అమెరికన్‌-ఇండియన్‌ గ్రామాల్లో తిరిగిన చిత్రకారిణి ఎమిలీ కార్‌

స్త్రీ యాత్రికులు

              ఎమిలీ కార్‌ కెనడా దేశపు ప్రఖ్యాత చిత్రకారిణి. ఆమెకి గ్రామీణ వాతావరణం అంటే ఎంతో ఇష్టం. కాబట్టే కెనడా దేశంలోని కొలంబియా తీరంలో ఉన్న ఇండియన్‌ గ్రామాల్లో ఉన్న టోటెమ్‌ చెక్క స్తంభాల మీద చిత్రకళను రక్షించి, భావితరాల వారికి అందించిన ఘనత ఎమిలీ కార్‌కి దక్కింది.
ఆమె ఉండేది వాంకూవర్‌ అయినా ప్రతి వేసవి కాలంలోనూ పరిసరాల్లోని ఇండియన్‌ గ్రామాల్లోకి వెళ్ళటం విధిగా పాటించేది. వాంకూ వర్‌కి ఉత్తరాన ఉన్న ‘క్వీన్‌ ఛార్లెట్‌’ దీవుల్లో అద్భుతమైన ప్రయాణాలు చేసి, వాటికి లోతట్టుగా ఉన్న స్కీనా, నాస్‌ నదీ ముఖ ద్వారాల గుండా  వెళ్ళి అక్కడి గ్రామాల్లో ఉండే జానపద సాంప్రదాయాల్ని అధ్యయనం చేస్తూ ఉండేద్ష్మి ముఖ్యంగా టోటెమ్‌ స్తంభాలను గురించి. టోటెమ్‌ స్తంభాల్ని చెట్ల మొదళ్ళతో తయారుచేస్తారు. అవి సుమారు 20-25 అడుగుల ఎత్తు ఉంటాయి.
టోటెమ్‌ అంటే ఒక వంశానికి లేదా కుటుంబానికి గుర్తు. అది ఒక పక్షి, చేప, జంతువు ఏదైనా కావచ్చు. కొన్నిసార్లు ఏదోఒక మొక్క లేదా సహజమైన వస్తువు కూడా టోటెమ్‌ స్థాయిలో పూజింపబడుతుంది. అలాంటి టోటెమ్‌ని ఆ కుటుంబంవాళ్ళు తమ పూర్వీకుడిగా గుర్తించి, గౌరవిస్తారు. అలాంటి టోటెమ్‌లో ఏ బొమ్మలు వేస్తున్నారో వాటిని చంపి తినటం తప్పుగా భావిస్తారు. పైగా అలాంటి వాటిని పెంచటం వలన తమకి శుభం జరుగుతుందనుకొంటారు. కాబట్టి వాటి అభివృద్ధికి కృషి చేస్తారు. ఆ జాతి సభ్యులందరూ ఆ టోటెమ్‌తో గుర్తింపు పొందుతారు.
ఈ టోటెమ్‌ స్తంభాలని సాధారణంగా పొడవైన చెట్ల మొదళ్ళను చెక్కటం ద్వారా తయారు చేస్తారు. కొన్నిసార్లు ఆ చెక్క శిల్పంమీద రంగులు కూడా వేస్తారు. వాటిలో ఒక శక్తివంతమైన భావ ప్రకటన కనిపిస్తుంది.
ఎమిలీకార్‌ జీవితం అంతా ఒంటరిగానే గడిపింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు నుండి దూరం అయ్యేసరికి జీవితం పట్ల ఒక అవగాహనకి వచ్చి ఏకాంతంగానే ఉండటానికి నిశ్చయించుకొంది. చిత్రకళ అంటే చిన్నప్పటి నుండి ఇష్టమే కనుక అది తనకు మంచి కాలక్షేపంగా మారిపోవ టంతో మరెవ్వరి అవసరం లేకుండాపోతుంది. తోడుకోసం ఇంట్లో కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకొంటుంది. వాటిని అప్పుడప్పుడూ తన కారులో ఎక్కించుకొని విక్టోరియా నగర వీధుల్లో తిప్పుతూ పరమానందం పొందేది.
