నవంబరు 2011 సంపాదకీయం

ఏదైనా అనుకున్నది సాధించాలన్నా, మంచి పనులకి ముందడుగు వెయ్యలన్నా  స్త్రీల వల్లే అవుతుంది కదూ! మనం చేసే ఉద్యమాలు కానీ ఆందోళనలు కానీ  ధర్మము ,న్యాయసమ్మతమూ అయినా నాయకుల అలసత్వం ,అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల  మన డిమాండ్లు తీరకపోగా , ఆత్మ స్థైర్యం కోల్పోయి అన్నిటినీ పక్కన పెట్టటం జరుగుతుంది.కానీ షర్మిలని చూస్తే   పట్టుదలకి మారు పేరుగా   కనిపిస్తుంది.39 సం.ల  ఈ మణిపూర్ మహిళ గత పదకొండేళ్ళుగా   మణిపూర్ సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని రద్దు చేయాలనీ,ఈ […]

Read more

అక్టోబర్ 2011 సంపాదకీయం

స్త్రీలకి అన్ని చోట్లా ,అన్ని రంగాలలోను సమానత్వాన్ని ఆపాదిస్తున్నామంటూ   పోస్టర్ల పై  స్త్రీ సాధికారత ని ప్రదర్శించుకుంటున్న ప్రభుత్వానికి  ఇటీవల జరిగిన ఒక సంఘటన కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసింది. గుర్రం జాషువా 116 వ  జయంతి  సందర్భంగా    నిర్వహించిన ఒక  సభలో    డా.బోయి విజయభారతి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. ఆ సభలో  ఆమెతో పాటు నగదు పురస్కారాలను  అందుకున్న పురుషులకంటే తనకి తక్కువ నగదు ఇవ్వటంపై ఆమె తన నిరసనని వ్యక్తం చేస్తూ స్త్రీలకి ఒక న్యాయం ,పురుషులకి  ఒక  న్యాయం […]

Read more

సెప్టెంబర్ 2011 సంపాదకీయం

శరత్… మీకు జన్మ దిన శుభాకాంక్షలు ! ఈ మాసంలోనే అంటే సెప్టంబర్ పదిహేనవ తేదీన జన్మించాడు శరత్ చంద్రుడు.ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి.అయినా స్త్రీ హృదయంతో అతను జరుపుతున్న ”ఆలాప్ ఆలోచన”[interaction] యెడతెగనే లేదు. ఎంతమంది స్త్రీలు…విరాజ్,లలిత,కమల లత, రాజ్య లక్ష్మి,పార్వతి,మాధవి,సుబధ,కిరణ్మయి …శాంతులు, ధీరలు,అభాగినులు….ఎన్నెన్ని ముచ్చట్లు ,ఎన్నెన్ని సాహసాలు ,ఎన్నెన్ని చరిత్రలు…”ఎందుకు అసహ్యించుకోరు?స్త్రీ సాహసాన్ని అంతా అసహ్యించుకుంటూనే వుంటారు ”అని చెప్తూనే ,అతని కమల లత ”మొన్న సాయంత్రమే వచ్చావు నువ్వు,కానీ ఈనాడు ప్రపంచంలో నాకంటే మించి ఎవరూ నిన్ను ప్రేమించడంలేదు ,పూర్వ జన్మ […]

Read more

ఆగస్ట్ 2011 సంపాదకీయం

ఇటలీలో బురఖాను నిషేధించే ముసాయిదా బిల్లుకు తుది రూపం ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి .ఇది  జరిగితే ఐరోపా దేశాలలో ఫ్రాన్స్, బెల్జియం తర్వాత ఇటువంటి చట్టం చేసిన మూడో దేశం ఇటలీనే అవుతుంది .ఈ చర్యను క్రూసేడ్లతో పోల్చడం సమంజసం కాక పోయినప్పటికీ కొన్ని మౌలికమైన ప్రశ్నలు మాత్రం ఉత్పన్నం కాక మానవు .పాశాత్య దేశాలు మానవ హక్కుల గురించి ఎంతగా ఇతర దేశాల కు  ఉపదేశించినప్పటికీ వారి పోకడలు మాత్రం అనేక సార్లు ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసేట్టే ఉంటాయనేది అనుభవం  . అన్ని మతాలూ  […]

