మీటూ(కవిత)-డా. కరుణశ్రీ

గొంతు చించుకున్నా నా అరుపులు నాకే వినిపించేలోకంలో నాశబ్దాలు చెవుల కోసం వెతుక్కుంటున్నాయి నా శబ్దాలు మాట్లాడతాయ్ దారి తప్పితే పోట్లాడతాయ్ మోసంచేయాలని ప్రయత్నిస్తే నిలదీస్తాయ్ నా శబ్దాలు నిన్నూనన్నూ ఓదార్చే నేస్తాలు మిన్నూ మన్నూ ఏకం చేసే దస్త్రాలు ఏమనుకుంటున్నావ్ నేనాదమరిస్తే నా కంటి మీద కునుకు లేకుండా చేసి నువ్వు హాయిగా ఊరేగుదామనుకుంటున్నావా? అదేం కుదరదు గాలినికూడాబంధించిగడ్డిపోచనుకూడా కదలనివ్వను నా శబ్దాలుప్రతిధ్వనుల్ని మీటుతున్నాయి నా అరుపులు కెరటాల్లా ఎగిరెగిరి పడుతున్నాయి సముద్రాల సౌందర్యాన్నిదోచుకోవాలని తుఫాన్ల వెంట పడొద్దు సుడిగుండంలా చుట్టేసినామరూపాల్లేకుండా చేస్తాయ్. […]

Read more

ఆవరణం (కవిత)-వెంకట్ కట్టూరి

దేవాలయం విద్యాలయం సులువుగా తలరాతలు మార్చబడేది ఇక్కడే జీవితాలు చిందరవందరయ్యేది ఇక్కడే ఆనందడోలికల్లో తేలేది ఇక్కడే విషాదంలో మునిగిపోయేది ఇక్కడే వయసుపిలిచేది ఇక్కడే ఓర కంటితో కన్ను గీటేది ఇక్కడే తొలిచూపుతో వలచి కాలు జారిపడేది ఇక్కడే జీవితం సర్వనాశనం అయ్యేది ఇక్కడే చేసిన నేరానికి శిక్ష అనుభవించేది ఇక్కడే …. విద్యా బుద్దులు నేర్చుకొమ్మంటే లేదంటూ ప్రణయ కలపాల్లో మునిగి పోయేది ఇక్కడే  కాలంతో పాటుకరిగిపోయేది ఇక్కడే మొహంలోపడి తెరుకోలేవురా పడవ మునిగి పోయేదాక జీవితం తెల్లరిపోయిందని తెలుసుకోలేవురా గాణాoకాలు నేర్చుకోరా అంటే ఆమెకెన్ని […]

Read more

మట్టిపాదాలు పదాలైతే అమ్మ (కవిత )-పేరం అమృతరావు

అమ్మ సీరపైన సొక్క తొడుక్కొని పత్తిచేలో పత్తి తీస్తుంటే ఆపరేషన్ థియేటర్లోని డాటరమ్మలా ఉండావే పురుగుపట్టి పంటపోతే నష్టపరిహారం రైతుకిచ్చి ఖాళీ గిన్నేకదా నీకూలికి కిరీటం ********* ఏం చేద్దాం చెప్పు ….? పుట్టింటికాడ తోమిన అంట్లు సాలవన్నట్టు ఆడపిల్లకు సదువెందుకని మెట్టినింటికి కూడా సామాన్లేసి పంపిండు నియయ్యా ******** తలకు మించినభారం వొద్దనుకొని నీతలకో తమ్మే దగిలిస్తే సారా తాగేమొగుడితో సంసారానీదుతున్నావ్ గుదిబండలాంటి జీవితం గుప్పెడు మెతుకులకోసమే కదా ! ******** కాదు కాదు నా కోసమని కూలీనాలీ చేసి నీ కొంగుకు […]

Read more

పచ్చని సంతకం(కవిత )-దేవనపల్లి వీణావాణి

నేనక్కడ లేనన్న విషయం నాకు తెలియనే లేదు తలుపు విరిగిన అలమరలో వెనుక వరుసకు చేరిన దుపట్టాల మూట.. స్టీలు గిన్నెలకు మార్పిడి కానున్న పట్టు కుచ్చుల లంగా ఇక ఏ మాత్రం అటకకు భారం కాదు సగం తెగిన కాలి పట్టా రానున్న వెండిగిన్నెలో కరిగే ఒక అక్కర్లేని జ్ఞాపకం.. నా వద్ద జవాబు లేదు కిటికీ తెరిచి చూసాను అడవిలోకి దూరిన చందమామ ముడుచుకున్న ఆకుల మధ్య చిన్నబోతోంది దిక్కులేని మేఘం చెట్టును వెతుక్కుంది వర్షం బయటే కాదు లోపల కూడా […]

