జ్ఞాన దీపాలు(కవిత )- రవి కుమార్ పెరుమాళ్ళ

జ్ఞాన దీపాలు పచ్చ కాగితాల బొత్తి కన్నా బంగారు గనుల కన్నా అన్నిటికన్నా నా జీవితంలో పుస్తకం మిన్న పగలు కృంగదీసినా రాత్రి పూట మిత్రుడై సేదదీరుస్తుంది కన్నతల్లిలా లాలిస్తుంది బాధల నదిలో మునిగిపోతున్నప్పుడు చేయూతనిచ్చి రక్షిస్తుంది విజ్ఞానం, వినోదం అందించి తెలియని విషయాలు చెప్పే నా గురువు ఆపదల్లో తోడుగా నిలిచి నా చుట్టూ పరివ్యాప్తమౌతుంది నా తల్లిదండ్రులు కోట్లు ఇవ్వకపోయినా నా బీరువాలో వరుసగా పేర్చిన పుస్తకాలే నా తరగని ఆస్తి అసంఖ్యాక రచయితలు అందించిన అమూల్య నిధులు పుస్తకాలు మస్తకాలను […]

Read more

భాగ్యనగరంలోని అభాగ్యుల జీవన చిత్రణ(పుస్తక సమీక్ష -2 )-పెరుమాళ్ళ రవికుమార్

కవిని ఆలూరి అనగానే “ముగింపు మాటలా…”కథలు గుర్తొస్తాయి. రచయిత్రి తండ్రినుండి సాహితీ రచనను వారసత్వంగా పునికిపుచ్చుకొని రాస్తున్న రచయిత్రి.అంతేకాక ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ద్వారా మహిళా చైతన్య కార్యక్రమాల ద్వారా చురుకైన పాత్ర పోషిస్తున్నారు.2018 జనవరిలో వచ్చిన”అభాగ్య జీవనాల భాగ్య నగరం”ఈమె నూతన పుస్తకం అనే కంటే పరిశోధనాత్మక పుస్తకం అనటం సమంజసం. సాధారణంగా భాగ్య నగరం అనగానే మెట్రోరైలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్,విలాసవంతమైన జీవితాలు అనుకుంటాం. వీటితో పాటు అభాగ్యులు కూడా ఉన్నారన్న సంగతి ఊహల్లోకి కూడా రాదు.రచయిత్రి దాదాపు 14 […]

Read more

పత్ర చిత్రకారిణి సుహాసినితో ముఖాముఖి- రవి కుమార్ పెరుమాళ్ల

రవి : నమస్కారo మేడం  సుహా: నమస్కారo రవి,విహంగ పాఠకులకి అభివాదాలు. రవి:మేడం ఇటీవల మీరు పనిచేసిన కళాశాల లోని గ్రంధాలయంలో మీ పేరున ఆర్ట్ కార్నర్ పెట్టారని విన్నాను.చాలా సంతోషం.దాని గురించి చెప్పండి. నేను పనిచేస్తున్న మహిళా కళాశాలలోనే నన్నొక కళాకారిణిగా గుర్తించడం, నాపేరుతో ఒక కార్నర్‌ని ఏర్పాటు చెయ్యడం నేను, నా ఆచరణ, నా కళ విద్యార్థులకి ఇన్ఫిరేషన్‌గా వుంటుంది అని వాళ్ళు భావించడం ఎంతో ఆనందం కలిగించింది. బతికుండగానే ఇలాంటి గౌరవం దక్కడం కన్నా ఏ కళాకారులైనా కోరుకునేదేముంటుంది. నా […]

Read more

  హే”విలంబ”రాగం -పెరుమాళ్ళ రవి కుమార్

వసంతాల ఆమనీ  కొత్త రాగం ఆలపించవే  ఉగాదిన షడ్రుచుల భావాలు పలికించవే ఉగాది పచ్చడిలోని జీవిత పరమార్థాన్ని పాడవే కమ్మనైన నీ గొంతుతో స్మార్ట్ ఫోన్ తో స్మార్ట్ గా కనిపించినా ఎవరికి వారే యమునాతీరే అందరూ కలిసిన చోటా ఎవరి ప్రపంచం వారిది ఫేస్ బుక్ వాట్స్ అప్ ట్విట్టర్ పోస్ట్ అంటూ కామెంట్లoటు లైక్ లంటూ సంబరపడే నెటిజన్లకి బంధాల విలువను తెలుపవే  కమ్మనైన నీ గొంతుతో దేశ సేవ కై అసువులు బాసిన వీర జవాన్లారా మీత్యాగం మా బ్రతుక్కి […]

Read more

మా అన్నయ్య (కవితా సంకలనం)-పుస్తక సమీక్ష-పెరుమాళ్ళ రవికుమార్

                            శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ఈయన పేరు వినగానే 35 మంది యోగుల చరిత్రను తెలిపే ‘సిద్ధ యోగి పుంగవులు’,షేక్స్ పియర్ వంటి పూర్వ ఆంగ్లేయుల జీవిత చరిత్రకు నిలువుటద్దం ‘పూర్వాoగ్ల కవుల ముచ్చట్లు’’,మరీ ముఖ్యంగా యాబై మంది జాతీయ అంతర్జాతీయ మహిళా మణులను పరిచయం చేసే ‘మహిళా మాణిక్యాలు’ సాహితీ ప్రియులకు కరదీపిక లాంటిది. ఈయన గురించి ప్రముఖ రచయిత్రి ,ప్రరవే జాతీయ […]

