది
  సమాజం మారుతుంది

  అంతా మీ ఆడవారి చేతుల్లోనే ఉంది

 9. geethanjali says:

  నా కథకి స్పందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు స్త్రీల జీవితాల్లో అత్యంత చిక్కగా,,అల్లుకుపొయిన పురుష లైంగిక రాజకీయాలను విప్పి చూపడమే నా ఈ కథల ప్రధాన లక్ష్యం.మూసి ఉన్న తలుపుల వెనకాల పెళ్లి,దాంపత్య జీవితం..రొమాన్స్ పేర్లతో ,,పెళ్లి,భర్త అనే చట్టబధమైన లైసెన్సులతో..స్త్రీల మనో దేహాల మీద జరిగే దాడి ..సెక్సువల్ వయోలెన్స్ ఎంత భయానకంగా ఉంటుందో,,నా దగ్గరకి డిప్రెషన్ కౌన్సిలింగ్ కి వచ్చే స్రీలు వెక్కెక్కి ఏడుస్తూ చెప్తుంటే..గుండె తరుక్కు పోతుంది.వీళ్ళ జీవితాలు డాక్యుమెంట్ చేయడం వెనకాల ఈ వేదనలను తెలపడం తో పాటుగా,,మగవాళ్ళని sensiti చేయాలన్న ఆస కూడా ఉంది.violence ని వయోలెన్స్ గానే రాస్తాము.ఇంకా దానికే రూపం ఇవ్వలేము.అవును..ఈ కథలో దాదాపు అన్ని సంఘటనలు ఒక్క స్త్రీకె జరిగాయి.బస్సులో ఇన్సిడెంట్ నేనూ చూసా ఒకసారి ఆమె తో పాటుగా.. ఈ కథలను నేను ఒక సెన్సేషన్ కోసం రాయటం లేదు..ఒక విమెన్ sexologist గా,,స్త్రీల జీవితాల్లో పెళ్లి,,ఆధిపత్యాల పేరుతో అమలవుతున్న లైంగిక హింసని చాల దగ్గరగా వింటున్నా.బాధితుల నోటి వెంబడి..చాల డిస్టర్బ్ అవుతున్నాను.వీటిని డాక్యుమెంట్ చేయకపోతే సమాజం పట్ల ..ముఖ్యం బాధిత స్త్రీల పట్ల నేరం చేస్తున్నట్లు గా ఫీల్ అవుతాను.అందుకే అన్ని పనులు పక్కన పెట్టి ఈ కథలు రాస్తున్నాను. నా ఈ కథలను హేమలత గారు సహృదయం తో స్పందించి..ప్రచురిస్తున్నందుకు
  ..మీరంతా స్పందిస్తున్నందుకు…అందరికి నా కృతజ్ఞతలు ఇక ముందు కథలను కూడా ఇలానే స్పందిస్తారని ఆసిస్తూ..
  మీ geethanjali.

 10. Srinivas saahi says:

  Hatsaf madam…

 11. Thirupalu says:

  ప్రిజిడ్‌ మంచి కధ. సామాజిక అనిచి వేత స్త్రీలలో మానసిక ప్రిజిడ్‌ కు దారి తీస్తే. ఇలాంటి లైంగిక అణచి వేత శారీరక ప్రిజిడ్‌ దారితీస్తుంది.

 12. wahed says:

  సమాజం మాట్లాడడానికి ఇష్టపడని విషయాలు, బయటపెట్టుకోడానికి తటపటాయించే విషయాలు, దిగమింగుకునే కన్నీళ్ళను చాలా చక్కగా రాశారు.

 13. venkateswarlu rejeti says:

  ఫెంటాస్టిక్, మర్వేలేస్ ,మేల్ శావినిసం,సమాజం లో నిత్యం గమనం లోఉన్న సంఘటనలే చాల బాగా ప్రెసెంట్ చేసారు.కాని సెక్స్ లో హింస జంతు ప్రవ్రుత్తి అనుకొంటా. అనిమల్ ప్లానెట్ లో చాలా అనిమల్స్ సెక్స్ ప్రవర్తన చాలా వైవిద్యం గా ఉంటుంది.

