దేవుడు – అమ్మ?? CEO??

చిన్నప్పటి నుంచీ నేను దేవుడిని చాలా సార్లు ఫీల్ అయాను

వచ్చేసిందా అనుమానం – ఆ టైటిల్ ఏంటి “దేవుడు – అమ్మ?? CEO??” అని – ఈ దేవుడ్ని ఫీల్ అవడమేంటి? – ఈ లలిత కి అసలు బాగానే ఉందా అని?

అసలు విషయం లోకి వస్తున్నాను.

చిన్నప్పుడు మా నాన్నమ్మ తో మా అనాతవరం శివాలయానికి, అమలాపురం వేంకటేశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు ఆవిడ వెనకాల నాకు అప్పటికి నోటికి వచ్చిన అన్ని శ్లోకాలు పాడుకుంటూ ప్రదక్షిణం చేసి, ఆయా దేవుళ్ళ ప్రసాదాలు తిని జడలో పూజార్లిచ్చిన  పూలు పెట్టుకుని, ఇంటికి వచ్చి కొబ్బరి ముక్కలు తినేస్తే ఆవిడ హ్యాపీ.తరవాత కొంచెం పెద్దయాక గుండులో వున్న హాయి తెలిశాక 4 , 5 తరగతుల్లో ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడల్లా జుట్టంతా ఆ కళ్యాణ  కట్ట లో అర్పించి, నాలుగు పూసల దండలు , ఒక డాక్టర్ ప్లాస్టిక్ బొమ్మ కొనుక్కుని ఇంటికి వస్తే బోల్డంత సంబరం,  నాకు, పప్పీ కి, కుట్టి కి – మమ్మల్ని  చూసి అమ్మ, నాన్నలు హ్యాపీ.

ఇంకొంచెం పెద్దయాక వినాయక చవితి కి పాలవెల్లి కట్టి,  దసరా కి నవరాత్రి పూజలకి ఓంకార క్షేత్రంకి వెళ్లి, సంక్రాంతి కి ముగ్గులేసి, ఉగాది కి వేపపూత పచ్చడి తిని, శ్రీరామ నవమికి పానకం తాగి, వరలక్ష్మి వ్రతానికి కథ చదివితే – ఆడ పిల్లలు చేతికి అంది వచ్చారని అమ్మ హ్యాపీ.

ఆ తర్వాత పెళ్ళయ్యాక ఇంకా బోల్డు, బోల్డు పూజలు అమ్మ, అత్తయ్య చెప్పినట్టు చేస్తూ ఇంటికి వచ్చిన వాళ్లకి తాంబూలమిస్తూ గల గలా మాట్లాడుతూ తిరిగేస్తే అందరూ హ్యాపీ.

ఇన్ని రకాలుగా దేవుడికి సంబంధించినంత పండుగలు, పూజలు, వ్రతాలు చేస్తున్నప్పుడు అవి చేసినందువల్ల నా వాళ్లకి కలిగిన, కలిగించిన ఆనందం లో నాకు దేవుడు కనిపించేవాడు.

కానీ నా అంతట నేను ఎప్పుడూ ఇది కావాలి అని ఇప్పటివరకూ దండం పెట్టుకోలేదు. దేవుడి ముందు కళ్ళు మూసుకుంటే ఏమీ గుర్తు రాదు. అలాగని నాకు కష్టమంటే ఏమిటో తెలియదా అంటే -:( ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు, సీత కష్టాల్లా కాకపోయినా లలిత కష్టాలు లలితవి అనేలా ఏవో వున్నాయి లెండి. ఆయనని అంటే దేవుడిని ఎలాగు ఏమీ అడగను కదా అని అంత పట్టించుకోను. నాకు వీలైనప్పుడు దీపం పెడతాను- లేకపోతే బజ్జో పెడతాను.

ఇప్పుడు అసలు నా  టైటిల్ వెనక కథ లోకి వస్తున్నాను. ఇదిగో ఇలాగే ఏదో పూజల గురించి మాట్లాడుతూ మా తులసి (నా ఆడపడుచు) అడిగింది – అదేంటి వదినా-   రోజూ దీపం పెట్టకపోతే ఎలా? పూజలు అవీ చేయకపోతే ఎలా- దేవుడికి కోపం రాదా? ఏదైనా చెడు జరగదా అని.

అప్పుడు నా ఎప్పటి “లలిత – ఉవాచ” మోడ్ లో ఇలా చెప్పాను:

చూడు తులసి! నా అభిప్రాయం లో దేవుడ్ని రెండు రకాలుగా అనుకోవచ్చు.

