అంతే తేడా …

నానీ గణగణా మోగుతున్న ఫోన్ ని అందుకున్నది. అది చెల్లెలు సత్యవతి నుండి. “మా ఊళ్ళో తిరణాల జరుగుతున్నది, మీరందరూ – యావన్మందీ – తక్షణం బయల్దేరి వచ్చేయండి.” “సత్యం! ప్రతి సంవత్సరం తప్పకుండా జరుగుతున్నదే కదా, ఇంత అకస్మాత్తుగా – ఈ పిలుపు – ఏదో ప్రత్యేకత – ఉండే ఉంటుది …. ” – “ఈ ఏడు మా పెద్దోడి చిన్నోడు కృపాకర్ – సినిమాలలో వేసే వాడు …. , కృపాకర్ వస్తున్నాడు, ఈ పల్లెటూరి జాతర సీనులన్నిటినీ కథలో […]

Read more

ది కిస్‌(కథ)-గీతాంజలి

ఎత్తైన కొండల మీద పర్చుకుంటున్న చల్లని వెన్నల వెన్నల్లో మెరుస్తున్న పచ్చని గడ్డి… ఆ గడ్డిలో మొలచిన నక్షత్రాల్లాంటి తెల్లని గడ్డిపూలు, ఆకాశంలో నక్షత్రాల్ని పలకరిస్తున్నాయి. నా నేస్తాలతో చిన్నప్పుడు నేను ఆడుకున్న ఆ కొండలు… తెల్లని గడ్డిపూలను చూస్తూ మురిసిన ఆ క్షణాల్లోకి మళ్ళీ ఇలా… మనిషంత ఎత్తున ఆ కొండకి నన్ను అదుముతూ అతను నా మొఖం వైపుకి వంగుతున్నాడు. అతని కళ్ళలో వెన్నల్లో మత్తడి తెగిన జలధార నా వైపుగా ప్రవహిస్తున్నది. అతని పెదాలు మాత్రం కాంక్షతో చిట్లడానికి సిద్ధమైన […]

Read more

నా భర్త నన్ను రేప్‌ చేశాడు!!!(కథ)-గీతాంజలి

నేను విజ్ఞాన జ్యోతి హాస్పిటల్లో మెడికల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నాను. ఆ రోజు డ్యూటీకొచ్చేప్పటికీ ఆలస్యమైంది. పేషంట్స్‌ వర్సగా ఎదురు చూస్తున్నారు. నన్ను చూడగానే రమాదేవి అనే పేషంట్‌ ఆత్రంగా లేచి నిల్చుంది చేతిలో రిపోర్ట్స్‌తో… కళ్ళల్లో ఏదో భయం కనపడుతున్నది. ఎప్పట్నించి ఎదురు చూస్తున్నదో మొదటి నంబరు ఆమెదే. నార్మల్‌ ఉన్నాయా మేడమ్‌ రిపోర్ట్స్‌ ఏమన్నా ఫరక్‌ ఉన్నదా అని అడిగింది రమాదేవి చాలా భయం నిండిన దిగులు చూపులతో. ఏం చెప్పాలి? ఆమె భర్త చెడు తిరుగుళ్ళు తిరిగి – ఆమెకి […]

Read more

ఆమే, ఆమెకు సైన్యం (కథ )-శ్రీదేవి

“సౌదా!!! పారిపో ఇక్కడ నించి” అని హెచ్చరిస్తున్నాడు సౌరభ్, చర్చ్ గది లో.ముసుగు దొంగ, సౌదా నుదుటన పాయింట్ బ్లాంక్ రేంజీ లో తుపాకీ పెట్టి క్రూరం గా నవ్వుతున్నాడు,ఆమె చలించలేదు సరి కదా ” కాల్చారా దమ్ముంటే” అంటోంది. ఆమె కళ్ళు పరమ శివుని త్రినేత్రం వలే అగ్ని గొళాలయి, ముసుగు దొంగ ని తీక్షణంగా చూస్తున్నాయి.అంతే కాదు “ఎంట్రా ఆలోచిస్తున్నావు? తొందరగా కాల్చు” అంటూ రెచ్చ కొడుతోంది వాడిని. దొంగ, తుపాకి ఆమె నుదుటికి బలంగా నొక్కిపెడుతూ “ఎందుకే, నా చేతికి […]

Read more

మృగాల మధ్య!(కథ)-వేణు నక్షత్రం

గోడపై వ్రేలాడుతున్న మ్యూజికల్ క్లాక్  ఉన్నట్టుండి చిన్నగా సంగీతం వినిపించింది.    అంతవరకూ నిశ్శబ్దంగా ఫైళ్లలో ముఖాన్ని దూర్చిన రవీంద్ర గడియారం వంక చూశాడు, సమయం అయిదు గంటలయ్యింది.   ఉదయం నుండీ కనీసం లంచ్ కూడా చేయకుండా చాలా వరకు ఆఫీసు పనిలో బిజీ వున్నాడు  రవీంద్ర. ఇంక ఓపిక లేక ఫైలన్నీ సర్ది,  బైక్ స్టార్ట్ చేసి ఇంటి వైపు బయలు దేరాడు.   ఒక  అర్థ గంట తర్వాత రోడ్డు పై హైదరాబాద్ ట్రాఫిక్ ని జయించి  ఓ వీరునిలా విజయ గర్వముతో  […]