కెనడా పశ్చిమతీరంలోని ప్రకృతి అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆ పరిసరాల్లో నివసించే ఇండియన్లు ఎమిలీకి చాలా ఇష్టం. బొమ్మలు వేసుకొంటూ ఒంటరితనంతో విసిగిపోయిన ఎమిలీ కార్‌     కొంతకాలం బయట తిరుగుదామని నిశ్చయించు కొంటుంది. ఆ విధంగా తనకు యాత్రలపట్ల కుతూ హలం పెరిగి పరిసరాల్లోని దీవుల్లో చాలా ప్రాంతాలు తిరుగుతూ వాటిని తన చిత్రకళలో ప్రతిసృష్టి చేసేది.
కొలంబియా తీర గ్రామాల్లో నాశనమైపోతున్న టోటెమ్‌ స్తంభాల మీద చెక్కిన శిల్పాల్ని నకలు తీసుకొందామని నిర్ణయించుకొంది. అలాంటి శిల్పాలు కిట్వాన్‌ కూల్‌ గ్రామంలో ఎక్కువ. ఎంతో అందంగా ఉన్న ఆ స్తంభాలు ఆమెని బాగా ఆకర్షిస్తాయి.
నార్త్‌ అమెరికన్‌ ఇండియన్‌ ప్రజలు, వాంకూవర్‌ పరిసరాల గ్రామాల్లో ఇలాంటి టోటెమ్‌ స్తంభాలని చాలా చెక్కారు. వారి పూర్వీకుల ఆత్మలు ఆ స్తంభాల్లో దాక్కొని ఉంటాయని వారి నమ్మకం. ఇలాంటి స్తంభాలు పోలినేషియన్‌ దీవుల్లో ఉండేవారు కూడా చెక్కారు. పరిసరాల్లోని అడవుల్లో దొరికే పెద్ద చెట్లను తొలచి, వారి వంశం లేదా కుటుంబ కీర్తిని తెలియజేయటానికి, ఆ సమాజంలో వారి ప్రత్యేకతని చాటుకోవటానికి గ్రామాల్లో ప్రతిష్టాపన చేస్తుంటారు.
ఆ కిట్వాన్‌ కూల్‌ గ్రామం సరిగ్గా ఏ కొండల చాటున ఉందో ఎవరూ చెప్పరు. కొంతకాలం ఎదురుచూస్తుంది. చివరికి ఒకరోజున ఆ గ్రామ పెద్దగారి అబ్బాయి స్వయంగా తారసపడటంతో, ‘నన్ను మీ ఊరికి తీసుకెళ్ళగలవా?’ అని అడుగుతుంది. అతడిపేరు అలెక్‌. బాగా సిగ్గుపడే మనిషి. ఇంగ్లీషు మాత్రం ధారాళంగానే మాట్లాడుతున్నాడ్ష్ము యాస ఉన్నా సరే. ‘రేపు ఉదయం హడ్సన్‌బే వద్దకి మీరు రాగలిగితే తప్పనిసరిగా తీసుకెళతాను’ అంటాడు. ఎమిలీ కార్‌ ఎంతో ఆనందపడుతుంది. రెండు మూడు రోజులకి సరిపడా ఆహారం, దోమల మందు, తన గుడారం, పెయింటింగ్‌ సామగ్రి అంతా తీసుకుని బయలుదేరుతుంది.
చెప్పిన సమయానికి అలెక్‌ తన నాలుగు గుర్రాల ట్రక్కు తీసుకుని సిద్ధంగా అక్కడే ఉంటాడు. ట్రక్కునిండా కలపవేసి ఉంది. ఆ పొడుగాటి చెక్కలమధ్య ఉన్న ధాన్యపు బస్తాలమీద అప్పటికే ముగ్గురు పనివాళ్ళు ఎగుడుదిగుడుగా కూర్చుంటారు. ఎమిలీ వారితోపాటుగా అక్కడ సర్దుకోక తప్పలేదు.
ఆ గుర్రాల బండి సాగిపోతూ ఉంటే ఒక ముసలాయన పెద్ద తుపాకీ తీసుకొని, బండి వెనుక వేగంగా నడుస్తూ వస్తుంటాడు. ఎమిలీకి తోడుగా ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకుంటుంది. గూడు లేని ఆ బండి మీదకి ఎండ ఎక్కువగా రావటంవల్ల కుక్కపిల్ల గసపెట్టటం మొదలెడు తుంది. ఆ బండి ఊపులకి తాను ఏ మలుపులో పడిపోతుందో తెలియ కుండా ఉంటుంది ఎమిలీకి.
