స్త్రీ యాత్రికులు

    ‘మా ఊరికి ఎందుకు వచ్చావు?’.
    ‘టోటెమ్‌ స్తంభాల చిత్రాలు వేసుకోవటానికి’.
    ‘అవి నీకు ఎందుకు?’ అని వారు అడిగినప్పుడు వాటిని నకలు తీసుకోనిస్తారో, లేదో అని భయం పట్టుకొంది ఎమిలీకి.
    ‘అవి చాలా అందంగా ఉంటాయి కాబట్టి నాకు ఇష్టం. పైగా అవన్నీ చాలా పాతవి అయిపోయాయి. కొత్తవి చేయటం ఈ రోజుల్లో తగ్గిపోయింది కదా, అందుకు’ అని వివరిస్తుంది ఎమిలీ.
    ‘వీటిని ఏం చేసుకుంటావు నువ్వు?’
    ‘ఇవన్నీ చిత్రాలుగా వేసి, మ్యూజియంలో ఉంచుతాను. కొంతకాలం పోయాక ఎలాగైనా ఈ చెక్కవి అన్నీ విరిగిపోతాయి. అప్పుడు వీటి అసలు రూపాలు మ్యూజియంలో చూసి, గతిం చిన వైభవాన్ని ఊహించుకుని ఆనందించవచ్చు’. అని చెబుతుంది.
    ‘ఇంకా మాకేమన్నా లాభం ఉందా?’
    ‘ఎందుకులేదు? భవిష్యత్‌ తరాలవారు మీ సంస్కృతిని గురించి తెలుసుకునే అవకాశం ఉంది. పైగా ఐరోపాదేశాలవారు కూడా వీటిని చూసి సంతోషిస్తారు.’ అంటుంది.
    ఈ విధంగా ఆ ఇంట్లో వారందరికీ తృప్తిగా సమాధానాలు రావటంతో ఎమిలీని వారి గ్రామం లోనికే కాదు, వారి హృదయాల్లోకి కూడా ఆహ్వానిస్తారు. అక్కడికి రావటంలో తన ఉద్దేశ్యం స్పష్టంగా చెప్పటంతో తనకి ఆహ్వానం సులభంగా దొరుకు తుంది.
    పాత ఊళ్ళో ఆకాశానికి అడ్డంగా నిలబడి ఉన్న టోటెమ్‌ స్తంభాలు ఉదయపు సూర్యకాంతిలో అద్భుతంగా కనిపిస్తుంటాయి ఎమిలీకి. ఆ వెలుగు సృష్టించిన బలమైన నల్లని నీడలు పొడుగ్గాసాగి, నేల బారుగా ప్రయాణాలు చేస్తుంటాయి. ఆ స్తంభాల్ని ప్రతి అంగుళం మేరా ఎంతో ఓపికతో ఒక పద్ధతి ప్రకారంగా మలిచారు. వాటిల్లో తల్లీబిడ్డల బొమ్మలే ఎక్కువ. చిన్న పిల్లల ముఖాల్లో కూడా తెలివిగల పెద్దవారి కవళికలు కనిపిస్తాయి. గుండ్రంగా ఉండే ఆ స్తంభాలపై బిడ్డను ఎత్తుకున్న తల్లి శిల్పాన్ని చెక్కటానికి ఎంత శ్రమించారో తెలుస్తుంది. ఈ శిల్ప సాంప్ర దాయం కిట్వాన్‌ కూల్‌ టోటెమ్‌ స్తంభాలన్నిటికీ వర్తిస్తుంది. ఒక స్తంభం ముందు తన ఈజెల్‌ అమర్చుకుని వాటిని చిత్రించటం మొదలు పెట్టగానే చిన్నపిల్లలు చుట్టూతా మూగిపోయేవారు. ఆ రోజు సాయంత్రాని కల్లా ఉరుములు, మెరుపులతో ఆకాశం చీకటిగా తయారైంది. ఆ వింతైన ఆటవిక అందాల స్తంభాల్ని చూస్తూ ఉండగానే వర్షంలో తడిసిపోతుంద్ష్మి తన కుక్కపిల్లతో సహా. ఒక పక్కగా ఉన్న సమాధిచాటుకి వెళ్ళి, దాని పంచలో ముడుచుకొని వణికిపోతూ కూర్చొంటుంది. తాను తలదాచుకొన్న ఆ సమాధిలో ‘ఒక షమాన్‌ (భూతవైద్యుడు) శాశ్వత నిద్రపోతున్నాడు’ అని అక్కడ ఉన్న బోర్డుని చదవగానే భయంతో ఒక పాకలోకి లగెత్తుతుంది. అప్పటికే అక్కడ వర్షంతో తడిసిన గుర్రాలు గుంపులుగా ఉంటాయ్ష్మి తోకలతో ఈగల్ని కొట్టుకొంటూ. ఎమిలీ చేతిలో ఉన్న  తడిసిన కుక్కపిల్లని చూడగానే కొన్ని గుర్రాలు సంతోషించినట్లుగా, చిన్న సకిలింపుతో వారికి ఆహ్వానం పలుకుతాయి.
    రెండుగంటల తర్వాత వర్షం తగ్గుతుంది. అడవి గుర్రాలన్నీ ఒక్కసారి బారుగాసాగి ఒళ్ళు విరుచుకుని, చర్మాన్ని చిన్న అలలుగా కదిలిస్తూ, పెద్దగా సకిలించేసరికి ఆ నీటి తుంపర్లతో మరోసారి తడిసిపోతుంది ఎమిలీ.
    టోటెమ్‌ స్తంభాలమీద ఉన్న శిల్పాల ముక్కుల చివరినుండి బొట్లు బొట్లుగా నీళ్ళు కారుతుంటాయి. ఏవో ముత్యాలు మెరుస్తూ జారిపోతు న్నట్లుగా క్షణాల్లో పరిసరాల్లో పొగమంచు ఆక్రమించుకొంటుంది. చల్లని గాలితో చెట్ల ఆకులు కదలిపోతూ ఉండగానే, తానొక అద్భుతమైన ప్రకృతి చిత్రంలో భాగమైపోతుంది ఎమిలీ కార్‌.
    ఇంటికి వెళ్ళిన ఎమిలీతో అలెక్‌ ‘మా అత్తయ్య నిన్ను తన ఇంట్లోనే ఉండమని కోరింది’ అని చెప్పగానే తనకి తోడు దొరికినందుకు సంతోష పడుతుంది. ఇంట్లో వారందరూ ఎమిలీని వారి సొంత మనిషిగా చూసు కోవటం మొదలుపెట్టేసరికి ఆమెకి ఎంతో సరదాగా ఉంటుంది.
    కొత్తగా కట్టిన దుంగల ఇల్లు ఎంతో అందంగా ఉంది. వేళ్ళాడుతూ ఉండే ఎండుచేపల తోరణాలు ఒక పక్కగా ఉన్నాయి. గుండ్రని మందమైన తుంగపరుపులు. ఆ పరుపుల్లోకి పక్షిమాదిరిగా జొరబడి ఒక పక్కనుండి వాటిని కప్పుకోవాలి. ఆ ఇంటి మధ్యలో ఉన్న ఉయ్యాల్లో ఒక పాప జోగుతూ ఉంటుంది. అందరూ నిద్రపోతూ ఉంటారు. తన కుక్క పెట్టే చిన్న గురక, అక్కడ గడ్డకట్టిన నిశ్శబ్దాన్ని కొరుకుతూ ఉందా అనిపించేది.
    రాత్రి తనకి తోడుగా నిప్పు పురుగులు వచ్చి, గాల్లో వంపులు తిరిగేవి. ఒక మణి పురుగు వచ్చి ముక్కుమీద వాలేది. కుక్కపిల్ల వాటిని పట్టుకుందామని ఎగిరేది. ఉదయాన్నే ఎమిలీ నదికి వెళ్ళి ముఖం కడుక్కొం టానంటే అలెక్‌ అత్తగారు ఒప్పుకునేవారు కాదు. ఆమెకి ప్రత్యేకంగా బేసిన్‌తో నీళ్ళు తెచ్చిఇస్తారు.
    పాత గ్రామంలో టోటెమ్‌లు చాలా ఉన్నాయి. వాటిని చిత్రించ టానికి ఎన్నో రోజులు వారితో ఉండాలి. ఉదయం మొదలు సాయంత్రం అయ్యేదాకా వాటిని చిత్రిస్తూ తాను వచ్చిన ఐదు రోజుల్లో అన్ని బొమ్మలూ వేయగలిగింది.
