Category Archives: ధారావాహికలు

వీరనారి ఝాన్సీ ఝల్ కారీ బాయి

                                 చరిత్రలో అంతరించిపోయి న  సాహసగాథలు , సాహస వీరులు ఎంతో మంది ఉన్నారు . కొందరి చరిత్రలు గ్రంధస్థమైతే , మరికొందరి సాహసాలు చరిత్ర పొరల్లో భూస్థాపితం అయిపోయి ఉంటాయి .                                       స్త్రీల విజయాలు . సాహసాలు , త్యాగాలని ఈ రోజుకి బాహాటంగా అంగీకరించని పరిస్థితులు  కన్పిస్తాయి.  స్త్రీలనే  వంకతోనో , చులకన … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , | Leave a comment

ముకుతాడు

                తూర్పున వెలుగు రేకలు పరుచుకుంటున్నాయి. తెరిచిన కిటికీ రెక్కల గుండా వెలుతురు ముఖంపై పడడంతో బలవంతాన కళ్ళు తెరిచింది చంద్ర.. దాదాపు ప్రతి రోజు నిద్ర ఆమెకు దూరమవుతూనే వుంది. నిన్న రాత్రి ఒక్క పిసరు కూడా నిద్ర లేక పోవడంతో, రెప్పలు బరువుగా వాలి పోతున్నాయి. అలసట వదలడంలేదు. అయినా తప్పదు, లేచే … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

టగ్ ఆఫ్ వార్ – 6

రత్నబాల వెళ్ళాక చాలా సేపు ఇద్దరూ స్థబ్దుగా ఉండిపోయారు. ఎప్పటికో తేరుకుని , “ అయ్యో ఈ రోజు సంధ్యా దీపం కూడా వెలిగించలేదు “ అంటూ లేచిన శకుంతల లైట్ వేసి “ మోహం కడుక్కుని రండి వేడిగా కాస్త టీ ఇస్తాను” వంటగదిలోకి కదలబోయింది. చటుక్కున ఆమె చెయ్యి పట్టుకుని ఆపి “శకూ … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

ఒయినం

 సేడేనీ పుట్నిల్లు బయలెల్లు సీతా పురుషుడేల కలిగెనమ్మ పూలవాసనా               ||పు|| ఈ సక్కాని లోకసుందరి జానకమ్మకు ఐదుసేర్ల ముతియాలు వొల్లెపోసుకో                   ||ఐ|| సేడేనీ పుట్నిల్లు బయలెల్లు సీతా సేడేనీ పుట్నిల్లు బయలెల్లు సీతా … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

స్త్రీ యాత్రికులు

ఎడారి ప్రయాణాల పిపాసి రోజితా ఫోబెస్‌  ’ప్రయాణాలు చేయటానికి ఒక సమతుల్య మానసిక పరిస్థితి అవసరం. నా ఒంటరి జీవితం నాకు నేర్పిన పాఠం ఇదే’ అని బాహాటంగా చెప్పిన రోజితా ఫోబెస్‌ ఒక గొప్ప ఎడారి ప్రేమికురాలు. ఎడారి ప్రేమికులకు బ్రిటన్‌లో కొరవలేదు. డఫీ, యాగ్నెస్‌ లెవిస్‌, మారియాంటోనిటా వీళ్ళందరూ ఎడారిని ప్రేమించిన యాత్రికులే. అన్నిటి … Continue reading

Posted in ధారావాహికలు, యాత్రా సాహిత్యం | Leave a comment

గౌతమీ గంగ

             టంటంఠ, టంఠ,  ట ట టంట టంఠః’’ అన్నారు భోజరాజుగారు కొలువులో ప్రవేశిస్తూనే. రాజాభిషేకే మద విహ్వలాయాః! హస్తాచ్యుతో హేమఘటః! సోపాన మార్గే లుళితిశ్చ తస్య, శబ్దోభవతీ!  టంటంట టంటా! ట ట టంట టంఠ! అన్నాడు కాళిదాసు. ఉన్నత సౌధపు చలికలో భోజరాజుగారు స్నానం చేస్తున్నారు. … Continue reading

Posted in ఆత్మ కథలు, ధారావాహికలు | Leave a comment

ఎనిమిదో అడుగు

‘లేదా? అంత రిక్వెస్ట్‌ చేసి, అప్పజెప్తే వుండకుండా వెళ్లిందా? ఇదేదో పెద్ద దేశ ముదురులా వుందే… ఇంకా నయం ఆయన చేతికున్న ఉంగరాలను పట్టుకెళ్లింది కాదు…. ఇలాంటి వాళ్లను చూసే కాబోలు     పెద్దవాళ్లు మనుషుల్ని నమ్మకూడదంటారు…’ తనక్కడ వుండలేదన్నది పక్కనపెట్టి ఆ అమ్మాయి మీద కోపంతో పళ్లునూరాడు హేమేంద్ర మౌనం ప్రభాత్‌ మనసుకి చివుక్కు మనిపించి… … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

మహత్ముడిచే  సాహస మహిళగా కీర్తించబడిన అంజాదీ బేగం  భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ప్రజలు కుటుంబాలకు కుటుంబాలుగా ఉద్యమించిన సంఘటనలు దర్శనమిస్తాయి. ఆ కుటుంబాలలోని పురుషులు సహజంగా బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుండగా, మహిళలు వారికి సహకరించటం సర్వసాధారణం. అలా కాకుండా  ఓ కుటుంబంలోని స్త్రీ, పురుషులంతా ఉమ్మడిగా పరాయి పాలనకు వ్యతిరేకంగా పోరుబాట ఎంచుకుని ఉద్యమించటం … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

టగ్ ఆఫ్ వార్ – 5

Swathee sripada

ఈ లోగానే ఇలాగ తొందరపడుతుందని అనుకుందా? రత్న బాల కు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నిజానికి ఎక్కడ వుంది పొరబాటు. తలతిప్పి చూస్తె ఈశ్వరరావు గురకపెడుతూ నిద్రపోతున్నాడు. ***************** రమాపతి రావ్ ఇంటికి వచ్చేసరికి అలసిపోయి వచ్చిన భర్తకు వేడి వేడిగా కాఫీ పట్టుకు వచ్చింది శకుంతల. యాభై దాటినా రమాపతి రావ్ సన్నగా చువ్వలా … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

గౌతమీ గంగ

ఆమె ఆరవ ఏటనే సంపన్న కుటుంబీకులు తమ కోడలిగా చేసుకున్నారు. నోములూ, వ్రతాలూ,  పండుగలూ,  పబ్బాలకు వచ్చే వియ్యాలవారి మర్యాద రత్తమ్మగారికి తలకు మించిన భారం అయ్యేది. ఇంట్లో మరో ఆడతోడు లేదు. లచ్చన్నగారికి పురుషాహంకారం. ఆమెకు తోడు పడనీయకపోగా ఆయన పరిచర్యలలో ఏపాటి లోపం వచ్చినా ఆమెపై తాడి ఎత్తున లేచేవారు. సుబ్బన్నతల్లి పరిస్థితి … Continue reading

Posted in ఆత్మ కథలు, ధారావాహికలు | Leave a comment