పడమటి స్త్రీవాద కవిత్వం-మాయా ఏంజిలో

                 పడమటి స్త్రీవాద కవిత్వం- విహంగ వీక్షణం -1 స్త్రీ వాదం ఒక భాషకో ఒక దేశానికో సంబంధించినది కాదు. ఒక ఉనికికి ఒక స్వేచ్చకు ఒక వ్యక్తిత్వానికి ప్రతిరూపం. విశ్వం అణువణువునా తలెత్తిన భావన .దానికి అక్షరరూపం స్త్రీ వాద కవిత్వం. పాశ్చాత్య మహిళల కవిత్వాన్ని తెలుగులోకి అనువదించి విహంగ పాఠకులకి ప్రత్యేకంగా ప్రతివారం అందిస్తున్నారు రచయిత్రి, కవయిత్రి స్వాతీ శ్రీపాద . చదివి మీ అభిప్రాయం తెలియజేస్తారు కదూ! ఈ వారం […]

Read more

లలిత గీతాలు – స్వాతీ శ్రీపాద

ఈ రేయి ఇలా ఆగిపోనీ ఈ క్షణం ఇలా నిలిచిపోనీ అలసిపోని వెన్నెలతో అలా తిరిగి వచ్చేందుకు వెలసిపోని వెలుగులతో మనసుమాట చెప్పేందుకు ఈ రేయి ఇలా ఆగిపోనీ …….. విరిపూలై విరబూసిన విప్పారిన అందాలను ’కనురెప్పలార్చి చూడాలని’ చెప్పలేని సోయగాల నిశ్సబ్దపు నిమ్నగలను మౌనం మునివేళ్ళతో తాకాలని అలల తుళ్ళింతల పులకరింతలు కళ్ళారా తనివిదీర దోసిళ్లతొ తాగాలని గాలి తలల గమకాలతొ చుక్కలకే బాట వేసి చూపుల తపనల కధ విప్పాలని ఈ రేయి ఇలా ఆగిపోనీ…………… ఏనాడో చిన్ననాడు ఎగరేసిన పతాకాల […]

Read more

లలిత గీతాలు – స్వాతీ శ్రీపాద

ఎపుడైనా ఆదమరచి నీ ఉనికిని మరచానా ఎద వాకిట క్షణమైనా ఆలసించి నిలిపానా ……….. పెదవులపై తొణికిసలై విరబూసిన తలపులలో పరవశించి మేను మరచి నీ అడుగుల సడి వినలేదా? చిరునవ్వుల వెన్నెలలో తడిసి తడిసి తమకాన్నై మసక వెలుగు మలుపులోన నిలచిన నీ రూపం గమనించలేదా ఎపుడైనా ఎక్కడైన లోలోపలి పొరబాటైనా ఒక్కమాట క్షణమైనా నీవులేని నేనెక్కడ  – స్వాతీ శ్రీపాద  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Read more

లలిత గీతాలు – స్వాతి శ్రీపాద

తలపులు ప్రవహించే తలపండిన హృదయంలో గడిచిన వసంతాల పరిమళాలు చిగురించే శిశిరం విదిలించిన ఆకురాలు రంగుల్లో ఎప్పటివా ఉప్పొంగే మధురోహల సరిగమలు యౌవనాన రాసుకునే తొలి పలుకుల పుస్తకాన వెన్నెలకే వేడెక్కిన ఊహల చిరు మోహనాలు చుట్టూ పరచుకున్న పచ్చ పచ్చని జ్ఞాపకాలు మనసున వెదజల్లినట్టు మంచుపూల తొలి చినుకులు దాగుడుమూతలాడుకునే వెలుగు చెట్లనీడల్లో వికసించే కొత్త కలల గరికపూల సమూహాలు ఎవరన్నారిది వ్యర్ధమనీ వృద్ధాప్యపు నరకమనీ సమయం వరమిస్తే అచ్చంగా అణువణువూ నీదేగా  – స్వాతీ శ్రీపాద ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

Read more

లలిత గీతాలు

ఊపిరి సొగసువు నీవై ఊహల గగనం నీవై విహరించే మేలి మబ్బు జిలుగు తునక చివరంచువు నీవై మల్లె పూలై విరగ బూసిన చుక్కలవుతూ పరిమళాల ప్రవాహాల పలకరించు చిరుగాలి చెక్కిలి సిగ్గు బరువున మోసుకొచ్చే నెమలీక ప్రేమలు చూపు శ్వాసకు శ్వాస చూపై మెత్త మెత్తని చినుకు సవ్వడి ఎద మెట్లపై నా జారి జారి తొలకరింపై చిలకరింపై హత్తుకున్న వెలుగు వాకల చల్ల చల్లని స్పర్శ గిరికీలలో విద్యుత్ వరద వెల్లువ పొంగిపొర్లే సంబరాన మెల్ల మెల్లన పొలక మెరుపై మరకతాలై […]