    చివరికి తాను బయలుదేరాల్సిన రోజు రానేవచ్చింది. కానీ ఆ ముందురోజు రాత్రి వర్షం బాగాపడింది. తెల్లవారినా ఆగలేదు. కాస్త తెరిపి ఇస్తుంది అనుకొని, తన సామానంతా సర్దుకునేసరికి మళ్లీ వర్షం మొదలై వదలకుండా మూడురోజులు కురిసింది. ఈ వర్షాలకి తన దారంతా గోతులతో నిండిపోయి ఉంటుందని కంగారుపడుతుంది ఎమిలీ. మూడు రోజులు ఉందామని వస్తే అదికాస్తా వారం రోజులు పట్టింది. ఎమిలీ తెచ్చుకొన్న బిస్కట్లన్నీ తడిసిపోతాయి.ఈసారి సామానులు ఏమీ లేని గుర్రాల బండిలో, అలెక్‌ పక్కనే ఆనందంగా కూర్చుంది. తీరా బయలుదేరబోయే సరికి అలెక్‌ అత్తగారు వచ్చి, ‘ఎమిలీ, నువ్వేసిన బొమ్మల్ని మాకు చూపించకుండానే తీసుకు వెళతావా?’ అని అడుగుతుంది. కట్టలన్నీ విప్పి ఎంతో ఓపిగ్గా అందరికీ చూపిస్తుంది. మీకు ఏమన్నా కావాలా? అని కూడా అడుగుతుంది. ‘మాకు ఇవేమీ వద్దు. ఎందుకంటే ఇవి అందరూ చూస్తారు, మాకు మా స్తంభాలు ఉన్నాయిగా, అవి నీవేమీ తీసుకుపోవటం లేదుకదా?’ అని అనగానే అందరూ నవ్వుకొంటారు.
    అలెక్‌ ఎంతో జాగ్రత్తగా ఎమిలీని తీసుకువెళ్ళి ఆమెని మొదట్లో కలిసిన ప్రదేశంలో వదిలిపెడతాడు. ఆ దారిలో ఎమిలీకి ఫారెస్ట్‌ పోలీసులు ఎదురై ‘వాళ్ళు నిన్ను బాగా చూశారా?’ అని అడుగుతారు. ‘చాలా బాగా చూశారు, అవకాశం ఉంటే మరోసారి వారివద్దకి వెళ్ళాలనిపిస్తుంది’ అంటూ ఎంతో ఆనందపడుతుంది. అది విన్న పోలీసులు ఆశ్చర్యపోతారు. ఇండియన్లు ఉండే ఆ కిట్వాన్‌ కూల్‌ పరిసరాలకి పోలీసులు, సర్వేయర్లు, మిషనరీలు ఎవరు వెళ్ళినా రాళ్ళతో కొట్టి తరిమేసేవారు. అలాంటిది ఈమెకి  వసతి ఎట్లా కల్పించారబ్బా! అనుకొంటారు.
 

 నరమాంస భక్షకుల మధ్య జీవితాన్ని గడిపినడెయిసీ బేట్స్‌

    ఆస్ట్రేలియా ఖండంలోని ఆటవిక మానవులతో కలిసి జీవించి, వారి అభివృద్ధికోసం పాటుపడిన స్త్రీ డెయిసీ బేట్స్‌. ముప్ఫై ఐదు సంవత్సరాల పాటు ఆస్ట్రేలియాలో తిరిగిన ఈ మహా యాత్రికురాలు ఎబారిజినల్‌ జాతివారికి తన జీవితకాలాన్నే కాకుండా తన ఆస్తినంతా ఖర్చు పెట్టింది. ఆస్ట్రేలియాలో ఒక లెజెండ్‌గా మారిపోయిన ఈ సాహస వనిత దాదాపు ఎనభై రకాల స్థానికుల ఆటవిక భాషల్లో భావ ప్రకటన చేయ గలిగింది.
    డెయిసీ బేట్స్‌ యాంత్రపాలజిస్టు కాకపోయినా, ఆటవికులకి ఒక ప్రాణస్నేహితురాలిగా, సలహాదారుగా ఒక హృదయం ఉన్న స్త్రీగా సహాయం చేసింది. ఆమె వారితోపాటుగా ఉంటున్నా, తన తరహాలో ఒక చిన్న గుడ్డ గుడారంలోనే నివసించేది. అయితే ఆమె ధరించే బట్టలు మాత్రం, నాటి విక్టోరియా రాణిని తలపింపచేసేవి. తన దైనందిన కార్యక్రమాలన్నీ ఒక పద్ధతిలో చేసుకొంటూ పోయేది. గుర్రపు స్వారీ చేయటం, ఎక్కువ దూరాలు నడుచుకొంటూ వెళ్ళటం ఆమెకు చాలా ఇష్టం.