గుర్రాలు చాలా కష్టపడి లాగుతుంటాయి. వాటి వంటికి అతుక్కున్న దుమ్మంతా చెమటకి తడిసి, కారిపోతూ ఉంటుంది. రోడ్డంతా గతుకులు. ముందు వరుసలో కూర్చున్నవారు మాటిమాటికీ తమ స్థలాలు మార్చుకొం టుంటార్ష్ము చలికాలంలో పకక్షుల జంట గుడ్ల పొదుగుమీద మారుతూ ఉన్నట్లుగా.
ఉన్నట్లుండి ఒక మలుపులో గుర్రాలు పెద్దగా సకిలిస్తూ ఎగిరేసరికి బండి పూర్తిగా ముందుకి వాలిపోతుంది. చిందరవందరగా జారిపోయిన ఆ కలపంతా సర్దుకోవాల్సి వచ్చింది. అదొక గంటపని. ఇంతలో అందరూ దిగి, కాసేపు విశ్రాంతి తీసుకొంటారు. ఆ తరువాత తలా ఒక చెయ్యివేసి, బండి మీద కలపని సక్రమంగా సర్దుతారు.
ఎదురుగా చిన్న నది ప్రవహిస్తూ ఉంటుంది. అలసిపోయిన గుర్రా లకి తిండి, నీళ్ళు, ఏర్పాటుచేస్తారు. ఎమిలీ తన కుక్కని తీసుకుని ఆ నది ఒడ్డుకి పోకుండా ఎలా ఉండగలదు? ప్రకృతిని ఆస్వాదించటానికే కదా ఇంత దూరం వచ్చింది. కుక్క నోటికి ప్రేమగా బిస్కట్లు అందిస్తుంది. అది కాలువలో లోతు లేనిచోట నీళ్ళు తాగుతూ ఉంటే, ఎమిలీ కూడా సరదా కోసం గట్టు మీద బోర్లా పడుకొని తన కుక్క పిల్లలాగే ఆ ప్రవహించే నీటిని నోటితో అందుకుంటూ ఆనందపడుతుంది. బహుశా ఆమెకి జాన్‌ కాన్‌ స్టేబుల్‌ అనే రొమాంటిక్‌ చిత్రకారుడి గ్రామీణ వాతావరణాన్ని తెలిపే బొమ్మలు గుర్తుకివచ్చి ఉంటాయి.
ఎండ తగ్గిందాకా అందరూ ఆ చెట్ల కిందే విశ్రాంతి తీసుకొని, పొద్దు తిరగగానే మళ్ళీ ప్రయాణంసాగించి, సాయంత్రం అయ్యేసరికి ఒక చిన్న అడవి ప్రాంతం చేరుకొంటారు. అక్కడ దోమల గుంపులు ఎక్కువ.
చివరికి ఒక పొడవాటి పాత్రమాదిరిగా ఉండే లోయ అంచుకు ఆనుకుని ఉన్న రోడ్డులోకి చేరిపోతారు. అది మరీ గతుకులరోడ్డు. ‘నేను దిగి నడుచుకుంటూ ఆ ముసలాయన పక్కనే వస్తాను’ అంటుంది ఎమిలీ. కానీ అలెక్‌ ఆమె కోరికని పట్టించుకోడు. ‘అదిగో! ఆలోయకి అవతల ఉండేదే కిట్వాన్‌కూల్‌. దగ్గిరే, త్వరగానే చేరుకొంటాం’ అంటూ నచ్చ చెబుతాడు. అప్పటికీ ఎమిలీ తన పంతం మానకపోయేసరికి ‘మేడమ్‌, మీరు నడుస్తూ వచ్చారనుకోండి, గ్రామంలోని కుక్కలు మీ బుజ్జికుక్కని పట్టుకుని రక్కేస్తాయి, ఆ తర్వాత మీ ఇష్టం’. అని కొద్దిగా భయపెట్టి బండిని కొంచెం వేగంగా పోనిస్తాడు. ‘ఎమిలీ మేడమ్‌ బండిదిగదు’ అను కొన్నాడు అలెక్‌. ఎమిలీ మాత్రం వెంటనే బండిదిగి కుక్కపిల్లను చంక నెత్తుకొని బండివెనుకనే నడవటం మొదలు పెడుతుంది. కానీ త్వరలోనే కాళ్ళు నొప్పులు పుట్టి మరలా బండెక్కి ఒక పెద్ద ఓట్‌ ధాన్యపు బస్తామీద కూర్చుంటుంది. పడిపోకుండా ఆ బస్తాలమీద కూర్చోవటానికి కొంచెం సర్కస్‌ విన్యాసాలు తెలిసి ఉండాలనుకొంటుంది మనస్సులో.
