మేఘసందేశం-19 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

“కావ్యేషు నాటకం రమ్యం – నాటకేషు శకుంతలా-తత్రాపి చతుర్థాంకం తత్రశ్లోక చతుష్టయోః” అని లోక ప్రాశస్త్యం. కావ్యాల కన్నా నాటకాలు రమ్యమైనవి. నాటకాలన్నింటిలోనూ అభిజ్ఞానశాకుంతలం గొప్పది. ఆ నాటకంలో నాలుగో అంకం మరీ గొప్పది. ఆ శాకుంతల నాటకంలోని చతుర్థాంకపు మొత్తం పాఠంలో ఆ నాలుగు శ్లోకాలు అత్యంత గొప్పదనం కలవి. కావ్యాలు మన మనస్సుకు హత్తుకొనేలా లోకవృత్తాంతాలనూ వాటి మంచి చెడ్డలనూ బోధిస్తాయి. ఎంత చక్కగా బోధిస్తాయంటే, ఒక మనోహరి ఎంతో ప్రియంగా మాట్లాడుతూ మంచి మాటలు తలకెక్కించినంత సుతారంగా బోధిస్తాయి. కాని […]

Read more

మేఘసందేశం-18 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఒక అర్ధరాత్రివేళ ఒక వ్యక్తి ఒక గొప్పవెలుగునిస్తున్న దివిటీని చేతితో పట్టుకొని ముందుకు వెళుతున్నాడనుకొందాం. ఆ దివిటీకి ముందున ఉన్న భవనాలు, వస్తువులు ధగధగా వెలిగిపోతూ ఉంటాయి కదా! ఆ దివిటీ ముందుకు దాటిపోగానే ఆ భవనాలు, ఆ వస్తువులన్నీ ఆ తేజస్సును కోల్పోవటమే కాకుండా అంతకు ముందు తమకున్న కాంతిని కూడా కోల్పోయి కళావిహీనంగా కనిపిస్తాయి కదా! ఇప్పుడు ఈ విషయాన్ని మహాకవి కాళిదాసు వర్ణించిన తీరు చూద్దాం. మహాకవి కాళిదాసు రచించిన రఘువంశ కావ్యంలో విదర్భ రాజకుమారి ఇందుమతికి స్వయంవరం జరుగుతున్నది. […]

Read more

మేఘసందేశం-17 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు మహాకవి అమ్మవారి కటాక్షం లభించడానికి ముందు చాలా అమయాకంగా ఉండేవాడట. అందరూ ఏదో విధంగా పనిగట్టుకుని అతన్ని ఆటపట్టించేవారట. ఆ రోజుల్లో ఒక ఊరి పడచు అతన్ని చూసి “అస్తి కస్చిత్ వాక్ విశేషః?” అని అన్నదట. అంటే “అసలు నీకు కొంచెమైనా మాట్లాడగలిగే విషయం ఉందా” అని అపహాస్యం చేసిందట. కొన్నాళ్ళకు అమ్మవారి కరుణతో గతం అంతా మర్చిపోయి మహాకవి అయిపోయాడని ఐతిహ్యం. గతం మర్చిపోయినా కాని ‘అస్తి, కస్చిత్, వాక్’ అనే ఆ పడచు పలికిన ఆ మూడు పదాలు […]

Read more

మేఘసందేశం-16 -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాస భారతదేశపు జాతీయకవి అని కవిపండితులు చెప్తారు. మన దేశానికి చెందిన అత్యుత్తమ సాంస్కృతికాదర్శాలను తన కావ్యాల్లో ప్రతిబింబింప జేయడం వలననే ఆయనకీ గౌరవం దక్కింది. “యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం” అని భగవద్గీత ఉవాచ. అంటే భారతీయ సంస్కృతి మొత్తం యజ్ఞం-దానం-తపం-త్యాగం అనే నాలుగు స్థంభాలమీద నిలబడి ఉంది. ఇంద్రియాల్ని తమ వశంలో ఉంచుకోవడమే తపస్సు. ముక్కుమూసుకుని అరణ్యాలలో నివసిస్తేనే తపస్సు కాదు. వశిష్ట, కణ్వాదులు అరణ్యాలలో ఉంటే దిలీపుడు, దుష్యంతుడు రాజ్యాధికారంలో ఉన్నప్పటికీ, అరిషడ్వర్గాలను జయించి తపస్సమాధిలో ఉండే మహర్షులంటారు పెద్దలు. […]

Read more

మేఘసందేశం-15- వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు గురించి ఒక సంఘటన చెప్పుకుని మేఘసందేశంలోకి వెళ్దాం. ఒక సారి భోజరాజుకు వింత కోరిక ఒకటి కలిగింది. “నేను మరణించిన తర్వాత కాళిదాసు తన గురించి ఏమి చెప్తాడు”? అని తలచి,      కాళిదాసును పిలిపించి తన కోరిక చెప్పాడు. కాళిదాసు “మీ కోరిక పిచ్చిగానూ,  అమంగళకరము గానూ వుంది నేను తీర్చలేను క్షమించండి” అన్నాడు. రాజాజ్ఞను ధిక్కరించిన వారికి దేశ బహిష్కారమే శిక్ష అన్నాడు రాజు.  కాళిదాసు భయపడి అయినా చెప్తాడేమో అనుకుని. కానీ కాళిదాసు “విద్వాన్ సర్వత్ర పూజ్యతే”   అని ఒకే […]