    డెయిసీ బేట్స్‌ క్రీ.శ. 1862వ సం||లో ఐర్లాండు దేశంలో జన్మించింది. తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్‌. ఆమెకి ఇంగ్లీషువారి ఆచార వ్యవహారాలంటే ఎంతో ఇష్టం. అలాగే వారి పరిపాలనా విధానంకూడా ఆమెని ఆకట్టుకుంది. ఇంగ్లండుకోసం దూర ప్రాంతాల్లో ఉండి పనిచేసే వారంటే ఆమెకు ఎంతో ఇష్టం. తనకీ అలాంటి అవకాశం వస్తే బాగుంటుంది అనుకొంటూ ఉండేది.

        దురదృష్టవశాత్తూ తల్లిదండ్రుల్ని కోల్పోయిన డెయిసీ, సర్‌ ఫ్రాన్సిస్‌ ఔట్రామ్‌ అనే ఇండియన్‌ సివిల్‌ సర్వెంట్‌గా రిటైరైన ఒక ఆఫీసర్‌ ఇంట్లో పెరుగుతుంది. అతడు ఎంతో దయకల పెద్ద మనిషి. కొంతకాలం ఇండియాలో కూడా పనిచేశాడు. అతని నుండే డెయిసీకి దానగుణం, ధర్మగుణం అబ్బుతాయి. కాని అతడు మరణించాక డెయిసీ ఐర్లాండు వదిలేసి, ఆస్ట్రేలియాకి వెళుతుంది. అది 1884 వ సంవత్సరం. ఒంటరితనం వల్ల దిగులుపడి, మానసికంగా దెబ్బతిన్న డెయిసీ అనారోగ్యం పాలవుతుంది. డాక్టర్ల సలహామేరకు ప్రయాణాలకి సిద్ధం అవుతుంద్ష్మి ఇసాబెల్లాబర్డ్‌ బిషప్‌ మాదిరిగా. పొట్టిగా, సన్నగా ఉండే డెయిసీకి ఎంత ధైర్యమో చెప్పలేం. ఆస్ట్రేలియాదేశం వెళ్ళి ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంది. ఈ ప్రయాణాల్లో పరిచయమైన జాక్‌ బేట్స్‌ అనే క్వీన్‌ లాండ్‌ భూస్వామితో డెయిసీకి పెళ్ళి జరిగిపోతుంది. ఒంటరితనంతో ఎవరూ లేకుండా అనారోగ్యంతో జీవించటంకంటే, ఒకరితోడుగా సంతోషంగా ఉండటం మంచిదనిపిస్తుంది. భార్యా భర్తలిద్దరూ కలసి పరిసరాల్లోని మైదానాల్లో హాయిగా తిరుగుతూ ఉండేవారు. ఆరోగ్యం కుదుటపడింది. ఎడారుల్లో ఒంటెల మీద, మెట్ట ప్రాంతాల్లో గుర్రం మీద కూడా యాత్రలు చేశారు. ఇలాంటి యాత్రలు చేయటం వలన డెయిసీ ఎంతో ఆనందపడింది. ఎప్పటికీ ‘ఆ ఎడారి పరిసరాల్లోనే జీవించాలి’ అని ఆమె నిశ్చయించుకొంది.
    పది సంవత్సరాలపాటు సంసారజీవితం అనుభవించిన తరవాత కొన్ని కారణాలవలన డెయిసీ, జాక్‌బేట్స్‌ విడిపోతారు. వారి కొడుకుని భర్త తీసుకుపోతాడు. ఆవిధంగా విడిపోయాక డెయిసీకి భర్తతోగాని, కొడుకుతో గాని ఎలాంటి సంబంధబాంధవ్యాలు ఉండవు. కానీ ఆ పశ్చిమ ఆస్ట్రేలియా మైదానాలంటే ఎంతో ఇష్టపడింది.  ఒంటరిగా గుర్రం మీద అవన్నీ తిరుగుతూ ఉండేద్ష్మి ఒక సోమరి మేఘం మాదిరిగా, తప్పిపోయిన ఆస్ట్రేలియా ముర్రేజాతి గొర్రెమాదిరిగా. ఎందుకనో ఆస్ట్రేలియాని వదిలి వెళ్ళాలనిలేదు. చేతిలో ఉన్న డబ్బు తక్కువ. భర్తకీ, బిడ్డకీ దూరమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో గుండెదిటవు చేసుకుని ఎలా వచ్చిందో అలాగే ఇంగ్లండుకి వెళ్ళిపోతుంది.