Read more

నాన్నే నా జీవితం(కవిత )-ఈడిగ.నగేష్

నాలో సగం నాన్న నాన్న లో సగం నేను నడక నేర్పింది నవ్వులు పంచింది నన్ను ముందుకు నడిపింది నాన్నే! నా శ్వాస నా ధ్యాస నా సర్వం నాన్నే! క్రమశిక్షణ నేర్పి నాకు ఉన్నత స్థానాన్ని కల్పించి నాన్న ఓ మూలన నిలిచిపోయాడు! నువ్వు ముళ్ళ బాటలో నడిచి మాకు దారి నిండా పూలు పరిచావు! కష్టాలను భరించావ్ ఆకలిని దిగమింగావు ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని మా జీవితాల్లో వెలుగులు నింపావు! ఏమివ్వగలను నాన్నా నీకు మరొక జన్మంటూ ఉంటే నీకే కొడుకుగా […]

Read more

నజరానా ఉర్దూ కవితలు-5 – అనువాదం ఎండ్లూరి సుధాకర్

నా మద్యం విలువ నీకేం తెలుసు అర్చకా ! అది తాగి నేను దీవిస్తే నరకమైనా స్వర్గమే ఇకా !                                                   -రియాజ్ ఖైరాబాదీ *నిన్నటి దాకా నా మనసు బహు ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడేమయ్యిందో మరి ఆ పై వాడికే తెలియాలి           […]

Read more

ఆశ (కవిత )- ఎస్ .ఆర్ .పృథ్వి

అమ్మంటే అమృతం బిడ్దేమి చేసినా కమ్మని ప్రేమనే పంచుతుంది నాన్నంటే కషాయం ఘాటుగా వున్నా బిడ్డ భవితకి ప్రాణం రెండు చేతులు పట్టుకుని నడక నేర్పింది వాళ్లే వర్తమానానికి పునాది రాళ్లు అలసిపోయిన అమ్మా నాన్నలకు సేద తీరాలన్న ‘ఆశ ‘ వుంటుంది నీ పలకరింపు పులకింపు జేస్తుంది నీ స్పర్శ తృప్తిని నింపుతుంది నీ భవిష్యత్తులో ఆనందాన్ని వెతుక్కుంటూ కరిగిపోతారు వాళ్ళు  -ఎస్ .ఆర్ .పృథ్వి ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Read more

మరొక రెండు(కవిత )- దేవి ప్రియ

పలుకు పన్నీటి బొట్టంత కానీ అంతే పరిమళం అంతే విరిదళం . కవిత కన్నీటి చుక్కంత కానీ అంతే ఆర్ద్రం అంతే సంద్రం .                                                                                     […]

Read more

మీ టూ(కవిత )-మాణిక్యం ఇసాక్

పనిచేసే చోట స్త్రీల లైంగిక వేధింపులపర్వానికి చరమగీతం పాడాలని మబ్బులు పట్టిన ఆకాశం ఒట్టి ఉరుములకూ మెరుపులకూ నేల దాహం చల్లారదని వేయి మైళ్ళు నడకైనా ఒక్క అడుగుతోనే ప్రారంభ మవ్వాలని ట్విట్టర్ లో అమెరికన్ అలైసా మిలానో నెటిజన్ల ఉద్యమం దూరాలను దాటి దగాపడిన స్త్రీల భారాలను తగ్గించడానికి భారతదేశంలో దుమారంలేపుతూ బడాబాబుల వెన్నులో వణుకు పుట్టిస్తూ నానా పటేకర్ వైరముత్తు అక్బర్ ఎందరెందరో…. మున్ముందు ఎవరి బండారం బయట పడుతుందో? ప్రపంచమే కుగ్రామమైన నేడు దగాపడిన స్త్రీలకు ఒక వేదికైన మీ […]

Read more

మేమెవరం ?(కవిత )– వెంకట్ కట్టూరి

ఎవరం మేం ఎవరం వర్ణ సంకరం చేసారు జాతిసంకరం అన్నారు వెలివాడల్లోకి నెట్టారు మురికి కూపాల్లో మాసిపోయిన శరీరాలతో కంపుకొడుతూ కట్టుకోడానికి గుడ్డ పీలిక లేదు రొచ్చుకంపులో బతికేటోళ్లం రోతబురదల్లో మసలేటోళ్ళం ఎవరం మేం ఎవరం… కామంతో మదమెక్కిన ఏనుగుల్లా మా ఆడ బిడ్డలను చెరిచారు మీకామాగ్నికి బలైపోయిన ఎందరో అభాగ్యురాళ్ళ జీవితాలకు సజీవ సాక్ష్యం మేం ఎవరం మేం ఎవరం… అక్రమ సంతానమని పేరుపెట్టి, గ్రామంలో లేకుండా పొలిమేర అవతలకు గెంటేసి హీనజాతిగా ముద్రవేశారు కడజాతి వారిగా చేశారు ఎవరం మేం ఎవరం…. […]

Read more
1 2 3 4 5 47