Read more

లలిత గీతాలు

ఆ చుక్కల వెలుగులో ఆ జాబిలి జిలుగులో వొలికినవా నీ చిరునవ్వులు కురిసెనుగా కెంపులు సంపెంగలు విరజాజులు పరిమళాల జడివానలు లోలోపల ఎద గది లోలోపల ఓ మూలన తియతియ్యని తేనెల కలలవాకలు తనువంతా తొణికిసలై తొంగి చూసె ఆశలు ఆకొండపైనవిరిసిన బొండుమల్లెలు పదిలంగా నును వెచ్చని భావాలను జ్ఞాపకల తెర వెనుకన కాంతిరేఖ నాజూకు నాట్యాన సజీవమై సలలితమై సాగిపోవు సెలఏళ్ళను గలగలమను పలవరింత ఓ మూలన అసంపూర్తి చిత్రంలా ఉలితాకిడి స్పర్శకై అవనతమై అభిసారికగా ఎదురుచూసె జీవనాన చుక్కమొలిచినట్టు చుక్కపొడిచినట్టు పెదవి […]

Read more

లలిత గీతాలు

ఆ నీలి కళ్ళ సంద్రంలో ఎక్కడివా నీలాలు పొడి బారిన నదులా అవి ప్రేమ కధా కావ్యాలు ఎడారిలో ఎండమావి మెరుపు ల్లా ఎప్పటివా వట్టిపోయి వగచే పంటపొలాలు కన్నీరై ప్రవహించే కరుణామృత హృదయం సవరించిన సరిగమలై మది పలికే చిరు గీతం మరపురాని గతం మళ్ళీ వసంతమై తిరిగొస్తుందని ఎన్నాళ్ళీ ఎదురు చూపు ఎద వాకిట తలపు వెనక మబ్బు నలుపు నీడలోనొ మసక వెలుగు తుది మలుపునొ మోమంతా పరచుకున్న మధురమైన దరహాసపు వెన్నెలలా ఆ ఘడియలు ఏక్షణమో ఎదుట నిలిచి […]

Read more

లలిత గీతాలు

పులకింతలపున్నాగలుఏవాకిట కురిసినా తొలకరించు తొలి పలుకులు ఏనోటన పలికినా పరిమళాల ప్రవాహాలు పరుగులిడే గుభాళింపు కనుసన్నల జాజిపూలు పల్లవించుకావ్యాలే   ఆవంకన జాలువారు జలపాతపు తలపులెన్నొ ఈ వంకన నింగితాకు సింగిణీల విల్లంబులు కనుపాపల కదలికలో హొయలొలికే సోయగాలు కనగలిగే మనసుకైతే అరచేతిన స్వప్నమౌను   నిర్నిద్రలొ ఊహకొలను తొలిచూపుల స్పర్శకేను జలజలమను పల్లవాలపారిజాత గమకాలై చిరు సవ్వడి అలికిడిలో ఆదమరచి ఒక్కక్షణం తెల్లవారె కలలన్నీ తెల్లబోయె మోవిసిరులు – స్వాతీశ్రీపాద  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~~

Read more

లలిత గీతాలు – 20

 పలకరింపా చిరునవ్వు వెన్నెల చిలకరింపా పూల వానా ఇది జలతారు వెలుగు సోనా ? ముత్యంపు పూ రెక్కలన్నీ సరిగమల రవళులను చింది నట్టు నింగి కెగసిన హరివిల్లు రంగులన్నీ విరి బాలలై కురిసినట్టు పలకరింపా ? ఇది తొలకరింపా ? తొలి ప్రేమల చిరు చెమరింపా ? పెదవి తొణికీ మధువులొలికే పూల వాగున పరిమళాలై తేలి పోతూ సోలిపోతూ ఎదలో పొంగి ఉప్పొంగే భావఝరుల మగతపడుతూ మైమరచిపోతూ పలకరింపా పులకరింపా తొలి ప్రేమల తొలకరింపా? ఏటి మోమున అలదుకున్న మసక వెలుతురు […]

Read more

లలిత గీతాలు – 19

ఒక్కసారి ఒక్కమారు కనురెప్ప పాటు కాలంలో ఎన్ని కళలు ఎన్ని హొయలు చిన్నిపాప చిరునవ్వున   అల్లసాని అల్లికలో అలరారే సొగసు తెరలు మొల్ల కలం వెదజల్లిన కావ్యకాంతి సౌరభాలు   ఈ వంకా ఆవంకా ఎన్ని వేల నెలవంకలు చిన్ని పాప పెదవులపై ఊయలూగు పరిమళాలు   నింగినేల ఏకమయే సింధూరపు జ్వాల తళుకు నిలువెల్లాతడబడుతూ నీలి మబ్బు నటన సొగసు   ఒక్కసారి ఒక్కమారు ఎన్ని వేల వసంతాలు చిన్ని పాప చెక్కిలి పై అలరారే సోయగాలు –  స్వాతీ శ్రీ […]

Read more
1 2 3 5