    అక్కడ ఆమెకి తెలిసినవారు ఎవ్వరూ లేరు. ఏదో ఒక పని చేసేందుకై సిద్ధపడక తప్పలేదు. పత్రికా విలేఖరి వద్ద పని దొరుకుతుంది. కొంతకాలం తరువాత తానే ఒక జర్నలిస్టు స్థాయికి ఎదిగి, తన కాళ్ళమీద తాను నిలబడే స్థాయికి చేరుకొంటుంది. ఆర్ధికంగా శక్తి ఏర్పడగానే డెయిసీ ఆలోచనలు మళ్ళీ ఆస్ట్రేలియా మైదానాల్లోకి ప్రయాణిం చటం మొదలుపెట్టాయి. ఆ ప్రకృతిలోకి వెళ్ళాలనీ, ఆ దట్టమైన అడవుల్లో తిరగాలనీ, పచ్చగా ఉండే ఆ కొండల కొసలకి ఉయ్యాల కట్టి ఊగుదా మనీ, మెరిసే ఆ సరస్సుల పక్కన కూర్చొని సింగారించుకొందామనీ, ఆ ప్రకృతితో మమేకం అవుదామనీ మరలా కలలు కనటం మొదలుపెట్టింది.
    నగరాల్లో జీవనం వలన డబ్బు వస్తుందేకాని, మనశ్శాంతి రాదు అనుకొంది. ఆమెకి పలికేవారు కరువయ్యారు. ఒంటరిగా ఇంట్లో ఉండటం ఆమెకు సాధ్యమయ్యేది కాదు. మళ్ళీ పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేదు. తనలాగా స్వాతంత్య్రాన్ని అనుభవించిన వారు పరిసరాల్లో లేకపోయేసరికి ఆస్ట్రేలియా మైదానాల్లోకి వెళ్ళటమే ఆమెకు శరణ్యమయ్యింది. ‘అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి?’ అని ఆలోచిస్తున్న సమయంలో అలాంటి అవకాశం తననే వెతుక్కుంటూ వచ్చింది.
    1899 వ సం||లో టైమ్స్‌ పత్రికలో పడిన ఒక ఉత్తరంలో పశ్చిమ ఆస్ట్రేలియాలో ఇంగ్లీషువారు ఆయా పరిసరాల్లోని అబారిజినల్‌ ప్రజల్ని ఇబ్బందులకి గురిచేస్తున్నట్లుగా, వారిపై కఠినంగా ప్రవర్తిస్తున్నట్లుగా రాశారు.
    ఆ ఉత్తరం రాసింది ఆ ప్రాంతంలో పనిచేస్తున్న రోమన్‌ కాథలిక్‌ చర్చి బిషప్‌. తాను ఒకప్పుడు తిరిగిన పశ్చిమ ఆస్ట్రేలియాలో ఇలాంటి ఘోరకృత్యాలు జరగటం ఆమె సహించలేకపోయింది. వెంటనే టైమ్స్‌ పత్రిక వారిని సంప్రదించి, ఆస్ట్రేలియా ఆటవిక మానవులపై జరుగుతున్న దమనకాండ గురించి ఒక సమగ్ర నివేదికను సమర్పిస్తానని వారిని ఒప్పించింది. పైగా ఇది బ్రిటీషు ప్రభుత్వపు గౌరవ మర్యాదలకు సంబంధిం చిన విషయం. తమ దేశంపై ఇలాంటి చెడ్డ ప్రచారం జరగటం మంచిది కాదు కాబట్టి, వారు వెంటనే అంగీకరించి, డెయిసీ బేట్స్‌ని ఆస్ట్రేలియాకి పంపుతారు.