Read more

మేఘసందేశం-14 -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాస మహాకవి విద్వత్తు గురించి చెప్పడానికి ఒక చిన్న విషయం చెప్పి, మేఘ సందేశంలోకి వెళ్తాను. భవభూతి అనే ఒక మహాకవి ”ఉత్తరరామచరిత్రమ్” నాటకం వ్రాయటం పూర్తిచేసిన తర్వాత, దాన్ని అతిప్రసిద్ధుడైన కాళిదాస మహాకవికి చూపించి ఆయన అభిప్రాయం తెలుసుకోవాలని ఉబలాటపడ్డాడు. ఏమంటాడో ఏమో అని శంక ఉన్నప్పటికీ ధైర్యం చేసి తన కుమారుడికి గ్రంథం యిచ్చి కాళిదాసు యింటికి పంపాడు. కాళిదాసు యింట్లో కూచుని తీరిగ్గా చదరంగం ఆడుకుంటున్నాడు. భవభూతి కుమారుడు కాళిదాసుతో మీరు కొంచెం సమయమిస్తే, మా నాన్నగారి నాటకం మీకు […]

Read more

మేఘసందేశం-13 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు అనగానే మనకు కూర్చున్న కొమ్మని నరుకుతూ, వెర్రివెంగళప్పలా, మోసంతో ఒక రాకుమారిని పెళ్ళాడి ఆవిడ ప్రోద్బలంతో, నాలిక మీద కాళిక బీజాక్షరాలు రాయబడిన సాహితీ విశారదుడైన కధే! అన్ని భాషల్లోనూ సినిమాలు గా కూడా వొచ్చింది! అదే! కానీ అది కేవలం కల్పన అంటారు విమర్శకులు. అంత చక్కని భాష యే గురువు దగ్గిరా ఏమీ నేర్వకుండానే హఠాత్తుగా వొచ్చేస్తుందా ఎవరికయినా? కాళిదాసకవి కూడా అందరి వలెనే విద్యాభ్యాసం ద్వారానే తన ప్రతిభని మెరుగు పర్చుకుని వుండవచ్చునని భావిస్తారు. అతనికీ ఇతర కవులైన […]

Read more

మేఘసందేశం-12 -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు గురించి అఖండ భారతావనికి తెలియజేసిన కోలాచల మల్లినాథసూరి గురించి చెప్పుకోవలసి ఉంది. ఆయనే లేకుంటే కాళిదాసు అంతటి మహాకవి ప్రపంచానికి తెలిసేవాడు కాదంటే అతిశయోక్తి కాదేమో! తన వ్యాఖ్యానంతో కాళిదాసు సాహిత్యానికి జీవం పోసిన మహా మహోపాధ్యాయుడు మల్లినాథసూరి. 14వ శతాబ్దం చివర, 15వ శతాబ్దం ఆరంభంలో జీవించిన ఆయన రాచకొండను పాలించిన సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థానంలో ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంస్కృత పండితునిగా పేరుగాంచిన ఆయన పేరిట వారణాసి హిందూ విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగం పని చేస్తోంది. నిరుపేద […]

Read more

మేఘసందేశం-11 -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు వ్యాసుని “చకారకుక్షి” అని సరదాగా అనేవాడట. మేఘ సందేశ శ్లోకాల్లోకి వెళ్ళబోయే ముందు దాని వివరమేమిటో తెలుసుకుందాం. మహాభారతం చాలా పెద్ద గ్రంధం. అందులో లక్షకు మించిన శ్లోకాలున్నాయి. అంత పెద్దగాధని వివరించేటప్పుడు ఆశ్లోకాలలో పాదపూరణకు అనుష్టుప్ ఛందస్సులో అక్షర నియతి తప్పిపోకుండా “చకారం” యెక్కువగా వాడారట! అందువల్ల కాళిదాసు ఆయన్ని చకార కుక్షి అని తమాషాగా అనేవాడు. కాళిదాసు విశ్వనాథుని దర్శనం కోసం ఒక సారి కాశీ పట్టణం వెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక పరిచారకుడు ఆయనకు ఆలయప్రాంగణంలోని వ్యాసుని విగ్రహం […]

Read more

మేఘసందేశం-10 -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఒక గొప్ప కావ్యాన్ని వ్రాయడానికి కావలసిన మనోస్థైర్యము ఒక ఋషికి మాత్రమే ఉంటుంది. సాహిత్యములో కావ్యప్రక్రియ చాల కష్టమైనది. కావ్యములలో నాటకము అందమైనది. అట్టి నాటకములలో అందమైనది శకుంతల. “పండితులు చూసి మెచ్చుకొనునంత వఱకు నేను చేసిన ప్రయోగము సరియైనదని నమ్మను, పనిలో ఎంతటి నేర్పరియైనను తన పని మీద తనకు సరిగా వున్నదను నమ్మకము కలుగదు, దానిని యితరులు చూసి మెచ్చుకొనినప్పుడే ఆత్మవిశ్వాసము కలుగుతుంది” అని అభిజ్ఞాన శాకుంతలంలో సూత్రధారునితో పలికిస్తాడు కాళిదాసు. మహాకవి కాళిదాస కృత అభిఙ్ఞాన శాకున్తలమ్ సంస్కృత నాటక […]

Read more
1 2