పొద్దుగూకే సమయానికి కిట్వాన్‌ కూల్‌ గ్రామం చేరుకుంటారు. కుక్కలు పరుగెత్తుకుంటూ, అరుస్తూ వచ్చి తోకలు తిప్పుతాయి ప్రశ్నార్ధ కంగా. బండిదిగిన వారు ఎవరి బస్తాలు వారు దించుకుని, తీసుకుపోతారు. అలెక్‌ కూడా ఒక బస్తా తీసుకుని ఏదో ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అప్పటివరకూ బండి వెనకాలే వస్తున్న ముసలాయన తన తుపాకీ సర్దుకుని ఎటో వెళ్ళాడు. చివరికి ఆ కట్టెలబండి, తనూ, తనకుక్క మిగులుతారు. తనకేమీ అర్ధం కాదు. అలెక్‌ త్వరగా వస్తే బాగుంటుంది కదా! అనుకొంటుంది.
చీకటయ్యేకొద్దీ తన చుట్టూతా గ్రామ సింహాలు చేరటం, అవి మొరగటం, సమాధానంగా ఎమిలీ పిల్లకుక్క కూడా ఏదో వింతగా మొరగటంలాంటిది చేస్తూ ఉంటే ఎమిలీకి భయమేస్తుంది. ఇంతలో అదే వీధిచివర ఏదో గందరగోళం జరగటంతో ఊర కుక్కలన్నీ ఒక్కసారిగా పరుగులంకించుకుని జారుకుంటాయి. ఈ అవకాశంతో ఎమిలీ కుక్క హాయిగా గాలి పీల్చుకుంటుంది. ఎమిలీకి చిరాకు ఎక్కువయ్యే సమయాని కల్లా అలెక్‌ వచ్చి, రాత్రికి భోజనం, నివాసం ఏర్పాట్లు చేస్తాడు. తనకి ఇచ్చిన ఇంట్లోకి వెళుతుండగా దూరాన టోటెమ్‌ స్తంభాల ఛాయ కనిపి స్తుంది. ‘తెల్లారగానే వాటి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి’ అనుకొంటూ భోజనంచేసి, నిద్రలోకి జారుకుంటుంది.
మరుసటి ఉదయం అలెక్‌ వచ్చి, ఊరిచివరగా ఉన్న వాళ్ళ నాన్నగారింటికి తీసుకెళతాడు ఎమిలీని. అది కొయ్య దుంగలతో కట్టిన పెద్ద ఇల్లు. ఎంతో విశాలంగా ఉంది. ఏడుకిటికీలు, రెండు తలుపులు. అలెక్‌ నాన్నగారిని చూడగానే ఎమిలీ ఆశ్చర్యపోతుంది. ఆయన ఎవరోకాదు నిన్నంతా బండివెనక తుపాకీ పట్టుకుని నడుస్తూ వచ్చినాయనే. పేరు డౌస్‌. ఎమిలీకి మంచి గదిఇచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తారు.
వారి ఇంట్లో పెత్తనమంతా స్త్రీలదే. ఆరోజు మాత్రం ఎమిలీ ఇల్లు కదలటానికి వీల్లేదు అని చెప్పారు. రాత్రికి తన బెడ్‌రూం అంతా చాలా ప్రత్యేక పద్ధతిలో అలంకరించి పెడతారు. ఒక ఆర్టిస్టు అయిన ఎమిలీకూడా వారి కళా దృష్టికి ఆశ్చర్యపోతుంది. పైగా ఆరోజు ఆమెతో ఎవరూ మాట్లాడ లేదు. దోమలు మాత్రం పీక్కుతింటాయి. ఎందుకీ బాధ అనుకొంటూ భయపడుతుంది. ఇంటివారు దోమలని పొమ్మని పొగపెడతారు. అయినా అవి రావటం మానవు.
మూడవరోజు తెల్లారగానే అలెక్‌ వచ్చి ‘నీతో మా అత్తగారు మాట్లాడా లనుకొంటున్నారు’ అనగానే సరే అంటుంది. కానీ సమస్యంతా ఎక్కడంటే అత్తగారికి ఇంగ్లీషురాదు. ఆ ఇద్దరికీ అలెక్‌ అనువాదం చేసిపెట్టాలి.

ప్రొ.ఆదినారాయణ

(ఇంకా  వుంది )

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 229
యాత్రా సాహిత్యంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)