    డెయిసీ ఆస్ట్రేలియాలో ఓడ దిగి, పశ్చిమ మైదానాల్లో ఎనిమిది వందల కి.మీ.ల దూరం గుర్రపుబగ్గీ మీద ప్రయాణించి, ఆ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొంటుంది. అప్పుడామె వయసు ముప్ఫై ఏడు సం||లు మాత్రమే.
    అక్కడ ఒక నెలరోజులు పాటుతిరిగి, ఇరుపక్షాల అభిప్రాయాలు తీసుకొన్నాక, ఇంగ్లండువారు ఎవరిమీదా ఎలాంటి బలప్రదర్శనగానీ, దౌర్జన్యంగానీ చేయలేదనీ, రోజువారీ కూలీలకి మంచి మాంసం బదులుగా, ఓఫాల్‌ (ఎముకలు, పేగులు, గిట్టలు లాంటివి) ఇవ్వటంవలన, పని లేనప్పుడు పంపించి వేయటం వలన మాత్రమే స్థానికులు ఇబ్బందికి గురయ్యారని తెలుసుకొంటుంది. ఈ విషయాలన్నీ చాలా నిజాయితీగా వర్ణించేసరికి బ్రిటీషు ప్రభుత్వం ఆమెను మెచ్చుకోవటమే కాక మరిన్ని కుతూహలమైన విషయాల్ని తమకు తెలియజేయమని, ఆమెకు ప్రత్యేక నిధులు కూడా సమకూరుస్తారు. తాను ఏ ప్రయాణమైతే చేయాలనుకుందో, అదే ప్రయాణాన్ని ప్రభుత్వమే తన చేత చేయించటానికి ముందుకు వచ్చేసరికి, డెయిసీ సంతోషంతో అంగీకరిస్తుంది.
    డెయిసీ రాసిన రిపోర్ట్స్‌కి బ్రిటీషువారు స్పందించి, ఆటవికులకి మంచి ఆహారాన్ని ఇవ్వటం, నిత్యం ఏదో ఒక పనికల్పించటం, మొదలు పెట్టగానే వారు తిరగబడటం మానుకొంటారు. దీని వలన మాంసం కోసం జంతువులని చంపటం కూడా తగ్గుముఖం పడుతుంది.
    బిషప్‌ రాసిన ఉత్తరంలోని విషయాలు తప్పు అని నిరూపించేసరికి ఆయనే స్వయంగా డెయిసీ వద్దకు వచ్చి, క్షమాపణలు చెప్పి, ‘బీగిల్‌ బే’ ప్రాంతాల్లో నివసించే ప్రజల అలవాట్లు మార్చటానికి డెయిసీని సహాయంగా తీసుకెళతాడు. ఆ ప్రాంతాల్లో రోమన్‌ కాథలిక్‌ మిషన్‌ వారి అభ్యుదయ భావాల్ని వినేవారి కంటే, ఎగతాళిచేసేవారే ఎక్కువగా ఉంటారు. అందు వలన అక్కడి పరిస్థితులమీద కూడా సమగ్రమైన సమాచారం ఇచ్చినప్పుడే చర్చివారి కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కాబట్టే డెయిసీ సేవలు ఆ చర్చివారికి అవసరమౌతాయి.
    బీగిల్‌బేకి వెళ్ళగానే గుంపులుగా చేరిన ఆ ప్రజలందరూ బిషప్‌ చెప్పే ఉపన్యాసం వినకుండా పెద్దగా అరవటం, గందరగోళంగా తమలోతాము అరచుకోవటం చేస్తుంటారు. వారిలో కొందరు ఎముకలు మెళ్ళో వేసుకుని తిరుగుతుంటారు. కొందరేమో చిన్న పిల్లల మాంసాన్ని ఆనందంగా తింటూ కనిపిస్తారు. అలాంటి అనాగరిక దృశ్యాల్ని కళ్ళారా చూసిన డెయిసీ, ‘వారికి తప్పనిసరిగా దైవాన్ని తెలుసుకునే అవసరం ఉంది’ అని నిశ్చయించు కొంటుంది. వారిని నరమాంస భక్షణ నుండి కూడా తప్పించటం తన బాధ్యతే అనుకొని, ఆ మిషనరీ వారితోనే ఉండి, తన వంతు సేవల్ని వారికి అందించాలనుకొంటుంది.  

 – ప్రొ.ఆదినారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

242

యాత్రా సాహిత్యం, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)