Read more

జూలై సంపాదకీయం

సాహిత్యానికి స్త్రీల దృక్పధం అలవడి ఇన్నేళ్ళయిన తర్వాత స్త్రీలుగా మనమేం రాస్తున్నామో,ఏం రాయాల్సి ఉందో సమీక్షించుకోవాలి.స్త్రీలుగా రాయడం అంటే ఇపుడు కేవలం జెండర్ అస్తిత్వం లోంచి రాయడం మాత్రమే కాదు.కుల మత ప్రాంత వర్గ అస్తిత్వాల సంక్లిష్టతలని  అర్ధం చేసుకుంటూ వివక్షతలని ప్రశ్నిస్తూ రాయడం. ప్రతీ అస్తిత్వం లోనూ మగవారికన్నా అధికంగా అణచివేతకూ ఆధిపత్యానికీ గురయ్యే స్త్రీలు వాటిని సాహిత్య ప్రక్రియల్లోకి తీసుకురావడానికి కూడా అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది.సమస్యల్ని అవగాహన లోకి తెచ్చుకోవడం ఒక ఎత్తైతే,వాటిని రికార్డ్ చేసే క్రమంలో ఎదురయ్యే సెన్సార్షిప్ ని అధిగమించడం మరొక సవాలు. మగవారు అంగీకరించిన ప్రమాణాలకి […]

Read more

జూన్ సంపాదకీయం

విహంగ మహిళా పత్రిక జూన్ సంచికకి స్వాగతం. ఎప్పటిలాగే మరో  ఉన్మాది చేసిన ఘాతుకానికి ఖమ్మంలో మరో శ్రీలత  బలయ్యింది. వరంగల్ జిల్లాలో  జిల్లా బాబు చేతిలో  మౌనిక అత్యాచార యత్నానికి , దాడికి  గురైంది. అబార్షన్లూ,వరకట్నాల సాధింపులూ  అయితే లెక్కే లేదు. ఇవన్నీ పైకి కనిపించే హింసలు.ప్రతిరోజూ మానసికంగా హింసించబడుతూ …అత్తింట్లో ఆరళ్ళకు గురవుతున్న అతివలు ఇంకెంతమందో…. అన్ని వార్తల్లాగే  ఇవి కూడా రెండో రోజుకి సాధారణ వార్తలుగా మరుగున పడ్డాయి. అన్నిటికంటే ‘మరుపు’ మంచి  మందు. ఇది మన ప్రభుత్వానికి మాత్రం […]

Read more

మే 2011 సంపాదకీయం

అభివృద్ధి చెందటం అంటే ఏంటి? పాకిస్తాన్ లో బిన్ లాడెన్ని ఎలా మట్టుబెట్టారో వైట్ హౌస్ లో కూర్చుని చూడటమా? మనిషి సాంకేతికంగా కొత్త విషయాలు కనిపెట్టటమా? మానసిక పరిణతి చెంది ఉన్నత విలువల్ని పెంపొందించుకోవటమా? సాంప్రదాయాల పేరుతో దళితులు తినే తిండిలో మూత్రం పోయటం…ప్రేమ వివాహం చేసుకుందని యువతిని పరువు హత్య చెయ్యడం… ఇదంతా అభివృద్ధి కిందకి వస్తుందా? స్వప్నిక ,అనూషల హత్యల తరువాత కూడా యువతులపై దాడులు ఆపలేని చట్టాలు, ప్రభుత్వం కొత్తగా సాధించిన అభివృద్ధి ఏంటి? పెళ్ళికి నిరాకరించిందని మానవ […]

Read more

జనవరి 2011 సంపాదకీయం

తెలుగు సాహిత్యానికి , స్త్రీలకి, స్త్రీ ల మనోభావాలకీ అవినాభావ సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. మనువు నుంచి మన కాలపు కంప్యూటర్ యుగం దాకా ఎన్నో మార్పులొచ్చాయి.  భవిష్యత్తులో ఇంకా వస్తాయి. ఏ మార్పయినా కాలానికి అనుగుణంగానూ ,సమాజానికి అనుకూలంగానూ వుండాలి. మనువు స్త్రీలను శాసించినట్టు శాసిస్తే ఇప్పుడెవరూ ఒప్పుకోరు.ఏ జీవికైనా స్వేచ్ఛ అవసరం. అది దేహానికి, మెదడు కి,మనసుకి,భావజాలానికి సంబంధించి వుంటుంది. ‘విహంగ’ ప్రధాన ఉద్దేశం స్త్రీల స్వాతంత్ర్య భావాల అభివ్యక్తుల్ని ఆదరించటం ,గౌరవించటం. ఇది మన పత్రిక.మన సమస్యలకి ,ఉద్యమాలకి […]

Read more
1 3 4 5