Read more

రాయల సీమ ‘కథా’నాయకుడు- పులికంటి కృష్ణా రెడ్డి

పులికంటి కృష్ణా రెడ్డి వర్ధంతి సందర్భం గా…..                 రాయల సీమ సిన్నోన్ని                  రాళ్ళ మధ్య బతికినోన్ని                  రాగాలే ఎరుగకపోయినా                  అనురాగానికి అందే వాణ్ణి                  రాసుకుని  బతుకుదామని రైలు […]

Read more

సుప్తావస్థ

ఫోటో : 3.bp.blogspot.com/ మనసు అమ్ముల పొది ఎక్కుపెట్టిన ఆలోచనా శరాలు … కొన్ని చుక్కల్ని తాకాయి మరికొన్ని నేలపై మొలకెత్తాయి  సూర్యుడి వేడికి కొన్నిరెక్కలు తెగి పడ్డాయి ఇoకొన్ని… చంద్రుడి కిరణాల తాకిడికి చల్లబడ్డాయి కొన్ని అమ్మ చుట్టూ తిరిగాయి మరికొన్ని నాన్న చుట్టూ… కొన్ని సుప్తావస్థ లోనూ మరి కొన్ని వుండచుట్టుకునీ కొన్ని మబ్బుల చాటున దాగున్నాయి కొన్ని అచేతనలో ఉండిపోయాయి కొన్ని బాధల్ని చీల్చుకుని వెళ్ళాయి మరి కొన్ని కాలం తో పోటీ పడ్డాయి చివరకు కొన్ని గమ్యం దిశగా వెళ్ళాయి […]

Read more

తెలుగు పుత్రికా రత్న’జెస్సీ’పాల్

జన్మదిన సందర్భంగా  జరిపిన ముఖాముఖిలో జెస్సీపాల్ గారి అంతరంగ వీక్షణం            ఆమె నడిచే విజ్ఞానభాండాగారం .ఆమె జ్ఞాపక శక్తి అమోఘం.ఉన్నత కుటుంబంలో పుట్టినా అహంకారపు ఆనవాళ్ళు ఏమాత్రం దరిచేరనీయని ఉన్నత వ్యక్తి తాను.ఉన్నతమైన ఆశయాల ఆసక్తి తాను.నిండైన ఆహార్యం,నిలువెత్తు ఔదార్యం,నిజమైన విద్యా సౌభాగ్యపు భాగ్య ప్రదాత తాను. బాలల భవిష్యత్తు తరాల బ్రతుకు విధాత తాను .మాటల్లో మృదుత్వం , చూపుల్లో కరుణత్వం నడకలో గాoభీర్యం ఆమె సొంతం .చెరగని చిరునవ్వు చెదరని ఆత్మ విశ్వాసం సడలని […]

Read more

పడాల రామారావు దృక్కోణంలో అల్లూరి – పెరుమాళ్ళ రవికుమార్‌

                       ‘‘శ్రీరామ రాజు యొక్క దౌర్జన్య పద్ధతులతో నేనేకీభవించజాలక పోయిననూ ఆయన అకుంఠిత సాహసమూ, త్యాగ దీక్ష, ఏకాగ్రత, ఉత్తమ శీలమూ, నిరాడంబరమగు కష్టజీవనమూ మనమందరమూ నేర్వదగినవి’’. అని అల్లూరి సీతారామరాజు గురించి గాంధీజీ అన్న మాటలు అక్షర సత్యం.పడాల రామారావు రాసిన ‘అల్లూరి సీతారామరాజు’ చారిత్రక గ్రంథం అల్లూరి సీతారామరాజు.                    జీవిత విశేషాలని, ఆయా సంఘటనలని కళ్ళకు […]

Read more

డా.పెళ్ళకూరు జయప్రద ‘‘వీలునామా’’

                తెలుగులో సృజనాత్మక వచన సాహిత్య ప్రక్రియలు అనేకం విస్తరించాయి. అందులో కథకు ప్రాముఖ్యత, ప్రాచుర్యమూ ఉంది. 1910లో మొదలైన ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో ఎన్నో విలక్షణమైన కథలు వెలుగుచూశాయి. కథలో సమాజాన్ని, మానవ జీవితాన్ని అనేక అనుభవాలను అనేక కోణాల నుంచి స్పృశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కథలంటే అందరికీ ఇష్టమే. కథలని ఇష్టపడని వారుండరు. కథలో మానవువుని జీవితాన్ని పరిపూర్ణ్ణంచేసే మనోభావాలు, రాగద్వేషాలు, ఆనందాలు, క్షోభలు ఇవన్నీ కథలో ప్రతిఫలిస్తాయి.                      చాలా మంది గొప్పగొప్ప రచయితలు, రచయిత్రులు కథకు […]

Read more