Read more

ప్రశ్న (కథ) – గీతాంజలి

స్వరూప స్కూటర్ని వేగంగా నడిపిస్తోంది. స్వరూప మనసు అతలాకుతలం అయిపోతోంది. పద్మ తల్లిదండ్రుల మీద ఆశ్చర్యం, కోపం, అసహ్యం కలగలిసిన భావంతో ఆమె చాలా అనిశ్చితంగా ఉంది. పదిహేను రోజుల క్రితం ఎనిమిది సంవత్సరాల పద్మని వాళ్ళ కాలనీ యువకుడే అయిన పదహారు సంవత్సరాల రమేశ్‌ స్కూల్లో చాక్లెట్లు పంచిపెడుతున్నారని అబద్ధం చెప్పి నిర్మానుష్యమైన స్కూల్లో సాయంత్రం వేళ తరగతి గదిలో పద్మపై లైంగిక అత్యాచారం చేశాడు. తర్వాత విపరీతమైన రక్తస్రావంతో స్పృహ తప్పిన పద్మని కర్రలతో విపరీతంగా కొట్టి చంపేసాడు. ఈ వార్త […]

Read more

రాగి చెంబు మిల మిలా …

రాగి చెంబు – నానీ చేతిలో తళ తళా మెరుస్తోంది. ఆ తామ్ర చెంబు – శంకరాభరణం నిర్మలమ్మ మామ్మ మర చెంబు అంత అమూల్యమైనది. ఏడేళ్ళ వయసులో పల్లకిలో పెళ్ళికూతురిగా , కూర్చుంది – తన పక్కన తనకెంతో ఇష్టమైన ఈ తామ్ర పాత్రిక – ఈ ఎర్రని చెంబు సృష్టించిన కథలు అబ్బో, ఎన్నెన్నో! ఈ వేళ, నానీ సెల్లార్లోకి దిగింది . భూతల గృహ విభాగం – అదే, సెల్లార్ లో తులసి చెట్టుకి పూజా పునస్కారాలు చేయాలి కదా […]

Read more

ఖడ్గచాలనం

అదిగో లబ్‌డబ్‌మని చప్పడు మొదలయింది. అమ్మ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అంటే నాన్న ఇంటికి వచ్చాడన్న మాట! నాన్న ఇంటికొస్తే ఇంట్లో ఒక బీతావహ వాతావరణం మొదలవుతుంది. ఇల్లు ఇల్లులా అనిపించదు. క్రూరమృగాలు సంచరించే కీకారణంలా మారిపోతుంది. ఆయన ఇంట్లో లేకపోతే మృగం ఎప్పడు ఏ క్షణంలో వచ్చి తన మీద దాడి చేస్తుందో తెలియని అమాయక కుందేలులా అమ్మబితుకు బితుకు బితుకుమంటూ వుంటుంది. ఆయనింట్లో వుంటే ఆహారం కాబోయే కుందేలులా వజ వజ వణుకుతూ వుంటుంది. అమ్మ పొట్టలో వెచ్చగా పెరుగుతున్న […]

Read more

బెల్లం ముక్క(కథ )- ఆదూరి హైమావతి

” నీమీద మీవాళ్ళకంతా ఇంకా ప్రేమ ప్రవహిస్తుందనే ఉంనుకుంటున్నావా!” ” నీకాసందేహ మెందుకూ!నేను పుట్టినపుడే’ మహాలక్ష్మి మనింట పుట్టిందని పొంగిపోయారు, ఇప్పటివరకూ అంతే నామీద ఏమాత్రం మావాళ్ళకు ప్రేమతగ్గలేదు, నీవేచుస్తావుగా అంతా ఎలా పరుగెట్టు కొస్తారో!” ధీమాగా అంటున్ననన్ను నవ్వుతూచూసి అంది రత్న. ” నీ భ్రమవదిలిస్తాను. పందెమా!” ” పందెం ఏదైనా నేను తయార్ ! “ “సరే నీవుగెలిస్తే ,మీవారికింకానీమీద ప్రేమనది పారుతుంటే నేను ఓడిపోయినట్లు, నీకోసం మీవారెవ్వరూ మూడు రోజుల్లోగా రాక పోతే నీవు ఓడిపోయినట్లు.అప్పుడు ఓడినవారు గెలిచినవారు ఏంచెప్తే […]

Read more

ఎంక్వయిరీ(కథ)- డా.లక్ష్మి రాఘవ

ఆఫీసు బిల్డింగ్ నుండీ బయటకు రాగానే అప్రయత్నం గానే వెదికాయి కావ్య కళ్ళు.. దూరంగా కనిపించాడు అతను! ఇంకొంచెం దగ్గరగావుంటే దగ్గరికి వెళ్లేదేమో కానీ ఇంతలో కాబ్ వచ్చింది. కాబ్ లోకూర్చున్నాక మళ్ళీ అతని గురించి ఆలోచన వచ్చి పొద్దున్న కొలీగ్ రమ్యతో సంబాషణ గుర్తుకు వచ్చింది. “ఒక వారం నుండీ ఒక అతనిని గమనిస్తున్నాను రమ్యా. నేను బయటకు వచ్చేసమయానికి ఉంటాడు” “ఇక్కడే పని చేస్తున్నాడేమో..” “లాస్ట్ వీక్ ఇంకో షిఫ్ట్ లో పని చేసాను..అప్పుడు కనిపించాడు..అప్పుడే నేను గమనించింది..ఇప్పుడునైట్షిఫ్ట్ మారితే మళ్ళీ […]

Read more
1 2 3 4 21