 14. subhashini poreddy says:

  ఎంతో మంది ఇప్పటికీ చెప్పుకోలేని భాదలను ఈ మాటల్లో … ఇలా చెప్పుకోవచ్చు అనేలా చెప్పారు కథ. అసలు ఇదీ ఒక కారణమేనా విడిపోవడానికి అనే వాళ్ళు ఎంతమందో!! పెళ్లి పేరుతో ఎన్నో ఇళ్ళల్లో జరుగుతున్న ఈ హింస ను చదివి….ఒక్కసారి వళ్ళు జలదరించింది. మాటలు రావడం లేదండీ…!! ఇన్ని అభద్రతల మద్య ఆడపిల్లలను ఎలా పెంచాలి అన్న భయం పట్టుకుంది. అందం, ప్రతిభ , మంచి వ్యక్తిత్వం అన్ని కలబోసి అమ్మాయిని పెంచితే…ఇలాంటి ఏ మృగాడి చేతిలోనో బలయిపోతుంటే ..నిస్సహాయం గా చూస్తున్న తల్లిదండ్రులు ఎందరో!! దీనికి పరిష్కారం ఏంటి? అమ్మాయి తనువు,మనసు సర్వనాశనం అయ్యాక జీవచ్చవం లా జీవితాన్ని గడపాల్సిం దేనా?చట్ట బద్దమైన హింస కు చట్ట బద్దం గా విడిపోవడమే మార్గం. కానీ ..బస్సుల్లో, రోడ్లమీద ఇలా చేసే వాళ్ళని ఎలా శిక్షించాలి?అక్కడికక్కడే ధైర్యం గా తిరగబడాలి. అలా పెంచాలి అమ్మాయిలను. మీ కథ మార్గనిర్దేశం చేసింది. గీతాంజలి గారు..థ్యాంక్ యు వెరీ మచ్.

 15. padmaja says:

  చాల వ్యథా భరితంగా ఉంది కానీ సమాజంలో జరుగుతున్నదే అది
  చాల బాగా చెప్పారు ఎవరు చెప్పనంతగా’

 16. sn says:

  very well narrated.హోప్ it shall be a opening to atleast ఫెవ్ మెన్ in the సొసైటీ . hope every women is independent.so that they come అవే from the Clutches of such rapists in the mask of husband.if it took so many years for educated women… just think of illeterate women who అండర్ గో such agony.hope our country విమెన్ becomes free from men be next decade .

 17. g.siva nageswararao..... says:

  చాల పవర్ ఫుల్ నెరేటివ్ ​……… బట్ ఫీల్ మిస్ అయింది …….. మీ ఆడవాళ్ళ బాధలు గురంచి చలం గారు చెప్పితేనే బాగుంటుంది ……. బాధలు ………

  • subhashini poreddy says:

   చలం గారే చెప్పాలి అనడం ఏంటండీ? ఇప్పటి కాలం లో ఇప్పటి వ్యక్తీకరణ. ఒక స్త్రీ వేదన గురించి ఇంతకన్నా బాగా ఎవరైనా చెప్పగలరా? మీరింకా చలం కాలం లోనే జీవిస్తున్నట్లున్నారు….

  • Suresh Kumar Digumarthi says:

   నేనైతే చాలా ఎక్కువ ఫీల్ అయ్యానండీ. చదువుతూ ఉంటే కంట్రోల్ చేసుకోలేనంత భావోద్రేకానికి లోనయ్యాను. ఇంత విచక్షణా రాహిత్యంగా ఉన్న ప్రస్తుత సమాజ పరిస్తితులన్నింటీ కాంప్రహెన్సివ్ గా ఒకే చోటకు తీసుకు వచ్చి సమస్య లోతును మరోసారి డా. గీతాంజలి గారు గుర్తుచేసినట్టే అనిపించింది.

 18. Suresh Kumar Digumarthi says:

  వేదనాభరితమైన కధనం.

 19. vasanta lakshmi ,P. says:

  తన స్నేహితురాలి భర్త ..ప్రేమ ,అనురాగం తో సాగిస్తున్న సంసార జీవనం గురించి ప్రస్తావిచారు కదా ..ఈ కథ ఏదో మగ వారి మీద ద్వేషం వెళ్ళ కక్కడానికి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు ? రాజకీయ వేత్తల అనైతికత గురించి కథ రాస్తే ,అందరూ అలా ఉంటారని ..అంటారా ? అని అన రే .ఇది అలా మృగం లా ప్రవరించే మగ వారు , భర్త అనే లైసెంస్ ఉంటే చాలు ,ప్రతి రాత్రి , బ్లాత్కారం చేయ వచ్చు ..ఆమె ఇష్టాఇష్టాలు తో సంబంధం లేకుండా ..అని రెచ్చిపోయే భర్త ల గురించి ..ఇంత షాకింగ్ గా రాస్తే గానీ ,మరి ఆలోచించరు ..ఎందుకిలా రాసారు ? రాయవలసిన అవ్సరం ఏం వచ్చింది ? అని .. మనం రోజూ వింటున్న విషయాలే ,దురదృష్ట వసాత్తూ ..ఒక్కొక సారి ..అన్నీ ఒక్కరికే జరుగుతాయి.. బాబాయి సొంత తండ్రి లాంటి చిన్నాన్న ,ఇంట్లోనె పైశాచిక దాడి, ప్రతి రాత్రి మీద పడే మృగం ..ఆఫీసు లో అవకాశం దొరుకితే , మీద పడే ఆఫీసర్లు …ఎవరు లేరు ..అందరూ ఉన్నారు ఈ సమాజం లో . మంచి భర్త లూ ఉన్నారు .మంచి నాన్నలూ ఉన్నారు ..ఆమె కి కనిపించిన సమాజం ..ఆమె ని హింసించే సమాజం ..అది ..కాదు ,లేదు ..అని మొండిగా వాదించడం కన్నా ,, ఎందుకిలా రాయాలి వచ్చింది ? నిజం గా సమాజం లో ఇలాం టి మగమృగాలు ఉన్నారా ? అని బాధ పడాలి మనం ..బయటకి చెప్పుకోలేని ఎన్నో వ్యధలు ..నిర్భయ కేస్ బయటకి వచ్చింది ..ఇంకా ఎన్ణో ..ఇళ్ళల్లో జరిగేవి, బజారల లో జరిగేవి బస్సుల్లో జరిగేవి ..ఇలా ఎన్నో ఎన్నెన్నో ..ఆడ వారు వారి కష్టాలు ,నెమ్మదిగా గుంభన గా మౌనం గా సహించాలి ..అని చెప్పి చెప్పి, ఇలా ఈ పరిస్థితి కి తీసుకు వచ్చారు ..అత్యా చారం జరిగితే ముందు ..నీదే తప్పు అని వేలెత్తి చూ్పించే సంఘం ఇది ..నువ్వు రెచ్చగొట్టే దుస్తులు వేసుకున్నావు , లేక పోతే ,నీ మాటలు లో ఏదో తేడా ఉంది, అంటూ అన్నీ ఆమే మీదకి నెట్టేసే సంఘం ఇది ..అందుకే ఇలాంటి కథల ఆవశ్యకత ఉంది….ఇంకా ఇంకా , క్రూడ్ గా చెప్పినా అర్ధం చేసుకోరా ??? నిజానికి సుందరం అయిన తొడుగులు తోడిగి ,ఎంత కాలం ఇలా తప్పించుకుంటాం …హాట్స్ ఆఫ్ టొ గీతాంజలి ..

 20. ఎలా స్పందించాలో కూడా తెలియడంలేదు. చాలా మంది వ్యదాభారితమైన కథలు ఇవి. స్త్రీలందరూ మీరు చూపిన జీవితాన్ని అనుభవిస్తున్నవారే! ఇలా కథలుగా చదివిన వారైనా సున్నితంగా వ్యవహరించడం నేర్చుకుంటే బావుండును. స్త్రీల మనఃదేహవ్యధలు ఇవి . చాలా చక్కగా అందిస్తున్నారు భారతి గారు .

  బస్ ప్రయాణం లో వ్రాసిన విషయం లాంటింది ప్రత్యక్షంగా చూసి విహంగ లోనే ప్రచురితమైన “వారు వారే ” అన్న కవిత వ్రాసాను. చాలామంది ఆ కవితపై ధ్వజమెత్తారు. వాస్తవాలని అంగీకరించని సమాజంలో మనం బ్రతుకుతున్నాం. చాలా బరువుగా ,బాధగా ఉంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)