వందేళ్ల సినిమా వైభవం

అక్టోబర్ 19 వ తేదీన సాయంత్రం 5 గం . కి రాజమండ్రి ఆనం రోటరీ  హాలులో భారతీయ చలన చిత్రం వందేళ్ళ పండుగ జరిగింది . డా . మధు ఫోమ్రా జ్యోతి ప్రజ్వలనం చేయగా , శ్రీ పట్ట పగలు వెంకట్రావు సభకి అధ్యక్షత వహించారు . శ్రీ ఎస్ .బి . చౌదరి సభకి ఆహ్వానం పలికారు . విశిష్ట  అతిధిగా విచ్చేసిన ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు మాట్లాడుతూ నూరేళ్ళ చలన చిత్ర విశేషాలను తెలిపారు గుఱ్ఱం  జాషువా  మూకీ సినిమాలకు కథా వ్యాఖ్యాతగా రాజమండ్రిలోనే జీవితాన్ని ప్రారంభించారని , ఆయన సినిమా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ , ఆ విషయాలను వివరించారు . 

ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిధులుగా డా.ఎమ్.ఆర్.వి.శర్మ , శ్రీ మన్యం బాబ్జి , డా .వి . రాజేంద్ర ప్రసాద్ విచ్చేశారు . 

సిని నటుడు జిత్ మోహన్ మిత్ర సంగీత బృందం అధ్వర్యంలో డా . గంగా కిషోర్ , డా . కె.వి. చౌదరి , డా . రాజేంద్ర ప్రసాద్ , డా . రామ మనోహర్ (ఈల పాట ), మణి , శేఖర్ , గంగాధర్ , సత్యనారాయణ  , ఫణి , ఎ . ప్రభాకర్ సినీ గీతాలను ఆలపించారు . 

అనంతరం సినీ విజ్ఞాన విశారద ‘శ్రీ ఎస్ .వి. రామారావు’ చే రూపొందించిన ” వందేళ్ల  సినిమా వైభవం ” లఘు చిత్ర ప్రదర్హన జరిగింది . 

 – విహంగ మహిళా సాహిత్య పత్రిక

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

UncategorizedPermalink
0 0 vote
Article Rating
2 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
B.V.Sangayya ( Nani)
B.V.Sangayya ( Nani)
7 years ago

బాగుంది

B.V.Raghavarao
B.V.Raghavarao
7 years ago

బాగుంది