1. దేవుడు ఒక  కంపెనీ CEO లాంటి వాడు. ఆ CEO కి తన కంపెనీ లో పని చేసే ప్రతి  ఏమ్ప్లాయీ గురించి పట్టించుకునేంత తీరిక వుండదు. అందుకని చాల డిపార్టమెంట్లు, బోల్డు టీములూ క్రియేట్ చేసి ఏ డిపార్టుమెంటు ప్రాబ్లెమ్స్ ఆ లెవెల్ లో సాల్వ్ అయేలా చూస్తాడు. ఒకసారి ఆఫీసు లో చేరాక కొన్నాళ్ళే ఎవరైనా హెల్ప్ చేస్తారు. తర్వాత అన్నీ మనమే మన పొజిషన్  కి తగినట్లు మేనేజ్ చేయాలి.

మన ప్రపంచానికి దేవుడు CEO అనుకుంటే ఆయన మనకి సెక్యూరిటీ కి ఇల్లు, అమ్మ, నాన్న, చదువుకోవడానికి  స్కూల్, డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు క్రియేట్ చేసాడు. వీటన్నిటి తో పాటు మనుషులకి ఎమోషనల్ డిపెందేన్సి ఇచ్చాడు – మనకి అవసరం అయినపుడు అయిన వాళ్ళు ఆదుకోవడానికి.  ఇన్ని చేసాక ఇంకా ‘దేవుడా – నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు’ అని దండాలు పెడితే సముద్రపు ఇసుకలో రేణువు లాంటి వాళ్ళం. ఆయనకి మన అప్లికేషను చేరేటప్పటికి మన జీవిత కాలం అయిపోతుంది.  అందుకని నేనేదో దీపం పెట్టకపోతే ఆయనకి పట్టించుకునేంత తీరిక వుండదేమో – అసలు ఆయనకి ఈ లలిత అనే ఒక ప్రాణి వుందని గుర్హు పెట్టుకునేంత అవసరం లేదేమో. సో – అక్కడ మనం సేఫ్.

2. ఇంకా రెండో రకం గా ఆలోచిస్తే దేవుడు అమ్మ లాంటి వాడు. ఒక అమ్మకి పది మంది పిల్లలున్నాఅందరి మీద సమానంగా ప్రేమ వుంటుంది- అందరినీ ఒకేలా చూస్తుంది. చంటి పాపకి పాలిస్తుంది. పెద్ద బాబు కి ఆమ్ పెడుతుంది. ఇంకో పెద్ద పాపని చెల్లిని జాగ్రత్తగా చూడమంటుంది. ఒక రోజులో ఎవరికి తగినట్టు అందరి అవసరాలూ తీరుస్తుంది. స్కూల్ కి వెళ్ళే పిల్ల అయినా, పాలు తాగే పసిపాప అయినా – వాళ్ళ వాళ్ళ ఆకలిని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్లకి కేర్ చేస్తుంది కానీ-  ఏ ఒక్కరినీ నిర్లక్ష్యం  చేయదు. పాప గుండెల మీద తన్నిందని అలగదు, కొట్టదు, అన్నం పెట్టడం మానేయదు.

దేవుడు కూడా అమ్మ లాగే  అనుకుంటే లలిత సముద్రం లో నీటి బొట్టయినా, ఇంకోటి అయినా – ఏమైనా పట్టించుకుంటాడు, జాగ్రత్తగా చూస్తాడు. తప్పు చేసినా క్షమిస్తాడు. అప్పుడు కూడా నేను సేఫ్ 🙂

అలా కాకుండా దీపం పెట్టలేదు, పూజ చేయలేదు అని నా మీద అలిగితే దేవుడెలా అవుతాడు? నిర్గుణ స్వరూపుడైతే కోపం, అహంకారం, పగ వుంటే దేవుడెలా అవుతాడు? ఒక వేళ అలాంటివాడే దేవుడైతే నేనెంత బాగా చేసినా ఏదో ఒక తప్పు పడతాడు – మామూలు మనిషి లాగే.

నా వరకు నాకు –
ప్రొద్దున్న లేచి మాట వల్ల కానీ, చేత వల్ల కానీ ఎవరినీ బాధించకుండా
ఎవరి చెడు నీ కోరుకోకుండా
ఎవరి ఏ రకమైన అభివృద్ధి కైనా ఈర్ష్య పడకుండా
ఎవరి గురించీ చెడు మాట్లాడకుండా
చేతనైనంతలో సహాయం చేస్తూ
పసి పాపలా మనసారా నవ్వగలిగిన
ప్రతి ఒక్కరిలో దేవుడు వున్నాడు
అలాంటి దేవుడ్ని నేను చాలా, చాలా సార్లు ఫీల్ అయ్యాను- అవుతూనే వుంటాను.

– లలితా TS.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , Permalink

One Response to దేవుడు – అమ్మ?? CEO??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో